Descendants of the assets
-
జయ ఆస్తిపై పూర్తి హక్కులు వారికే
సాక్షి, చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వ్యవహారం మరో మలుపు తిరిగింది. జయ ఆస్తులకు దీప, దీపక్ ప్రత్యక్ష వారసులని మద్రాసు హైకోర్టు శుక్రవారం తీర్పు చెప్పింది. జయ ఆస్తికి వారిద్దరూ రెండో తరం వారసులని గురువారం ప్రకటించిన కోర్టు శుక్రవారం తీర్పును సవరిస్తున్నట్లుగా ప్రత్యక్ష వారసులని స్పష్టం చేసింది. అనారోగ్యకారణాలతో జయలలిత అకస్మాత్తుగా కన్నుమూసిన నాటి నుంచి రెండు అంశాలపై రసవత్తరమైన చర్చకు తెరలేచింది. ఒకటి రాజకీయ వారసులు ఎవరు, రెండు అపారమైన ఆమె ఆస్తికి వారసులు ఎవరు..? అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత పార్టీలో ఎవ్వరినీ నెంబరు టూ స్థాయిలో కూర్చో బెట్టలేదు. ఒకటి నుంచి వంద వరకూ అన్నీ తానై వ్యవహరించారు. ఆస్తుల కేసులో జైలు జీవితం గడిపినపుడు పన్నీర్‌సెల్వంకు సీఎం బాధ్యతలు అప్పగించినా అది అంతవరకే. పార్టీలో, ప్రభుత్వంలో పన్నీర్‌సెల్వం సహా అందరూ కిందిస్థాయి నేతలుగానే కొనసాగారు. ఆ రెండింటిలో మొదటిదాన్ని కైవసం చేసుకునే యత్నంలో శశికళ బొక్కబోర్లాపడి జైలు జీవి తం గడుపుతోంది. జయ స్థాయిలో శశికళ పార్టీలో చక్రం తిప్పినా అదంతా అనధికారమే. కొంత జయకు తెలియకుండా సాగిపోయినదే. ఇక ఆస్తిని దక్కించుకునేందుకు సైతం శశికళ, టీటీవీ దినకరన్ ప్రయత్నాలు చేసి విఫలమైనారు. జయ అవివాహిత కావడంతో ప్రత్యక్ష వారసులు లేరు. తాను నటుడు శోభన్‌బాబు, జయలలితకు జన్మించిన కుమార్తెను, ఆమె ఆస్తికి తానే వారసురాలినంటూ వేర్వేరుగా ఇద్దరు యువతులు కొన్నాళ్లపాటు హడావిడి చేశారు. వీరిలో బెంగళూరుకు చెందిన యువతి కోర్టులో కేసు కూడా వేసింది. ఆమె వాదనకు బలం లేకపోవడంతో కొద్దిరోజుల్లోనే కనుమరుగైంది. ఇక జయలలిత అన్న జయకుమార్ కుమార్తె దీప, కుమారుడు దీపక్ సైతం వారసత్వపోరును ప్రారంభించారు. పారీ్టకి, ప్రాపరీ్టకి సైతం తామే వారసులమని దీప మీడియా ముందుకొచ్చారు. చెన్నై పోయస్ గార్డెన్‌లోని నివాసాన్ని జయ స్మారకమందిరంగా మార్చాలని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను న్యాయస్థానం ద్వారా అడ్డుకున్నారు. చదవండి: పోయెస్ గార్డెన్‌పై పోరు.. చిన్నమ్మకు చిక్కే జయకు రక్తసంబందీకులుగా దీప, దీపక్ మాత్రమే చలామణిలో ఉండడంతో న్యాయస్థానం తీర్పు కూడా వారిద్దరికీ అనుకూలంగా వచ్చింది. పోయస్‌గార్డెన్ ఇంటిని స్మారకమందిరం చేయాలనే అంశంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వానికి అధికారం ఉందని గురువారం ఇచ్చిన తీర్పులో పేర్కొంది. జయ ఆస్తులకు దీప, దీపక్ రెండోతరం వారసులని పేర్కొంది. ముందురోజు చెప్పిన తీర్పులో సవరణలు చేస్తూ జయ ఆస్తులకు దీప, దీపక్ ప్రత్యక్ష వారసులని మద్రాసు హైకోర్టు శుక్రవారం మరో తీర్పు వెలువరించింది. ఇతర ఆస్తుల మాటెలా ఉన్నా చెన్నై పోయస్గార్డెన్పై అటు ప్రభుత్వం ఇటు దీప, దీపక్ పట్టుబటి ఉన్నారు. పోయస్‌గార్డెన్ ఇంటిని స్మారక మందిరం చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని న్యాయస్థానమే చెప్పిందని న్యాయశాఖా మంత్రి సీవీ షణ్ముగం తీర్పు వెలువడగానే మీడియా ముందు ధీమా వెలిబుచ్చారు. తాజా తీర్పుతో పోయస్‌గార్డెన్ ఇంటిపై దీప, దీపక్‌కు పూర్తిస్థాయి అధికారం వచ్చినట్లు భావించవచ్చు. జయ ఆస్తుల వ్యవహారంలో ఇంతవరకు శశికళ ప్రత్యక్ష జోక్యం చేసుకోలేదు. త్వరలో అదే జరిగితే ఈ వ్యవహారం మరెన్ని మలుపులు తిరుగుతుందో వేచిచూడాలి. చదవండి: వారిద్దరూ అమ్మ వారసులే ఈ తీర్పును ఊహించలేదు: దీప మద్రాసు హైకోర్టు శుక్రవారం తాజా తీర్పును వెలువరించిన అనంతరం మీడియాతో దీప మాట్లాడారు. ఇలాంటి తీర్పును నేను ఊహించలేదు. అన్నాడీఎంకే సైతం ఈ తీర్పును స్వాగతించాలి. పోయెస్‌గార్డెన్ రోడ్డులోకి ప్రవేశించకుండా నిరోధించారు. వారు ఎవరో మీకు తెలుసు. అత్త (జయలలిత) కడసారి చూపులకు కూడా నోచుకోకుండా చేసింది అన్నాడీఎంకే ప్రభుత్వమే. పోయెస్‌గార్డెన్ ఇంట్లోనే పుట్టాను. అయితే ఆ ఇంటిలోకి నేను వెళ్లకుండా అడ్డుకున్నారు. తమిళనాడు ప్రభుత్వం తమపై అనవసరమైన నిందలు మోపింది. అయితే చట్టం నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. మద్రాసు హైకోర్టుకు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. జయ ఆస్తులపై మాకు కోర్టు సర్వాధికారం ఇచ్చింది. ప్రత్యక్ష వారసులమని ప్రకటించిన తరువాత ఏఏ హక్కులు వస్తాయో పరిశీలించాలి. అన్ని ఆస్తులు మాకు అప్పగించాలి. వేదనిలయాన్ని జయ స్మారకమందరంగా మార్చాలని ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై, ఆ ఇంటిపై హక్కు కల్పించాలని కోరుతూ గవర్నర్‌ను కలుస్తాను. అన్నాడీఎంకే నుంచి ఇకపై వచ్చే సమస్యలను న్యాయస్తానంలోనే ఎదుర్కొంటాను. జయ ఆస్తుల విషయంలో అన్నాడీఎంకేకు అడ్డంకులు ఎదురవడంతో నన్ను టార్గెట్ చేస్తున్నారు. మాలో కొన్ని భయాలు నెలకొన్నందున సాయుధ పోలీసు బందోబస్తు కల్పించాలి. చదవండి: రక్త సంబంధీకులు వారసులు కారా? జయ ఆస్తుల చిట్టా జయలలిత ఆస్తులను అధికారికంగా లెక్కకట్టేందుకు ఉన్న ఆధారాలు ఎన్నికల నామినేషన్ల పత్రాల్లో ఆమె చూపిన వివరాలు మాత్రమే. తన వార్షిక ఆదాయం రూ.9.34 కోట్లని 1996లో ఆదాయపు పన్నుశాఖకు లెక్కచూపారు. అధికశాతం వ్యవసాయంపై వచ్చే ఆదాయమని పేర్కొన్నారు. నెలకు ఒక్కరూపాయి జీతం పొందుతున్నట్లు ఆ లెక్కల్లో తెలిపారు. 2011 ఎన్నికల్లో పోటీచేసినపుడు రూ.51.4 కోట్ల ఆస్తి చూపారు. 2016లో రూ.113.73 కోట్ల ఆస్తిని నామినేషన్ పత్రాల్లో పేర్కొన్నారు. చరాస్థి కింది రూ.42 కోట్ల విలువైన బంగారు నగలను చూపారు. స్థలాలు, నిర్మాణాల కింద మరో రూ.72 కోట్ల ఆస్తులను ఆమె చూపారు. బ్యాంకుల్లో రూ.10.63 కోట్ల డిపాజిట్టు చూపగా ఇందులో రెండుకోట్లు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సీజ్‌కు గురయ్యాయి. వివిధ కంపెనీల్లో రూ.27.44 కోట్లు పెట్టుబడులున్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో 21289.30 గ్రాముల బంగారం, 1250 కిలోల వెండిని సీజ్ చేశారు. రూ.2.4 కోట్ల అప్పుకూడా ఉందని ఆమె పేర్కొన్నారు. 1992లో కొడనాడులో 900 ఎకరాల టీ ఎస్టేట్‌ను కొనుగోలు చేసి క్రమేణా 1,800 ఎకరాలకు విస్తరించినట్లు తెలుస్తోంది. బహిరంగ మార్కెట్లో ఒక్కో ఎకరా రూ.1 కోటికి పలుకుతుంది. ఇక లగ్జరీ వసతులతో కొడనాడు బంగ్లా కూడా ఉంది. కొడనాడు ఎస్టేట్ తనకు సొంతమని శశికళ చెబుతున్నారు. జయలలిత పేరున మొత్తం 173 ఆస్తులున్నట్లు సమాచారం. వీటిల్లో కనీసం వంద ఆస్తుల్లోనైనా జయలలితకు పెద్దవాటా ఉండే అవకాశం ఉంది. జయ ఆస్తులపై న్యాయస్థానంలో వాదోపవాదాల్లో రూ.913 కోట్ల ఆస్తులుగా చూపారు. -
వారిద్దరూ అమ్మ వారసులే
సాక్షి చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తుల వివాదం కోర్టు తీర్పుతో ఒక కొలిక్కి వచ్చింది. కొంత ప్రభుత్వానికి మిగిలినది జయ అన్న కుమార్తె దీప, కుమారుడు దీపక్‌కు చెందేలా బుధవారం తీర్పు చెప్పింది. ఈ పంపకాలపై 8 వారాల్లోగా బదులు పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశించింది. అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షులు ఎంజీ రామచంద్రన్ మరణం తరువాత ప్రధాన కార్యదర్శి హోదాలో పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత తమిళనాడు రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. పలుసార్లు అన్నాడీఎంకేను అధికారపీఠంలో కూర్చొనబెట్టి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే అదే స్థాయిలో భారీ ఎత్తున ఆస్తులను సైతం కూడబెట్టినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. అనధికారికంగా వేలాది కోట్ల రూపాయల ఆస్తులున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే జయలలితకు చెన్నై పోయెస్‌గార్డెన్‌లో బంగ్లా, కొడైకెనాల్లో ఎస్టేట్, హైదరాబాద్‌లో ద్రాక్షతోట రూ.913 కోట్ల విలువైన ఆస్తులున్నాయని అధికారిక సమాచారం. (రక్త సంబంధీకులు వారసులు కారా? ) 2016 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కొద్ది నెలల్లోనే ఆమె అస్వస్థకు గురై అనూహ్యమైన రీతిలో అదే ఏడాది డిసెంబర్ 5నఅకస్మాత్తుగా కన్నుమూశారు. వివాహం చేసుకోకుండా ఆధ్యంతం కుమారిగానే జీవించినందున ఆమె కూడబెట్టిన కోట్లాది రూపాయల ఆస్తులకు వారసులు ఎవరనే అంశంపై పెద్ద చర్చనీయాంశమైంది. జయ మరణించిన తరువాత ఆదాయపు పన్నుశాఖాధికారులు జయ నివాసం పోయెగార్డెన్‌లో తనిఖీలు చేసినపుడు ఆస్తి పంపకాలు చేసినట్లు ఎలాంటి పత్రాలు దొరకలేదు. జయ రక్త సంబం«దీకులుగా ఆమె అన్న జయకుమార్ కుమార్తె దీప, కుమారుడు దీపక్ మాత్రమే ఉన్నారు. అయితే జయతో వారికి సత్సంబంధాలు, పోయెస్‌గార్డెన్ ఇంటికి రాకపోకలు లేనందున ఆస్తులు వివాదంలో చిక్కుకున్నాయి. జయ ఆస్తికి, రాజకీయాలకు సైతం తామే వారసులమని దీప గళమెత్తినా చట్టబద్ధత లేకుండా పోయింది. పోయెగార్డెన్‌లో ఇంటిని జయస్మారక మందిరంగా మార్చాలని అన్నాడీఎంకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. (స్మారక మందిరంగా జయలలిత నివాసం) అత్త (జయలలిత) ఆస్తులపై ఏకపక్ష నిర్ణయం తీసుకునే అధికారం అన్నాడీఎంకే ప్రభుత్వానికి లేదని దీప అభ్యంతరం పలికింది. జయ ఆస్తులపై తమకు తెలియకుండా ఎలాంటి నిర్ణయం తీసుకునేందుకు వీల్లేదని గట్టిగా అడ్డుతగిలింది. ఈ పరిస్థితిలో జయ ఆస్తుల పర్యవేక్షణకు ప్రయివేటు నిర్వాహకుడిని నియమించాల్సిందిగా కోరుతూ అన్నాడీఎంకే నేత పుహళేంది, జానకిరామన్ అనే మరో వ్యక్తి మద్రాసు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. జయలలిత అన్న కుమారుడు దీపక్, కుమార్తె దీపను ఈ పిటిషన్లో ప్రతివాదులుగా చేర్చారు. జయ చట్టపూర్వక వారసులమైన తమను నిర్వాహకులుగా నియమించాలని వారిద్దరూ కోర్టుకు విన్నవించుకున్నారు. జయ ఆస్తిపన్ను బకాయి ఉన్నారంటూ ఆదాయపు పన్నుశాఖ కొంత ఆస్తిని గతంలోనే జప్తుచేసి ఉంది. చెన్నై పోయెస్‌గార్డెన్‌లోని జయ నివాసం ‘వేద నిలయం’ను జయ స్మారకమందిరంగా మార్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అత్యవసర చట్టం తీసుకొచ్చింది. జయ ఆస్తులపై దాఖలైన పిటిషన్లపై వాదోపవాదాలు ముగియగా తీర్పు తేదీని ప్రకటించకుండా న్యాయమూర్తులు ఈ కేసును వాయిదావేశారు. జయ ఆస్తులపై సిఫార్సులతో తీర్పు: ఇదిలా ఉండగా, జయలలిత ఆస్తుల వివాదానికి సంబంధించి కొన్ని సిఫార్సులతో మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు కృపాకరన్, అబ్దుల్ ఖుద్దూస్ బుధవారం తీర్పును ప్రకటించారు. అందులోని వివరాలు ఇలా ఉన్నాయి. ‘పోయెస్‌గార్డెన్‌లోని ఇంటినంతా స్మారకమండపంగా మార్చాల్సిన అవసరం లేదు, కొంతభాగాన్ని సీఎం క్యాంప్ ఆఫీస్‌గా చేయవచ్చు. ఈ సిఫార్సులను ప్రభుత్వం పరిశీలించి స్మారక మండపంపై నిర్ణయం తీసుకోవాలి. ప్రయివేటు ఆస్తుల కొనుగోలుపై ప్రజల హృదయాల్లో అనేక సందేహాలుంటాయి. అందుకే జయ ఆస్తుల నిర్వహణకు ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలి. ఆ ట్రస్ట్‌లో దీప, దీపక్‌లను సభ్యులుగా చేర్చాలి. వీరిద్దరికీ ప్రభుత్వం 24 గంటలపాటూ సాయుధ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలి. జయ ఆస్తుల్లోని కొంత భాగాన్ని అమ్మివేసి ఆ సొమ్మును బ్యాంకులో డిపాజిట్ చేయాలి. డిపాజిట్‌పై వచ్చే ఆదాయం నుంచి దీప, దీపక్లకయ్యే పోలీసు బందోబస్తు ఖర్చుకు వినియోగించాలి. రెండో తరం వారసులుగా జయ అన్న కుమార్తె, కుమారునికి జయ ఆస్తిపై హక్కు ఉంటుంది. ఈ సిఫార్సులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని 8 వారాల్లోగా కోర్టులో బదులు పిటిషన్ దాఖలు చేయాల’ని వారు తీర్పులో పేర్కొన్నారు. జయ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులుగా పరిగణిస్తూ నిర్వాహక అధికారిని నియమించుకునే అవకాశాన్ని కలి్పంచాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను న్యాయమూర్తులు కొట్టివేశారు. అన్నింటికి వారసులం: దీప దివంగత సీఎం, తన మేనత్త ఆస్తులకే కాదు ఆమె ఆశయాలు, లక్ష్యాలకు వారసులం తాను, తన సోదరుడు దీపక్ అని దీప వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో మీడియా ముందుకు బుధవారం సాయంత్రం దీప వచ్చారు. కోర్టు ఇచ్చిన సూచనల్లో తమను వారసులుగా పేర్కొనడం ఆనందంగా ఉందన్నారు. తాను, తన సోదరుడు ఈ విషయంలో ఏకాభిప్రాయంతో ముందుకు సాగుతామని తెలిపారు. పారంపర్య ఆస్తులే కాదు, మేనత్త ఆస్తులకు తామిద్దరం వారసులమని, ఆమె ఆశయ సాధన, లక్ష్యాల్లోను వారసులంగా ఉంటామన్నారు. -
‘నల్ల’ కుబేరులను శిక్షించాలి
-
‘నల్ల’ కుబేరులను శిక్షించాలి
⇒ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి ⇒ వారసుల ఆస్తులపై పన్నులు వేయటం సరికాదు ⇒ సర్కారు బలంగా ఉన్నంత మాత్రాన మేలు జరగదు ⇒ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యలు పనాజీ: చట్టాలను క్రమబద్ధీకరించడం, పటిష్టంగా అమలు చేయడం ద్వారా నల్లధనం కుబేరులను శిక్షించాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ వ్యాఖ్యానించారు.చట్టాలను ఎవరూ కూడా దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. శుక్రవారం డీడీ కోసాంబి ఐడియాస్ ఫెస్టివల్లో పాల్గొన్న సందర్భంగా ప్రజాస్వామ్యం, అభివృద్ధి అంశంపై మాట్లాడుతూ ఆయన ఈ విషయాలు చెప్పారు. విదేశాల్లోనే కాదు దేశీయంగా కూడా భారీ ఎత్తున బ్లాక్ మనీ మూలుగుతోందని రాజన్ పేర్కొన్నారు. విదేశాల్లో దాచుకున్న వారినే కాకుండా ఇలా దేశీయంగా దాచుకున్న నల్ల ధనం కుబేరులను కూడా పట్టుకుని, శిక్షించాలన్నారు. గడిచిన కొన్ని దశాబ్దాలుగా పన్నులు గణనీయంగా తగ్గాయని, ప్రస్తుతం సహేతుక స్థాయిలోనే ఉన్నాయని రాజన్ తెలిపారు. వీటిని కూడా ఎగ్గొడితే పన్నుల వ్యవస్థను అవహేళన చేసినట్లేనన్నారు. ‘ప్రజలు పన్నులు కట్టేందుకు తగిన అవకాశం ఇవ్వాలి. అప్పటికీ కట్టకపోతే అప్పుడు శిక్షించాలి. పన్నులు ఎగ్గొడితే శిక్ష తప్పదు అన్న విషయం స్పష్టంగా తెలియాలి. ఇందుకోసం పన్నుల వ్యవస్థను పటిష్టం చేయాలి’ అని వ్యాఖ్యానించారు. ప్రజలకు ఉద్యోగావకాశాలు కల్పించడం ముఖ్యమని, ఇందుకోసం ప్రభుత్వం సరైన విధానాలను రూపొందించాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. వారసత్వ ఆస్తి పన్నులు సరికాదు.. వారసత్వ ఆస్తిపై పన్నుల విధానాన్ని తప్పుపడుతూ .. ప్రభుత్వం ప్రజలను సంపన్నులుగా చేయడంపైనే దృష్టి పెట్టాలే తప్ప వారసత్వంగా సంపద దక్కించుకున్న వారిని సాధారణ స్థాయికి దిగజార్చకూడదన్నారు. అసలు ఇలాంటి పన్నులు విధిస్తే సంపద సృష్టించే వారికి ఎటువంటి ప్రోత్సాహకాలు లేకుండా పోతాయన్నారు. అటు ఆర్థిక రంగ చట్టాల సంస్కరణల కమిషన్ (ఎఫ్ఎస్ఎల్ఆర్సీ) చేసిన సిఫార్సులపైనా పరోక్షంగా ఆయన విమర్శలు సంధించారు. లెసైన్స్ పర్మిట్ జమానా నుంచి బైటపడిన దేశం తాజాగా అపీలేట్ జమానా బారిన పడకూడదన్నారు. ఆర్బీఐ సహా ఆర్థిక రంగానికి సంబంధించిన నియంత్రణ సంస్థలన్నిటీకీ ఒకే అపీలేట్ అథారిటీని ఏర్పాటు చేయాలన్న ఎఫ్ఎస్ఎల్ఆర్సీ సిఫార్సు నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రభుత్వం పటిష్టంగా ఉంటే సరిపోదు.. ప్రభుత్వం పటిష్టంగా ఉన్నంత మాత్రాన సరైన దిశలోనే పాలిస్తుందని ఏమీ లేదని రాజన్ వ్యాఖ్యానించారు. దీనికి నియంత హిట్లర్ ఉదంతమే నిదర్శనమన్నారు. ‘హిట్లర్ జర్మనీలో అత్యంత సమర్ధమైన పాలనే అందించాడు. 1975-77 మధ్య ఎమర్జెన్సీ విధించినప్పుడు మన దగ్గర నడిచినట్లే.. ఆయన పాలనలో కూడా రైళ్లు సరిగ్గా సమయానికి నడిచేవి. ఆయన ప్రభుత్వం చాలా పటిష్టమైనది కూడా. కానీ చట్టాలన్నింటినీ తుంగలో తొక్కి ఆయన జర్మనీని పతనం వైపుగా నడిపించాడు’ అని రాజన్ చెప్పారు. కాబట్టి.. చిత్తశుద్ధి, నైపుణ్యం, ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పం గలవారే పటిష్టమైన ప్రభుత్వానికి సారథ్యం వహించాలని ఆయన వ్యాఖ్యానించారు. అందరికీ మెరుగైన విద్య, వైద్యం వంటివి కల్పించినప్పుడే సమ్మిళిత వృద్ధిని సాధ్యమన్నారు.