Devotees believe
-
కాశీలో ‘మోక్ష’ భవనాలు
లక్నో: కాశీలో చనిపోతే మోక్షం వస్తుందని. చావు పుట్టుకల నుంచి విముక్తి లభిస్తోందని కొంతమందిలో నమ్మకం. ఆ భావనతోనే చనిపోయేందుకు కాశీ వెళుతున్నారు. కాశీకి వెళ్లిన వాళ్లు కాటికి వెళ్లిన వాళ్లు ఒక్కటే అని గతంలో ఓ నానుడి ఉండేది..అయితే కాటికి వెళ్లేందుకే ఇప్పుడు చాలా మంది కాశీకి వెళుతున్నారు. మోక్షం కోసం వచ్చే ఇలాంటి వారికి వసతి కల్పించేందుకు అక్కడ ప్రత్యేకంగా భవనాలు కూడా ఉన్నాయి. చనిపోయే వారి కోసం ముక్తి భవన్ పారిశ్రామికవేత్త విష్ణుహరి దాల్మియా 1958లో ఈ ముక్తి భవన్‌ను ప్రారంభించారు. కాశీలో చనిపోవాలని వచ్చే వారికి ఇక్కడ ఆశ్రయం కల్పిస్తారు. చావుకు దగ్గిరగా ఉన్న వాళ్లు ఇక్కడికి వస్తారు. ముక్తి భవన్లో ఉచితంగానే వసతి కల్పిస్తారు. అయితే ఇక్కడికి వచ్చే వారికి తప్పనిసరిగా ఓ సహాయకుడు ఉండాలి. వీరికి ఓ రూమ్ కేటాయిస్తారు. కనీసంగా 15 రోజులు ఇక్కడ ఉండే అవకాశం ఉంది. ఆ లోపు చనిపోతే సరేసరి. లేదంటే ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి, రూమ్‌ల ఖాళీని బట్టి మరోసారి వసతి అవకాశం ఇస్తామని నలభై ఏళ్లుగా ముక్తి భవన్ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న మేనేజర్ భైరవ్నాథ్ శుక్లా తెలిపారు. ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ కాశీలో చనిపోవాలనే తన తండ్రి ఆఖరి కోరిక తీర్చేందుకు ఓ కుమారుడు తండ్రిని తీసుకుని మోక్ష భవన్‌కు వచ్చాడు. అయితే అక్కడ కుమారుడు చనిపోయాడు. తండ్రి మాత్రం బతికే ఉన్నాడు. మరో సంఘటనలో ఓ కొడుకు తన తండ్రిని ఇక్కడికి తీసుకొచ్చాడు. పదిహేను రోజులు అక్కడే ఉన్నా తండ్రి చనిపోలేదని కొడుకు విసుగ్గా ఆ తండ్రిని ఇంటికి తీసుకెళ్లిపోయాడు. ఆ తండ్రి కనీసం మరో ఐదేళ్లు బతికే అవకాశం ఉందని, ఇలా రకారకాల ఆలోచనలతో ఇక్కడికి వస్తుంటారని శుక్లా తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఓ జంట కాశీభవన్‌లో తన ఆఖరి మజిలీని గడుపుతున్నారు. వీరిరువురూ విద్యాశాఖలో పనిచేస్తూ స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. తరచుగా కాశీ వెళ్తుండేవారు. రూ. 5 లక్షలు విరాళంగా ఇచ్చి కాశీ భవన్లో ఓ గదిని తీసుకున్నారు. మిగతా జీవితాన్ని అక్కడే సంతోషంగా గడిపేస్తామని చెబుతున్నారు. 20 ఏళ్లుగా అక్కడే నివాసం అస్సీ ఘాట్‌కు సమీపంలో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ముముక్షు భవన్ ఉంది. ఇందులోనే ప్రాథమికోన్నత పాఠశాల, ఓ గుడి, 60 రూములు ఉన్నాయి. ఢిల్లీకి చెందిన గులాబ్ బాయ్ అనే మహిⶠ20 ఏళ్లుగా ఈ భవన్‌లోనే ఉంటున్నారు. భర్త మరణానంతరం తన కోరిక మేరకు పిల్లలు ఇక్కడికి తీసువచ్చి వదిలి వెళ్లారని, ఢిల్లీలో కంటే ఇక్కడే తనకు హాయిగా ఉందంటున్నారు గులాబ్. పైగా, ఢిల్లీలో నివశించేవారికి రక్షణ లేకుండా పోయిందని, అక్కడ జరుగుతున్న హత్యల వార్తలను టీవీల్లో చూస్తున్నానని చెప్పారు. ‘ఇక్కడ చనిపోతే మోక్షం లభిస్తోందని చాలామంది ఎప్పటి నుంచో ఇక్కడికి వస్తున్నారు. అయితే కొన్ని లాడ్జీలు చావులను వ్యాపారంగా మార్చేశాయని’ సీనియర్ జర్నలిస్ట్ అమితాబ్ భట్టాచార్య విమర్శించారు. -
అతీత శక్తి...
విజ్ఞానశాస్త్రానికి అతీతంగా ఒక శక్తి ఉన్నదని భక్త జనం విశ్వసిస్తారు. చైతన్యయుత ప్రపం చాన్ని నడిపించే, నియంత్రించే ఏదో ఒక శక్తి ఉన్నదని వారి భావన. దీన్ని కాదనేవారూ, పూర్వపక్షం చేయడానికి ప్రయత్నించేవారూ ఎప్పుడూ ఉంటారు. స్వీయానుభవాలద్వారా మాత్రమే అలాంటి శక్తి ఉన్నదన్న విశ్వాసం ఎవరికైనా కలుగుతుంది. వివరించి చెబితే అర్థమ య్యే విషయం కాదది. చైత్రమాసం, శుక్లపక్ష ఏకాదశి, శ్రీరామనవమి మరునాడు లాంఛనప్రాయంగా చిలుకూరు బ్రహ్మోత్స వాలు ప్రారంభమయ్యేరోజు. కొంతకాలం క్రితం అలాంటి ఒకరోజున ధ్వజారోహణకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ధ్వజంపై ధ్వజ చిత్రాన్ని చిత్రించాక ధ్వజస్తంభం కిందనున్న గరుత్మంతుని చిన్న విగ్రహానికి అభిషేకం పూర్తయింది. చక్కరపొం గలి నైవేద్యం కూడా ఇచ్చారు. దీనికి రెండు పేర్లున్నాయి. గరుడపిండం లేక గరుత్మం తుని నైవేద్యం అని పిలుస్తారు. ‘యా స్త్రీ పిండం జ్ఞాతీ పుత్రవీ భవేత్’ ఏ స్త్రీ ఈ గరుడపిండాన్ని ప్రసాదంగా భావించి తింటుందో, ఆ స్త్రీ పుత్రవతి అవుతుం దని ఆగమశ్లోకం చెబుతోంది. ఈ శ్లోకాన్ని, శ్లోకార్థాన్ని చిలుకూరు బాలాజీ ఆలయంలో భక్తులందరికీ చెప్పా ము. ప్రతి ఏడాదీ ఇలా ప్రసాదం ఇవ్వడం, దానివల్ల తమకు ఫలితం కలిగిందని ఎందరో మహిళలు సంతో షంతో చెప్పడం రివాజు. ఎందరో తల్లులు ఆలయానికి పాపనో, బాబునో ఎత్తుకుని వచ్చి గరుడ ప్రసాద ఫలితమే తమ బిడ్డ అని చెబుతుంటారు. గరుత్మంతుడు సర్పదోషాన్ని హరిస్తాడని ప్రతీతి. రెండు సంవత్సరాలక్రితం ఒక యువతి చిలు కూరు ఆలయానికి వచ్చింది. తనకు పిల్లలు లేరన్న బెంగ ఆమెను వేధించేది. గర్భసంచి ఉండవలసిన చోటుకన్నా కాస్త పక్కన ఉన్న కారణంగా పిల్లలు పుట్ట రని వైద్యులు తేల్చిచెప్పారట. తన బాధను ఆమె నాతో చెప్పింది. అనునయించాను. వైద్యశాస్త్ర జ్ఞానం అపా రంగా విస్తరించిన విషయం నిజమే అయినా అన్నిటికీ అతీతుడైన ఆ దేవదేవుడి కరుణాకటాక్షాలుంటే ఎం తటి అసాధ్యమైనా సుసాధ్యమవుతుందని చెప్పాను. ఆమెకు కొంచెం సాంత్వన లభించినట్టే ఉంది. కొన్నా ళ్ల తర్వాత ఆమె మళ్లీ వచ్చింది. ఈసారి ఆమెకు కొత్త సమస్య వచ్చింది. గర్భధారణ జరిగిందట. కానీ, గర్భ సంచి అలాంటి స్థితిలో ఉన్నందువల్ల అబార్షన్ చేసు కుంటేనే మంచిదని వైద్యులు సూచించారట. ఎం దుకైనా మంచిదని మరో వైద్యుని సంప్రదించమని చెప్పాను. మరో వైద్యురాలు ఆ యువతిని పరీక్షించి కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ఆమెను ఎప్పటికప్పుడు పర్య వేక్షిస్తూ తన కనుసన్నల్లో పెట్టుకుని కాపాడారు. ఆ పర్యవేక్షణ ఫలితంగా నెలలు నిండాక ఆ యువతి పండంటి బిడ్డను ప్రసవించింది. ఆమె సంతోషానికి అవధులు లేవు. బాబును ఆలయానికి తీసుకుని వచ్చింది. భక్తులంతా ఆమె సంతోషాన్ని పంచుకున్నా రు. మాతృత్వం స్త్రీకి భగవంతుడిచ్చిన గొప్పవరం. ఆ వరం లభించినప్పుడు కలిగే ఆనందం మాటలకంద నిది. తన అనుభవాన్ని మైకులో చెప్పమని ఆ యువతి కోరింది. ఈసారి ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలు ప్రారం భం కానున్నాయి. పదో తేదీనాడు ధ్వజారోహణ. ప్రతి ఏడాదిలాగే ఈసారీ భక్తులందరికీ గరుడ ప్రసాదం ఇస్తాము. ఎందరెందరో భక్తులు వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించడం, తమ అనుభవాలను మాతో పంచుకోవ డం ఒక అద్భుతమైన అనుభూతి కలిగిస్తుంది. మొదటే చెప్పాను. విజ్ఞానశాస్త్రానికి అతీతమైన శక్తి ఉంది. దాని మహిమలు అనుభవించినవారికే తెలుస్తాయి. - సౌందర్‌రాజన్ చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు -
భక్తుల నరకయాతన
లక్షన్నర మంది భక్తుల రాక .. ఏకాదశి దర్శనం కోసం పాట్లు ధర్నాలతో హోరెత్తించిన భక్తులు.. నిరసనలతో ధర్మకర్తల మండలి, అధికారులపై తిట్ల దండకం సాక్షి, తిరుమల: అనుకున్నదే అయ్యింది. చరిత్ర పునరావృత్తం అయింది. నాలుగైదేళ్లుగా వైకుంఠ దర్శనం కోసం వచ్చే సామాన్య భక్తులకు నరకం కనిపించటం సర్వసాధారణమైపోయింది. అన్నీ తెలిసిన టీటీడీ ధర్మకర్తల మండలి, అధికారులు మాత్రం వీఐపీ సేవలోనే తరలించారు. కాలినడక భక్తులు అష్టకష్టాలు పడ్డారు. అడుగడుగునా తిరుమలలో భక్తులు ఆందోళనలు, ధర్నాలతో తమ నిరసన వ్యక్తం చేశారు. ధర్మకర్తల మండలి, అధికారులపై తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. జిల్లా ఇన్చార్జి మంత్రి పార్థసారథి వాహనాన్ని అడ్డుకున్నారు. ఆయన సముదాయించినా భక్తులు శాంతించలేదు. చలిగాలుల్లో భక్తుల పాట్లు తిరుమలలో ధనుర్మాసంతో వల్ల చలి తీవ్రంగా పెరిగింది. దీనికి తోడు మంచు వర్షంలా కురవటంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గదులు లభించని భక్తులు ఆరుబయట షెడ్లలోనే నిరీక్షించారు. మరికొందరు భక్తులు చెట్ల కింద, క్యూలైన్లలోని నిద్రించారు. భక్తులకు లగేజీకష్టాలు వైకుంఠ ఏకాదశి , ద్వాదశి దర్శనం కోసం నడకదారుల్లో రికార్డు స్థాయిలో 60 వేల మందికిపైగా భక్తులు వచ్చారు. వీరిలోని టీటీడీకి 40 వేల మందికే టికెట్లు ఇచ్చింది. ఇందులోభాగంగా అలిపిరి వద్ద డిపాజిట్ చేసిన లగేజీని తిరుమలకు తెచ్చేందుకు ఆలస్యమైంది. అలాగే, తిరుమలకు చేరిన లగేజీ కూడా త్వరగా అందజేయటంలో సిబ్బంది విఫలమయ్యారు. వీటితోపాటు కొందరు భక్తుల లగేజీ చేరకపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దర్శన టికెట్టు ఇవ్వలేని టీటీడీ తాము తెచ్చిన లగేజీ కూడా అందజేయటంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. టికెట్ల దందా.. రూ.10 వేలనుంచి రూ.20 వేలు పలికిన వీఐపీ పాసు ప్రముఖులకు కేటాయించి రూ.1000 వీఐపీ టికెట్టు నల్లబజారులో రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు ధరతో చేతులు మారింది. ప్రముఖులతోపాటు ఇతర పేర్లు కూడా జతచేయటంతో టికెట్లు అందాయి. అలాగే, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల అధికారులతో పేర్లతోపాటు కేటాయించిన టికెట్లలో కూడా ఇతర పేర్లు జత అయ్యాయి. అలాంటి టికెట్లను ముందుగానే కుదుర్చుకున్న ధరలతో విక్రయించారు. ఇందులో ఇద్దరు ముగ్గురు టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు కూడా ఉన్నారు. వీరు తమ ఇష్టానుసారంగా టికెట్లను ఇతర వ్యక్తులకు కేటాయించినట్టు తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఆశ పోయింది... వైకుంఠ ఏకాదశికి శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకుందామని నాయుడుపేట నుంచి వచ్చాను. ఇక్కడ క్యూలైన్ చూస్తుంటే ఏకాదశికి స్వామి దర్శనం దొరుకుతుందనే ఆశ పోయింది. - సుబ్బారావు, నాయుడుపేట క్యూలైన్లో ఊపిరి పీల్చుకోవటం కష్టమైంది... అలిపిరి నుండి కాలినడకన తిరుమలకు వచ్చాము. గాలిగోపురం వద్దనున్న అధిక భక్తుల రద్దీలో కనీసం ఊపిరిపీల్చుకోవటం చాలా కష్టమైపోయింది. మా కుటుంబ సభ్యులందరూ కనిపించకుండా పోయారు. - వరలక్ష్మి, నెల్లూరు సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నారు... క్యూలైన్లను అదుపుచేయలేకపోవటమే కాకుండా టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తున్నారు. క్యూలైన్ వద్ద కనీసం తాగటానికి మంచి నీరు కూడా లభించ టంలేదు. - మురళి, హైదరాబాద్ కనీస వసతులు లేవు... సామాన్య భక్తులకు కనీసం వసతులను కూడా టీటీడీ ఏర్పాటు చేయడంలేదు. ఓ క్రమపద్ధతిలో క్యూలైన్‌ను క్రమబద్ధీకరించకుండా వదిలేసారు. అందువల్లనే భక్తుల మధ్య తోపులాట జరుగుతోంది. - రాజ్యలక్ష్మి, చిత్తూరు