Dharmayogi
-
'జయలలిత బయోపిక్‌లో నటించాలనుంది'
హీరోయిన్గా దశాబ్దన్నర కాలంగా కొనసాగుతున్నా ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్‌తో దూసుకుపోతోంది సీనియర్ హీరోయిన్ త్రిష. మధ్యలో పెళ్లి క్యాన్సిల్ అవ్వటంతో కాస్త తడబడినా ఇప్పుడు తిరిగి ఫాంలోకి వచ్చింది. ముఖ్యంగా లేడి ఓరియంటెడ్ సినిమాల మీద దృష్టి పెడుతున్న ఈ చెన్నై బ్యూటి ఇంట్రస్టింగ్ సినిమాలతో ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదలైన కోడి (తెలుగులో ధర్మయోగి) సినిమాలో నెగెటివ్ రోల్లో మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకొని టాప్ రేంజ్‌కు చేరింది. ప్రస్తుతం మోహిని సినిమాతో మరోసారి అలరించే ప్రయత్నం చేస్తున్న త్రిష తన మనసులోని కోరికను బయటపెట్టింది. కోడి సినిమాలో పొలిటీషన్ పాత్రలో నటించిన ఈ భామ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కిస్తే..,1 అందులో లీడ్ రోల్ నటించాలని భావిస్తుందట. మరి త్రిష కోరికను మన్నించి ఎవరైనా జయలలిత బయోపిక్‌ను తెరకెక్కిస్తారేమో చూడాలి. -
ఆ ప్రశ్న అంటే అసహ్యం!
ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే... జయలలిత జీవితకథతో సినిమా తీస్తే? ఎలా ఉంటుందని చెన్నై సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ జయలలిత బయోపిక్ తీస్తే? ఆమె పాత్రలో నేను నటిస్తానంటూ త్రిష ఆసక్తి కనబరుస్తున్నారు. పదిహేనేళ్ల కెరీర్లో పలు రకాల పాత్రలు చేశారు త్రిష. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో జయలలిత బయోపిక్‌లో నటించాలనుందని చెప్పారు. జయలలితకీ, తనకూ ఓ కామన్ విషయం ఉందంటున్నారు త్రిష. అదేంటంటే...‘‘అప్పట్లో జయలలిత చదువుకున్న చెన్నైలోని చర్చ్ పార్క్ కాన్వెంట్‌లోనే నేనూ చదువుకున్నా’’ అని ఈ చెన్నై బ్యూటీ పేర్కొన్నారు. ► మిస్ చెన్నైగా ఎంపికైనప్పటి నుంచి ఇవాళ విడుదల కాబోయే ‘ధర్మయోగి’ వరకూ కెరీర్లో ఒక్క డల్ మొమెంట్ కూడా లేదు. పశ్చాత్తాప పడిన సందర్భాలు అసలు లేవు. ఎన్నో విజయాలు, కొన్ని అపజయాలు చూశాను. కెరీర్ స్టార్టింగ్‌లో హీరోయిన్గా ఈ స్థాయికి వస్తానని ఊహించలేదు. ఈ ప్రయాణం ఆనందకరమైన ఆశ్చర్యంతో సాగుతోంది. ప్రేక్షకులు ఎప్పుడూ నన్ను నేను స్పెషల్‌గా ఫీలయ్యేలా చేస్తున్నారు. ► నటిగా ఉండడం వలన అత్యంత చెత్త విషయం ఏంటంటే.. ఎందులోనూ నిజాయితీ ఉండదు. నటన అంటేనే అబద్ధం కదా. ఇక్కడ మీకో విషయం చెప్పాలనిపిస్తోంది.. నా పేరు త్రిష కదా. స్నేహితులందరూ నాకు పెట్టిన నిక్ నేమ్ ఏంటో తెలుసా? ‘ట్రాష్’ (తెలుగులో ‘చెత్త’). చాలా చెత్తగా ఉంది కదూ!! ► అలసట ఎక్కువైతే ఉపశమనం కోసం విహార యాత్రకు వెళతా. పని ఒత్తిడి కావొచ్చు.. ఆరోగ్యం బాగోనప్పుడు కావొచ్చు.. ట్రావెలింగ్‌కి వెళితే సెట్ రైట్ అవుతా. న్యూయార్క్ నాకు బాగా ఇష్టమైన నగరం. ఎప్పుడైనా హాలిడేకు వెళ్లాలనుకుంటే నా ఫస్ట్ చాయిస్ న్యూయార్కే. మరీ ముఖ్యంగా షాపింగ్‌కి అంటే ప్యారిస్. ► పక్కా అయ్యర్ సాప్పాడు (అంటే.. బ్రహ్మణుల భోజనం అని అర్థం) నాకిష్టం. తిండి విషయంలో కంట్రోల్‌గా ఉండడమే నా ఫిట్నెస్ మంత్ర. అంతే గాని.. స్పెషల్ డైట్ అంటూ ఏమీ లేదు (నవ్వుతూ). ► స్కూల్లో టాప్ స్టూడెంట్‌నే. అప్పుడు ఇంగ్లీష్, మ్యాథ్స్ (లెక్కలు) నా ఫేవరెట్ సబ్జెక్ట్స్. స్కూల్ లైఫ్ చాలా హ్యాపీగా గడిచింది. కాలేజీలో అంత ఎంజాయ్ చేయలేదు. ►ఇటీవల చూసిన సినిమాల్లో హిందీ ‘సుల్తాన్’ నచ్చింది. అందులోనూ నాకిష్టమైన నటుడు సల్మాన్‌ఖాన్ సినిమా కావడంతో బాగా నచ్చింది. హీరోయిన్లలో ప్రియాంకా చోప్రా అంటే ఇష్టం. హాలీవుడ్లో లియోనార్డో డికాప్రియో అంటే చచ్చేంత ప్రేమ. ►‘ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?’ అనే ప్రశ్నంటే నాకు అసహ్యం. ఎవరైనా ఆ ప్రశ్న అడిగితే, వెంటనే చిరాకు వస్తుంది. సమాధానం చెప్పాలనిపించదు. విమర్శకులకు పెద్దగా విలువివ్వను. కొందరు గాసిప్స్ గట్రా రాస్తుంటారు. వాళ్లను పట్టించుకోను. -
దీపావళికి కలుస్తా - ధనుష్
‘‘తొలిసారి ద్విపాత్రాభినయం చేశా. అన్ని వర్గాలకూ నచ్చే చిత్రమిది. తమిళంలోలానే తెలుగులో కూడా పాటలు హిట్టవుతాయనే నమ్మకం. ఉంది. మళ్లీ దీపావళికి కలుస్తా’’ అని ధనుష్ అన్నారు. ఆయన హీరోగా ఆర్.ఎస్.దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో రూపొందిన తమిళ చిత్రం ‘కొడి’. త్రిష, అనుపమా పరమేశ్వరన్ హీరోయిన్లు. ఈ చిత్రాన్ని శ్రీమతి జగన్మోహిని సమర్పణలో నిర్మాత సి.హెచ్.సతీశ్ కుమార్ ‘ధర్మయోగి’గా తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. సంతోష్ నారాయణన్ స్వరపరిచిన గీతాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. సి.హెచ్.సతీశ్ కుమార్ మాట్లాడుతూ - ‘‘ధనుష్ చేసిన రెండు పాత్రలు పూర్తి విభిన్నంగా ఉంటాయి. దీపావళి కానుకగా తెలుగులో 500 థియేటర్లలో విడుదల చేయాలనుకుంటున్నాం. నాకు సహకరిస్తున్న నిర్మాత మల్కాపురం శివకుమార్‌కి థాంక్స్’’ అన్నారు. నిర్మాతలు కె.యల్.దామోదర ప్రసాద్, వంశీకృష్ణ, రాజ్ కందుకూరి పాల్గొన్నారు. ఈ చిత్రానికి మాటలు: శశాంక్ వెన్నెలకంటి, పాటలు: రామజోగయ్య శాస్త్రి. -
ధర్మం కోసం యోగి పోరాటం
తమిళంలో స్టార్డమ్ తెచ్చుకున్న కథానాయకుడు ధనుష్ ‘రఘువరన్ బీటెక్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. ఇప్పటివరకూ పలు విభిన్నమైన పాత్రల్లో నటించిన ఆయన తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తోన్న తమిళ చిత్రం ‘కొడి’. త్రిష, అనుపమా పరమేశ్వరన్ కథానాయికలు. ఆర్ఎస్ దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్ పతాకంపై సీహెచ్ సతీష్‌కుమార్ ‘ధర్మయోగి’గా తెలుగులోకి విడుదల చేస్తున్నారు. నిర్మాత మాట్లాడుతూ- ‘‘వైవిధ్యమైన కథాంశం, పవర్ఫుల్ క్యారెక్టరై జేషన్స్తో తెరకెక్కిన చిత్రమిది. రాజకీయ నేపథ్యంలో నడిచే ఈ మూవీ ధనుష్ కెరీర్లో ఓ మైలురాయిగా నిలుస్తుంది. ‘నరసింహ’లో రమ్యకృష్ణ పాత్ర అంత పవర్‌ఫుల్‌గా త్రిష పాత్ర ఉంటుంది. త్వరలో పాటలను, దీపావళికి తెలుగు, తమిళ భాషల్లో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు.