కార్మికవర్గ ప్రయోజనాలే ముఖ్యం
డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ సాధిస్తాం
అనుబంధ పరిశ్రమలు, నూతన గనుల ఏర్పాటుకు కృషి
పనిచేసే వారికే కమిటీల్లో చోటు కల్పిస్తాం
టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి
రామకృష్ణాపూర్(ఆదిలాబాద్), న్యూస్‌లైన్ : కార్మికవర్గ ప్రయోజ నాలకే ముఖ్యం.. పని చేసే వారికే కమిటీల్లో చోటు కల్పిస్తామని టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి వెల్లడించారు. కార్మికుల్లో ప్రశ్నించే తత్వం రావాలి.. నాయకత్వ లోపాలను ఎత్తిచూపేవారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు. డిపెండెంట్ ఎంప్లాయ్‌మెం ట్ సాధించడంతోపాటు నూతన టెక్నాలజీ ని వినియోగించుకొని అనుబంధ పరిశ్రమ లు, నూతన గనుల స్థాపన ప్రధాన ఎజెండ గా ముందుకు సాగనున్నట్లు పేర్కొన్నారు. యూనియన్ అంతర్గత ఎన్నికలలో విజయం సాధించిన సందర్భంగా ‘న్యూస్‌లైన్’కు ఇచ్చి న ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలను వెల్లడించారు. వివరాలు రాజిరెడ్డి మాటల్లోనే..
ప్రశ్న : కార్మికుల తీర్పును మీరెలాఆస్వాదిస్తున్నారు.?
జవాబు : తీర్పు ఊహించినదే. కార్మికవర్గం ఎప్పుడూ ధర్మాన్ని, న్యాయాన్ని బలపరుస్తూ వచ్చింది. వారి నమ్మకాన్ని ఏమాత్రం వమ్ము చేయకుండా బాధ్యతను గుర్తెరిగి.. పద్ధతిగా వ్యవహరిస్తాం.
డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఎలా సాధిస్తారు?
డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ అనేది న్యాయమైన కోరిక. కార్మికుల పిల్లలకు బొగ్గుబావు ల్లో పనిపై అవగాహన ఉంటుంది. దీనిని సాధించేందుకు కొత్తగా ఏర్పడే ప్రభుత్వంతో చర్చిస్తాం. యాజమాన్యంపై ఒత్తిడి తెస్తాం. అన్ని సంఘాలను కలుపుకొని ఐక్య ఉద్యమా లు నిర్మిస్తాం. అవసరమైతే సమ్మె చేపడతాం.
కోల్‌బెల్ట్ ప్రాంతంలో నిరుద్యోగ సమస్య తీరడానికి కార్యాచరణ ఏమైనా ఉందా..?
నూతన టెక్నాలజీని వినియోగించుకొని కొత్త గనుల ఏర్పాటుతోపాటు సంస్థ వినియోగిం చే పరికరాలన్నింటినీ అనుబంధ పరిశ్రమల ద్వారానే ఉత్పత్తి చేసేలా యాజమాన్యం చొరవ చూపాలి. థర్మల్, సోలార్ పవర్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలి. ఇందుకోసం సంస్థపై ఒత్తిడి తీసుకువస్తాం. అప్మెల్తో సంస్థ ఒప్పందాన్ని రద్దు చేయిస్తాం.
సకలజనుల సమ్మె నాటి అడ్వాన్స్‌ను మాఫీ చేయిస్తారా..?
సకలజనుల సమ్మె కాలం నాటి *25వేల అడ్వాన్స్ మాఫీ కోసం చిత్తశుద్ధితో పోరాడుతాం. కార్మికులు లీవులు పెట్టకుండా, పండుగలకు పోకుండా ఐదున్నర నెలలు నిర్విరామంగా కృషి చేసి సంస్థను కాపాడుకోవడాని కి పాటుపడ్డారు.
నాయకుల ఉచిత మస్టర్లను మీరు సమర్థిస్తారా..?
ఎట్టిపరిస్థితుల్లో సమర్థించం. కార్మికులతో కలిసి పనిచేసే వారికే కార్యవర్గంలో చోటు కల్పిస్తాం. ఈ క్రమంలో నాయకులకు మస్టర్ల పరంగా కొంత వెసులుబాటు కల్పించాల్సిన అవసరం మేనేజ్మెంట్పై ఉంటుంది.
యూనియన్ ఫండ్‌ను కార్మిక సంక్షేమానికి ఎలా వినియోగిస్తారు..?
గని ప్రమాదల్లో మృతిచెందిన కార్మికుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవడానికి యూనియన్ ఫండ్ నుంచి కొంత వెచ్చించాలనేది నా తపన. కార్మికుడు చనిపోయినప్పు డు దూర ప్రాంతంలో ఉండే వారి పిల్లలు వచ్చే వరకూ శవాన్ని పరిరక్షించడానికి కనీ సం ఫ్రీజర్లు సింగరేణిలో లేవు. మృతదేహా న్ని ఇంటికి తీసుకెళ్లేందుకు సైతం అంబులెన్స్‌లు ఇవ్వడం లేదు. ఈ విషాయాలపై మేనేజ్మెంట్తో మాట్లాడుతూనే యూనియన్ పరంగా అవసరమైన చర్యలు చేపడతాం.
హెల్ప్‌లైన్, హెల్ప్ డెస్క్‌ల ఏర్పాటుపై..?
ప్రతీ ఏరియాలో హెల్ప్‌లైన్, ఏరియా ఆస్పత్రుల్లో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేస్తాం. గతంలో కేసీఆర్ కూడా ఈ విషయం చెప్పా రు. హెల్ప్‌లైన్‌కు వచ్చే సమస్యలు, సలహాల విషయంలో ఒక టీంను ఏర్పాటు చేసి ఎప్పటి కప్పుడు సమీక్షిస్తాం.
మల్లయ్య వర్గాన్ని టీఆర్ఎస్ బలపర్చింది కదా.. పార్టీ విషయంలో మీ వైఖరేంటి?
కేసీఆర్ మా లీడర్. ఆయనను తండ్రిగానే భావిస్తున్నా. బహుషా మల్లయ్య వర్గీయులు ఎన్నికల్లో లబ్ధి కోసం టెక్నికల్‌గా ప్రకటన చేయించి ఉంటారు. టీఆర్ఎస్ పార్టీ పట్ల మాది ఎప్పటికీ సాఫ్ట్ కార్నరే.
సికాస స్టైల్లో పనిచేస్తామంటున్నారు.. ఎలా..?
సికాస స్టైల్ అంటే.. సమస్యను లేవనెత్తడం. పరిష్కారం కోసం దేనినైనా ఎదుర్కోవటం. ముఖ్యంగా కార్మిక వర్గంలో ప్రశ్నించే తత్వం అలవడాలి. అధికారులను నిలదీసే పరిస్థితి రావాలి. అదే విధంగా డబ్బులకోసం నాయకులు పనిచేసినా నిలదీయాలి. ప్రశించే వాళ్ల కు మేము అండగా నిలుస్తాం.