Depot managers
-
అధికారులూ.. కార్లు దిగి బస్సెక్కండి!
ఆర్టీసీ పొదుపు మంత్రం • ఇక తెల్లకాగితం ముక్కకూ లెక్కే • మార్చి వరకు ఒక్క కుర్చీ ఖర్చు కూడా కనిపించొద్దు • ఆర్టీసీలో హడలెత్తిస్తున్న సర్క్యులర్-33 • కొసరు చర్యలు భేష్... మరి అసలు వృథా సంగతేంటి? సాక్షి, హైదరాబాద్: డిపో మేనేజర్లు ఆర్టీసీ బస్సుల్లోనే ఆఫీసులకెళ్లాలి. వచ్చే మార్చి చివరి వరకు కొత్తగా ఒక్క కుర్చీ, బల్ల కూడా కొనొద్దు.. లైట్ వేసే ముందు కరెంటు బిల్లును గుర్తుచేసుకోవాలి. ఒక్క తెల్లకాగితాన్ని కూడా అనవసరంగా వాడొద్దు.. ఈ నిబంధనలతో కూడిన సర్క్యులర్-33 ఇప్పుడు ఆర్టీసీలో హడలెత్తిస్తోంది. ఇటీవల జరిగిన సుదీర్ఘ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు ఈ సర్క్యులర్‌ను జారీచేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు 44 శాతం ఫిట్మెంట్ ప్రకటనతో పెరిగిన జీతాలు సంస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే వరస నష్టాలతో దివాళా దిశగా సాగుతున్న ఆర్టీసీని ఈ జీతాల భారం చావుదెబ్బతీసింది. మీ తిప్పలేదో మీరే పడండంటూ ప్రభుత్వం చేతులెత్తేయటంతో ఈడీలు, ఆర్ఎంలతో మేధోమథన సమావేశం నిర్వహించిన జేఎండీ పొదుపు సూత్రాలతో తాజాగా సర్క్యులర్ జారీ చేశారు. సర్క్యులర్ 33లోని ముఖ్యాంశాలు * డిపో అధికారులు ఆఫీసులకు, సమావేశాలకు, ఫీల్డ్ విజిట్‌కు ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్లాలి. కార్లు, జీపుల ఖర్చును ఆదా చేయాలి. * వచ్చే మార్చి 31 వరకు డిపోలు, ఆర్ఎం కార్యాలయాల్లో ఎలాంటి ఫర్నిచర్ కొనొద్దు. టీఏ, డీఏలను నియంత్రించాలి. * సెల్‌ఫోన్, కార్యాలయ ఫోన్ బిల్లులను నియంత్రించాలి. ఏసీలు, లైట్లు, ఫ్యాన్లు జాగ్రత్తగా వాడి కరెంటు బిల్లులు తగ్గించాలి. * బస్‌స్టేషన్, బస్టాపులు, కొత్త బస్సుల ప్రారంభోత్సవ ఖర్చులు తగ్గించాలి. * ఒక్క తెల్లకాగితాన్ని కూడా వృథా చేయకుండా స్టేషనరీ బిల్లులకు అడ్డుకట్ట వేయాలి. * అనసవర సమావేశాల పేర చేసే ఖర్చులు పూర్తిగా అదుపు చేయాలి. మరి వీటి సంగతేంటి..? ♦ బెంగళూరులో 6,300 సిటీ బస్సులు తిరుగుతున్నాయి. సంవత్సరం క్రితం వరకు అక్కడ లాభాలే లాభాలు. వేతన సవరణ తో ఈ సంవత్సరమే స్వల్ప నష్టం వ చ్చింది. అంతే జనాభా ఉన్న హైదరాబాద్‌లో కేవలం 3,500 బస్సులే తిరుగుతున్నాయి. అంటే ఆక్యుపెన్సీ అక్కడికంటే ఎ క్కువ ఉండటం సహజం. అంటే లా భాలు ఎక్కువగా ఉండాలి. కానీ గడచిన 12 నెలల్లో సిటీ నష్టాలు రూ.165 కోట్లు. ♦ రాష్ట్రప్రభుత్వంలోని ఏ కార్పొరేషన్లో లేనట్టు ఆర్టీసీలో అధికారుల స్థాయిని బట్టి జీతానికి అదనంగా ‘గ్రేడ్ పే’ చెల్లిస్తున్నారు. తాజా వేతన సవరణతో ఇది సూపర్ స్కేల్ అధికారులకు నెలకు రూ.35 వేలు, స్పెషల్ కేడర్ అధికారులకు రూ.12 వేలు, సీనియర్ స్కేల్ అధికారులకు రూ.8 వేలు, జూనియర్ స్కేల్ అధికారులకు రూ.5 వేలు చెల్లిస్తున్నారు. ఈ రూపంలో వార్షిక భారం రూ.కోట్లలోనే ఉంది. ♦ ప్రివిలేజి పాస్ రూపంలో రీయింబర్స్మెంట్లు కూడా తడిసి మోపెడవుతున్నాయి. ఆర్టీసీ అధికారుల భార్య/భర్తలు ప్రభుత్వ ఉద్యోగులైతే దీన్ని వాడొద్దు. ఆ రూపంలో లక్షల్లో దుర్వినియోగమవుతోంది. ♦ కొందరు అధికారులకు ఇద్దరు ముగ్గురేసి డ్రైవర్లు ఉన్నారు. వీరంతా బస్సు డ్రైవర్లే. వీరి జీతాలే నెలకు లక్ష దాటుతున్నాయి. ఆ కార్ల మరమ్మతుల పేర భారీ ఖర్చు చూపుతున్నారు. అద్దె కార్లు వినియోగిస్తే ఇందులో మూడొంతులు ఆదా అవుతుంది. ఆర్టీసీలో ప్రమాద ఘంటికలు ⇒ ఈ ఆర్థిక సంవత్సరం తొలి 4 నెలల నష్టం రూ.97.18 కోట్లు. ⇒ కొత్త వేతన సవరణతో నెలవారీ జీతాల భారం రూ.75.25 కోట్లు. ⇒ కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌తో ఏడాదికి పెరిగిన జీతాల భారం4.2 కోట్లు కొత్త వేతన సవరణ 2013 నుంచి అమలులోకి రావటంతో ఏర్పడ్డ బకాయిలు రూ.1,518 కోట్లు. ⇒ అప్పులకు నెలసరి వడ్డీ రూ.11 కోట్లు -
ఆర్టీసీలో 27మంది తెలంగాణేతర ఉద్యోగులు
వార్‌రూమ్‌కు నివేదించిన టీఎంయూ మహబూబ్‌నగర్ అర్బన్,న్యూస్‌లైన్: జిల్లా ఆర్టీసీ పరిధిలో 27 మంది తెలంగాణేతర అధికారులు, ఉద్యోగులు ఉన్నట్లు వార్‌రూమ్‌కు మెయిల్ ద్వారా నివేదించినట్లు టీఎంయూ రాష్ట్ర కార్యదర్శు లు జీఎల్ గౌడ్, రాజనర్సింహుడు, జిల్లా కార్యద ర్శి టీఎస్ చారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మహబూబ్‌నగర్ డీఎం జగన్మోహన్రావు, సీ ఐ రామకృష్ణ, ఎంఎఫ్ రాజు, ఇద్దరేసి ఇంజనీరింగ్, హెల్త్ సిబ్బంది, కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ డిపో మేనేజర్లు బాలాజీ, అంజతుల్లా, రాజేశ్‌కుమార్, షాద్‌నగర్‌లో ఒక్కొక్కరు చొప్పు న సీఐ,ఎంఎఫ్,టీఏటూ,వనపర్తిలో ఒక్కొక్క ఎస్ టీఐ, టేఏటూ, ఇద్దరు లీడింగ్ స్టాఫ్, నాగర్‌కర్నూల్‌లో టీఏటూతో పాటు 10 మంది కండక్టర్లు, శ్రామిక్, మెకానిక్‌లు తెలంగాణేతరులు ఉన్నారని, వారి వివరాలను ప్రభుత్వానికి, తమ యూనియన్ రాష్ట్ర శాఖకు పంపించినట్లు పేర్కొన్నారు. కొత్త డిపో కమిటీ... మహబూబ్‌నగర్ డిపో టీఎంయూ కొత్త కమిటీని ఎన్నుకున్నట్లు యూనియన్ నేతలు మరో ప్రకటనలో తెలిపారు. అధ్యక్షుడిగా కుర్మయ్య, కార్యనిర్వహక అధ్యక్షుడిగా జయరాజు, కార్యదర్శిగా టీఎస్ఎస్ రెడ్డి, ప్రచార కార్యదర్శిగా కోడూరు శ్రీను, కోశాధికారిగా హరికిషన్‌లను ఎన్నుకోగా రాష్ట్ర యూనియన్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. మిగతా పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఈ కమిటీయే ఎన్నుకుంటుందని వెల్లడించారు. -
‘ఎంప్లాయీస్ యూనియన్’ ఉద్యమబాట
కడప అర్బన్, న్యూస్‌లైన్: కడప, మైదుకూరు, జమ్మలమడుగు, రాయచోటి డిపో మేనేజర్లు, సూపర్వైజర్లు తమపై తప్పుడు ఫిర్యాదులు చేస్తూ వేధిస్తున్నారని ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ఆందోళనబాట పట్టారు. కడప బస్టాండు ఎదురుగా ఎంప్లాయీస్ యూ నియన్ ఆధ్వర్యంలో కడప డిపో మేనేజర్ వైఖరిపై నిర్వహిస్తున్న ఆందోళన సోమవారం ఆరవరోజుకు చేరుకుంది. ఈ మేరకు ఎంప్లాయీస్ యూనియన్ కడప జోనల్ సెక్రటరి జీవీ నరసయ్య, కడప రీజనల్ అధ్యక్ష కార్యదర్శులు ఎస్.నాగముని, వీఎం కుమార్, రీజనల్ నాయకులు బండి చెన్నయ్య, రామిరెడ్డి తదితరులు సోమవారం సాయంత్రం కడప ఇ న్చార్జి ఆర్ఎం బ్రహ్మానందరెడ్డికి ఉద్యమ నోటీసు ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ కడపలో డిపోలో కొంతమంది ట్రాఫిక్ సూపర్వైజర్లు కార్యకర్త లు, నాయకులను రెచ్చగొట్టడమే కాకుం డా కార్మికుల సమస్యల పరిష్కారానికి డిపో మేనేజర్ల దృష్టికి తీసుకెళ్లినప్పుడు అవహేళనచేసి మాట్లాడుతున్నారని విమర్శించారు. దీంతోపాటు పలు సమస్యల పరిష్కారానికి రీజనల్ మేనేజర్‌కు, ఇతర అధికారులకు అనేక సంయుక్త సమావేశాల్లో ఫిర్యాదులు ఇచ్చినా ఫలితం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రీజనల్ మేనేజ్మెంట్ తమ ధోరణి మార్చుకోనందున ప్రత్యక్ష ఆందోళనలు చేయాలని ఈ నెల 17న డిపో కార్యదర్శుల సమావేశం లో నిర్ణయించామన్నారు. అందులో భాగంగా ఈ నెల 20,21 తేదీల్లో రీజనల్ వ్యాప్తంగా అన్ని డిపోల పరిధిలో ఆందోళనలు చేపడుతున్నామన్నారు.