Dev Gill
-
మగధీర విలన్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ వచ్చేసింది!
మగధీర విలన్ దేవ్‌గిల్ హీరోగా నటించిన తాజా చిత్రం అహో విక్రమార్క. ఈ సినిమాలో చిత్ర శుక్లా హీరోయిన్గా నటిస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి రాజమౌళి శిష్యుడు పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నాడు. వార్డ్ విజర్డ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఆర్తి దేవిందర్ గిల్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే దేవ్‌గిల్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. కాగా.. ఈ చిత్రం ఆగస్టు 30న ఇది విడుదల కానుంది. -
విక్రమార్క వస్తున్నాడు
రామ్‌చరణ్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘మగధీర’ సినిమాలో విలన్ పాత్రలో నటించిన దేవ్ గిల్ హీరోగా నటించిన చిత్రం ‘అహో! విక్రమార్క’. పేట త్రికోటి దర్శకుడు. దేవ్ గిల్ప్రోడక్షన్స్పై ఆర్తి దేవిందర్ గిల్, మీహిర్ కుల్జర్ని, అశ్విని కుమార్ మిస్రా నిర్మించారు.ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఆగస్టు 30న రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. దేవ్ గిల్ మాట్లాడుతూ– ‘‘అహో! విక్రమార్క’ సినిమాలో పోలీసుల ధైర్యం, అంకితభావాన్ని గొప్పగా చూపించబోతున్నాం. నటుడిగా నాలోని మరో కోణాన్ని ఈ మూవీ ద్వారా ప్రేక్షకులు చూస్తారు’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్, ఆర్కో ప్రవో ముఖర్జీ. -
రాజమౌళిగారు నాకు జీవితం ఇచ్చారు: దేవ్ గిల్
‘‘నా స్వస్థలం పుణే. ముంబైలో ఉన్న నన్ను ‘మగధీర’ మూవీ కోసం రాజమౌళిగారు హైదరాబాద్‌కి తీసుకొచ్చి, నాకు జీవితం ఇచ్చారు. రాజమౌళి, రమా రాజమౌళిగార్ల వల్లే ఈ రోజు ‘అహో విక్రమార్క’లో హీరోగా నటించి, నిర్మించగలిగాను. ఇందుకు నాకు ఆనందంగా ఉంది’’ అని దేవ్ గిల్ అన్నారు. ‘మగధీర’ చిత్రంలో రామ్‌చరణ్‌కి ప్రతినాయకుడిగా నటించిన దేవ్ గిల్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడే. ఆయన హీరోగా పేట త్రికోటి దర్శకత్వం వహించిన చిత్రం ‘అహో విక్రమార్క’. దేవ్ గిల్ ప్రొడక్షన్స్‌పై దేవ్ గిల్ భార్య ఆర్తి ఈ మూవీ నిర్మించారు. ఈ సినిమా టీజర్‌ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. దేవ్ గిల్ మాట్లాడుతూ– ‘‘మగధీర’ నుంచి తెలుగు ప్రేక్షకులు నాపై ప్రేమను కురిపిస్తూనే ఉన్నారు. నన్ను ఇంతవరకు విలన్‌గా చూశారు. ‘అహో విక్రమార్క’తో హీరోగా మీ అందరికీ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను’’ అన్నారు. ‘‘మా ్ర΄÷డక్షన్ నుంచి వస్తున్న మొదటి చిత్రం ఇది. ఈ సినిమా చాలా కొత్తగా ఉంటుంది... ప్రేక్షకులు ఆదరించాలి’’ అన్నారు ఆర్తి. పేట త్రికోటి మాట్లాడుతూ– ‘‘దేవ్ గిల్‌కి ΄ోలీస్ కథ సరి΄ోతుందని భావించి, ఈ సినిమా తీశాం. తెలుగు, హిందీ భాషల్లో ఈ సినిమా చిత్రీకరించాం’’ అన్నారు. ‘‘త్రికోటి, దేవ్ గిల్గార్లతో పని చేయడం ఆనందంగా ఉంది’’ అన్నారు హీరోయిన్ చిత్రా శుక్లా. నటులు యువరాజ్, ప్రవీణ్ మాట్లాడారు. -
హీరోగా మగధీర విలన్.. టీజర్ రిలీజ్ చేసిన రాజమౌళి!
రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా నటించిన బ్లాక్‌బస్టర్ చిత్రం మగధీర, రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా టాలీవుడ్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో విలన్ పాత్రలో దేవ్‌గిల్ ఆకట్టుకున్నారు. తాజాగా ఆయన హీరోగా నటించిన చిత్రం అహో విక్రమార్క. ఈ చిత్రానికి పేట త్రికోటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను దర్శకధీరుడు రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేశారు. 'ఇది అసుర రాజ్యం.. ఇక్కడికీ ఎవడైనా రావడమే తప్ప.. ప్రాణాలతో తిరిగిపోవడం ఉండదు' అనే డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. తాజాగా విడుదలైన ఈ టీజర్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈ చిత్రంలో దేవ్ గిల్ పవర్ఫుల్ పోలీసు ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. 'పోలీస్ అంటే సింహం కాదురా.. సింహాన్ని కూడా వేటాడే వేటగాడు' అనే డైలాగ్ ఈ మూవీపై అంచనాలు పెంచుతోంది. అసుర రాజ్యం పేరిట అమాయకులను హింసించే వారిని హీరో ఏం చేశాడనేది కథ. ఈ సినిమా విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు. Forever grateful to you @ssrajamouli garu 🙏🏼❤️#AhoVikramaarkaTeaser out now! - https://t.co/WIxYwyGxu7#AhoVikramaarka @iamdevsinghgill @ChitraShuklaOff @WriterPravin @tejaswwini @SayajiShinde @BithiriSathi_ @prabhakalakeya @petatrikoti pic.twitter.com/V5bw3GKavM— Dev Gill (@iamdevsinghgill) June 20, 2024 -
రావణలంక
మురళీ శర్మ, దేవ్ గిల్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రానికి ‘రావణ లంక’ అనే టైటిల్ ఖరారు చేశారు. బీఎన్ఎస్ రాజు దర్శకత్వంలో క్రిష్ సమర్పణలో కె. సిరీస్ మూవీ ఫ్యాక్టరీ బేనర్లో రూపొందుతున్న ఈ చిత్రంలో క్రిష్, అస్మిత, త్రిష ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఒక పాట మినహా షూటింగ్ పూర్తయిన ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు. ఆదివారం చిత్రం మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బీఎన్ఎస్ రాజు మాట్లాడుతూ – ‘‘ఇదొక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కిస్తున్నాం. ఉజ్జల్ మంచి ట్యూన్స్ ఇచ్చారు. కాలభైరవ, రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాటలు హైలైట్. త్వరలో పాటలను విడుదల చేస్తాం’’ అన్నారు. -
రణదేవ్ బిల్లా అంటే ఎవరు?
ఐ టాకు ఏ ఇంగిలీసు ఆల్ పీపులు వెల్లా టుడే! ఉత్తమ విలన్ ఇది నాది అని ఒక్కసారి నేను అనుకుంటే అది నాకు దక్కి తీరాలి విలన్ ఎలా ఉండాలి? కోపం కోసమే పుట్టినట్లు... రెండు నిప్పుల కుంపట్లు ఎప్పుడూ కళ్లలో పెట్టుకోవడమే తన హక్కు అన్నట్లు ఉండకూడదు. ఒక లెక్క ప్రకారం చెప్పుకోవాలంటే... సెలైంట్‌గా ఉంటూనే సునామీ సృష్టించాలి. సునామీలా వెర్రెత్తిపోతూనే... సెలెనైై్సపోవాలి. వ్యూహాన్ని మెరుగుదిద్దుకోవాలి. ‘ఉత్తమ విలన్’ అంటే ఇలా ఉండాలి’ అనిపించుకోవాలి. చల్లగా చాపకింద నీరులా ఉండి చావు దెబ్బతీసే ‘విలన్’ పాత్రలకు ఇంకా చేరువకాలేదుగానీ... ఆవేశాన్ని, హాస్యాన్ని సమపాళ్లలో పండించగలనని నిరూపించాడు దేవ్ గిల్. దేవ్ గిల్ అంటే? ఎవరు? అదేనండీ... ‘మగధీర’ విలను. రణదేవ్ బిల్లా!! అమ్మో....! నాలుగు శతాబ్దాల నాటి తీరని వాంఛతో రాకుమార్తె కోసం మళ్లీ పుట్టిన విధ్వంసకారుడు. ఎంతకైనా తెగించి తొడగొట్టే రాక్షసుడు... రణదేవ్ బిల్లా! ‘మగధీర’లో మగటిమి ఉట్టి పడే విలన్‌గా భయపెట్టిన దేవ్... ‘పూలరంగడు’లో ‘ఐ టాకు ఏ ఇంగిలీసు’ అంటూ నవ్వించాడు. ‘సినిమాలో ఒక హీరో ఉంటాడు కాబట్టి... అతనికొక విలన్ ఉండాలి’ అన్నట్లుగా ‘మగధీర’ సినిమాలో ‘విలన్’ పాత్రను డిజైన్ చేయలేదు. ఆ పాత్రలో రక్తమాంసాలు ఉంటాయి. చీకటి వెలుగులు ఉంటాయి. కొండను ఢీ కొట్టే బలమైన ముందడుగు ఉంటుంది. అగ్గిలాంటి ఆవేశం ఉంటుంది. దీంతో పాటు అడుగుతడబడడం ఉంటుంది. అవమానం ఉంటుంది. ప్రత్యర్థిని సవాలు చేసే దమ్ము కావాలి.ఆ దమ్ము గొంతులోనే కాదు... గంభీరమైన దృఢమైన శరీరంలోనూ కనిపించాలి.‘మగధీర’లో విలన్ పోస్ట్‌కు ఎంపిక కావడం అంటే ఆషామాషీ ఏమి కాదు. మరి అదృష్టం ఉంటే? ఆ అదృష్టానికి ప్రతిభ తోడైతే.... ఆ ప్రతిభే... రణదేవ్ బిల్లా, రఘువీర్గా నటించిన దేవ్ గిల్! దేవిందర్‌సింగ్ గిల్ మహారాష్ట్రలోని పుణేలో పుట్టాడు.తండ్రికి చిన్న రెస్టారెంట్ ఉంది.నటుడు కావాలనే కోరిక మూడో క్లాసు నుంచే మొదలైంది. మూడో క్లాసులోనే ఒక నాటికలో నటించాడు. అలా ప్రతి సంవత్సరం నటిస్తూనే ఉన్నాడు. పెద్దయ్యాక... మోడల్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు.బాలీవుడ్ సినిమా ‘షాహీద్-ఏ-ఆజమ్’లో రాజ్‌గురుగా నటించాడు. మంచి పాత్ర!దమ్మున్న పాత్ర!! కానీ సినిమా పెద్దగా ఆడలేదు. ఆ తరువాత... దేవానంద్ డెరైక్ట్ చేసిన ‘మిస్టర్ ప్రైమ్‌మినిస్టర్’ సినిమాలో నటించాడు. ప్చ్... పెద్దగా ప్రయోజనం లేదు. కేసీ బొకాడియా ‘బోల్డ్’ సినిమాలో.... ‘డబ్బుతో ఈ ప్రపంచాన్ని ఈజీగా కొనేయవచ్చు’ అని నమ్మే బిజినెస్ టైకూన్ ప్రాత్రలో నటించాడు. ఆ సినిమా పెద్ద హిట్టై ఉంటే... పరిస్థితి ఎలా ఉండేదో తెలియదుగానీ... ‘బోల్డ్’ తరువాత గ్యాప్ వచ్చింది.గ్యాప్ తరువాత తెలుగులో నాగార్జున, విష్ణు సినిమా ‘కృష్ణార్జున’లో నటించాడు.ఆ సమయంలోనే మోహన్‌బాబు దృష్టిలో పడ్డాడు. ఆయన రాజమౌళికి దేవ్ గిల్ గురించి చెప్పాడు. గిల్ రాజమౌళిని కలిశాడు. ‘‘ఇప్పుడు ఎలా ఉన్నావో... నెల తరువాత కూడా అలాగే కనిపించాలి’’ అని చెప్పాడు రాజమౌళి.అదే... మీసం... అదే గడ్డంతో... నెల తరువాత కలిశాడు. ఒడ్డూ పొడుగు బాగున్న దేవ్ గిల్‌ను ‘రణదేవ్ బిల్లా’ పాత్ర వరించింది. ‘ఉత్తమ విలన్’గా ఎంతో పేరు తెచ్చింది. తెలుగు చిత్రసీమకు చాలా దగ్గర చేసింది. హైదారాబాద్ అల్లుడిని కూడా చేసింది! ‘మగధీర’ ‘పూలరంగడు’ ‘రగడ’ ‘ప్రేమకావాలి’ ‘రచ్చ’ ‘నాయక్’ ‘లింగ’ సినిమాలతో ‘యంగ్ విలన్’గా మంచి మార్కులు కొట్టేశాడు దేవ్ గిల్. ‘‘చెడ్డ పాత్రల్లో నటించాలని నాకు మా చెడ్డ కోరిక’’ అంటాడు దేవ్‌గిల్.అందుకే కదా... దేవిందర్ సింగ్ గిల్ కాస్తా ఉదయఘడ్ సేనాధిపతి ‘రణదేవ్ బిల్లా’గా మనకు చేరువయ్యాడు!