ఆ ప్రశ్న అంటే అసహ్యం!
ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యం కారణంగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే... జయలలిత జీవితకథతో సినిమా తీస్తే? ఎలా ఉంటుందని చెన్నై సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఒకవేళ జయలలిత బయోపిక్ తీస్తే? ఆమె పాత్రలో నేను నటిస్తానంటూ త్రిష ఆసక్తి కనబరుస్తున్నారు. పదిహేనేళ్ల కెరీర్‌లో పలు రకాల పాత్రలు చేశారు త్రిష. ఇటీవల జరిగిన ఓ సమావేశంలో జయలలిత బయోపిక్‌లో నటించాలనుందని చెప్పారు. జయలలితకీ, తనకూ ఓ కామన్ విషయం ఉందంటున్నారు త్రిష. అదేంటంటే...‘‘అప్పట్లో జయలలిత చదువుకున్న చెన్నైలోని చర్చ్ పార్క్ కాన్వెంట్‌లోనే నేనూ చదువుకున్నా’’ అని ఈ చెన్నై బ్యూటీ పేర్కొన్నారు.
► మిస్ చెన్నైగా ఎంపికైనప్పటి నుంచి ఇవాళ విడుదల కాబోయే ‘ధర్మయోగి’ వరకూ కెరీర్‌లో ఒక్క డల్ మొమెంట్ కూడా లేదు. పశ్చాత్తాప పడిన సందర్భాలు అసలు లేవు. ఎన్నో విజయాలు, కొన్ని అపజయాలు చూశాను. కెరీర్ స్టార్టింగ్‌లో హీరోయిన్‌గా ఈ స్థాయికి వస్తానని ఊహించలేదు. ఈ ప్రయాణం ఆనందకరమైన ఆశ్చర్యంతో సాగుతోంది. ప్రేక్షకులు ఎప్పుడూ నన్ను నేను స్పెషల్‌గా ఫీలయ్యేలా చేస్తున్నారు.
► నటిగా ఉండడం వలన అత్యంత చెత్త విషయం ఏంటంటే.. ఎందులోనూ నిజాయితీ ఉండదు. నటన అంటేనే అబద్ధం కదా. ఇక్కడ మీకో విషయం చెప్పాలనిపిస్తోంది.. నా పేరు త్రిష కదా. స్నేహితులందరూ నాకు పెట్టిన నిక్ నేమ్ ఏంటో తెలుసా? ‘ట్రాష్’ (తెలుగులో ‘చెత్త’). చాలా చెత్తగా ఉంది కదూ!!
► అలసట ఎక్కువైతే ఉపశమనం కోసం విహార యాత్రకు వెళతా. పని ఒత్తిడి కావొచ్చు.. ఆరోగ్యం బాగోనప్పుడు కావొచ్చు.. ట్రావెలింగ్‌కి వెళితే సెట్ రైట్ అవుతా. న్యూయార్క్ నాకు బాగా ఇష్టమైన నగరం. ఎప్పుడైనా హాలిడేకు వెళ్లాలనుకుంటే నా ఫస్ట్ చాయిస్ న్యూయార్కే. మరీ ముఖ్యంగా షాపింగ్‌కి అంటే ప్యారిస్.
► పక్కా అయ్యర్ సాప్పాడు (అంటే.. బ్రహ్మణుల భోజనం అని అర్థం) నాకిష్టం. తిండి విషయంలో కంట్రోల్‌గా ఉండడమే నా ఫిట్‌నెస్ మంత్ర. అంతే గాని.. స్పెషల్ డైట్ అంటూ ఏమీ లేదు (నవ్వుతూ).
► స్కూల్‌లో టాప్ స్టూడెంట్‌నే. అప్పుడు ఇంగ్లీష్, మ్యాథ్స్ (లెక్కలు) నా ఫేవరెట్ సబ్జెక్ట్స్. స్కూల్ లైఫ్ చాలా హ్యాపీగా గడిచింది. కాలేజీలో అంత ఎంజాయ్ చేయలేదు.
►ఇటీవల చూసిన సినిమాల్లో హిందీ ‘సుల్తాన్’ నచ్చింది. అందులోనూ నాకిష్టమైన నటుడు సల్మాన్‌ఖాన్ సినిమా కావడంతో బాగా నచ్చింది. హీరోయిన్లలో ప్రియాంకా చోప్రా అంటే ఇష్టం. హాలీవుడ్‌లో లియోనార్డో డికాప్రియో అంటే చచ్చేంత ప్రేమ.
►‘ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు?’ అనే ప్రశ్నంటే నాకు అసహ్యం. ఎవరైనా ఆ ప్రశ్న అడిగితే, వెంటనే చిరాకు వస్తుంది. సమాధానం చెప్పాలనిపించదు. విమర్శకులకు పెద్దగా విలువివ్వను. కొందరు గాసిప్స్ గట్రా రాస్తుంటారు. వాళ్లను పట్టించుకోను.