ఆర్టీసీలో 27మంది తెలంగాణేతర ఉద్యోగులు | Rtc in 27 telangana employess | Sakshi
Sakshi News home page

ఆర్టీసీలో 27మంది తెలంగాణేతర ఉద్యోగులు

Published Tue, May 27 2014 1:56 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM

Rtc in 27 telangana employess

వార్‌రూమ్‌కు నివేదించిన టీఎంయూ
మహబూబ్‌నగర్ అర్బన్,న్యూస్‌లైన్: జిల్లా ఆర్టీసీ పరిధిలో 27 మంది తెలంగాణేతర అధికారులు, ఉద్యోగులు ఉన్నట్లు వార్‌రూమ్‌కు మెయిల్ ద్వారా నివేదించినట్లు టీఎంయూ రాష్ట్ర కార్యదర్శు లు జీఎల్ గౌడ్, రాజనర్సింహుడు, జిల్లా కార్యద ర్శి టీఎస్ చారి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. మహబూబ్‌నగర్ డీఎం జగన్మోహన్‌రావు, సీ ఐ రామకృష్ణ, ఎంఎఫ్ రాజు, ఇద్దరేసి ఇంజనీరింగ్, హెల్త్ సిబ్బంది, కొల్లాపూర్, కల్వకుర్తి, నాగర్‌కర్నూల్ డిపో మేనేజర్లు బాలాజీ, అంజతుల్లా, రాజేశ్‌కుమార్, షాద్‌నగర్‌లో ఒక్కొక్కరు చొప్పు న సీఐ,ఎంఎఫ్,టీఏటూ,వనపర్తిలో ఒక్కొక్క ఎస్ టీఐ, టేఏటూ, ఇద్దరు లీడింగ్ స్టాఫ్, నాగర్‌కర్నూల్‌లో టీఏటూతో పాటు 10 మంది కండక్టర్లు, శ్రామిక్, మెకానిక్‌లు తెలంగాణేతరులు ఉన్నారని, వారి వివరాలను ప్రభుత్వానికి, తమ యూనియన్ రాష్ట్ర శాఖకు పంపించినట్లు పేర్కొన్నారు.

కొత్త డిపో కమిటీ...
మహబూబ్‌నగర్ డిపో టీఎంయూ కొత్త కమిటీని ఎన్నుకున్నట్లు యూనియన్ నేతలు మరో ప్రకటనలో తెలిపారు. అధ్యక్షుడిగా కుర్మయ్య, కార్యనిర్వహక అధ్యక్షుడిగా జయరాజు, కార్యదర్శిగా టీఎస్‌ఎస్ రెడ్డి, ప్రచార కార్యదర్శిగా కోడూరు శ్రీను, కోశాధికారిగా హరికిషన్‌లను ఎన్నుకోగా రాష్ట్ర యూనియన్ ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. మిగతా పూర్తిస్థాయి కార్యవర్గాన్ని ఈ కమిటీయే ఎన్నుకుంటుందని వెల్లడించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement