
సాక్షి, హైదరాబాద్: కోమటోళ్ల నుంచి తన ప్రాణాలకు రక్షణ కల్పించాలని ప్రొఫెసర్ కంచ ఐలయ్య డీజీపీ అనురాగ్ శర్మకు విజ్ఞప్తి చేశారు. సోమవారం డీజీపీని కలసిన అనంతరం ఐలయ్య విలేకర్లతో మాట్లాడుతూ ఎంపీ టీజీ వెంకటేష్, ఆర్యవైశ్య సంఘం నాయకులు శ్రీనివాస్‌గుప్తా, రామకృష్ణ, రమణ తదితరులు తనను చంపుతానని బెదిరించారని డీజీపీకి తెలిపారు. బెదిరింపుల కారణంగా తాను బయటకు వెళ్లలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్, ఇతర జిల్లాలకు వెళ్లిన సమయంలో స్థానిక పోలీసులకు ముందస్తు సమాచారం ఇస్తే భద్రతా చర్యలు తీసుకుంటారని డీజీపీ అనురాగ్ శర్మ తెలిపారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment