టీఆర్‌ఎస్‌ వచ్చాకే న్యాయం | The TRS comes to power and justice for classification movements | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ వచ్చాకే న్యాయం

Published Sat, Sep 2 2017 3:13 AM | Last Updated on Sun, Sep 17 2017 6:15 PM

టీఆర్‌ఎస్‌ వచ్చాకే న్యాయం

టీఆర్‌ఎస్‌ వచ్చాకే న్యాయం

వర్గీకరణ ఉద్యమాలపై పిడమర్తి రవి

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాకే వర్గీకరణ ఉద్యమాలకు న్యాయం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్‌ చైర్మన్‌ పిడమర్తి రవి అన్నారు. తెలంగాణ భవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏనాడూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని మందకృష్ణ ఉద్యమకారుల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎవరూ మందకృష్ణ మాటలను నమ్మవద్దని కోరారు.

ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో తీర్మానం చేసిందన్నారు. ఉద్యమంలో పాల్గొన్న వారు తమ బాధలను స్థానిక ఎమ్మెల్యే, మంత్రికి చెప్పుకోవాలని సూచించారు. బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎస్‌ రాములు, టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ ఘంటా చక్రపాణి టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందనప్పటికీ సీఎం కేసీఆర్‌ వారికి పదవులిచ్చారన్నారు. ఉద్యోగ సంఘాలను గౌరవించింది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని గుర్తించాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement