అతీత శక్తి... | God gives power mother to protect child | Sakshi
Sakshi News home page

అతీత శక్తి...

Published Fri, Mar 14 2014 1:37 AM | Last Updated on Sat, Sep 2 2017 4:40 AM

అతీత శక్తి...

అతీత శక్తి...

విజ్ఞానశాస్త్రానికి అతీతంగా ఒక శక్తి ఉన్నదని భక్త జనం విశ్వసిస్తారు. చైతన్యయుత ప్రపం చాన్ని నడిపించే, నియంత్రించే ఏదో ఒక శక్తి ఉన్నదని వారి భావన. దీన్ని కాదనేవారూ, పూర్వపక్షం చేయడానికి ప్రయత్నించేవారూ ఎప్పుడూ ఉంటారు. స్వీయానుభవాలద్వారా మాత్రమే అలాంటి శక్తి ఉన్నదన్న విశ్వాసం ఎవరికైనా కలుగుతుంది.  వివరించి చెబితే అర్థమ య్యే విషయం కాదది.
 
 చైత్రమాసం, శుక్లపక్ష ఏకాదశి, శ్రీరామనవమి మరునాడు లాంఛనప్రాయంగా చిలుకూరు బ్రహ్మోత్స వాలు ప్రారంభమయ్యేరోజు. కొంతకాలం క్రితం అలాంటి ఒకరోజున ధ్వజారోహణకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటున్నాము. ధ్వజంపై ధ్వజ చిత్రాన్ని చిత్రించాక ధ్వజస్తంభం కిందనున్న గరుత్మంతుని చిన్న విగ్రహానికి అభిషేకం పూర్తయింది. చక్కరపొం గలి నైవేద్యం కూడా ఇచ్చారు. దీనికి రెండు పేర్లున్నాయి. గరుడపిండం లేక గరుత్మం తుని నైవేద్యం అని పిలుస్తారు.
 
 ‘యా స్త్రీ పిండం జ్ఞాతీ పుత్రవీ భవేత్’
 ఏ స్త్రీ ఈ గరుడపిండాన్ని ప్రసాదంగా భావించి తింటుందో, ఆ స్త్రీ పుత్రవతి అవుతుం దని ఆగమశ్లోకం చెబుతోంది. ఈ శ్లోకాన్ని, శ్లోకార్థాన్ని చిలుకూరు బాలాజీ ఆలయంలో భక్తులందరికీ చెప్పా ము. ప్రతి ఏడాదీ ఇలా ప్రసాదం ఇవ్వడం, దానివల్ల తమకు ఫలితం కలిగిందని ఎందరో మహిళలు సంతో షంతో చెప్పడం రివాజు. ఎందరో తల్లులు ఆలయానికి పాపనో, బాబునో ఎత్తుకుని వచ్చి గరుడ ప్రసాద ఫలితమే తమ బిడ్డ అని చెబుతుంటారు. గరుత్మంతుడు సర్పదోషాన్ని హరిస్తాడని ప్రతీతి.
 
 రెండు సంవత్సరాలక్రితం ఒక యువతి చిలు కూరు ఆలయానికి వచ్చింది. తనకు పిల్లలు లేరన్న బెంగ ఆమెను వేధించేది. గర్భసంచి ఉండవలసిన చోటుకన్నా కాస్త పక్కన ఉన్న కారణంగా పిల్లలు పుట్ట రని వైద్యులు తేల్చిచెప్పారట. తన బాధను ఆమె నాతో చెప్పింది. అనునయించాను. వైద్యశాస్త్ర జ్ఞానం అపా రంగా విస్తరించిన విషయం నిజమే అయినా అన్నిటికీ అతీతుడైన ఆ దేవదేవుడి కరుణాకటాక్షాలుంటే ఎం తటి అసాధ్యమైనా సుసాధ్యమవుతుందని చెప్పాను. ఆమెకు కొంచెం సాంత్వన లభించినట్టే ఉంది. కొన్నా ళ్ల తర్వాత ఆమె మళ్లీ వచ్చింది. ఈసారి ఆమెకు కొత్త సమస్య వచ్చింది. గర్భధారణ జరిగిందట. కానీ, గర్భ సంచి అలాంటి స్థితిలో ఉన్నందువల్ల అబార్షన్ చేసు కుంటేనే మంచిదని వైద్యులు సూచించారట. ఎం దుకైనా మంచిదని మరో వైద్యుని సంప్రదించమని చెప్పాను.
 
 మరో వైద్యురాలు ఆ యువతిని పరీక్షించి కొన్ని జాగ్రత్తలు చెప్పారు. ఆమెను ఎప్పటికప్పుడు పర్య వేక్షిస్తూ తన కనుసన్నల్లో పెట్టుకుని కాపాడారు. ఆ పర్యవేక్షణ ఫలితంగా నెలలు నిండాక ఆ యువతి పండంటి బిడ్డను ప్రసవించింది. ఆమె సంతోషానికి అవధులు లేవు. బాబును ఆలయానికి తీసుకుని వచ్చింది. భక్తులంతా ఆమె సంతోషాన్ని పంచుకున్నా రు. మాతృత్వం స్త్రీకి భగవంతుడిచ్చిన గొప్పవరం. ఆ వరం లభించినప్పుడు కలిగే ఆనందం మాటలకంద నిది. తన అనుభవాన్ని మైకులో చెప్పమని ఆ యువతి కోరింది.
 
 ఈసారి ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలు ప్రారం భం కానున్నాయి. పదో తేదీనాడు ధ్వజారోహణ. ప్రతి ఏడాదిలాగే ఈసారీ భక్తులందరికీ గరుడ ప్రసాదం ఇస్తాము. ఎందరెందరో భక్తులు వచ్చి ఈ ప్రసాదాన్ని స్వీకరించడం, తమ అనుభవాలను మాతో పంచుకోవ డం ఒక అద్భుతమైన అనుభూతి కలిగిస్తుంది. మొదటే చెప్పాను. విజ్ఞానశాస్త్రానికి అతీతమైన శక్తి ఉంది. దాని మహిమలు అనుభవించినవారికే తెలుస్తాయి.
 - సౌందర్‌రాజన్
 చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకులు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement