Dholak
-
Video: మోదీ సింగపూర్ పర్యటన.. ఢోలు వాయించిన ప్రధాని
న్యూఢిల్లీ: బ్రూనై పర్యటన ముగించుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం సింగపూర్ చేరుకున్నారు. సింగపూర్‌లో ప్రవాస భారతీయులు మోదీకి నృత్యాలు, సంగీత ప్రదర్శనలతో ఘనస్వాగతం పలికారు. మోదీకి ఓ మహిళ రాఖీ కూడా కట్టింది. ఈ సందర్భంగా అక్కడ బస చేస్తున్న హోటల్ వద్ద మోదీ ఢోలువాయించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.మహారాష్ట్రకు చెందిన జానపద నృత్యం 'లావణి'ని వివిధ మహిళలు ప్రదర్శిస్తుండగా.. ప్రధాని మోదీ ఢోలు వాయించారు. అనంతరం సింగపూర్ ప్రధాని లారె న్స్ వాంగ్, అధ్యక్షుడు థర్మన్ షణ్ముగరత్నం, ఇతర మంత్రులతో భేటీ కానున్నారు.ఇక సింగపూర్ పర్యటనపై మోదీ ట్వీట్ చేశారు. ‘ఇప్పుడే సింగపూర్‌లో ల్యాండ్ అయ్యాను. భారత్-సింగపూర్ స్నేహాన్ని పెంపొందించే లక్ష్యంతో జరిగే వివిధ సమావేశాల కోసం ఎదురు చూస్తున్నాను’ అంటూ పేర్కొన్నారు.VIDEO | PM Modi (@narendramodi) tried his hands at 'dhol' as he received a warm welcome upon arrival at Marina Bay, #Singapore. (Source: Third Party) pic.twitter.com/hY4WAyELFy— Press Trust of India (@PTI_News) September 4, 2024కాగా మోదీ బ్రూనై, సింగపూర్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. రెండు రోజుల ద్వైపాక్షిక పర్యటనలో భాగంగా మంగళవారం బ్రూనై వెళ్లారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధానికి 40 ఏళ్లయిన సందర్భంగా మోదీ ఈ పర్యటన చేపట్టిన విషయం తెలిసిందే. భారత ప్రధాని బ్రూనై వెళ్లడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా బ్రూనై రాజు హాజీ హసనల్ బోల్కియాను మోదీ భేటీ అయ్యారు. ఈ పర్యటనలో ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు జరిగినట్లు భారత విదేశాంగ శాఖ అధికారులు వెల్లడించారు. రెండు దేశాల మధ్య త్వరలోనే నేరుగా విమాన సర్వీసులను ప్రారంభించేందుకు అంగీకారం కుదిరినట్లు తెలిపారు. ఈ ఏడాది చివరి నాటికి చెన్నై నుంచి బ్రూనై రాజధానికి విమాన సర్వీసులు ప్రారంభించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొన్నారు. -
ఢోలక్ ధడ్కన్
ఢోలక్.. దక్కన్ సంప్రదాయపు ధడ్కన్! ఒకప్పుడు హైదరబాదీ లోగిళ్లలో సందడి చేసిన ఈ ఢోలక్ హోరు తగ్గిందిప్పుడు.దావతులన్నీ డీజేలతో మారుమోగుతుంటే చిన్నబుచ్చుకొని మూలన పడింది ఢోలక్. అయినా అడపాదడపా ఆ దరువుతో తన పాటను వినిపిస్తోంది హఫీజా ఆపా. ఆమే ఇప్పుడు ఢోలక్ కే గీత్కి ధడ్కన్! మా నల్లకోడి పోయింది ఏం చేయమంటారు? ఆ కోడి కూర గురించి కలకంటూన్న మా అత్తగారు అంతలోకి అడగనే అడిగారు ‘ఈ పూట వంటేం వండుతున్నావ్ కోడలు పిల్లా?’ అంటూ! మా నల్లకోడి పోయింది ఏం చెప్పమంటారు? జొన్నరొట్టె.. గోంగూర’ అని చెప్పనా?’అంటూ ఓ కోడలు పిల్ల బాధపడుతోంది. ఫుల్లుగా మందుకొట్టి బజార్లో తూలుతుంటే పోలీసులు పట్టుకొని మత్తు వదలకొట్టిరి.. రాత్రంతా స్టేషన్లో గడిపి పొద్దున్నే ఇంటికెళ్లితే గిన్నెలు గంటెలు విసిరి పెళ్లాం స్వాగతం పలికే అంటూ ఓ తాగుబోతుగోడు వెళ్లబోసుకుంటున్నాడు.అలాగే ఓ పెళ్లికొడుకు పెళ్లికూతురిని పొగడడం, చుట్టుపక్కల వాళ్లు ఒకరి మీద ఒకరు విసుర్లు విసురుకోవడం ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇవి మాటలు కావు.. దక్కనీ సంగీతం. హైదరాబాద్‌కే ప్రత్యేకమైన ఉర్దూ జానపదాలు. జనసామాన్యంలో సింపుల్‌గా ఇవి ఢోలక్ కే గీత్‌గా స్థిరపడిపోయాయి. ఏ ఇంట్లో ఏ శుభకార్యమైనా ఢోలక్ కే గీత్తోనే ప్రారంభం కావాలని అనేంత అసామాన్య ఆదరణను సంపాదించాయి. అయితే.. ఇప్పుడు ఇవి వినిపించకుండా పోయే పరిస్థితి ఏర్పడుతోంది. ఢోలక్ కే గీత్ ఆలపిస్తున్న హఫీజా .. ఢోలక్ బజాయిస్తూ .. ఆ జనపదాలను ఆలపిస్తూ వాటి ప్రాణం నిలపాలని ప్రయత్నిస్తున్న చివరితరం కళాకారిణి. ఆమె గురించి.. హైదరాబాద్, యాకుత్‌పురాలో పుట్టిపెరిగిన హఫీజా చిన్నప్పుడే ఢోలక్ కే గీత్ పట్ల ఆకర్షితురాలైంది. ఆమెకు ఎనిమిదేళ్లున్నప్పుడు వాళ్లింటి దగ్గరున్న ఓ రిటైర్డ్ పోలీస్ ఈ ఢోలక్ కే గీత్ పాడేవాడు. రోజూ వాళ్లింటికి వెళ్లి ఆ పాటలను వినేది. క్రమంగా ఆ ఆసక్తి ఆ పాటలను నేర్చుకోవాలనే పట్టుదలగా మారింది. అది గమనించిన ఆ రిటైర్డ్ పోలీస్ ఆ దక్కనీ సంప్రదాయ సంగీతం నేర్పించాడు. డోలక్తో సహా. కూతురు ఆరాటం గమనించి హఫీజా తల్లిదండ్రులు మహ్మద్ వాహెద్ అలీ, లాల్‌బీ కూడా అభ్యంతరం చెప్పలేదు. ప్రోత్సహించారు. హఫీజాకు ఇద్దరు అక్కలు, ఒక అన్న, ఒక తమ్ముడు. ఢోలక్ కే గీత్ ఈమెకు వినిపించినంత ఇష్టంగా మిగిలిన నలుగురికీ వినిపించలేదు. అందుకే ఆ ఇంటి నుంచి హఫీజా ఒక్కతే గాయనిగా మారింది. తొలుత బంధువుల ఇళ్లల్లో శుభకార్యాలకు గీతాలను ఆలపించేది. తర్వాత్తర్వాత ఎవరు ఆహ్వానించినా ఢోలక్తో వెళ్లి ఆనందంగా పాటలు పాడి వచ్చేది. ‘ఇది ఒక కళ అని కూడా తెలియని వయసు అది. ఎవరు పాడమంటారా అని ఎదురుచేసేదాన్ని. పాడు అంటే చాలు ఢోలక్ మోగేది.. నా గొంతు పాడేది. శుభకార్యం జరుపుకుంటున్న ఇల్లుగల వాళ్లు డబ్బు చేతిలో పెడుతుంటే కొత్తలో చిత్రంగా అనిపించేది. కాని తర్వాత తర్వాత గర్వంగా ఉండేది నా ఖర్చులకు నేను సంపాదించుకుంటున్నానని. అక్షరం ముక్క రాని నాకు ఆ కళ అన్నం పెడుతోంది అమ్మలా అని అనుకునేదాన్ని. ఢోలక్.. గీత్ సబ్ బంద్ పధ్నాలుగు, పదిహేనేళ్ల వయసులో హఫీజాకు పెళ్లయింది కర్నూల్‌కు చెందిన మహ్మద్ అయాజ్ పాషాతో. పెళ్లయిన మర్నాడే హఫీజాతో చెప్పాడు అతను ‘ఢోలక్.. గీత్ సబ్ బంద్ ఈ ఇంట్లో’ అని. కష్టంగానే భర్త ఆజ్ఞను అమలు చేసింది ఆమె. ముగ్గురు పిల్లలు పుట్టారు. కర్నూలు కన్నా హైదరాబాదులోనే బతుకుదెరువు ఎక్కువని హఫీజా మళ్లీ తను పుట్టిన ఊరుకే చేరింది తన కుటుంబంతో. హైదరాబాద్‌లో ఏ మూల ఢోలక్ కే గీత్ వినిపించినా ప్రాణం కొట్టుకునేది. బలవంతంగా మనసును వేరే పనుల మీదకు మళ్లించుకునేది. అలా దాదాపు పదిహేనేళ్లు ఆ సంగీతానికి దూరంగా ఉంది హఫీజా. ఆ క్రమంలోనే అనారోగ్యంతో భర్త చనిపోవడంతో ఇల్లు నడపాల్సిన బాధ్యత ఆమె మీదే పడింది. కుటుంబ పోషణకు పనులు చేసుకుంటూనే మళ్లీ ఢోలక్‌ను పట్టుకుంది హఫీజా. అప్పటికే డీజేలు, ఆధునిక సంగీతహోరులో ఢోలక్ సవ్వడి సన్నబడుతూ వస్తోంది. కాని అరవైఏళ్ల కిందటి పాటలు, బాణీలతో హైదరాబాద్ ముంగిళ్లను మారుమోగిస్తూ పూర్వపు కళను తీసుకురావడం మొదలుపెట్టింది హఫీజా. ఇంతలోకే ఆమె జీవితంలో మరో రెండు విషాదాలు. తన ఇద్దరు కొడుకులూ చనిపోయారు. ఆ దుఃఖాన్నీ ఢోలక్ కే గీత్తోనే మరిపించుకునే ప్రయత్నం చేసింది. సైరాబాను, సుల్తానా అనే తనకు తెలిసిన ఇద్దరు మహిళలకు ఈ పాటలు నేర్పి ముగ్గురూ ఓ బృందంగా డోలక్ కే గీత్‌ను పాపులర్ చేసింది. హైదరాబాద్‌లోనే కాదు.. నిశ్చితార్థం, మెహందీ, పెళ్లి, పురుడు, బారసాల, బర్త్డేలతోపాటు ఈ ఢోలక్ కే గీత్‌కు సినిమా ఆడియో ఫంక్షన్స్ కూడా వేదిక అవుతున్నాయంటే ఆ దక్కనీ కళకున్న డిమాండ్ ఎంతో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి వింటే ఇట్టే పట్టేసే ఆమె అరవై ఏళ్ల కిందటి పాటలను అక్షరం పొల్లుపోకుండా పాడుతుంది. పెళ్లిళ్లలో వధూవరుల గుణగణాలను బట్టి అప్పటికప్పుడే ఆశువుగా పాటలను పాడేస్తుంది. ఇలా ఏ ఫంక్షన్ అయినా దానికి తగినట్టుగా ఆమె పాటలు కట్టి ఢోలక్‌ను బజాయించిన సందర్భాలెన్నో! ‘ఢోలక్ కే గీత్ మాతోనే ఆగిపోవద్దన్నదే నా ఆశ’ అంటుంది హఫీజా. ‘మా చిన్నప్పుడైతే బాగా ధనవంతులే ఈ గానా బజానా పెట్టేవారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కూడా మమ్మల్ని పిలుస్తున్నారు. ఒక్క హైదరాబాద్‌లోనే కాదు విదేశాల్లో ఉన్న హైదరాబాదీయులూ అక్కడ మా కచేరీలు పెట్టిస్తున్నారు. సంతోషమే కాని ఈ పాటలను నేర్చుకోవడానికి కొత్త తరం ఎవరూ ముందుకు రావట్లేదు. అంత ఇంట్రెస్ట్ చూపించట్లేదు. మాతో ఉన్న వాళ్లు కూడా ఏదో గొంతు కలుపుతారు కాని ఢోలక్ వాయించరు. నేర్చుకోలేదు. సమస్య ఎక్కడంటే దీన్ని డబ్బు సంపాదన మార్గంగా చూస్తున్నారు కాని కళగా చూడట్లేదు. ఇది నేర్చుకుంటే ఫాయిదా ఏంటీ అనుకుంటారు. కళ ఆత్మానందాన్నిస్తుంది. దానికి మించిన ఫాయిదా ఏం ఉంటది? ఈ విషయమే చెప్పి నేర్పించాలని చూస్తున్నాను కాని ఎవరూ ఇంట్రెస్ట్ చూపట్లేదు’ అని నిరాశపడుతోంది హఫీజా. -
ఎవరు డోలక్? బుల్ బుల్ ఏమిటి?
ఓస్! అంతేకదా! అయితే కొట్టండి డోలక్, వాయించండి బుల్ బుల్ అన్నాడు. ‘‘ ఆ గోల దేనికిరా యీ అర్థరాత్రి’’ అని గద్దించాడు ఒకాయన. ‘‘గోలేంది బాబూ! అవి లేందే నాక్కాలు లెగవదు’’ అన్నాడు జీన్సు కుర్రాడు. అక్షర తూణీరం రోడ్డు వారగా సాము గరిడీల సందడి ఆరంభై మెంది. నేలకు పాతి న కట్టుకొయ్యకు ముంగిస కట్టేసి ఉంది. దాని పక్కనే మూసేసిన పాము బుట్ట ఉంది. మూటల్లోంచి సరుకు సరంజామా తీసి వివరంగా పరుస్తున్నారు. డోలక్ నిర్విరామంగా మోగుతోంది. బాగా నలిగిన హిందీ పాట వరస బుల్ బుల్ మీద వినిపిస్తోంది. చేతికి కట్టుకున్న గజ్జెల చెండు లయబద్ధంగా మోగుతూ డోలక్ దరు వుకి కొత్త రంగు వేస్తోంది. రెండేసి గడముక్కల్ని కత్తెరవా టుగా అమర్చి, ఆ రెంటినీ దూరం దూరంగా నిలబెట్టి వాటి మధ్య తీగె బిగిస్తున్నారు. చోద్యం చూడ్డానికి జనం మూగుతున్నారు. అయిదారేళ్ల పిల్ల బనీను, నిక్కరు వేసుకుని పిల్లిమొగ్గలు వేస్తూ జనాన్ని ఆకడుతోంది. రంగురంగుల సెల్వార్ కమీజ్ వేసుకున్న గడసాని ఓ పక్కగా నిలబడి మొహానికి పౌడర్ మెత్తుతోంది. అక్కడ కూచున్న దాదా చాయ్ తాగి బీడీ కాల్చడం పూర్తి చేసి రంగంలోకి దిగాడు. జులపాల జుట్టు, సైకిల్ కట్టు, అడ్డచారల బనీను, దవడలు జారిపోయినా ముఖంలో జాలువారు తున్న ఉత్సాహం- డమరు కాన్ని శక్తి కొద్దీ వాయించి, ఏదో జరిగిపోతోందన్న భ్రమ కలిగించాడు. జనం పోగవుతున్నారు. బుట్ట లోంచి పాముని తీసి మెడలో వేసుకుని దాని పడ గని విప్పిస్తూ, బుసకొట్టిస్తూ చుట్టూ తిరిగాడు దాదా. చూస్తుండగా అక్కడ కొంత చోటు ఆక్రమిం చి జనాన్ని గుండ్రంగా నిలబెట్టాడు. డోలక్ మోగు తోంది. బుల్ బుల్ పాత వరసలనే పాడుతోంది. ఉన్నట్టుండి గడసాని డ్యాన్స్ మొదలెట్టింది. బుల్ బుల్ నాగిన్ మ్యూజిక్ వినిపి స్తుంటే డోలక్ గజ్జెల దరువు వేస్తోంది. స్పీడు పెరిగే సరికి జనం యీలలు వేస్తూ, కాళ్లూ చేతులూ కదుపుతున్నారు. జనం దడి కట్టారు. దడి మందం నాలుగు వరసలకి పెరిగింది. దాదా డమరుకం వాయిస్తూ చేయబోయే అద్భుతాలను ఏకరువు పెడుతున్నాడు. పాము ముంగిసల పోరాటం చూడకుండా వెళితే పాపం అన్నాడు. శాపం చుట్టుకుంటుందన్నాడు. అక్కడ గారడీ ముఠా అంతా కలసి అయిదుగురు లేరు గాని చాలామంది ఉన్నట్టుగా ఉంది. ఉన్నట్టుండి ఒక కుర్రాడు ముందుకు వచ్చాడు. పాలిపోయిన జీన్సు, తెగ మాసిన టీషర్టు, గట్టిగా దువ్వి ముడేసిన పిలక జుట్టు, చివికిపోయిన కాన్వాస్ బూట్లు, రెండు చేతుల్లో కర్రపుల్లలున్నాయి. వాటి చివరల వస్త్రాల పీలికలు చుట్టి ఉన్నాయి. వాటిని కాసేపు గాలిలో తిప్పి ఆర్భాటం చేశాడు. పుల్లల కొసలని కిరసనాయిల్లో ముంచి, వెలిగించి కాగడాల తో విన్యాసం చేశాడు. కిరసనాయిలు పుక్కిట నిండా తీసుకున్నాడు. డోలక్, డమరుకం, బుల్ బుల్ జోరుగా మోగుతున్నాయి. జీన్సు కుర్రాడు ఆకాశం వైపు తిరిగి రెండు కాగడాలను ఒకచోట నిలిపి ఆ మంట మీదకి నోట్లో కిరసనాయిల్ని బలంగా ఉమిశాడు. ఆ శక్తికి అది అగ్నిగోళంలా గాలిలోకి వెళ్లింది. జనం హాహా కారాలు, చప్పట్లు, ఈలలు... వీధి వీధి అంతా పైకి చూసింది. జీన్సుకు ర్రాడు వెలుగు తున్న కాగడాలతో గెడసాని కోసం కట్టిన తీగెమీంచి దూకాడు. అలా గాలిలోకి తేలి గాలి బొమ్మలా అవతల దిగాడు. ఆశ్చర్యపోయారు. ఆలోచన చేశారు, జీన్సు కుర్రాణ్ణి జీప్‌లో తీసుకెళ్లారు. బోలెడంత బిర్యానీ పెట్టించారు. బాగా చీకటి పడ్డాక మరోచోటికి తీసు కెళ్లారు. అక్కడ గాజుపెంకులు గుచ్చిన గోడను చూపించారు. అది అతను దూకిన తీగె ఎత్తు కంటె తక్కువే. అవతలికి దూకు ఆ తర్వాత నీకోపని చెబుతాం అన్నారు, తీసుకెళ్లిన వాళ్లు. ఓస్! అంతే కదా! అయితే కొట్టండి డోలక్, వాయించండి బుల్ బుల్ అన్నాడు. ‘‘ ఆ గోల దేనికిరా యీ అర్థరాత్రి’’ అని గద్దించాడు ఒకాయన. ‘‘గోలేంది బాబూ! అవి లేందే నాక్కాలు లెగవదు’’ అన్నాడు జీన్సు కుర్రాడు. ‘ఓరి నీయబ్బ...’అని ఒక్కసారి వాళ్లంతా నీరు కారిపోయారు. జీన్సు కుర్రాడు ఆ చీకట్లో నడు చుకుంటూ దాదా సన్నిధికి, డోలక్ బుల్బుల్ చప్పు డుని వెతుక్కుంటూ వెళ్లిపోయాడు. దాదా ఎవరు? పాము, ముంగిస తలపడ్డాయా? గడసాని పడకుం డా నడిచిందా? ఇదంతా ఒక పజిల్. - శ్రీరమణ 1960లలో బాపురమణల ఆధ్వర్యంలో నడిచిన జ్యోతి మంత్లీ సంపాదక బాధ్యతలని నండూరి రామమోహనరావు తీసుకున్నారు. జ్యోతిలో సవ్యసాచి పేరుతో ‘అక్షర తూణీరం’ శీర్షిక నడిపారు ఎన్నార్. మా పల్లెటూళ్లో కాలక్షేపం చేస్తున్న నన్ను నలభై ఏళ్లనాడు కాలమిస్ట్‌గా పత్రికలకు పరిచయం చేసిన నండూరికి నివాళిగా యీ అక్షర తూణీరం. - శ్రీ