dharna at Delhi
-
కూటమికి దాడులు ట్రెండ్ అయిపోయింది
-
ఈ బాబు దేశానికి ప్రమాదకరం
-
చంద్రబాబు ఒక్కక్షణం కూడా అధికారంలో కొనసాగే హక్కులేదు..
-
పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలి
న్యూఢిల్లీ: పాత పింఛన్ పథకాన్ని(ఓపీఎస్) పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ, ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో ఆదివారం ‘పెన్షన్ శంఖనాథ్ మహార్యాలీ’ పేరిట భారీ ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 20కిపైగా రాష్ట్రాల నుంచి వేలాది మంది ఉద్యోగులు తరలివచ్చారు. ప్రభుత్వం తీసుకొచి్చన కొత్త పింఛన్ పథకాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రిటైర్మెంట్ తర్వాత తమ జీవితానికి భరోసానిచ్చే పాత పింఛన్ పథకాన్ని పునరుద్ధరించాలని తేల్చిచెప్పారు. జాయింట్ ఫోరం ఫర్ రిస్టోరేషన్ ఆఫ్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్, నేషనల్ జాయింట్ కౌన్సిల్ ఆఫ్ యాక్షన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టినట్లు నిరసనకారులు వెల్లడించారు. 2004 జనవరి 1 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరినవారు కొత్త పింఛన్ పథకాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అలిండియా రైల్వే మెన్స్ ఫెడరేషన్ జాతీయ కనీ్వనర్ శివగోపాల్ మిశ్రా చెప్పారు. -
సీపీఎస్ రద్దుకు నేడు ఢిల్లీలో ధర్నా
పెద్ద ఎత్తున ఢిల్లీ చేరుకున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు సాక్షి, న్యూఢిల్లీ: తమ ప్రయోజనాలకు ప్రతిబంధకంగా మారిన కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ 29 రాష్ట్రాల ప్రభుత్వ ఉద్యోగులు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద గురువారం ధర్నాకు దిగనున్నారు. ధర్నా అనంతరం పార్లమెంటు వరకు ర్యాలీగా వెళ్లనున్నారు. ఈ నిరసన ప్రదర్శనకు తెలంగాణ ఎన్జీవో సంఘం, గెజిటెడ్ ఉద్యోగుల ఫోరం మద్దతు పలికాయి. ధర్నాలో పాల్గొనడానికి రెండు సంఘాల ఆధ్వర్యంలో ఉద్యోగులు ఇప్పటికే పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం సాయంత్రం ఇక్కడి తెలంగాణ భవన్లో టీఎన్జీవో సంఘం గౌరవాధ్య క్షుడు దేవీ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. ఉద్యోగ విరమణ తర్వాత ఉద్యోగుల హక్కు అయిన పెన్షన్ స్వీకరణకు ప్రతిబంధకంగా ఉన్న సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎస్ రద్దుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్రంపై ఒత్తిడి తెస్తామని మంత్రి హరీశ్ రావు, ఎంపీ కవిత తదితరులు మద్దతు పలికారని పేర్కొన్నారు. సమావేశంలో సంఘం అధ్యక్షుడు కారం రవీందర్ ఉద్యోగులు పాల్గొన్నారు.