'జయలలిత బయోపిక్లో నటించాలనుంది'
హీరోయిన్గా దశాబ్దన్నర కాలంగా కొనసాగుతున్నా ఇప్పటికీ క్రేజీ ఆఫర్స్తో దూసుకుపోతోంది సీనియర్ హీరోయిన్ త్రిష. మధ్యలో పెళ్లి క్యాన్సిల్ అవ్వటంతో కాస్త తడబడినా ఇప్పుడు తిరిగి ఫాంలోకి వచ్చింది. ముఖ్యంగా లేడి ఓరియంటెడ్ సినిమాల మీద దృష్టి పెడుతున్న ఈ చెన్నై బ్యూటి ఇంట్రస్టింగ్ సినిమాలతో ఆకట్టుకుంటుంది. ఇటీవల విడుదలైన కోడి (తెలుగులో ధర్మయోగి) సినిమాలో నెగెటివ్ రోల్లో మరోసారి తానేంటో ప్రూవ్ చేసుకొని టాప్ రేంజ్కు చేరింది.
ప్రస్తుతం మోహిని సినిమాతో మరోసారి అలరించే ప్రయత్నం చేస్తున్న త్రిష తన మనసులోని కోరికను బయటపెట్టింది. కోడి సినిమాలో పొలిటీషన్ పాత్రలో నటించిన ఈ భామ, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తెరకెక్కిస్తే..,1 అందులో లీడ్ రోల్ నటించాలని భావిస్తుందట. మరి త్రిష కోరికను మన్నించి ఎవరైనా జయలలిత బయోపిక్ను తెరకెక్కిస్తారేమో చూడాలి.