Development of Dalits
-
దళితులు మరింత అభివృద్ధి చెందాలి
–చత్తీస్ఘడ్ ఎంపీ సన్సాద్ అభిషేక్‌సింగ్ నెల్లూరు(బారకాసు): ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథాలను దళితులు సద్వి నియోగం చేసుకుని మరిం త అభివృద్ధి చెందాలని చత్తీస్ఘడ్ ఎంపీ సన్సాద్ అభిషేక్‌సింగ్ పేర్కొన్నా రు. సోమవారం నెల్లూరు వచ్చిన ఆయన నగరంలోని ఎన్టీఆర్నగర్ సమీ పంలోని రాయపు దళితవాడను సందర్శించారు. అక్కడి దళితులతో ఎంపీ మమేకమై వారితో మాట్లాడారు. గత ప్రభుత్వాల పరిపాలనలో ఎలా ఉన్నారు? ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ పరిపాలనలో ఎలా ఉన్నారు?, తదితర విషయాలను ఆయన దళిత మహిళలను అడిగి తెలుసుకున్నారు. అందుకు వారు స్పందిస్తూ తమకు పింఛన్లు రావడం లేదని వాపోయారు. బ్యాంకు రుణాలు మంజూరు చేయడం లేదని ఎన్ని సార్లు తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. ఎంపీ మాట్లాడుతూ దళితుల అభివృద్ధే ప్రధాని ధ్యేయమన్నారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. అనంతరం దళితులతో కలసి ఆయన సహపంక్తి అల్పాహార విందు చేశారు. ఎంపీ వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.సురేంద్రరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు జయరాజ్‌తో పాటు పలువురు పార్టీ నేతలు ఉన్నారు. -
దళితుల పేరుపై టీఆర్ఎస్ అధికారం : బీజేపీ
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : తెలంగాణ వస్తే, టీఆర్ఎస్ అధికారం చేపడితే దళితుడిని ము ఖ్యమంత్రి చేస్తానని ప్రకటించి అధికారాన్ని చే పట్టిన టీఆర్ఎస్ పార్టీ నేటికీ దళితులను మోసం చేస్తూనే ఉందని బీజేపీ దళితమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కె.రాములు ఆరోపించారు. శనివారం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఎస్సీ కా ర్పొరేషన్‌కు దళితులు దూరమయ్యే పరిస్థితి వ చ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన దళితులకు అవతరణ వేడుకల్లో అవమా నం జరిగిందని, దళిత ఉద్యమ కారులకు అవార్డులు, ఉద్యోగాలు ఇవ్వడంలో అన్యా యం చేశారని ఆరోపించారు. ఇంత చేస్తూనే దళితుల వ్యతిరేకిగా బీజేపీని బద్నాం చేసేం దుకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా నల్లగొండ జిల్లా సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఈ సభకు జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వస్తారని తెలిపారు. సమావేశంలో బీ జేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి, దళిత మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.జగన్, జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్, సాయిరాం, లక్ష్మణ్, అశోక్, బూషయ్య, కుమార్ పాల్గొన్నారు. -
ఎస్సీ రుణాలకు ఆన్లైన్ కష్టాలు
గుడివాడ టౌన్ : దళితుల అభివృద్ధి కోసం ప్రభుత్వం అందజేస్తున్న ఎస్సీ రుణాల పంపిణీ వ్యవహారం దరఖాస్తు చేసుకోదలచిన అర్హులను పలు రకాలుగా ఇబ్బందులకు గురిచేస్తోంది. రుణాలకు సంబంధించిన దరఖాస్తులను అర్హులు పూర్తిచేసి పీఓ కార్యాలయంలో ఇవ్వడానికి అలవాటుపడ్డారు. రుణాల కోసం ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని అధికారులు చెప్పడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పథకం కింద ప్రయోజనం పొందాలంటే ముందుగా కులం, ఆదాయం, నివాస ధ్రువీకరణ పత్రాలను మీ-సేవ ద్వారా పొందాలి. అనంతరం వాటిని తిరిగి మీ-సేవ లేదా ఇంటర్నెట్ కార్యాలయాల్లో ఆన్లైన్లో నమోదుచేసి దరఖాస్తు అంగీకరించినట్లు రశీదు పొందాల్సి ఉంది. సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేమి, ఈ విధానాన్ని అర్థం చేసుకోలేని తాము రుణాల కోసం ఎలా దరఖాస్తు చేసుకోగలమని అర్హులు ప్రశ్నిస్తున్నారు. అందుబాటులో లేని రెవెన్యూ అధికారులు తొలుత ధృవీకరణ పత్రాల కోసం అర్హులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగడానికే సమయం సరిపోతోంది. రైతు రుణమాఫీకి సంబంధించిన వివరాలను అందించాల్సిందిగా బ్యాంకులు రెవెన్యూ కార్యాలయానికి భారీసంఖ్యలో ఉన్న లబ్ధిదారుల జాబితాలను పంపాయి. వాటికి సంబంధించిన ఆధార్, రేషన్‌కార్డుల వివరాల సేకరణలో రెవెన్యూ అధికారులు, కార్యాలయ సిబ్బంది తలమునకలై ఉన్నారు. ఈ నేపథ్యంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకునే వారికి ధృవీకరణ పత్రాలపై సంతకాలు చేయడానికి వారు అందుబాటులో ఉండటం లేదు. దీంతో దరఖాస్తుదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఈ నెల 25 చివరిరోజు కావడంతో ఇవన్నీ ఎప్పటికి పూర్తవుతాయో తెలియడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సేవలు అందించలేని ‘మీ-సేవ’లు పట్టణంలో మీ-సేవ కేంద్రాలు మూడు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. వాటిలోని సిబ్బంది కరెంటు బిల్లులు, డ్రైవింగ్ లెసైన్సులు, వాహనాల, మున్సిపల్ ట్యాక్సులు వంటివి కట్టించుకోవడంతో పాటు ఆన్లైన్ దరఖాస్తులు కూడా చూడాల్సి వస్తోంది. ఇన్ని అవసరాలకు సరిపడా కంప్యూటర్లు, సిబ్బంది లేకపోవడంతో రుణాల కోసం దరఖాస్తు చేసుకోదలచినవారికి అందించాల్సిన సేవల గురించి పట్టించుకునేవారే లేరు. ఒక్కో మీ-సేవ కేంద్రంలో ఒక్క స్కానర్ మాత్రమే అందుబాటులో ఉంది. ఐదు నుండి 10 రకాల పత్రాలు ఇక్కడ స్కాన్‌చేసి జత చేయాల్సి రావడంతో ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. దీంతో రోజుకు ఒక్కో మీ-సేవ కేంద్రంలో 100 దరఖాస్తులు కూడా పూర్తికావడం లేదు. మధ్యలో ఈ నెల 23న ఆదివారం కావడంతో ఒకరోజు వృథా అవుతుందని, ఎప్పటికి తమ దరఖాస్తులు పూర్తవుతాయోనని అర్హులు తలలు పట్టుకుంటున్నారు. దళారుల ప్రభావం... ఇదిలా ఉండగా రుణానికి సంబంధించి అన్నీ మేమే చూసుకుంటామని కొందరు దళారులు తమను ప్రలోభపెట్టి సొమ్ము చేసుకుంటున్నారని దరఖాస్తు చేసుకోదలచిన అర్హులు ఆరోపిస్తున్నారు. కులం, ఆదాయ ధృవీకరణ పత్రాలు వారే తెచ్చి దరఖాస్తు పూర్తిచేస్తే ఒకరేటు, సర్టిఫికెట్లు తెచ్చుకుంటే కేవలం దరఖాస్తు చేయడానికి మరో రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నారని, అమాయకులు వీరి వలలో చిక్కుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. ఈ విధంగా పైరవీ చేసేవారిలో ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం. -
దళితులను ఆదరించింది వైఎస్ కుటుంబమే
తిరుపతి ఎంపీ వరప్రసాదరావు నెల్లూరు: ‘‘దళితులను వైఎస్ కుటుంబం ఆదరించినంతగా మరే కుటుంబం, ఏ పార్టీ కూడా ఆదరించి అక్కున చేర్చుకోలేదు. దళితులకు వైఎస్సార్సీపీలో ఉన్నంత స్వేచ్ఛ ఏ పార్టీలోనూ లేదు. అంతెందుకు ప్రాంతీయ పార్టీల్లో దళితులను మాట్లాడనివ్వడమే గగనం. అలాం టిది అనేకమంది దళిత నేతలకు ఉన్నత పదవులు కట్టబెట్టిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదే’’ అని తిరుపతి వైఎస్సార్సీపీ ఎంపీ వరప్రసాదరావు అన్నారు. చిత్తూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే నారాయణస్వామితో కలిసి ఆయన ఆదివారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వైఎస్ కుటుంబం జూపూడి ప్రభాకరరావుకు ఇచ్చినంత ప్రాధాన్యం మరెవరికీ ఇవ్వలేదన్నారు. నాడు వైఎస్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి అప్పగించారని గుర్తు చేశారు. తాజాగా వైఎస్ జగన్ ఆయనకు ఎమ్మెల్యే టికెట్ కూడా ఇచ్చారన్నారు. జూపూడి ఓటమికి పార్టీ ముఖ్యనేత వైవీ సుబ్బారెడ్డిని నిందించడం సరికాదన్నారు. సుబ్బారెడ్డి సొంతపార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటమిని కోరుకుంటారనడం సరికాదన్నారు. ఓటమి బాధలో జూపూడి కీలక నేతలను నిందించడం సరికాదన్నారు.