TRS authority
-
టీఆర్ఎస్ వచ్చాకే న్యాయం
వర్గీకరణ ఉద్యమాలపై పిడమర్తి రవి సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకే వర్గీకరణ ఉద్యమాలకు న్యాయం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని మందకృష్ణ ఉద్యమకారుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎవరూ మందకృష్ణ మాటలను నమ్మవద్దని కోరారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో తీర్మానం చేసిందన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వారు తమ బాధలను స్థానిక ఎమ్మెల్యే, మంత్రికి చెప్పుకోవాలని సూచించారు. బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు, టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి టీఆర్ఎస్ పార్టీకి చెందనప్పటికీ సీఎం కేసీఆర్ వారికి పదవులిచ్చారన్నారు. ఉద్యోగ సంఘాలను గౌరవించింది టీఆర్ఎస్ ప్రభుత్వమేనని గుర్తించాలన్నారు. -
దళితుల పేరుపై టీఆర్ఎస్ అధికారం : బీజేపీ
మహబూబ్‌నగర్ న్యూటౌన్ : తెలంగాణ వస్తే, టీఆర్ఎస్ అధికారం చేపడితే దళితుడిని ము ఖ్యమంత్రి చేస్తానని ప్రకటించి అధికారాన్ని చే పట్టిన టీఆర్ఎస్ పార్టీ నేటికీ దళితులను మోసం చేస్తూనే ఉందని బీజేపీ దళితమోర్చ రాష్ట్ర అధ్యక్షుడు కె.రాములు ఆరోపించారు. శనివారం ఆ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నంతకాలం ఎస్సీ కా ర్పొరేషన్‌కు దళితులు దూరమయ్యే పరిస్థితి వ చ్చిందన్నారు. తెలంగాణ ఉద్యమంలో పని చేసిన దళితులకు అవతరణ వేడుకల్లో అవమా నం జరిగిందని, దళిత ఉద్యమ కారులకు అవార్డులు, ఉద్యోగాలు ఇవ్వడంలో అన్యా యం చేశారని ఆరోపించారు. ఇంత చేస్తూనే దళితుల వ్యతిరేకిగా బీజేపీని బద్నాం చేసేం దుకు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా నల్లగొండ జిల్లా సూర్యాపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నామని, ఈ సభకు జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా వస్తారని తెలిపారు. సమావేశంలో బీ జేపీ జిల్లా అధ్యక్షుడు రతంగ్‌పాండురెడ్డి, దళిత మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.జగన్, జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్, సాయిరాం, లక్ష్మణ్, అశోక్, బూషయ్య, కుమార్ పాల్గొన్నారు. -
ఇంటికో ఉద్యోగం ఉత్తమాటే
నిజామాబాద్ సిటీ : టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఇంటికో ఉద్యో గం కల్పిస్తామన్న కేసీఆర్ హామీ ఉత్తమాటేనని నిజామాబాద్ లోక్‌సభ నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పంచరెడ్డి చరణ్ విమర్శించారు. స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే లక్ష ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ పూర్తి చేస్తామని చెప్పారని, రెండేళ్లు కావస్తున్నా ఉద్యోగాల మాటే ఎత్తడం లేదని ఆరోపించారు. విద్యార్థుల ఉద్యమాలు, ఆత్మ బలిదానాల ఫలితంగా గద్దెనెక్కిన సీఎం.. ఇప్పుడు వారిని పట్టించుకున్న పాపాన పోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కుటుంబానికి మాత్రం నాలుగు ఉద్యోగాలు దక్కాయన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకుంటే యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట నాయకులు నాగరాజు, సుధాకర్, కిషోర్ రాథోడ్, ఆదర్శ, దత్తాద్రి ఉన్నారు. -
దళితద్రోహి కేసీఆర్..
వికారాబాద్ : టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే తొలి ముఖ్యమంత్రిగా దళితుడినే చేస్తానన్నా కేసీఆర్ మాటతప్పి చరిత్రలో దళిత ద్రోహిగా మిగిలిపోయారని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు మందకృష్ణ మాదిగ తీవ్రస్థాయిలో ధ ్వజమెత్తారు. శనివారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూపంపిణీకేవలం ఆర్భాటమే తప్ప అమలులో చిత్తశుద్ధి లేదన్నారు. 2004 ఎన్నికల మేనిఫెస్టోలో ఐదెకరాలు ఇస్తానన్న కేసీఆర్ 2014 ఎన్నికల్లో మూడెకరాలకు దిగారని ఆయన విమర్శించారు. దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్య తన శాఖ పరిధిలో హెల్త్ వర్సిటీకి కృషి చేస్తానని వరంగల్‌లో చెప్పినందుకే కేసీఆర్ బహిరంగ సభలో రాజయ్యను అవమానించారని ఆయన ఆగ్రహించారు. దళితులను మోసం చేసి ఆధికారం లోకి వచ్చిన కేసీఆర్ ఇప్పుడు అవమానలకు గురిచేస్తున్నారన్నారు. ఎస్సీ రిజర్వేషన్అమలుకు సంబంధించి టీఆర్ఎస్ ప్రభుత్వం తమ వైఖరిని బహిర్గతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వారం రోజుల నుంచి కేసీఆర్‌ను కలవడానికి ప్రయత్నించినా అపాయింట్మెంట్ ఇవ్వకపోవటం సిగ్గుచేటన్నారు. 2010లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలమని ప్రధానికి లేఖ రాసిన కేసీఆర్ ఇప్పుడు ఎందుకు ముందుకు రావడం లేదని ప్రశ్నించారు. కీలకమైన సాంఘీక సంక్షేమ, బీసీ సంక్షేమ శాఖలను కేసీఆర్ తన దగ్గరే పెట్టుకోవడాన్ని చూస్తుంటే ఆయన దేశంలో ఎక్కడా లేని సంప్రదాయాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లుగా కనిపిస్తోందన్నారు. బతుకమ్మ ఉత్సవాలను ప్రభుత్వం నిర్వహిస్తున్నా కేసీఆర్ కేబినేట్లో ఒక్క మహిళా మంత్రి లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఎస్సీ వర్గీకరణపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సి.అనంతయ్య, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మద్దిలేటి మాదిగ, ప్రధాన కార్యదర్శి వనం నర్సింహ మాదిగ. జాతీయ కౌన్సిల్ సభ్యులు రావువల్ల బాబుమాదిగ, జిల్లా ప్రధానకార్యదర్శి డప్పు మోహన్ మాదిగ, నాయకులు పెండ్యాల అనంతయ్య, జగదీష్, శంకర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ మనసులో ఏముందో..
అంతుబట్టని అంతరంగం * పదవుల కోసం ఆశావహుల ఎదురుచూపులు * మరో రెండు నెలలు నిరీక్షణే అంటున్న గులాబీ నేతలు * బండాకు ఏ పదవి ఇస్తారో... క్యూలో మరికొందరు సీనియర్లు సాక్షిప్రతినిధి, నల్లగొండ: కేసీఆర్ అంతరంగం అంతుబట్టక గులాబీ నేతలు అయోమయానికి గురవుతున్నారు. పద్నాలుగేళ్ల పోరాటం తర్వాత టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. మొదటినుంచీ పార్టీనే నమ్ముకుని పనిచేసిన వారంతా ఏదో ఒక పదవిపై ఆశ పెట్టుకున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం దక్కని వారికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని బుజ్జగించారు. జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు కర్నె ప్రభాకర్, టీఆర్ఎస్ క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఎలిమినేటి కృష్ణారెడ్డి ఇలా హామీలు పొందిన వారిలో ఉన్నారన్నది పార్టీవర్గాల సమాచారం. కాగా, సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆయా కోటాల్లో రాష్ట్రంలో ఇద్దరికి అవకాశం ఇచ్చారు. తాజాగా మరో ఇద్దరి పేర్లు ఖరారు చేశారు. మునుగోడు నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడిన కర్నె ప్రభాకర్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తామని కేబినెట్ సమావేశం అనంతరం సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే. ఖాళీలు ఏమీ లేకపోవడం, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి ఎమ్మెల్సీ పదవులనే ఆశజూపడం వంటి కారణాల నేపథ్యంలో జిల్లాలో మరోనేతకు ఈ అవకాశం వస్తుందా..? లేదా? అన్న అంశంపై ఇప్పుడు చర్చ జరుగుతోంది. నల్లగొండ అసెంబ్లీ టికెట్ ఆశించిన జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డిని తొలుత లోక్‌సభ నియోజకవర్గం నుంచి బరిలో దింపాలని భావించారు. ఈ మేరకు హామీ కూడా ఇచ్చారు. ఆ తర్వాత మారిన సమీకరణాల నేపథ్యంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి అనూహ్యంగా తెరపైకి వచ్చి నల్లగొండ ఎంపీ టికెట్ దక్కించుకున్నారు. రాజేశ్వర్‌రెడ్డిని పార్టీలో చేర్చుకునే సందర్భంలో ఆ వేదికపై బహిరంగంగానే బండా నరేందర్‌రెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తదనంతర పరిణామాల తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. దీంతో ఇక, బండా నరేందర్‌రెడ్డి శాసనమండలిలో అడుగుపెట్టడమే తరువాయి అనుకున్నారంతా. కానీ, తొలివిడతలో రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి (జిల్లావాసే)కి, ఆదిలాబాద్ జిల్లా గిరిజన నేత రాములనాయక్కు అవకాశం కల్పించారు. ఆ తర్వాత గవర్నర్ కోటాలో జిల్లాకు చెందిన కర్నె ప్రభాకర్‌ను, ఆంగ్లో ఇండియన్ ఒకరిని ఎంపిక చేశారు. దీంతో ఇక, బండా నరేందర్‌రెడ్డికి ఎలా అవకాశం దక్కుతుందన్న ప్రశ్న మొదలైంది. నామినేటెడ్ పోస్టులపైనే ఆశ జిల్లాకు చెందిన మరికొందరు నేతలు కూడా పార్టీలో చేరారు. ఆ జాబితాతో శాసనమండ లి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఉన్నారు. ఆయన నేరుగా పార్టీ కండువా కప్పేసుకుని, పార్టీ సభ్యత్వం తీసుకోకున్నా, మొన్నటి శాసనమండలి చైర్మన్ ఎన్నికల్లో ఇన్చార్జ్ చైర్మన్‌గా ఉండి కూడా చైర్మన్‌గా పోటీలో ఉన్న స్వామిగౌడ్‌కు ఓటు వేసి తానూ గులాబీ పక్షమేని చెప్పకనే చెప్పుకున్నారు. ఆయన పదవీకాలం వచ్చే ఏడాది మార్చితో ముగియనుంది. స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి గెలిచిన ఆయనకు తిరిగి మరోమారు అవకాశం ఇస్తామని హామీ ఇచ్చినట్లు ప్రచారం ఉంది. ఇక, ఏ సమీకరణాల దృష్ట్యా చూసినా బండా నరేందర్‌రెడ్డికి కానీ, మరొకరికి కానీ, జిల్లా నుంచి ఎమ్మెల్సీలుగా అవకాశం దక్కడం దాదాపు అసాధ్యం. ఈ కారణంగానే రాష్ట్ర స్థాయిలో ఏదైనా కార్పొరేషన్ పదవి దక్కుతుందన్న ఆశాభావంతో ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ ముఖ్యులకు ప్రణాళికమండలి, ఆర్టీసీ వంటి ప్రధానమైనవి పోయినా, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు ఎక్కువే ఉన్నాయి. కాబట్టి వాటిలో ఏదో ఒకటి తప్పక వస్తుందన్న ఆశతో ఉన్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం, బహుశా సెప్టెంబరు మాసంలో ప్రభుత్వ కార్పొరేషన్లను భర్తీ చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నారు. అంటే కనీసం మరో రెండు నెలలు వేచిచూడక తప్పని పరిస్థితి. ‘ఇప్పటి వరకైతే సీఎం అందరికీ న్యాయం చేస్తూ వస్తున్నారు. పద్నాలుగేళ్లుగా పార్టీని నమ్ముకుని, అప్పజెప్పిన బాధ్యతల్లా మోసిన సీనియర్లను ఎలా పక్కన పెడతారు..? కచ్చితంగా వారికి కూడా న్యాయం చేస్తారు. కాకుంటే కొంత సమయం వేచి చూడక తప్పదు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడం కోసం పదవుల భర్తీ తప్పనిసరి. అందరికీ న్యాయం జరుగుతుందని భావిస్తున్నా..’ అని టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఒకరు ‘సాక్షి’తో వ్యాఖ్యానించారు. అంటే, జిల్లాకు ఎమ్మెల్సీ పదవులు అందివచ్చినా, రాకున్నా, నామినేటెడ్ పోస్టులు రావడం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది.