'ఆమె నవ్వుకు 100 వాట్ల వెలుగు'
ముంబై : సంగీతప్రియులకు ఎంతో ఇష్టమైన అలనాటి 'దీరే దీరే సాంగ్' న్యూ లాంచింగ్ కార్యక్రమానికి హాజరైన బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కొన్ని ఆసక్తికర విషయాలు ప్రస్తావించాడు. ప్రేమ అనే అంశంతో ముడిపడి ఉన్న ఈ పాటను మీరు ఎవరికి అంకితం చేస్తారని మీడియా వారు అడగడంతో.. నా జీవితంలో అలాంటి వారు ఎవ్వరూ లేవంటూ సమాధానమిచ్చాడు. వెంటనే సోనమ్ కపూర్ గురించి ప్రస్తావిస్తూ..'ఈ పాట చాలా హాట్.. సోనమ్ కూడా చాలా హాట్' అంటూ సెలవిచ్చాడు హృతిక్. ఆమెను కలిసి పనిచేయడం ఇది నాకు రెండోసారి అని తెలిపాడు. ఆమె నవ్వుకు 100 వాట్ల వెలుగుందంటూ చెప్పుకొచ్చాడు. సోనమ్ చాలా ఎనర్జిటిక్.. చాలా తెలివైన వ్యక్తి అంటూ కితాబిచ్చాడు.
బాలీవుడ్ లో ప్రస్తుతం సక్సెస్ బాట పట్టిన 'గ్యాంగ్స్టర్' భామ కంగనా రనౌత్ తో మీ రొమాన్స్, రిలేషన్ గురించి చెప్పడంటూ సినిమా జర్నలిస్టులు ప్రశ్నించడంతో ఒక్కసారిగా హృతిక్ ఆశ్చర్యానికి లోనయ్యాడు. 'ఓరి దేవుడా.. దీనిపై నేనేం చేప్పాలి' అంటూ సమాధానాన్ని దాటవేశాడు. తన తండ్రి గుల్షన్ కుమార్ కు నివాళిగా ఈ పాట ఆయనకు అంకితం చేస్తున్నానని భూషణ్ కుమార్ అన్నాడు. హృతిక్, సోనమ్ లపై దర్శకుడు అహ్మద్ ఖాన్ ఈ పాటను చిత్రీకరించారు.