అమరుల త్యాగాలు, టీడీపీ లేఖతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బాగుపడుతోంది సీఎం కేసీఆర్ కుటుంబమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. మండల కేంద్రంలో టీడీపీ నియోజకవర్గ స్దాయి కార్యకర్తల సమావేశం జాటోతు ఇందిర అధ్యక్షతన సోమవారం జరిగింది.
-
టీడీపీ జాతీయ కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి
పాలకుర్తి/పాలకుర్తి టౌన్ : అమరుల త్యాగాలు, టీడీపీ లేఖతో వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో బాగుపడుతోంది సీఎం కేసీఆర్ కుటుంబమేనని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రేవూరి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. మండల కేంద్రంలో టీడీపీ నియోజకవర్గ స్దాయి కార్యకర్తల సమావేశం జాటోతు ఇందిర అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సమావేశంలో ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ నాడు టీడీపీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కోసం కృషి చేయగా.. ఇప్పుడు టీడీపీని ఆంధ్రా పార్టీగా చిత్రీకరించేందుకు యత్నిస్తున్నారనిమ ండిపడ్డారు. కేసీఆర్ ఎన్నికల హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యాడని అన్నారు. కాగా, టీడీపీకి పలువురు నాయకులు ద్రోహం చేసినా ప్రజల్లో ఆదరణ చెక్కు చెదరలేదని అన్నారు. తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం రానుందని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా కంటికి రెప్పలా కాపాడుకుంటామని అన్నారు. తొలుత నాయకులు స్థానికంగా చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షులు గండ్ర సత్యనారాయణరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు బొట్ల శ్రీనివాస్, రాష్ట్ర కార్యదర్శి ఈగ మల్లేశం, నాయకులు గట్టు ప్రసాద్‌బాబు, పుల్లూరి అశోక్, చిలువేరు పెంటయ్య, ఘనపురం ఎల్లయ్య పాల్గొన్నారు
==================================================
03 పిఎల్‌కేవై 04 - చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేస్తున్న ప్రకాష్‌రెడ్డి, నాయకులు