devlopement works
-
రూ. 2.50 కోట్లకు ‘టెండర్’
మచిలీపట్నం (ఈడేపల్లి) : పుష్కరాల నిధుల నుంచి రూ. 2.50 కోట్లతో నిర్మిస్తున్న ఫుట్‌పాత్ నిర్మాణంలో నాణ్యత భూతద్దం పెట్టి వెదికినా కనిపించడం లేదు. నిర్మించిన కొద్ది రోజు లకే పగుళ్లు బీటలు షరా మామూలే. విలువైన ప్రజాధనం అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్ల వల్ల ఎలా దుర్వినియోగం అవుతోందో ఇక్కడే తేటతెల్లమవుతుంది. పట్టణంలోని నాగపోతురావు సెంటరు నుంచి బస్టాండు వరకు రోడ్డుకు ఇరువైపులా డ్రైనేజీపై ఫుట్‌పాత్‌లను నిర్మించేందుకు పనులను చేపట్టారు. దాదాపు మూడు కిలోమీటర్లు పొడవునా నిర్మిస్తున్న ఈ కాలిబాట పనుల్లో ఆదితోనే నాణ్యత లోపించింది. వంద మీటర్ల దూరం కూడా నిర్మించని గోడకు అప్పుడే పగుళ్ళు వస్తుంటే దాదాపు మూడు కిలోమీటర్ల చేయాల్సిన పనిలో ఎంత వరకు నాణ్యత ఎంత, ఇది ఎంతకాలం మనగలుగుతుంది? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. అడుగడుగునా ప్రమాణాలకు పాతర డ్రైనేజీపై ఆరు అడుగులు వెడల్పున సిమెంటు బిళ్ళలను ఏర్పాటు చేసి వాటిపై కాలిబాటను నిర్మించాలి. ఇందుకు ఉపయోగిస్తున్న పరికరాలు, మెటీరియల్ నాణ్యతను క్వాలిటీ కంట్రోల్ అధికారులు ముందుగా తనిఖీచేసి అన్నీ నిర్ధరించాకే పనులు చేయాలి. కానీ పనులు అందుకు విరుద్ధంగా జరుగుతున్నాయి. దీనివల్లే నిర్మాణ దశలోనే పగుళ్ళు వస్తున్నట్లు తెలుస్తొంది. డ్రైనేజీపై నిర్మించాల్సిన ఆరు అడుగుల సిమెంటు బిళ్ళలను కొత్తవి నిర్మించకుండా పాత వాటినే ఉపయోగిస్తున్నారు. వాటిలో కొన్ని పగిలిపోయి ఇనుప చువ్వలు బయటకు వచ్చేశాయి. శి«థిలావస్థకు చేరిన బిళ్ళలపై నిర్మాణాలు చేస్తే అవి ఎంత వరకు ఉపయోగకరం అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటీవలే బస్టాండ్ సెంటరు నుంచి జిల్లా పరిషత్ ఆఫీసు వరకు చేపట్టిన డివైడర్ పనులకు టెండర్లు వేయకుండానే పనులు చేపట్టడం, తాజాగా ఫుట్‌పాత్‌కు అనుమతులు లేకుండానే పనులు చేపట్టడం వెనుక మతలబేమిటో అధికారులే చెప్పాలి. కాంట్రాక్టర్ల వద్ద నుంచి మున్సిపాలిటీలో కొందరు అధికారులు పెద్దమొత్తంలో మామూళ్ళను దండుకున్నట్లు తెలుస్తోంది. అందువలనే ఈ బాగోతాన్ని చూసీచూడనట్లు వదిలేశారన్న ఆరోపణలు ప్రజల్నుంచి వినిపిస్తున్నాయి. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ^è ర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అనుమతులు లేని మాట వాస్తవమే క్వాలిటి కంట్రోల్ విభాగం నుంచి అనుమతులు లేని మాట వాస్తవమేనని మున్సిపల్ ఇంజనీర్ కామేశ్వరావు అన్నారు. ఇంటర్నెల్ ల్యాబ్‌లో పరిశీలించిన తర్వాతే పనులు చేపట్టాం, విరిగిన గోడలను మళ్ళీ కట్టిస్తాం అని చెప్పారు. : కామేశ్వరరావు, మున్సిపల్ ఇంజనీర్ -
పుష్కర పనులు ఎక్కడివక్కడే
విజయవాడ సెంట్రల్ : టీడీపీ పాలకులు నగరంలో అభివృద్ధి ముసుగులో విధ్వంసం సృష్టిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి నాగేంద్ర పుణ్యశీల విమర్శించారు. శనివారం పార్టీ కార్పొరేటర్లతో కల్సి చాంబర్లో సమావేశం నిర్వహించారు. ఆలయాల కూల్చివేత, మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహాన్ని తొలగించిన పాలకులు చివరకు మహాత్మాగాంధీ విగ్రహాన్ని బుడమేరులో పడేయడం శోచనీయమన్నారు. మంచిపనులు చేసేవాళ్ళు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిల్చిపోతారన్న ఎంపీ కేశినేని వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంచిపనులు చేశారు కాబట్టే ఆయనకు పేదలు గుండెల్లో గుడి కట్టారన్నారు. పుష్కర పనుల్ని పూర్తి చేయడంలో అధికారులు, పాలకులు విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఐదు నెలల క్రితం పుష్కర పనులు ప్రారంభమైతే ఎంపీకి కార్పొరేటర్లు ఇప్పుడు గుర్తొచ్చారా అని ప్రశ్నించారు. 30 శాతం పనులు అలాగే మిగిలిపోయాయని నాలుగు రోజుల్లో వీటిని ఎలా పూర్తి చేస్తారని ధ్వజమెత్తారు. పారిశుద్ధ్యంపై ఇప్పుడు అసహనమా? శానిటేషన్ కాంట్రాక్టులు అడ్డదారిలో పచ్చదండుకు కట్టబెట్టారని ఆరోపించారు. ఇప్పుడు పారిశుధ్యం బాగోలేదని సీఎం అసహనం వ్యక్తం చేయడం ఓ డ్రామాగా పేర్కొన్నారు. గోడలపై బొమ్మలు వేస్తే విజయవాడ మారిపోదని, పేద,మధ్య తరగతి వర్గాలకు మౌలిక సదుపాయాలను మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. కార్పొరేటర్లు బీజాన్బీ, అవుతు శ్రీశైలజ మాట్లాడుతూ హడావుడి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు దెబ్బతింటున్నాయన్నారు. దాసరి మల్లీశ్వరీ మాట్లాడుతూ సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించిన ఎంపీ కార్పొరేటర్లను అవమానపర్చారన్నారు. 4వ డివిజన్లో పదిరోజులుగా మురుగునీరు వస్తోందని ఆ విషయాన్ని చెబుదామంటే కనీసం తనకు అవకాశం ఇవ్వలేదన్నారు. పార్టీ కార్పొరేటర్లు బి.సంధ్యారాణి, ఉమ్మడిశెట్టి బహుదూర్, కె.దామోదర్, ఎం.శివశంకర్ పాల్గొన్నారు.