సాక్షి, హైదరాబాద్: చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడులు, వేధింపుల నియంత్రణకు ఏడాదిపాటు రాష్ట్ర పోలీస్ నిర్వహించనున్న క్యాంపెయిన్ శుక్రవారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, లక్ష్మారెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ మల్లారెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సీఎస్ ఎస్పీ సింగ్, డీజీపీ అనురాగ్ శర్మ ప్రారంభించనున్నారు. ఈ మేరకు డీజీపీ అనురాగ్ శర్మ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment