రెండు గంటలు హైడ్రామా
చలకుర్తి (పెద్దవూర), న్యూస్‌లైన్: ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, డీజీపీ దినేష్‌రెడ్డిల వైఖరిని నిరసిస్తూ శనివారం పెదవూర మండలం చలకుర్తి గ్రామంలో ఇద్దరు యువకు లు సెల్‌టవర్ ఎక్కారు. గ్రామానికి చెందిన ఏనిక సత్యం అలియాస్ తెలంగాణ సత్యం, ఎడారి నరేష్‌లు సెల్‌టవర్‌ను ఎక్కి సీఎం, డీజీపీలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రెండు గంటల పాటు ఉత్కంఠను రేకెత్తించారు.
హైదరాబాద్‌లో సీమాంధ్రుల సభకు అనుమతి నిచ్చి సీఎం, డీజీపీలు పరోక్షంగా ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ మిలియన్ మార్చ్‌కు అనుమతి నివ్వకుండా తెలంగాణవాదులను ఎక్కడికక్కడే నిర్బంధి ంచి అరెస్టులు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు సమైక్య సభకు అనుమతిని వ్వడమే కాకుండా భోజనాలు ఏర్పా టు చేయడం విడ్డూరంగా ఉందని దుయ్యబట్టారు. సీమాంధ్ర సభను అడ్డుకుంటేనే సెల్‌టవర్ దిగుతామని తేల్చిచెప్పారు.
విషయం తెలుసుకున్న పెద్దవూర, హాలియా ఎస్ఐలు ఎండీ నయీముద్దీన్, విజయ్‌ప్రకాష్‌లు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్రామస్తులు, తెలంగాణవాదులు భారీ సంఖ్యలో అక్కడికి చేరారు. సెల్‌టవర్ నుంచి కిందికి దూకి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. గ్రామస్తులు, పోలీసులు వారిని వారించడం తో రెండు గంటల అనంతరం టవర్ దిగారు. కేసులు ఎన్నైనా పెట్టండి.. మా తెలంగాణ రాష్ట్రాన్ని మాకు ఇవ్వ ండి అంటూ ఎస్ఐ కాళ్లు పట్టుకుని వేడుకున్నారు. వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.