DGP anuragha sharma
-
నేడు ‘లైంగిక వేధింపుల నియంత్రణ’ క్యాంపెయిన్
సాక్షి, హైదరాబాద్: చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపుల నియంత్రణకు ఏడాదిపాటు రాష్ట్ర పోలీస్ నిర్వహించనున్న క్యాంపెయిన్ శుక్రవారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్ శర్మ ప్రారంభించనున్నారు. ఈ మేరకు డీజీపీ అనురాగ్ శర్మ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. -
కోమటోళ్ల నుంచి రక్షణ కల్పించండి
సాక్షి, హైదరాబాద్: కోమటోళ్ల నుంచి తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య డీజీపీ అనురాగ్ శర్మకు విజ్ఞప్తి చేశారు. సోమవారం డీజీపీని కలసిన అనంతరం ఐలయ్య విలేకర్లతో మాట్లాడుతూ ఎంపీ టీజీ వెంకటేష్, ఆర్యవైశ్య సంఘం నాయకులు శ్రీనివాస్‌గుప్తా, రామకృష్ణ, రమణ తదితరులు తనను చంపుతానని బెదిరించారని డీజీపీకి తెలిపారు. బెదిరింపుల కారణంగా తాను బయటకు వెళ్లలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్, ఇతర జిల్లాలకు వెళ్లిన సమయంలో స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం ఇస్తే భద్రతా చర్యలు తీసుకుంటారని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారన్నారు. -
తెలంగాణ పోలీస్ సిబ్బందికి వరాల జల్లు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం పోలీస్ సిబ్బందికి వరాల జల్లు కురిపిస్తోంది. పోలీస్ సిబ్బందికి ఇస్తున్న భద్రత సొమ్ము భారీగా పెంచుతున్నట్టు డీజీపీ అనురాగ్ శర్మ వెల్లడించారు. కిందిస్థాయి సిబ్బందికి ప్రస్తుతం చెల్లిస్తున్న హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్‌ను రూ. 3 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచుతున్నట్టు మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో చెప్పారు. హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్, ఏఎస్సై, ఏఆర్ ఎస్సైలకు రూ. 5 లక్షల నుంచి రూ. 7 లక్షల వరకు పెంచుతున్నట్టు ఆయన తెలిపారు. ఎస్సై కేడర్ అధికారులకు రూ. 7 లక్షల నుంచి రూ. 9 లక్షల వరకు పెంచుతున్నట్టు డీజీపీ చెప్పారు. డీఎస్పీ ఆపై అధికారులకు రూ.9 లక్షల నుంచి రూ. 11 లక్షల వరకు పెంచుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఉన్నత చదవుల కోసం విదేశాలకు వెళ్లే పోలీసుల పిల్లలకు ఇచ్చే సాయం రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంచుతున్నారు. పోలీసుల కూతుళ్ల వివాహాలకు ఇచ్చే రుణాన్ని రూ. 3 లక్షల నుంచి 4 లక్షలు, పోలీసుల ఎక్స్‌గ్రేషియా ఎస్సై క్యాడర్‌కు రూ. 2 లక్షల నుంచి 4 లక్షల వరకు, ప్రమాదంలో మరణించిన పోలీసులకు రూ. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు పెంచుతున్నట్టు డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారు.