Dhanpura village
-
జువైనల్ హోం నుంచి ఏడుగురు బాల నేరస్థుల పరారీ
ముజాఫర్ నగర్: ప్రభుత్వ జువైనల్ సంక్షేమ గృహంలో బందీలుగా ఉన్న ఏడుగురు బాల ఖైదీలు పరారీ అయిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని ముజాఫర్ నగర్ లో మరోసారి చోటు చేసుకుంది. ఇందులో హత్యానేరంపై శిక్ష పడ్డ నలుగురు బాలలతోపాటు, అల్లర్లకు సంబంధించిన ఒక నిందితుడు, అత్యాచారం కేసులో శిక్ష అనుభవిస్తున్న మరో నేరస్థుడు కూడా ఉన్నాడని అడిషనల్ జిల్లా మెజిస్ట్రేట్ ఇందేర్మనీ త్రిపాఠీ తెలిపారు. తప్పించుకోవడానికి పక్కా ప్రణాళిక రచించుకున్న వీరు.. అడ్డగించిన నలుగురు అధికారులపై దారుణంగా దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలోఇద్దరు హోం గార్డులకు తీవ్ర గాయాలైయ్యాయి. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న హెం గార్డుల పరిస్థితి విషమంగా ఉంది. తప్పించుకున్న వీరి కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. నెల వ్యవధిలోనే ఇక్కడి నుంచి బాల ఖైదీలు తప్పించుకోవడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తోంది. ఇదే తరహా ఘటన గత నెల16 వ తేదీన చోటు చేసుకుంది. -
జువైనల్ హోం నుంచి 11 మంది బాలనేరస్థులు పరారీ
బాలనేరస్థుల సంక్షేమ గృహం నుంచి 11 మంది గత అర్థరాత్రి పరారైన సంఘటన బీహార్ భోజ్పూర్ జిల్లాలోని ధన్పూర గ్రామంలో చోటు చేసుకుంది. బుధవారం ఉదయం వివిధ ప్రాంతాలలో ముగ్గురు బాల నేరస్థులను అరెస్ట్ చేసినట్లు పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. మిగిలిన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు తెలిపారు. పోలీసు ఉన్నతాధికారి కథనం ప్రకారం... చదువుల తల్లి సరస్వతి దేవి జన్మదినమైన శ్రీ పంచమి సందర్భంగా నిన్న రాత్రి ధన్పూర బాలనేరస్థుల సంక్షేమ గృహంలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అయితే తాము పరారి అయ్యేందుకు అదే మంచి సమయంగా 11 మంది బాల నేరస్థులు భావించారు. దాంతో జైలు ఊచలు విరగొట్టి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే ఆ విషయాన్ని గ్రహించిన పోలీసులు వెంటనే అప్రమత్తమై ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దాంతో ఉన్నతాధికారులు వెంటనే స్పందించి జిల్లా వ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేశారు. బాలనేరస్థుల కోసం ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు తీవ్ర తరం చేశారు. దాంతో ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు.