Detective Agency
-
కుమార్తె కోసం గూగుల్‌లో సెర్చ్ చేస్తే.. రూ.లక్ష అడ్వాన్స్ తీసుకుని
సాక్షి, హైదరాబాద్: గూగుల్‌లో కాల్ సెంటర్ల నెంబర్లే కాదు... వివిధ సంస్థలూ బోగస్‌వి ఉంటున్నాయి. తన కుమార్తె కోసం డిటెక్టివ్ ఏజెన్సీని సంప్రదించాలని భావించిన అత్తాపూర్ వాసి ఇలాంటి సంస్థ వల్లోపడి రూ.లక్ష నష్టపోయారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు నిమిత్తం సైబరాబాద్‌కు బదిలీ చేయాలని నిర్ణయించారు. అత్తాపూర్‌కు చెందిన బాధితుడు (62) ఓఅపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నారు. తన కుమార్తెకు వివాహం చేయాలనే ఉద్దేశంతో వివిధ మాట్రిమోనియల్ సైట్స్‌లో రిజిస్టర్ చేశారు. దీంతో ఆయనకు అనేక ప్రొఫైల్స్ నుంచి ఇబ్బడిముబ్బడిగా ప్రతిపాదనలు వచ్చాయి. వీరిలో ఒకరిని ఎంపిక చేసుకున్న ఆయన ముందుగా అతడి పూర్వాపరాలు పరిశీలించాలని భావించారు. దీనికోసం ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని ఎంపిక చేసుకోవడానికి గూగుల్‌లో సెర్చ్ చేశారు. అందులో కనిపించిన నెంబర్ ద్వారా ఓ సంస్థను సంప్రదించారు. తమది ముంబై కేంద్రంగా పని చేస్తున్న ఏజెన్సీ అని చెప్పిన అవతలి వ్యక్తులు తమకు దేశ వ్యాప్తంగా నెట్వర్క్ ఉందని నమ్మబలికారు. వెరిఫికేషన్ కోసం అబ్బాయి వివరాలతో పాటు రూ.లక్ష అడ్డాన్స్‌గా చెల్లించాలని కోరారు. కుమార్తె భవిష్యత్తు కోసం ఆ మాత్రం ఖర్చు చేసినా పర్వాలేదని భావించిన బాధితుడు ఆ మొత్తాన్ని ఆన్లైన్లో చెల్లించాడు. ఆ తర్వాత సదరు ఫోన్ నెంబర్ పని చేయకపోవడంతో కొన్ని రోజులు ఎదురు చూసి మరోసారి ప్రయత్నించి మోసపోయానని గుర్తించారు. శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. బాధితుడు నివసించే అత్తాపూర్‌లోని అపార్ట్మెంట్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వస్తుంది. అయితే ఆయన వయస్సు తదితరాలను పరిగణలోకి తీసుకున్న ఏసీపీ ప్రసాద్ కేసు నమోదు చేయించారు. దీన్ని దర్యాప్తు నిమిత్తం సైబరాబాద్ సైబర్ క్రైమ్ ఠాణాకు బదిలీ చేయాలని శనివారం నిర్ణయించారు. అధికారులు ఆ మేరకు సన్నాహాలు చేస్తున్నారు. -
పెళ్ళికి ముందే అమ్మాయిని వెంబడిస్తూ..
నేరేడ్మెట్: విద్యార్థినులు, బాలికల కదలికలను రహస్యంగా గమనిస్తూ..వీడియో, ఫోటోలు తీస్తూ... పెళ్లికి ముందే వారి గుణగణాలపై ఆరా తీస్తూ వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్న డిటెక్టివ్ ఏజెన్సీ బండారం బట్టబయలైంది. జంట నగరాల్లోనే ఈ తరహా కేసు నమోదు కావడం తొలిసారని రాచకొండ పోలీసు కమిషనర్ మహేష్‌భగవత్ తెలిపారు. బుధవారం నేరేడ్మెట్లోని తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా ముదిరెడ్డిపల్లి, శివబాలయోగి నగర్‌కు చెందిన దేవంగ మహేష్ కంచన్‌బాగ్‌లోని డీఆర్డీఓలో జూనియర్ రీసెర్చ్ ఫెలో (మెకానికల్ ఇంజనీరింగ్)గా పని చేస్తూ బాలపూర్ క్రాస్ రోడ్డు సమీపంలోని త్రివేణి నగర్ కాలనీలో ఉంటున్నాడు. చైతన్యపురిలోని ఓ జూనియర్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినని ఇష్టపడుతున్న అతను ఆమెను తరచూ వెంబడిస్తున్నాడు. సదరు బాలికతో మాట్లాడాలని..ఆమె దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు చేసినా పట్టించుకోలేదు. దీంతో సదరు విద్యార్థిని వ్యక్తిగత వివరాలు తెలుసుకోవాలని భావించిన మహేష్ కొత్తపేట నాగోల్ రోడ్డు సమీపంలోని ఎస్బీహెచ్ కాలనీలో ఉన్న స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీ నిర్వాహకుడు చిక్కా కిరణ్‌కుమార్‌పు సంప్రదించాడు. తాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్న విద్యార్థిని ఆమె వ్యక్తిగత సమాచారంతోపాటు గుణగణాలు, బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? తదితర వివరాలు సేకరించాలని కోరాడు. ఇందుకు గాను రూ.17వేలతో ఒప్పందం చేసుకున్నాడు. ఇందులో భాగంగా డిటిక్టెవ్ ఏజెన్సీలో అడ్మిన్ ఆఫీసర్‌గా పని చేస్తున్న బాతుల సుహాసిని సదరు విద్యార్థిని వెంబడిస్తూ వీడియో చిత్రీకరిస్తూ, ఫోటోలు తీస్తూ, ఆమె సెల్ నంబర్‌ను సేకరించి మహేష్‌కు అందజేశారు. అంతేగాక కిరణ్‌కుమార్, సుహాసిని కళాశాలకు వచ్చి విద్యార్థి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. దీనిపై అనుమానం వచ్చిన ప్రిన్సిపాల్ కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు ఈ విషయమై నిలదీయగా సదరు విద్యార్థిని పెళ్లి చేసుకునేందుకు మహేష్ కోరిక మేరకు వివరాలు సేకరించినట్లు తెలిపారు. అయితే ఆమె మైనర్ కావడం రహస్యంగా వెంబడిస్తూ వీడియో, ఫొటోలు తీయడాన్ని అవమానంగా భావించిన ఆమె కుటుంబసభ్యులు ఈనెల 31న చైతన్యపురి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు మహేష్, కిరణ్‌కుమార్, సుహసినిలను అరెస్టు చేసిన పోలీసులు వారి నుంచి ఒక ల్యాప్‌టాప్, రెండు సెల్ఫోన్లు, పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సమావేశంలో ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఏసీపీ పృథ్వీదర్‌రావు, సీఐ సుదర్శన్, ఎస్ఐ సాయిప్రకాష్‌గౌడ్ పాల్గొన్నారు. వివరాలు వెల్లడిస్తున్న రాచకొండ సీపీ మహేష్‌భగవత్ సమాచారం తెలుసుకునే అధికారం లేదు: సీపీ వివాహానికి ముందు అమ్మాయిల వ్యక్తిగత సమాచారం, తెలుసుకునే అధికారం డిటెక్టివ్ ఏజెన్సీలకు లేదని సీపీ తెలిపారు. లేబర్ లైసెన్స్ తీసుకొని స్కౌట్ డిటెక్టివ్ ఏజెన్సీని నిర్వహిస్తున్నట్లు తేలిందన్నారు. ఇప్పటి వరకు పలువురి వివరాలు సేకరించినట్లు వెల్లడైందన్నారు. మహిళలు, యువతులను వెంబడిస్తూ వారి సమాచారం సేకరించడం, అవమానకరంగా వ్యవహరించే ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
అప్పుల వసూలుకు వస్తాదులొద్దు
కొచ్చి: రుణగ్రహీతల నుంచి అప్పులు వసూలు చేసేందుకు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కండలుతిరిగిన వస్తాదులను నియమించడం అనైతికం, అన్యాయమని కేరళ హైకోర్టు పేర్కొంది. వస్తాదులను పంపి రుణగ్రహీతలను వేధించి, భయపెట్టి అప్పులు రాబడుతున్నారని, దీనికి డిటెక్టివ్ ఏజన్సీలనూ వాడుతున్నారని జడ్జి జస్టిస్ సురేశ్ అన్నారు. ఇది చట్టప్రకారం నేరమన్నారు. ఓ ప్రైవేట్ డిటెక్టివ్ సంస్థ ఒక బ్యాంకుపై వేసిన పిటిషన్‌ను జడ్జి విచారించారు. -
ఈ వారం you tube హిట్స్
స్టార్ వార్స్ : ది ఫోర్స్ అవేకెన్స్ ట్రైలర్ నిడివి : 2 ని. 35 సె. హిట్స్ : 4,53,89,879 స్టార్ వార్స్ ఫిల్మ్ సిరీస్‌లో ఇది ఏడవది. ట్రైలర్ గతవారమే విడుదలైంది. ఈ అమెరికన్ ఎపిక్ స్పేస్ అపేరా చిత్రానికి జె.ఎ.అబ్రామ్స్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 14న రిలీజ్‌కు రంగం సిద్ధమైంది. 23 ఏళ్ల ఇంగ్లండ్ నటి డైసీ రిడ్లే ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఎడారి గ్రహం జక్కులో ఈమె మొదట స్కావెంజర్. తర్వాత సాహస వనితగా అవతరిస్తారు. 1983లో వచ్చిన స్టార్ వార్స్ సిక్స్ ‘రిటర్స్ ఆఫ్ ది జెడీ’ తర్వాత దాదాపు 30 ఏళ్లకు వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. స్టార్‌వార్స్ సీరీస్‌లో తొలిచిత్రం 1977లో విడుదలైంది. మార్వెల్స్ జెస్సికా జోన్స్ : ట్రైలర్ నిడివి : 2 ని. 28 సె. హిట్స్ : 26,47,608 నవంబర్ 20 నుంచి ‘నెట్‌ఫ్లిక్స్’ నెట్ వర్క్ ద్వారా ప్రపంచమంతటా ప్రసారం కాబోతున్న అమెరికన్ వెబ్ టెలివిజన్ సిరీస్.. మార్వెల్వ్ జెస్సికా జోన్స్. మార్వెల్స్ కామిక్స్ ఆధారంగా ఈ ఎపిసోడ్స్ తయారయ్యాయి. కథానాయిక జోన్స్ పాత్రను క్రిస్టెన్ రిటెన్ నటిస్తున్నారు. కథలో ఆమె ఒక సూపర్ హీరో. ఆ తర్వాత ఒక డిటెక్టివ్ ఏజెన్సీని నడుపుతుంది. సూపర్‌హీరోగా ఆమె కెరీర్ అర్ధంతరంగా అంతం కావడం వెనుక ఒక విషాదం ఉంటుంది. ఆ విషాదం నుండి తేరుకుని జెస్సికా తనని తను మలుచుకుంటుంది. తనేమిటో ప్రపంచానికి నిరూపిస్తుంది. దివానీ మస్తానీ : వీడియో సాంగ్ నిడివి : 2 ని. 44 సె. హిట్స్ : 33,20,290 రాజమందిరపు నృత్యగీతాన్ని వీక్షించదలచినవారు గతవారమే విడుదలైన ‘దివానీ మస్తానే’ అనే ఈ వీడియో సాంగ్‌ని ఎంపిక చేసుకోవచ్చు. దీపికా పడుకొనే, రణవీర్ సింగ్, ప్రియాంక నటించిన ‘బాజీరావ్ మస్తానీ’లోని ఈ పాటను ఎంతో రిచ్‌గా దృశ్యీకరించారు. సిద్ధార్థ్ గరిమ రాసిన ఈ పాటకు సంజయ్‌లీలా బన్సాలీ సంగీతం అందించారు. శ్రేయా గోషల్, గణేశ్ చందన్శివ గాత్రమిచ్చారు. మరాఠా యోధుడు మొదటి పీష్వా బాజీరావ్, ఆయన రెండవ భార్య మస్తానీల ప్రణయగాథ ఆధారంగా తీసిన ఈ చిత్రం డిసెంబర్ 18 న విడుదలౌతోంది. జస్టిన్ బీబర్ - సారీ (డాన్స్ వీడియో) నిడివి : 3 ని. 25 సె. హిట్స్ : 1,65,46,107 కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్ భగ్న ప్రేమగీతం ‘సారీ’. బీబర్ రెండవ సింగిల్ సాంగ్ అయిన ‘సారీ’ విడుదలైన మూడు రోజులకే కోటికి పైగా హిట్లు వచ్చాయి. గత ఆగస్టులో రిలీజ్ అయిన బీబర్ మొదటి సింగిల్ డెబ్యూ ‘వాట్ డు యు మీన్?’ కూడా ఇదేస్థాయి ఆదరణ పొంది, బిల్బోర్డ్ హాట్ 100 చార్ట్‌లో నిలిచింది. ఫాస్ట్ బీట్తో నడిచే తాజా డాన్స్ పాప్ సాంగ్ ‘సారీ’ యువతరాన్ని అలరిస్తోంది. జూలియా మైఖేల్స్, జస్టిన్ ట్రాంటర్, జస్టిన్ బీబర్ కలిసి రాసిన ఈ గీతంలో ‘నిన్నెంతో బాధపెట్టాను. ఇప్పుడు సారీ చెప్పడం ఆలస్యమేమో కదా’ అని ప్రీ కోరస్ వినిపిస్తూ ఉంటుంది. 20 ఇయర్స్ ఆఫ్ డి.డి.ఎల్.జె. నిడివి : 2 ని. 49 సె. హిట్స్ : 25,42,644 దిల్వాలే దుల్హనియా లే జాయేంగే (డి.డి.ఎల్.జే) విడుదలై ఈ అక్టోబర్ 20కి ఇరవై ఏళ్లు. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ ఫిల్మ్ ఇప్పటికీ ఒక సంచలనమే. షారుఖ్ ఖాన్, కాజోల్ ఈ చిత్రంతోనే మేడ్ ఫర్ ఈచ్ అదర్ హీరో హీరోయిన్లుగా బాలీవుడ్లో ప్రసిద్ధి చెందారు. ఎన్నారై అమ్మాయి, అబ్బాయి మధ్య నడిచే ప్రేమకథ ఇది. విషయం ఏమిటంటే డి.డి.ఎల్.జే. విడుదలై రెండు దశాబ్దాలు అయిన సందర్భంగా బాలీవుడ్ డెరైక్టర్ రోహిత్‌శెట్టి, దిల్వాలే టీమ్ కలిసి ఈ జ్ఞాపకాల వేడుకల వీడియోను రూపొందించారు. తప్పక చూడండి. హ్యూమన్స్ ఇన్ 1000 ఇయర్స్ నిడివి : 4 ని. 06 సె. హిట్స్ : 13,16,655 వచ్చే వెయ్యేళ్లలో మానవ జీవితం ఎలా ఉండబోతోందో, వివిధ రంగాలలో క్షణక్షణానికీ అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీ ప్రభావం వల్ల మానవుల రూపురేఖల్లో, మానవ జీవితంలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయో అంచనా వేస్తూ ‘అసాప్‌సైన్స్’ అనే యూట్యూబ్ చానెల్ ఈ వీడియోను రూపొందించింది! అసాప్‌సైన్స్ చెబుతున్న దానిని బట్టి మనిషి కళ్లు ఎర్రగా అవుతాయట. మనుషులు బక్కగా, చక్కగా, ఎత్తుగా, అందంగా మారిపోతారట. వాతావరణ మార్పులు, కృత్రిమ మేధస్సు కలిసి ఈ భూగోళం స్వరూపాన్నే మార్చేస్తాయట. ఇంకా చాలా విశేషాలున్నాయి. వీడియో చూడండి.