మోటార్ల చోరీ కేసులో ఇద్దరు అరెస్టు
కడప అర్బన్ : మోటార్ల చోరీ కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. కడప నగరం రిమ్స్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉన్న ధర్మతేజ ఐటీఐలో గత నెలలో గుర్తు తెలియని వ్యక్తులు ఆరు మోటార్లను దోచుకెళ్లారని అప్పట్లో కళాశాల యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. రిమ్స్ సీఐ మోహన్‌ప్రసాద్ ఆధ్వర్యంలో ఎస్ఐలు హేమాద్రి, రామాంజనేయులు తమ సిబ్బందితో నిందితులు వెంకట కృష్ణ, పీర్‌బాషాలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 98 వేలు విలువైన మోటార్లను స్వాధీనం చేసుకున్నారు.