దళితులు మరింత అభివృద్ధి చెందాలి
–చత్తీస్‌ఘడ్ ఎంపీ సన్‌సాద్ అభిషేక్‌సింగ్
నెల్లూరు(బారకాసు): ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథాలను దళితులు సద్వి నియోగం చేసుకుని మరిం త అభివృద్ధి చెందాలని చత్తీస్‌ఘడ్ ఎంపీ సన్‌సాద్ అభిషేక్‌సింగ్ పేర్కొన్నా రు. సోమవారం నెల్లూరు వచ్చిన ఆయన నగరంలోని ఎన్టీఆర్‌నగర్ సమీ పంలోని రాయపు దళితవాడను సందర్శించారు. అక్కడి దళితులతో ఎంపీ మమేకమై వారితో మాట్లాడారు. గత ప్రభుత్వాల పరిపాలనలో ఎలా ఉన్నారు? ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోదీ పరిపాలనలో ఎలా ఉన్నారు?, తదితర విషయాలను ఆయన దళిత మహిళలను అడిగి తెలుసుకున్నారు.
అందుకు వారు స్పందిస్తూ తమకు పింఛన్లు రావడం లేదని వాపోయారు. బ్యాంకు రుణాలు మంజూరు చేయడం లేదని ఎన్ని సార్లు తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదని తెలిపారు. ఎంపీ మాట్లాడుతూ దళితుల అభివృద్ధే ప్రధాని ధ్యేయమన్నారు. ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. అనంతరం దళితులతో కలసి ఆయన సహపంక్తి అల్పాహార విందు చేశారు. ఎంపీ వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు పి.సురేంద్రరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు జయరాజ్‌తో పాటు పలువురు పార్టీ నేతలు ఉన్నారు.