దేవరకొండ అసెంబ్లీ నియోజకవర్గం విజేత ఎవరు..!
దేవరకొండ (ఎస్టి) నియోజకవర్గం
దేవరకొండ గిరిజన రిజర్వుడ్ నియోజకవర్గంలో టిఆర్ఎస్ అభ్యర్దిగా పోటీచేసిన ఆర్.రవీంద్ర కుమార్ మూడోసారి విజయం సాదించారు.2004,2014లలో సిపిఐ పక్షాన గెలిచిన రవీంద్ర కుమార్ 2018లో టిఆర్ఎస్ నుంచి గెలిచారు. 2014లో విజయం సాదించిన కొంతకాలానికి ఆయన అదికార టిఆర్ఎస్లో చేరిపోయారు. ఈ ఎన్నికలో ఆయన తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్ది, మాజీ ఎమ్మెల్యే బాలూ నాయక్‌పై 38848 ఓట్ల ఆదిక్యతతో విజయం సాదించారు.
రవీంద్రకుమార్‌కు 96454 ఓట్లు రాగా, బాలూనాయక్‌కు 57606 ఓట్లు వచ్చాయి. ఇక్కడ బిఎస్పి పక్షాన పోటీచేసిన బిల్యా నాయక్‌కు 19 వేలకు పైగా ఓట్లు వచ్చాయి. 2014లో కాంగ్రెస్ ఐ తో పొత్తు పెట్టుకున్న సిపిఐ తెలంగాణ లో దేవరకొండ ఒక్క స్థానాన్ని గెలుచుకోగలిగింది. 2014లో రమావత్ రవీంద్ర కుమార్ తన సమీప టిడిపి-బిజెపి కూటమి ప్రత్యర్ధి బిల్యానాయక్ పై 4216 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు .
దేవరకొండ నియోజకవర్గంలో కాంగ్రెస్, కాంగ్రెస్ఐ కలిసి ఆరుసార్లు, సిపిఐ ఏడుసార్లు, టిఆర్ఎస్ ఒకసారి, పిడిఎఫ్ ఒకసారి గెలుపొందాయి. సిపిఐ నాయకుడు బద్దు చౌహాన్ ఇక్కడ మూడుసార్లు గెలిచారు. గిరిజన నేత రవీంద్రనాయక్ ఇక్కడ రెండుసార్లు గెలిచారు. ఆయన 2004లో వరంగల్ లోక్‌సభ స్థానం నుంచి టిఆర్ఎస్ పక్షాన పోటీచేసి విజయం సాధించారు.
దేవరకొండలో ఒక్కసారి కూడా టిడిపి గెలవలేదు. రవీంద్రనాయక్ గతంలో భవనం వెంకట్రామ్ మంత్రివర్గంలో సభ్యునిగా వున్నారు. 1999లో ఇక్కడ గెలిచిన రాగ్యానాయక్ 2001 డిసెంబర్లో నక్సల్స్ కాల్పులలో మరణించారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో రాగ్యానాయక్ భార్య భారతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తదనంతరం భారతి ఎమ్మెల్సిగా కూడా ఎన్నికయ్యారు. దేవరకొండ ఎస్.టి.లకు రిజర్వు కాక ముందు రెడ్లు రెండుసార్లు బ్రాహ్మణ ఒకసారి గెలిచారు.
దేవరకొండ (ఎస్టి) నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..