devolop
-
తెలంగాణలో బాగు పడింది కేసీఆర్ కుటుంబమే
టీడీపీ జాతీయ కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి పాలకుర్తి/పాలకుర్తి టౌన్ : అమరుల త్యాగాలు, టీడీపీ లేఖతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బాగుపడుతోంది సీఎం కేసీఆర్ కుటుంబమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. మండల కేంద్రంలో టీడీపీ నియోజకవర్గ స్దాయి కార్యకర్తల సమావేశం జాటోతు ఇందిర అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ నాడు టీడీపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోసం కృషి చేయగా.. ఇప్పుడు టీడీపీని ఆంధ్రా పార్టీగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారనిమ ండిపడ్డారు. కేసీఆర్ ఎన్నికల హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యాడని అన్నారు. కాగా, టీడీపీకి పలువురు నాయకులు ద్రోహం చేసినా ప్రజల్లో ఆదరణ చెక్కు చెదరలేదని అన్నారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం రానుందని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. తొలుత నాయకులు స్థానికంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు గండ్ర సత్యనారాయణరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి ఈగ మల్లేశం, నాయకులు గట్టు ప్రసాద్‌బాబు, పుల్లూరి అశోక్, చిలువేరు పెంటయ్య, ఘనపురం ఎల్లయ్య పాల్గొన్నారు ================================================== 03 పిఎల్కేవై 04 - చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న ప్రకాష్‌రెడ్డి, నాయకులు -
దేశప్రతిష్ట పెంచేందుకు కృషి చేయాలి
జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి ఓల్డ్ హైస్కూల్లో ఆటలపోటీలు ప్రారంభం జగిత్యాల రూరల్ : క్రీడాకారులు దేశప్రతిష్టను నిలబెట్టేలా పతకాలు సాధించేందుకు కృషి చేయాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఓల్డ్ హైస్కూల్లో జగిత్యాల జోనల్‌స్థాయి ఆటల పోటీలు ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఎక్కువ నిధులు కేటాయించి క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిధులు లేకుండా క్రీడలు నిర్వహిస్తున్న పీఈటీల కృషి అభినందనీయమన్నారు. ఇటీవల ఒలంపిక్స్‌లో రజత పతకం సాధించిన సింధు ఎలాంటి ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండా స్వయం కృషితో పతకం తీసుకువచ్చి దేశ ప్రతిష్టను పెంచిందన్నారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన పీఈటీలు కోటేశ్వర్రావు, శ్రీనివాస్‌ను ఎమ్మెల్యే సన్మానించారు. కార్యక్రమంలో ఓల్డ్ హైస్కూల్ హెచ్ఎం పద్మాకర్, ఉపాధ్యాయ సంఘం నాయకుడు బోనగిరి దేవయ్య, ఎస్కేఎన్ఆర్ పీడీ రవికుమార్, ఎస్జీఎఫ్ జోనల్ సెక్రటరి గంగారాం, పీఈటీలు నాగేందర్‌కుమార్, అజయ్‌బాబు, రాజిరెడ్డి, కోటేశ్వర్రావు, దత్తాత్రి, సాగర్, భాస్కర్‌రెడ్డి, లక్ష్మణ్, ప్రభాకర్, శ్రీనివాస్, వెంకటలక్ష్మీ, జమున, మల్లీశ్వరి, రేణుక తదితరులు పాల్గొన్నారు. -
తండాలను అభివృద్ధి చేస్తా
తండాలన్నీంటికి బీటీ రోడ్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తిరుమలాయపాలెం: పాలే రు నియోజకవర్గంలోని అన్ని తండాలకు బీటీ రోడ్లువేసి తండా వాసుల కష్టాలు తీరుస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఆదివారం మండలంలోని మర్రితండా నుంచి పాతర్లపాడు వరకు రూ.1.50 కోట్ల నిధులతో చేపట్టే బీటీ రోడ్డు నిర్మాణ పనులకు, తండాలో సైడ్‌డ్రెయిన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. రానున్న రోజుల్లో మండలంలో బీటీరోడ్లు లేని గ్రామం అంటూ ఉండదన్నారు. ప్రజల కోసం తాను అన్ని పనులు చేస్తానని, రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. భక్తరామదాసు ప్రాజెక్టుతో సాగునీటి వనరులు లేని తిరుమలాయపాలెంను సస్యశ్యామలం చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తికావడానికి ప్రజలు సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా గ్రామంలో విద్యుత్ తీగలు,ట్రాన్స్ఫార్మర్లు అధ్వానంగా ఉన్నాయని, గతంలో ఇద్దరు విద్యుదాఘాతంతో మృతి చెందారని మంత్రికి వివరించారు. వెంటనే ట్రాన్స్‌కో ఏఈ లక్ష్మీనారాయణను పిలిచి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామంలోని పాఠశాలలో ఉపాధ్యాయులు లేరని తెలుపగా విద్యావలంటీర్‌ను నియమించాలని ఎంఈఓ సత్యనారాయణకు సూచించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, ఎంపీపీ అధ్యక్షుడు కొప్పుల అశోక్, జెడ్పీటీసీ సభ్యురాలు కవిత, సర్పంచ్ బోడ మారు, ఎంపీడీఓ సన్యాసయ్య, తహసీల్దార్ వెంకటరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు రామసహాయం నరేష్‌రెడ్డి, బీరెడ్డి నాగచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.