'అర్హులైన వారికి పింఛన్లు ఇవ్వండి'
వేముల (వైఎస్సార్ జిల్లా): వేముల మండలంలో అర్హులైనవారందరికీ పింఛన్లు మంజూరుచేయాలని వైఎస్సార్ జిల్లా వేముల మండలప్రజాపరిషత్ అధ్యక్షురాలు ఉషారాణి ఎంపీడీవోకు సూచించారు.
సోమవారం జరిగిన మండల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పింఛన్లు అందక ఇబ్బందిపడుతున్నారని, అర్హులైన వారందరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.