బాబుకు ఖరారుకాని మోడీ అపాయింట్మెంట్
హైదరాబాద్: నూతన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడు గురువారం ఢిల్లీకి పయనమవుతున్నారు. రేపు, ఎల్లుండి ఢిల్లీలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 6.30 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆర్థిక ప్యాకేజీ, నిధుల గురించి పలువురు కేంద్ర మంత్రులతో ఆయన చర్చలు జరపనున్నారు.
కేంద్ర మంత్రులు పియూష్ గోయల్, ఉమాభారతి, వెంకయ్యనాయుడు, స్మృతి ఇరానీ, అరుణ్‌జైట్లీ, సదానంద గౌడతో రేపు చంద్రబాబు వేర్వేరుగా సమావేశమవుతారు. 27న నితిన్ గడ్కరీ, దేవేందర్ ప్రధాన్‌తో భేటీ అవుతారు. ప్రధాని నరేంద్ర మోడీతో ఎప్పుడు భేటీ అవుతారనేది ఇంకా ఖరారు కాలేదు.