Deputy Chairman post
-
‘డిప్యూటీ’ ఎంపికపై సర్వత్రా ఆసక్తి
సాక్షి, న్యూఢిల్లీ : పెద్దల సభలో నంబర్ 2 స్థానం ఎంపికపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. రాజ్యసభ కాసేపటి ప్రారంభం కాగా.. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక తీర్మానాన్ని చైర్మన్ వెంకయ్య నాయుడు చదివి వినిపించారు. అనంతరం ఓటింగ్ ప్రారంభమైంది. డిప్యూటీ చైర్మన్ ఎన్నికల బరిలో ఎన్డీయే కూటమి-కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఎన్నికకు దూరంగా ఉండాలని వైఎస్సార్ సీపీ(2), ఆప్(3), పీడీపీ(2), డీఎంకే(1) పార్టీలు నిర్ణయించాయి. ప్రస్తుతం రాజ్యసభ సభ్యుల సంఖ్య 244. ఓటింగ్‌కు దూరమైంది 8 మంది. దీంతో ఓటింగ్‌లో పాల్గొనేవారి సంఖ్య 236కి పడిపోయింది. అందులో 125 మంది ఇదివరకే ఎన్డీయే అభ్యర్థికి మధ్దతును ప్రకటించారు. విపక్షాల అభ్యర్థికి 111 మంది మద్ధతు ఇస్తున్నారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు ప్రస్తుతం కావాల్సిన మెజార్టీ మార్క్ 119. ఎన్డీయే కూటమి తరపున జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్, విపక్షాల తరపున కాంగ్రెస్ ఎంపీ కె. హరిప్రసాద్ పోటీ పడుతున్నారు. రాహుల్ గాంధీ స్వయంగా సంప్రదించలేదని అలిగిన ఆప్.. చివరి నిమిషంలో ఓటింగ్‌కు దూరమైనట్లు తెలుస్తోంది. -
డీప్యూటీ ఛైర్మన్ పదవి కోసం బీజేపీ,కాంగ్రెస్ పోరు
-
41 ఏళ్ల తర్వాత కాంగ్రెస్‌యేతర డిప్యూటీ చైర్మన్..!
సాక్షి, న్యూఢిల్లీ : దేశ ఎగువసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఈ ఏడాది జులైలో రిటైర్ కానున్నారు. దీంతో 41 ఏళ్ల తర్వాత రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని కాంగ్రెస్ కోల్పోయే అవకాశం ఏర్పడింది. 1977 నుంచి కాంగ్రెస్ పార్టీ నామినేట్ చేసిన వ్యక్తులే రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరిస్తూ వస్తున్నారు. 1977లో కాంగ్రెస్ నాయకుడు రామ్ నివాస్ మిర్ధా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎంపికయ్యారు. కాంగ్రెస్ చేతుల్లో నుంచి ఇప్పటికే స్పీకర్, డిప్యూటీ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ పదవులు పోయాయని, భవిష్యత్‌లో ఓ నాన్ కాంగ్రెస్ ఎంపీనే ఎగువ సభ డిప్యూటీ చైర్మన్ అవుతారని పేరు చెప్పడానికి ఇష్టపడని బీజేపీ నాయకులు ఒకరు వ్యాఖ్యానించారు. అయితే, కురియన్ తర్వాత డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీయేకు చెందిన వ్యక్తిని కూర్చుబెట్టడం అంత సులువేమీ కాదు. అందుకు సరిపడా నంబర్ ఎన్డీయే వద్ద లేదు. సంపద్రాయబద్దంగా అయితే లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ పదవులను అధికార పక్షానికి చెందిన వ్యక్తులు, డిప్యూటీ స్పీకర్, డిప్యూటీ చైర్మన్ పదవులు ప్రతిపక్ష పార్టీ వ్యక్తుల నిర్వహిస్తారు. అయితే, రెండు పదవులను తమ వద్దే ఉంచుకునేందుకు అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించింది. దీంతో ఎన్డీయే కూడా అలానే చేసే అవకాశం ఉందని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. మళ్లీ కాంగ్రెస్, బీజేపీ యేతర వ్యక్తికే డిప్యూటీ చైర్మన్‌గా అవకాశం దక్కుతుందనే ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. -
‘బాబు’ జెల్ల...‘రాజు’ కల కల్ల
సాక్షి ప్రతినిధి, కాకినాడ :తడిగుడ్డతో గొంతు కోయడం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి రివాజేనని మరోసారి రుజువైంది. టీడీపీకి జిల్లాలో ఒకప్పుడు పాతకాపు అయిన ఎమ్మెల్సీ చైతన్యరాజు ఇటీవల ఆ పార్టీ నేతలతో తిరిగి సాన్నిహిత్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. స్వతంత్ర ఎమ్మెల్సీ చైతన్యరాజు కుమారుడు రవికిరణ్‌వర్మ కూడా ఎమ్మెల్సీగా ఉన్నారు. చైతన్యరాజుకు ఎమ్మెల్సీ కంటే ఉన్నతమైన పదవిని పొందాలన్న కోరిక చాలాకాలంగా ఉంది. ఈ క్రమంలో ఆయన రాజ్యసభ లో అడుగుపెట్టాలని కలలుగన్నారు. గత జనవరిలో రాజ్యసభకు జరిగిన ద్వైవార్షిక ఎన్నికల్లో రాష్ట్రం నుంచి ఖాళీ అయిన సీటు కోసంచైతన్యరాజు చేయని ప్రయత్నం లేదు. స్వతంత్ర ఎమ్మెల్సీ కావడంతో అన్ని పార్టీల మద్దతుతో తన ఆకాంక్షను సాకారం చేసుకోవచ్చన్నాకున్నారు. తర్వాత కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగుదామనుకుని ఎమ్మెల్యేలతో లాబీయింగ్ కూడా జరిపారు. చివరి నిమిషంలో అంతా మొండిచెయ్యి చూపడంతో నామినేషన్ వేయకుండానే పెద్దల సభ ఆశలకు నీళ్లు వదులకోవలసి వచ్చింది. తాజాగా చైతన్యరాజు శాసనమండలి వైస్ చైర్మన్ కావాలని ఆశపడ్డారు. ఇందుకోసం ఎప్పుడో దూరమైన టీడీపీతో కూడా చెట్టపట్టాలు వేసుకున్నారు. ఉభయగోదావరి జిల్లాల్లో ఎమ్మెల్సీల మద్దతు టీడీపీకి కూడగట్టారు. మండలి వైస్‌చైర్మన్ రేసులో అందరి కంటే ముందు చెతన్యరాజే ఉన్నట్టు ఆయన అనుచరగణం బాహాటంగానే చెప్పింది. చంద్రబాబు కూడా చైతన్యరాజు అభ్యర్థిత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ప్రచారం జరిగింది. అంతా అనుకున్నట్టే జరుగుతోందనుకుంటున్న తరుణంలో చైతన్యరాజుకు ఏకాభిప్రాయం మాటున టీడీపీ నుంచి గట్టి ఎదురు దెబ్బతగిలింది. టీడీపీ పెద్దల వ్యూహమే.. : ఏకగ్రీవ ప్రతిపాదన తెరపైకి రావడం, చైతన్యరాజు అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించడం వెనుక టీడీపీ పెద్దల వ్యూహం ఉందంటున్నారు. చైతన్యరాజును కాక మరో ఎమ్మెల్సీని సూచించాలని కాంగ్రెస్ పక్ష నేత సి.రామచంద్రయ్య కోరడంతోనే ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డిని టీడీపీ ప్రతిపాదించడం గమనార్హం. తమ నాయకుడిని చివరి వరకూ ఊరించిన టీడీపీ చివరి నిమిషంలో జెల్లకొట్టి అవమానించిందని చైతన్యరాజు అనుచరులు అగ్గిమీదగుగ్గిలమవుతున్నారు. కాగా చైతన్యరాజు ఆశలను పెంచి, పోషించి, చివరికి తుంచి వేయడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నైజం వెల్లడైందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. బాబు ప్రజలనైనా, నేతలనైనా ఒకేరకంగా వంచించగలరని వ్యాఖ్యానిస్తున్నారు.