నిరుపేదల అభివృద్ధికి కృషిచేయాలి
=‘నాటా’ సభ్యుల సేవలు అభినందనీయం
=కాంగ్రెస్ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పొన్నాల వైశాలి
=జనగామ అత్రి మహర్షి పాఠశాలలో ఉచిత వైద్య శిబిరం
జనగామ, న్యూస్‌లైన్ : సమాజంలో ఉంటున్న నిరుపేదల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కాంగ్రెస్ మహిళా విభా గం జిల్లా అధ్యక్షురాలు పొన్నాల వైశాలి అన్నారు. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్(నాటా) ఆధ్వర్యంలో మంగళవారం పట్టణంలోని అత్రి మహర్షి పాఠశాల ఆవరణలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా నాటా అధ్యక్షుడు టి. సంజీవరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి వైశాలి ముఖ్యఅతి థిగా హాజరై మాట్లాడారు.
తాను అమెరికాలో ఉన్న సమయంలో వైద్యవృత్తినే చేపట్టానని, ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్నందున వైద్యం చేయడం వీలు కావడంలేద ని తెలిపారు. నాటా సభ్యులు అమె రికాలో డబ్బు సం పాదనను వదిలి తమ అమ్యూలమైన సమయాన్ని జన్మభూమికి కేటాయించడం అభినందనీయమన్నారు. మనం బాగుపడితే కాదు.. అందరూ బాగుండాలన్న లక్ష్యంతో ముందుకుసాగుతున్న నాటా సేవా కార్యక్ర మాలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని సూచించారు. నాటా నిర్వహించే మంచి పనులకు తన వంతు సహకారం అందిస్తానని ఆమె పేర్కొన్నారు.
సేవా కార్యక్రమాలతో ముందుకు : డాక్టర్ సంజీవరెడ్డి, నాటా అధ్యక్షుడు
తమ అసోసియేషన్ పేదలకు సేవ చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని నాటా అధ్యక్షుడు టీ.సంజీవరెడ్డి అన్నారు. వైద్య శిబిరంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నాటా సేవాడేస్‌లో భాగంగా ఈనెల 16 నుంచి 29 వరకు ప్రత్యేక సేవా కార్యమ్రాలు చేపడుతున్నామని తెలిపారు. వైద్య శిబిరాలే కాకుండా జిల్లాలోని పలు చోట్ల వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్లను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే రాష్ర్టంలోని పలు జిల్లా ల్లో వాటర్ప్లాంట్లను ఏర్పాటు చేశామన్నారు. పాఠశాల ల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఇండియాలో అమెరికాస్థాయి వైద్యం : డీఎంహెచ్ఓ సాంబశివరావు
ఇండియాలో కూడా అమెరికాస్థాయి వైద్యం లభిస్తోందని డీఎంహెచ్ఓ సాంబశివరావు అన్నారు. తమ శాఖ ఉద్యోగులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారని ఆయన తెలిపారు. డీఫ్లోరైడ్ వంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులతోపాటు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న నాటా సభ్యుల సేవలు ప్రశంసనీయమన్నారు. వృత్తిరీత్యా అమెరికాలో ఉంటు న్నా స్వదేశంపై ఉన్న మమకారంతో నాటా సభ్యులు ఇక్కడ సేవలు అందిస్తున్నారని.. మున్ముందు వారు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని ఆయన ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఇండియన్ ఓవర్సీస్ కోఆర్డినేటర్ ఏ. శ్రీనివాసరావు, అట్లాంటా కాన్షరెన్స్ సభ్యుడు సత్యనారాయణరెడ్డి, ప్రొఫెసర్ సురేంద్రకుమార్, జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్రమల్ల సుధాకర్, పీఏసీఎస్ చైర్మన్, వైద్య శిబిరం నిర్వాహకుడు జనగాం రాజిరెడ్డి, జక్కుల వేణుమాధవ్ పాల్గొన్నారు.
శిబిరంలో సేవలందించింది వీరే..
నాటా చేపట్టిన ఉచిత మెగా వైద్య శిబిరంలో నాటా అధ్యక్షుడు డాక్టర్ సంజీవరెడ్డితో పాటు, జనగామ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ సుగుణాకర్‌రాజు, డాక్టర్ ప్రవీ ణ్చందర్, స్థానిక ప్రభుత్వాస్పత్రి పీడియాట్రిషన్ శంకర్‌నాయక్, బచ్చన్నపేట పీహెచ్సీ వైద్యాధికారి అశోక్‌కుమార్, స్థానిక వైద్యులు కరుణాకర్‌రాజు, పద్మ, చేర్యాల, మద్దూరు. నర్మెట, బచన్నపేట, జనగామ పీహెచ్‌సీల వైద్య సిబ్బంది సేవలందించారు. కాగా, శిబి రానికి తరలివచ్చిన రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు.