ధర్మం కోసం యోగి పోరాటం
తమిళంలో స్టార్‌డమ్ తెచ్చుకున్న కథానాయకుడు ధనుష్ ‘రఘువరన్ బీటెక్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకూ దగ్గరయ్యారు. ఇప్పటివరకూ పలు విభిన్నమైన పాత్రల్లో నటించిన ఆయన తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తోన్న తమిళ చిత్రం ‘కొడి’. త్రిష, అనుపమా పరమేశ్వరన్ కథానాయికలు. ఆర్‌ఎస్ దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సీహెచ్ సతీష్‌కుమార్ ‘ధర్మయోగి’గా తెలుగులోకి విడుదల చేస్తున్నారు.
నిర్మాత మాట్లాడుతూ- ‘‘వైవిధ్యమైన కథాంశం, పవర్‌ఫుల్ క్యారెక్టరై జేషన్స్‌తో తెరకెక్కిన చిత్రమిది. రాజకీయ నేపథ్యంలో నడిచే ఈ మూవీ ధనుష్ కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలుస్తుంది. ‘నరసింహ’లో రమ్యకృష్ణ పాత్ర అంత పవర్‌ఫుల్‌గా త్రిష పాత్ర ఉంటుంది. త్వరలో పాటలను, దీపావళికి తెలుగు, తమిళ భాషల్లో సినిమాని విడుదల చేస్తాం’’ అన్నారు.