శ్రీవారి అభిషేక సేవలో ఏపీ సీఎస్
తిరుమల: తిరుమల వెంకటేశ్వర స్వామిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఆయన అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు వారికి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం లడ్డూ ప్రసాదాలను అందజేశారు.
కాగా తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం 4 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 5 గంటల సమయం పడుతుండగా, కాలిబాటన వచ్చే భక్తులకు 4 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది.