మహబూబ్‌నగర్ న్యూటౌన్ : తెలంగాణ వస్తే, టీఆర్‌ఎస్ అధికారం చేపడితే దళితుడిని ము ఖ్యమంత్రి చేస్తానని ప్రకటించి అధికారాన్ని చే పట్టిన టీఆర్‌ఎస్ పార్టీ నేటికీ దళితులను మోసం చేస్తూనే ఉందని బీజేపీ దళితమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కె.రాములు ఆరోపించారు. శనివారం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఎస్సీ కా ర్పొరేషన్‌కు దళితులు దూరమయ్యే పరిస్థితి వ చ్చిందన్నారు.
తెలంగాణ ఉద్యమంలో పని చేసిన దళితులకు అవతరణ వేడుకల్లో అవమా నం జరిగిందని, దళిత ఉద్యమ కారులకు అవార్డులు, ఉద్యోగాలు ఇవ్వడంలో అన్యా యం చేశారని ఆరోపించారు. ఇంత చేస్తూనే దళితుల వ్యతిరేకిగా బీజేపీని బద్నాం చేసేం దుకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా నల్లగొండ జిల్లా సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఈ సభకు జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వస్తారని తెలిపారు. సమావేశంలో బీ జేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి, దళిత మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.జగన్, జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్, సాయిరాం, లక్ష్మణ్, అశోక్, బూషయ్య, కుమార్ పాల్గొన్నారు.