devudu
-
అడవి బిడ్డల వెతల గాథ.. ‘ఈతచెట్టు దేవుడు’
ఒడిశా రాష్ట్రంలో వెనుకబడిన కొరాపుట్ జిల్లా– అక్కడి కొండకోనల్లో బతుకులు వెళ్లమార్చే అడవిబిడ్డల వెతల గాథ ‘ఈతచెట్టు దేవుడు’. సుప్రసిద్ధ ఒడియా రచయిత, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత గోపీనాథ్ మహంతి రాసిన ‘దాది బుఢా’ నవలను డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి ‘ఈతచెట్టు దేవుడు’గా తెలుగులోకి అనువదించారు. ఇదివరకే ఈ నవల ‘ది ఏన్సెస్టర్’ పేరిట ఇంగ్లిష్‌లోకి అనువదితమైంది. ఒరిస్సా అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అధికారిగా కొరాపుట్ జిల్లాలో కొంతకాలం పనిచేసిన గోపీనాథ్ మహంతి అక్కడి ఆదివాసీల జీవితాలను దగ్గరగా గమనించారు. లుల్లా అనే గ్రామంలోని గిరిజనుల బతుకులను, వాళ్ల వెతలను కళ్లకు కట్టే గాథ ఇది. లుల్లా గ్రామాన్ని అక్కడి గిరిజనులు విడిచిపెట్టి, మరో గ్రామాన్ని ఏర్పాటు చేసుకోవడానికి దారితీసిన పరిస్థితులు పాఠకులను కదిలిస్తాయి. ఒడియా భాషా సాహిత్యాలతో సుదీర్ఘ పరిచయం గల రచయిత్రి డాక్టర్ తుర్లపాటి రాజేశ్వరి ఈ నవలను మూలంలోని ఒరవడిని ఒడిసి పట్టుకుని అనువదించిన తీరు ప్రశంసనీయం. నవలలోని గిరిజనుల సంభాషణలకు ఆంధ్రా–ఒడిశా సరిహద్దుల్లోని కళింగసీమ మాండలికాన్ని ఎంచుకోవడం సముచితం. – దాసు -
వైఎస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే దేవుడి కూతురు మాధవి
-
రైతు ఇంటిపై తుపాకీతో దాడికి యత్నం
విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా దేవరపల్లి మండలం జుత్తాడపాలెంలో ఆదివారం నాటు తుపాకీ కలకలం సృష్టించింది. దేవుడు అనే రైతు ఇంటిపై నాటు తుపాకీతో దుండగుల దాడికి యత్నించారు. దీంతో దేవుడు కుటుంబ సభ్యులు బిగ్గర అరవడంతో దుండగులు అక్కడి నుంచి పరారైయ్యారు. వారిని పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. కానీ వారు అప్పటికే పరారైయ్యారు. అయితే సంఘటన స్థలంలో బుల్లెట్ లభ్యమైంది. దేవుడు కుటుంబం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
'కూల్ బాయ్స్ హాట్ గళ్స్' డైరెక్టర్ అరెస్ట్
విశాఖ : పోలీస్ శాఖలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగులకు కుచ్చుటోపీ పెట్టిన ముఠాను టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. ఉద్యోగులు పేరుతో రూ. 17 లక్షలు మేరకు మోసం చేసిన కేసులో 'కూల్ బాయ్స్ - హాట్ గాళ్స్' సినిమా దర్శకుడితో పాటు అసిస్టెంట్ డైరెక్టర్, ప్రొడ్యూసర్, జూనియర్ ఆర్టిస్ట్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంద్రగంటి క్రియేటివ్ మూవీస్ పతాకంపై దేవుడు దర్శకత్వంలో కూల్ బాయ్స్ హాట్ గాళ్స్ చిత్రాన్ని ఐ.ఎన్.రాజు నిర్మించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రైతులకు కుచ్చుటోపీ
శాంతినగర్, న్యూస్‌లైన్: అన్నదాతలను దళారులు నిలువునా ముంచుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అడ్డగోలు మాటలు చె ప్పి నమ్మించి మోసం చేస్తున్నారు. తాజాగా రైతులకు *40లక్షల ధాన్యం డబ్బులు చెల్లించకుండా ఓ దళారి ఉడాయించాడు. వివరాల్లోకెళ్తే.. బాల్‌రాజ్‌శెట్టి అనే వ్యాపారి పెద్దతాండ్రపాడులో స్థిరపడ్డాడు. పెద్దతాండ్రపాడు, తుమ్మిళ్ల, ముండ్లదిన్నె, కొంకల తది తర గ్రామాల్లోని రైతులు పండించిన మొక్కజొన్న, పంట జొన్న లు కొనుగోలు చేసేవాడు. 15 ఏళ్లుగా వారితో మంచితనంగా ఉంటూ ధాన్యం కొనుగోలుచేయడం, తరువాత డబ్బులు సక్రమంగా ఇస్తూ వచ్చాడు. ఈ క్రమంలో మూడునెల క్రితం ఆయా గ్రామాల్లో *40లక్షల విలువైన మూడువేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలుచేశాడు. మూడు నెలల తరువాత డబ్బులు ఇస్తానని, ఎక్కువ ధర చెల్లిస్తానని నమ్మబలికాడు. తెల్లకాగితంపై వారికి బిల్లులు రాసిచ్చాడు. మూడునెలల గడువు సమీపిస్తున్న తరుణంలో గ్రామం వదలి బాల్‌రాజ్‌శెట్టి అడ్రస్ లేకుండా పోయాడు. గత పదిహేను రోజుల క్రితం గ్రా మపెద్దల సమక్షంలో కర్నూలులో కలిసి మొత్తం డ బ్బులు ఇస్తానని చెప్పాడు. నేటివరకు అతని ఆచూకీ తె లియకపోవడంతో గ్రామపెద్దలు చేతులెత్తేశారు. చివరికి విసుగుచెందిన రైతులు సోమవారం శాంతినగర్‌లో నివాసం ఉంటున్న అతని వియ్యంకుడు ఆర్ఆర్ పాపయ్యశెట్టి నగల దుకాణం ఎదుట ఆందోళనకు దిగారు. వియ్యంకుడి ఆచూకీ చెబుతానని గతంలో చెప్పి ఇప్పుడు బుకాయిస్తున్నావని వాగ్వాదానికి దిగారు. దుకాణం మూయించేందుకు యత్నించగా షాపుయజమాని పోలీసులకు సమాచారమందించాడు. ఇంతలో మనస్తాపానికి గురైన తాండ్రపాడురైతు ఆంజనేయులు పురుగు మందు తాగడానికి యత్నించాడు. తోటి రైతులు మందుడబ్బాను లాక్కుని విసిరేశారు. మంగళవారం సాయంత్రంలోగా బాల్‌రాజ్‌శెట్టి ఎక్కడున్నా డబ్బులు ఇవ్వాలని, స్పష్టమైన హామీ ఇవ్వకపోతే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేస్తామని రైతులు తెలిపారు. ఆందోళన చేసిన వారిలో పెద్దతాండ్రపాడు గ్రామ రైతులు ముస్వ మాదన్న, మురళీధర్, కిష్టన్న, తిమ్మప్ప, రామన్‌గౌడ్, హన్మంతు, భగవన్న, శ్రీను, వెంకటేష్, లక్ష్మణస్వామి ఉన్నారు.