రామ్‌చరణ్ హీరోగా నటించిన బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ‘మగధీర’ సినిమాలో విలన్ పాత్రలో నటించిన దేవ్ గిల్ హీరోగా నటించిన చిత్రం ‘అహో! విక్రమార్క’. పేట త్రికోటి దర్శకుడు. దేవ్ గిల్‌ప్రోడక్షన్స్‌పై ఆర్తి దేవిందర్ గిల్, మీహిర్ కుల్జర్ని, అశ్విని కుమార్ మిస్రా నిర్మించారు.
ఈ మూవీని తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో ఆగస్టు 30న రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. దేవ్ గిల్ మాట్లాడుతూ– ‘‘అహో! విక్రమార్క’ సినిమాలో పోలీసుల ధైర్యం, అంకితభావాన్ని గొప్పగా చూపించబోతున్నాం. నటుడిగా నాలోని మరో కోణాన్ని ఈ మూవీ ద్వారా ప్రేక్షకులు చూస్తారు’’ అన్నారు. ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్, ఆర్కో ప్రవో ముఖర్జీ.
Comments
Please login to add a commentAdd a comment