dhee ante dhee
-
ఆ అబ్బాయితో ఢీ
ఓ అబ్బాయి, అమ్మాయి ఆఫీసులో కలిసి పనిచేస్తూ ఉంటారు. వారిద్దరి మధ్య వృత్తిపరంగా ఓ గొడవ జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ల జీవితాలు ఎలా మారాయి? అనే కథాంశంతో వస్తున్న చిత్రం ‘ఢీ అంటే ఢీ’. శ్రీకాంత్, సోనియామాన్ జంటగా జొన్నలగడ్డ శ్రీనివాసరావు స్వీయదర్శ కత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్లాటినమ్ డిస్క్ వేడుక హైదరాబాద్లో జరిగింది. ఈ సందర్భంగా తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ -‘‘చిన్న వయసులోనే శ్రీకాంత్ వందకు పైగా సినిమాలు చేశారు. ఈ నెల 15న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు’’ అని చెప్పారు. ‘‘చక్రిగారు ఈ సినిమాకు మంచి పాటలు అందించారు. ఇప్పుడు ఆయన లేకపోవడం దురదృష్టకరం’’ అని పరుచూరి వెంకటేశ్వరరావు చెప్పారు. శ్రీకాంత్ మాట్లాడుతూ -‘‘భూపతి కథ చెప్పినప్పుడు శ్రీనివాసరావు గారికి ఈ సినిమా బాగా నచ్చి, ఆయనే నిర్మాతగా మారారు. ఆయన ఎక్కడా రాజీపడకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు’’ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో నటులు పోసాని కృష్ణమురళి, రచయిత చంద్రబోస్ తదితరులు పాల్గొన్నారు. -
'డీ అంటే డీ' ప్లాటినం డిస్క్ వేడుక
-
‘ఢీ అంటే ఢీ’ మూవీ స్టిల్స్
-
శ్రీవారి సేవలో సినీ నటుడు శ్రీకాంత్
సాక్షి, తిరుమల : సినీ నటుడు శ్రీకాంత్, ఊహ తమ కుమార్తె, కుమారులతో కలిసి ఆదివారం స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయం అనంతరం వారు ఆలయానికి వచ్చారు. శ్రీవారు, వకుళమాతను దర్శించుకుని హుండీలో కానుకలు సమర్పించారు. అనంతరం రంగనాయక మండపంలో వారికి అధికారులు లడ్డూ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ హుదూద్ బాధితులకు తెలుగు చిత్ర పరిశ్రమ అండగా నిలిచిందని తెలిపారు. తాను నటించిన ఢీ అంటే ఢీ జనవరిలో విడుదల కానుందని చెప్పారు. నాటు కోడి, జల్సారాయుడు సెట్లో ఉన్నాయని తెలిపారు. రెండు రాష్ట్రాల ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. -
‘ఢీ అంటే ఢీ’లో సోనియామాన్ స్టిల్స్
-
‘ఢీ అంటే ఢీ’ మూవీ స్టిల్స్