Dhirendra
-
మహిళని ఎత్తి అవతలకు విసిరేసిన బౌన్సర్లు..
గ్రేటర్ నోయిడా: బాగేశ్వర్ ధామ్ అధిపతి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి నోయిడాలో నిర్వహించిన "దివ్య దర్బార్"కు భక్తులు భారీగా తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో బ్యారికేడ్లు దాటుకుని వచ్చిన మహిళను అక్కడి బౌన్సర్లు ఎత్తి అవతల పారేశారు. ఈ వీడియో ఇంటర్నెట్లో వైరల్ కావడంతో అక్కడే ఉండి చోద్యం చూస్తోన్న ఒక పోలీసు అధికారిని సస్పెండ్ చేస్తూ నోయిడా పోలీసు శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉత్తరాదిన ధీరేంద్ర కృష్ణ శాస్త్రికి విశేష ఆదరణ ఉంది. ఆయన ఎక్కడైనా ఏదైనా కార్యక్రమం నిర్వహిస్తున్నారంటే భక్తులు అశేష సంఖ్యలో తరలి వస్తుంటారు. అలాగే నోయిడాలో నిర్వహించిన దివ్యదర్బార్ కార్యక్రమానికి కూడా సభాప్రాంగణంలో ఇసుక వేస్తే రాలనంత జనం పోగయ్యారు. నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేయడంలో దారుణంగా విఫలమవడంతో తొక్కిసలాట కూడా జరిగింది. సగం కార్యక్రమం పూర్తైనా అప్పటికింకా భక్తులు సభాస్థలికి వస్తుండడంతో వారిని ఇంటికి వెళ్లి లైవ్ లో కార్యక్రమాన్ని చూడవలసిందిగా వాలంటీర్లు విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉండగా ధీరేంద్ర కృష్ణ ప్రవచనాలు చెబుతున్న సమయంలో ఒక మహిళ బ్యారికేడ్లు దాటుకుని స్టేజి వద్దకు దూసుకుని వెళ్లగా అక్కడ ఉన్న వాలంటీర్లు ఆమెను అలానే ఎత్తి జనంలోకి విసిరేశారు. అక్కడే ఉన్న ఎస్సై రామ శంకర్ వారిని వారించకుండా నిల్చుని చూస్తుండడం వీడియోలో రికార్డయ్యింది. ఈ వీడియో బయటకు పొక్కడంతో సదరు ఎస్సై ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది నోయిడా పోలీసు శాఖ. మహిళ పట్ల అమానుషంగా వ్యవహరించిన వాలంటీర్ పరారీలో ఉండగా పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. धीरेंद्र शास्त्री के दरबार मे धीरेंद्र शास्त्री के बाउंसरों ने कूड़े की तरह लड़की को उठाकर बैरिकेडिंग के पार फेंका#GreaterNoida #BageshwarDhamSarkar #DhirendraKrishnaShastri #TIME8 pic.twitter.com/I71daxELpU — TIME8 (@TIME8News) July 13, 2023 ఇది కూడా చదవండి: సిగ్గు.. సిగ్గు.. చావు వార్తని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి.. -
యూజీసీ చైర్మన్గా ధీరేంద్ర పాల్ సింగ్
న్యూఢిల్లీ: యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) చైర్మన్గా ప్రొఫెసర్ ధీరేంద్ర పాల్ సింగ్ను నియమిస్తూ శుక్రవారం అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆయన ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (నాక్) డైరెక్టర్గా ఉన్నారు. ధీరేంద్ర ఐదేళ్లపాటు యూజీసీ చైర్మన్ పదవిలో కొనసాగుతారని సిబ్బంది, శిక్షణ విభాగం (డీఓపీటీ) తెలిపింది. కాగా, ప్రొఫెసర్ వేద్ ప్రకాశ్ యూజీసీ చైర్మన్గా 2017 ఏప్రిల్లో పదవీ విరమణ పొందినప్పటినుంచి ఆ పదవి ఖాళీగా ఉంది. -
ఆట ఆడింది ఎవరు?
ధీరేంద్ర, పూజిత జంటగా షిరిడిసాయి క్రియేషన్స్ పతాకంపై అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ దర్శకత్వంలో తాడి మనోహర్కుమార్ నిర్మిస్తోన్న ‘డర్టీగేమ్’ గురుపౌర్ణమి సందర్భంగా ప్రారంభమైంది. చిత్ర దర్శకుడు మాట్లాడుతూ -‘‘సస్పెన్స్, రొమాన్స్, కామెడీ అంశాలతో రాజకీయ నేపథ్యంలో సాగే రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ ఇది. డర్టీగేమ్ ఏంటి? అసలు ఈ గేమ్ ఆడింది ఎవరు? రిజల్ట్ ఏంటి? ఎవరు గెలిచారు? ఎవరు ఓడారు? ఈ మిస్టరీ ప్రశ్నలన్నిటికీ చిత్రంలో సమాధానాలు దొరుకుతాయి. సురేశ్, నిర్మాత తాడి మనోహర్లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు’’ అన్నారు. ‘‘సింగిల్ షెడ్యూల్లో సినిమా పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’’ అని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి కథ-మాటలు-పాటలు- కథనం- దర్శకత్వం: అక్కపెద్ది వెంకటేశ్వర శర్మ, సంగీతం: సునీల్ కశ్యప్.