శాంతినగర్, న్యూస్‌లైన్: అన్నదాతలను దళారులు నిలువునా ముంచుతున్నారు. ఆరుగాలం కష్టించి పండించిన ధాన్యాన్ని అడ్డగోలు మాటలు చె ప్పి నమ్మించి మోసం చేస్తున్నారు. తాజాగా రైతులకు *40లక్షల ధాన్యం డబ్బులు చెల్లించకుండా ఓ దళారి ఉడాయించాడు. వివరాల్లోకెళ్తే.. బాల్‌రాజ్‌శెట్టి అనే వ్యాపారి పెద్దతాండ్రపాడులో స్థిరపడ్డాడు. పెద్దతాండ్రపాడు, తుమ్మిళ్ల, ముండ్లదిన్నె, కొంకల తది తర గ్రామాల్లోని రైతులు పండించిన మొక్కజొన్న, పంట జొన్న లు కొనుగోలు చేసేవాడు. 15 ఏళ్లుగా వారితో మంచితనంగా ఉంటూ ధాన్యం కొనుగోలుచేయడం, తరువాత డబ్బులు సక్రమంగా ఇస్తూ వచ్చాడు. ఈ క్రమంలో మూడునెల క్రితం ఆయా గ్రామాల్లో *40లక్షల విలువైన మూడువేల క్వింటాళ్ల ధాన్యాన్ని కొనుగోలుచేశాడు.
మూడు నెలల తరువాత డబ్బులు ఇస్తానని, ఎక్కువ ధర చెల్లిస్తానని నమ్మబలికాడు. తెల్లకాగితంపై వారికి బిల్లులు రాసిచ్చాడు. మూడునెలల గడువు సమీపిస్తున్న తరుణంలో గ్రామం వదలి బాల్‌రాజ్‌శెట్టి అడ్రస్ లేకుండా పోయాడు. గత పదిహేను రోజుల క్రితం గ్రా మపెద్దల సమక్షంలో కర్నూలులో కలిసి మొత్తం డ బ్బులు ఇస్తానని చెప్పాడు. నేటివరకు అతని ఆచూకీ తె లియకపోవడంతో గ్రామపెద్దలు చేతులెత్తేశారు. చివరికి విసుగుచెందిన రైతులు సోమవారం శాంతినగర్‌లో నివాసం ఉంటున్న అతని వియ్యంకుడు ఆర్‌ఆర్ పాపయ్యశెట్టి నగల దుకాణం ఎదుట ఆందోళనకు దిగారు. వియ్యంకుడి ఆచూకీ చెబుతానని గతంలో చెప్పి ఇప్పుడు బుకాయిస్తున్నావని వాగ్వాదానికి దిగారు. దుకాణం మూయించేందుకు యత్నించగా షాపుయజమాని పోలీసులకు సమాచారమందించాడు.
ఇంతలో మనస్తాపానికి గురైన తాండ్రపాడురైతు ఆంజనేయులు పురుగు మందు తాగడానికి యత్నించాడు. తోటి రైతులు మందుడబ్బాను లాక్కుని విసిరేశారు. మంగళవారం సాయంత్రంలోగా బాల్‌రాజ్‌శెట్టి ఎక్కడున్నా డబ్బులు ఇవ్వాలని, స్పష్టమైన హామీ ఇవ్వకపోతే పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేస్తామని రైతులు తెలిపారు. ఆందోళన చేసిన వారిలో పెద్దతాండ్రపాడు గ్రామ రైతులు ముస్వ మాదన్న, మురళీధర్, కిష్టన్న, తిమ్మప్ప, రామన్‌గౌడ్, హన్మంతు, భగవన్న, శ్రీను, వెంకటేష్, లక్ష్మణస్వామి ఉన్నారు.
రైతులకు కుచ్చుటోపీ
Published Tue, Aug 27 2013 5:31 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement