మహేష్‌కు తల్లిగా దీపా
సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమాకు సంబంధించి రోజుకు వార్త వినిపిస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 29న సెట్స్ మీదకు వెళ్లనుంది. హీరోయిన్గా రకుల్ ప్రీత్ సింగ్‌ను ఫైనల్ చేయగా మరో కీలక పాత్రకు కోలీవుడ్ నటిని ఎంపిక చేశారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కుతున్న ఈ సినిమాలో తెలుగుతో పాటు తమిళ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ కథలో కీలకమైన హీరో తల్లి పాత్రకు ప్రముఖ కోలీవుడ్ నటిని ఎంపిక చేశారు. ఇటీవల తెలుగు నాట కూడా సంచలన విజయాన్ని నమోదు చేసిన బిచ్చగాడు సినిమాలో హీరో తల్లిగా నటించిన దీపా రామానుజన్, మురుగదాస్ సినిమాలో మహేష్‌కు తల్లిగా కనిపించనుంది. ప్రముఖ తమిళ నటుడు దర్శకుడు ఎస్ జె సూర్య ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు.