'రాష్ట్రంలో 196 కరువు మండలాలను గుర్తించాం'
విజయవాడ: రాష్ట్రంలో 196 కరువు మండలాలను గుర్తించామని ఏపీ హోమంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పారు. మంగళవారం ఆయన కరువు పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఇంకా కరువు పరిస్థితులపై కలెక్టర్లతో నివేదిక తెప్పించుకుంటున్నామని చెప్పారు.
కరువు నివారణ కేంద్రం ఇప్పటికే 330 కోట్ల రూపాయలను కేటాయించినట్టు తెలిపారు. మరో 110 కోట్ల రూపాయలు రావాల్సి ఉందన్నారు. కరువు మండలాలు పెరిగితే.. 1400 కోట్ల రూపాయల మేర కేంద్రాన్ని సహాయం కోరతామని అన్నారు. రంగా అంశాన్ని హరిరామ జోగయ్య ఇప్పుడు ప్రస్తావించడం పద్దతి కాదని చినరాజప్ప చెప్పారు.