Dhurandhar 2 Movie
-
దురంధర్ నటుడికి జాక్‌పాట్.. జూనియర్ ఎన్టీఆర్ మూవీలో ఛాన్స్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్-2. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ మూవీ రిలీజైన వారం రోజుల్లోనే వెయ్యి కోట్ల వసూళ్లు సాధించింది. తాజాగా మరో ఘనతను సొంతం చేసుకుంది. కేవలం 15 రోజుల్లోనే రూ.1501 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. కేవలం మూడు నెలల్లోనే సీక్వెల్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో దురంధర్ టీమ్‌కు ఎక్కడా లేని క్రేజ్‌ను తెచ్చిపెడుతోంది. ఈ సినిమాలో నటించిన వారికి ఆదరణ ఓ రేంజ్లో వస్తోంది. తాజాగా ఓ దురంధర్ నటుడికి ఏకంగా టాలీవుడ్ ఛాన్స్ తీసుకొచ్చింది దురంధర్. ఈ మూవీలో నటించిన బిమల్ ఒబెరాయ్ తాజాగా జూనియర్ ఎన్టీఆర్ సరసన ఛాన్స్ కొట్టేశారు. ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో వస్తోన్న డ్రాగన్ చిత్రంలో ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. టోవినో థామస్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో బిమల్‌కు అవకాశమొచ్చినట్లు తెలుస్తోంది.కాగా.. బిమల్ ఓబెరాయ్ దురంధర్‌లో బలోచ్ యునైటెడ్ ఫోర్స్ లీడర్ శ్రీరాని బలోచ్ పాత్రలో మెప్పించారు. ఈ పాత్ర అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. సీరియస్ అండ్ ఇంటెన్స్ పర్ఫార్మెన్స్తో బిమల్ ఆడియన్స్‌ను అలరించారు. తాజాగా టాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఎన్టీఆర్ మూవీలో ఎలాంటి రోల్ చేస్తారన్న విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. #Dhurandhar fame #BimalOberoi aka #ShiraniBaloch has been roped in by #PrashanthNeel for #Dragon. 🔥#NTRpic.twitter.com/kqkYsg3myv— Milagro Movies (@MilagroMovies) April 3, 2026 -
15 రోజుల్లో దురంధర్-2 కలెక్షన్స్.. అఫీషియల్ ప్రకటన
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ దురంధర్-2. గతేడాది రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మార్చి 19న విడుదలైదన ఈ మూవీ వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. తాజాగా ఈ మూవీ మరో మైలురాయిని చేరుకుంది. రిలీజైన 15 రోజుల్లోనే రూ.1501 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ విషయాన్ని మేకర్స్ అఫీషియల్‌గా ప్రకటించారు.తొలివారంలో వెయ్యి కోట్లు దాటిన దురంధర్ ది రివెంజ్.. రెండోవారంలో కాస్తా జోరు తగ్గింది. ఈ వసూళ్లతో ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సినిమా కంటే ముందు దంగల్, బాహుబలి-2, పుష్ప-2 తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇప్పటి వరకు భారతదేశంలో రూ. 937.32 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది.ఆదిత్య ధర్ డైరెక్షన్లో ఈ మూవీని తెరకెక్కించారు. పాకిస్తాన్‌కు వెళ్లిన ఇండియన్ స్పై జీవితం ఆధారంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ భారతీయ గూఢచారి హంజా అలీ మజారి పాత్రలో నటించారు. ఇందులో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, డానిష్ పాండోర్, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించారు.Duniya bhar mein goonj rahi hai naye Hindustan ki dahaad. 🔥Day-wise break-up | IndiaWeek 1: ₹690 Cr*DAY 9: ₹42 Cr*DAY 10: ₹64 Cr*DAY 11: ₹71 Cr*DAY 12: ₹26 Cr*DAY 13: ₹28 Cr*DAY 14: ₹21 Cr*Day 15: ₹19 Cr*India: ₹961 Cr*Worldwide GBOC (2 weeks)India:… pic.twitter.com/jF0uS998P1— Jio Studios (@jiostudios) April 3, 2026 -
దురంధర్-2 కోసం స్టార్ హీరో త్యాగం..!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ తాజా చిత్రాన్ని మేకర్స్ వాయిదా వేశారు. ఈనెల 10న రిలీజ్ కావాల్సిన హారర్-కామెడీ చిత్రం భూత్ బంగ్లాను పోస్ట్‌పోన్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీ పెయిడ్ ప్రీమియర్స్ ఈ నెల 16 నుంచి ప్రారంభమవుతాయని వెల్లడించారు.ప్రస్తుతం దురంధర్ ది రివెంజ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. అందుకే భూత్ బంగ్లాను ఓ వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నామని నిర్మాతలు ప్రకటించారు. డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల నుంచి వచ్చిన అభ్యర్థనల వల్లే వారం రోజులు వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాత ఏక్తా కపూర్ అధికారిక ప్రకటనలో తెలిపారు. ప్రేక్షకులకు మెరుగైన సినిమా అనుభవాన్ని అందించడం.. థియేటర్లలో సినిమా విజయవంతంగా రన్ అయ్యేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆమె అన్నారు. 'ధురందర్: ది రివెంజ్' చిత్రానికి మరింత సమయాన్ని ఇవ్వడం వల్ల పరిశ్రమకు ప్రయోజనం చేకూరుతుందని ఎగ్జిబిటర్లు భావించారు.కాగా.. భూత్ బంగ్లా చిత్రాన్ని బాలాజీ మోషన్ పిక్చర్స్, కేప్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్లపై నిర్మించారు. ఈ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా.. అక్షయ్ కుమార్, శోభా కపూర్, ఏక్తా ఆర్ కపూర్ నిర్మించారు. ఈ చిత్రంలో వామికా గబ్బి, పరేష్ రావల్, టబు, రాజ్‌పాల్ యాదవ్, జిషు సేన్‌గుప్తా, మిథిలా పాల్కర్ కీలక పాత్రల్లో నటించారు. -
దురంధర్-2 కలెక్షన్స్.. తెలుగు సినిమాల రికార్డ్స్ కష్టమే..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ కలెక్షన్స్ పరంగా దూసుకెళ్తోంది. మొదటి వారంలో వెయ్యి కోట్లు దాటేసిన ఈ సినిమా.. ఆ తర్వాత తగ్గుతూ వస్తోంది. ఈ మూవీ రిలీజై రెండు వారాలు పూర్తయింది. ఈ సినిమా 14 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 1435 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.ఈ లెక్కన చూస్తే రెండో వారంలో వసూళ్ల పరందా దురంధర్-2 వెనకపడినట్లే తెలుస్తోంది. దురంధర్ కేవలం హిందీలో రిలీజైనప్పటికీ రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ సీక్వెల్ మూవీ హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ చేశారు. అయినప్పటికీ వసూళ్ల పరంగా కాస్తా జోరు తగ్గినట్లు కనిపిస్తోంది. ఇప్పుడున్న కలెక్షన్స్ ప్రకారమైతే రూ.1500 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.వసూళ్లు ఇలాగే కొనసాగితే పుష్ప-2, బాహుబలి-2 లాంటి టాలీవుడ్ చిత్రాల రికార్డ్స్ దాటడం కష్టంగానే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ కానుండడం దురంధర్ వసూళ్లపై ప్రభావం పడనుంది. ఈ సీక్వెల్‌గా ఆడియన్స్‌లో క్రేజ్ ఉన్నప్పటికీ రెండో వారానికి వచ్చేసరికి వసూళ్లు ఆశించిన స్థాయిలో రావడం లేదు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ స్పై థ్రిల్లర్‌లో సారా అర్జున్ హీరోయిన్గా మెప్పించింది. ఆర్ మాధవన్, సంజయ్ దత్ కీలక పాత్రలు పోషించారు. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ మార్చి 19న థియేటర్లలో రిలీజైంది. -
థియేటర్లలోకి ఏడున్నర గంటల 'ధురంధర్'
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 'ధురంధర్' హవా నడుస్తోంది. దక్షిణాదిలోని తెలుగు, తమిళంలోనూ ఈ చిత్రానికి మంచి వసూళ్లు దక్కుతున్నాయి. ఇదలా ఉండగానే మూవీ టీమ్ మరో సరికొత్త ప్రయోగం చేసేందుకు సిద్ధమైంది. రెండు భాగాలని కలిపి ఒక్కటిగా చేసి ఆ సినిమాని థియేటర్లలోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఈ మేరకు ఆ విషయం వైరల్ అవుతోంది.(ఇదీ చదవండి: దురంధర్-2 కలెక్షన్స్.. తెలుగులోనే ఎందుకిలా?)దాదాపు మూడున్నర గంటల నిడివితో 'ధురంధర్' తొలి భాగం గతేడాది డిసెంబరులో రిలీజైంది. రూ.1300 కోట్ల మేర కలెక్షన్ సొంతం చేసుకుంది. అప్పుడే సీక్వెల్ ఎప్పుడొస్తుందో వెల్లడించారు. చెప్పినట్లుగానే రెండు వారాల క్రితం ధురంధర్ 2ని థియేటర్లలోకి తీసుకొచ్చారు. ఇది 3 గంటల 50 నిమిషాల నిడివితో రిలీజ్ చేశారు. దీనికి బీభత్సమైన హైప్ ఉన్నప్పటికీ వాటిని అందుకుని, సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. చూస్తుంటే బాహుబలి 2, పుష్ప 2 నెలకొల్పిన ఘనతలు గల్లంతు అయిపోయేలానే ఉన్నాయి.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)ఇదలా ఉండగానే ఇప్పుడు డైరెక్టర్స్ కట్ పేరిట 'ధురంధర్' చిత్రాన్ని ఏడున్నర గంటల నిడివితో థియేటర్లలోకి తీసుకురాబోతున్నారనే న్యూస్ బయటకొచ్చింది. మంగళవారం(మార్చి 31)న ఈ మేరకు సదరు భారీ నిడివి మూవీకి సెన్సార్ జరిగినట్లు ఓ ఫొటో వైరల్ అవుతోంది. ఏప్రిల్ 5 నుంచి దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే ఈ సినిమా అందుబాటులోకి రానుందని తెలుస్తోంది. ఐమాక్స్, DC, HDR, EPIQ వంటి ప్రీమియం స్క్రీన్లలో మాత్రమే ప్రదర్శించే అవకాశం ఉందని తెలుస్తోంది.సుధీర్ఘ నిడివితో రాబోతున్న ఈ సినిమాలో దర్శకుడు తీసిన ప్రతి సీన్ ఉండనుందని, సెన్సార్‌లో తొలగించిన కొన్ని అదనపు సన్నివేశాలు కూడా ఉండనున్నట్లు సమాచారం. నేడో రేపో నిర్మాణ సంస్థ నుంచి ఈ మేరకు ప్రకటన వచ్చే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. ఒకవేళ ఏడున్నర గంటల నిడివితో రిలీజైనా కనీసం మూడు ఇంటర్వెల్స్ అయినా ఇవ్వాల్సి ఉంటుంది. ప్రేక్షకులు కూడా అంత ఓపికతో చూస్తారా అనేది అందరినీ తొలిచేస్తున్న ప్రశ్న. ఒకవేళ ఇది నిజమై, థియేటర్లలోకి వస్తే మాత్రం అత్యంత సుధీర్ఘ నిడివితో వచ్చే చిత్రంగా రికార్డ్ సృష్టించడం గ్యారంటీ.(ఇదీ చదవండి: 9 ఏళ్ల ‘బాహుబలి’ రికార్డు బ్రేక్ చేసిన ‘ధురంధర్’) -
కీర్తి ‘శాశ్వత్’ o చేసిన ధురంధర్!
నటీనటులైనా, దర్శకుడైనా, సాంకేతిక నిపుణులైనా... చిత్ర పరిశ్రమలో ఏ కళాకారుడికైనా ఒక పెద్ద విజయం కుదుపుని ఇస్తుంది కెరీర్‌కు మలుపును అందిస్తుంది. రాత్రికి రాత్రే తలరాతలను మార్చేయగల శక్తి ఒక్క సినిమా విజయానికి ఉంది. అదీ బాలీవుడ్ రికార్డులను బద్దలుకొట్టిన స్వదేశీ స్పై థ్రిల్లర్ ’ధురందర్’ లాంటి సినిమా అయితే ఇక చెప్పేదేముంది? సంచలన విజయం సాధించిన ఈ సినిమా దానితో సంబంధం ఉన్న ప్రతీ ఒక్కరి కెరీర్‌ను అనూహ్యమైన కుదుపుని అందించింది.వీరందరిలో, ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం రెండు భాగాలలకూ మ్యూజిక్‌ని ఇచ్చిన సంగీత దర్శకుడు శాశ్వత్ సచ్దేవ్ ముందున్నారు. దర్శకుడి తర్వాత ఆయన పేరే ఇప్పుడు భారతీయ సినిమా రంగంలో అతిపెద్ద చర్చనీయాంశంగా మారింది. ధురందర్ ఇటీవల విడుదలైన దాని సీక్వెల్ విజయాలకు ఎన్నో ముఖ్య కారణాలు ఉన్నప్పటికీ, ఈ వర్ధమాన సంగీతకారుడు అందించిన అద్భుతమైన నేపథ్య సంగీతం రెండు భాగాలకూ ప్రధాన ఆకర్షణగా నిలిచి, వాటిని బ్లాక్బస్టర్లుగా మార్చడంలో కీలక పాత్ర పోషించింది.గతంలో ఆదిత్య ధర్‌తో కలిసి ’ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ చిత్రానికి కూడా శాశ్వత్ పనిచేశారు తన అద్భుతమైన స్వరకల్పనకు ఎన్నో ప్రశంసలు అందుకున్నారు. ఆయన జాతీయ ఫిల్మ్‌ఫేర్ అవార్డులు రెండింటినీ గెలుచుకుని బాలీవుడ్‌కు ఒక బలమైన సందేశాన్ని ఇచ్చారు. ధురందర్ చిత్రంతో, తాను రాబోయే సంవత్సరాల్లో మరిన్ని సంచలనాలు సృష్టిస్తానని ఆయన మరోసారి చాటి చెప్పారు. «అత్యంత ఉత్కంఠ భరిత సన్నివేశాల్లో అనూహ్యంగా పాత బాలీవుడ్ పాటల్ని జోడిస్తూ దురందర్ చిత్రాల్లో.. శాశ్వత్ చేసిన కొత్త ప్రయోగం సూపర్ సక్సెస్ అయింది. సినిమా కథనంతో సజావుగా కలిసిపోయిన ఒకనాటి మ్యూజికల్ హిట్స్ ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. ఆయన వ్యూహం అద్భుతంగా ఫలించింది.కేవలం నేపథ్య సంగీతంలోనే కాకుండా, ప్రేక్షకులకు పాత జ్ఞాపకాలను గుర్తుచేసే ఐదు రెట్రో పాటలతో కథనాన్ని మరింత ఉత్కంఠభరితంగా మార్చినప్పుడు, క్లాసిక్ పాటలపై ఆయనకున్న అభిరుచి మరోసారి స్పష్టమైంది. దివంగత నుస్రత్ ఫతే అలీ ఖాన్ పాట దిల్ పే జఖ్మ్ ఖతే హై (1977), దిల్ (1990) నుంచి హమ్ ప్యార్ కర్నే వాలే (1990), తానేదార్ నుంచి తమ్మా తమ్మా (1990), త్రిదేవ్ నుంచి తిర్చీ టోపీవాలే (1989), అంగారే నుంచి ముజే జిందగీ నే మారా (1986) అలాగే బాజీగర్ (1993) నుంచి...పాటల్ని అద్భుతంగా కలగలిపారు.రణ్వీర్ సింగ్ తన అవార్డ్ విన్నింగ్ పెర్ఫార్మె న్స్ కి మెజారిటీ అవార్డులతో దూరంగా ఉండగా, ఆదిత్య ధర్ ఇప్పుడు కేవలం మూడు నెలల్లో రెండు అద్భుతమైన సినిమాలను అందించినందుకు పాన్–ఇండియా సంచలనంగా మారాడు. అదే విధంగా ప్రస్తుతం శాశ్వత్ అందించిన అద్భుతమైన సంగీతంతో చార్ట్స్‌లో టాప్‌లో నిలిచాడు. ఉత్సాహపరిచే డ్యాన్స్ నంబర్లు, స్టైలిష్ ఇంట్రో పాటలపై ఆధారపడే ఆధునిక సంగీత దర్శకుల్లా కాకుండా ఆయన సంగీతంలో తనదైన ప్రత్యేక శైలితో భిన్నంగా వెళ్లడం, తన సొంత నియమాల ప్రకారం పనిచేయడం ఆయన్ను బాలీవుడ్లో తదుపరి పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా మార్చింది. ఈ నేపధ్యంలో త్వరలోనే దక్షిణాది చిత్రసీమలో అడుగుపెట్టే అవకాశం కూడా ఆయనకు రానున్నట్టు సమాచారం. -
ధురంధర్ 2 కథ నాది.. కాపీ కొట్టారు: కన్నడ దర్శకుడు
పాన్ ఇండియా స్థాయిలో మార్మోగిపోతున్న పేరు ధురంధర్ 2. ఆదిత్య ధర్ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ధురంధర్ లైఫ్‌టైమ్ కలెక్షన్స్‌ను రెండో భాగం ఈపాటికే దాటేసింది. ఒకటీరెండు రోజుల్లో రూ.1500 కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో ధురంధర్ 2 కథ తనదంటూ మీడియా ముందుకు వచ్చాడు కన్నడ దర్శకుడు సంతోష్ కుమార్ ఆర్ఎస్.కష్టపడి కథ రాసుకున్నా..ఆయన మాట్లాడుతూ.. ధురంధర్ 2 మీరంతా చూసే ఉంటారు. ఈ సినిమాకు అంతటా మంచి స్పందన లభిస్తోంది. అయితే ఆ కథ నాది. సినిమా చూసిన తర్వాత నా కథ కాపీ కొట్టారన్న విషయం అర్థమైంది. 2023లోనే ఎంతో కష్టపడి ఈ కథ రాసుకున్నాను. ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను. పెద్ద నటీనటులు ఈ మూవీలో భాగం కావాలంటే బడా సంస్థ అండగా ఉండాలన్నారు. 2023లోనే రిజిస్టర్ చేయించా..అందుకే జీ స్టూడియోస్, టీ సిరీస్, ధర్మ ప్రొడక్షన్స్, సోనీ పిక్చర్స్.. ఇలా అనేక పెద్ద నిర్మాణ సంస్థలను సంప్రదించాను. చాలామందికి నా కథ పంపాను. ఆదిత్య రాయ్ కపూర్‌ని హీరోగా పెట్టి మూవీ తీయాలనుకున్నాను. 2023 నవంబర్లోనే ఈ కథ రిజిస్టర్ కూడా చేయించాను. అందుకు సంబంధించిన సాక్ష్యాలు నా దగ్గరున్నాయి. వీటి ఆధారంగా ధురంధర్ 2 మూవీ యూనిట్‌పై కేసు వేయాలనుకుంటున్నాను.అదే బాధగా ఉందివాళ్లు నా కథను చెడగొట్టారు. నేను వినోదం కోసం కథ రాస్తే దాన్ని రాజకీయ దుర్వినియోగం చేశారు. అదే నాకు మరింత బాధ కలిగిస్తోంది. నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ జరగకూడదు అని ఆవేదన వ్యక్తం చేశాడు. సంతోష్ కుమార్.. క్యాంపస్ క్రాంతి అనే కన్నడ చిత్రంతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ప్రస్తుతం యువన్ రాబిన్‌హుడ్ మూవీ చేస్తున్నాడు.చదవండి: నీ ముఖానికి గోల్డ్ చైన్ వేసుకునేంత సీన్ ఉందా? నటి ఆవేదన -
బాహుబలి-2 రికార్డు బ్రేక్ దూసుకుపోతున్న ధురంధర్
-
దురంధర్-2 కలెక్షన్స్.. తెలుగులోనే ఎందుకిలా?
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈనెల 19న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పటికే దురంధర్ వసూళ్లను క్రాస్ చేసింది. ప్రస్తుతం ఈ సినిమా రూ.1400 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ సీక్వెల్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లో రిలీజ్ కావడంతో రెండు వేల కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాకిస్తాన్‌కు వెళ్లిన ఇండియన్ స్పై జీవితం ఆధారంగా తెరకెక్కించారు.ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల పరంగా దూసుకెళ్తోన్న దురంధర్-2.. తెలుగులో మాత్రం డీలా పడిపోతోంది. తెలుగు డబ్బింగ్ వర్షన్ కేవలం రూ.25 కోట్ల వసూళ్లు మాత్రమే సాధించింది. అదే సమయంలో గతేడాది రిలీజైన కాంతార-2 తెలుగు వర్షన్లో ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. కానీ దురంధర్-2 విషయానికొస్తే తెలుగు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ అంతగా రావట్లేదని తెలుస్తోంది.తెలుగులో కలెక్షన్స్ డీలా..తెలుగులో కలెక్షన్స్ తగ్గడానికి కారణాలున్నాయి. ఇక్కడ తక్కువ స్క్రీన్స్ కేటాయించడం.. అంతేకాకుండా తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ కూడా చేయకపోవడం ప్రధానంగా వసూళ్లపై ప్రభావంపై కనిపిస్తోంది. వీటితో పాటు లాంగ్ రన్‌టైమ్ 4 గంటల నిడివి వల్ల కొంతమంది ఆడియన్స్ దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ వయొలెన్స్ ఎక్కువగా ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ దురంధర్-2ను థియేటర్లో చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపట్లేదు. ఈ కారణాల వల్లే తెలుగులో తక్కువ కలెక్షన్స్ వస్తున్నట్లు అర్థమవుతోంది. కాగా.. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజైంది. -
మార్చి రౌండప్: ముంచిన 'ఉస్తాద్'.. ఆదుకున్న 'ధురంధర్ 2'
సాధారణంగా మార్చి నెల అనగానే పరీక్షల సీజన్, సినిమాలు పెద్దగా చూడరు అనే అపవాదు ఉంటుంది. కానీ ఇదే నెలలో గతంలో 'ఆర్ఆర్ఆర్' లాంటి పాన్ ఇండియా మూవీ వచ్చి బ్లాక్‌బస్టర్ అయింది. బలగం, కోర్ట్, జాతిరత్నాలు తదితర చిన్న చిత్రాలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. ఈసారి మాత్రం అలాంటి మ్యాజిక్ జరగలేదు. ఆదుకుంటాడనుకున్న 'ఉస్తాద్'.. బయ్యర్లని నిండా ముంచాడు. ఇంతకీ ఈ నెల బాక్సాఫీస్ రిజల్ట్ ఏంటి?(ఇదీ చదవండి: ఓటీటీలోకి తమిళ హిట్ సినిమా.. తెలుగులోనూ స్ట్రీమింగ్)మార్చి తొలివారం ఏకంగా 10 వరకు చిన్న సినిమాలు వచ్చాయి. వీటిలో శ్రీ విష్ణు 'మృత్యుంజయ్' ఉన్నంతలో ఆసక్తి కలిగించింది. కానీ ఉసూరుమనిపించింది. నటి వరలక్ష్మీ శరత్ కుమార్.. తొలిసారి దర్శకురాలు, నిర్మాతగా తీసిన 'ఎస్.సరస్వతి' ఇదే వారం వచ్చింది. ఫ్లాప్ అయింది. శివాజీ 'సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని' ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. 'మెన్షన్ హౌస్ మల్లేష్' కూడా నిలబడలేదు.మూడోవారం ఉస్తాద్ భగత్ సింగ్, ధురంధర్ 2 సినిమాలు ఉన్నాయని.. రెండోవారం వచ్చే ధైర్యం ఎవరూ చేయలేదు. హెబ్బా పటేల్ నటించిన 'రేపు ఉదయం 10 గంటలకు' చిత్రం 14వ తేదీన థియేటర్లలోకి వచ్చింది. అసలు ఇదొకటి రిలీజైన సంగతి కూడా జనాలకు తెలియనంతగా వచ్చి వెళ్లిపోయింది.మూడోవారం ఉగాది కానుకగా పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' వచ్చింది. రిలీజ్ నాడు పండగ సెలవు కావడంతో ఉన్నంతలో థియేటర్లు నిండాయి కానీ టాక్ నెగిటివ్ వచ్చింది. రెండోరోజుకల్లా ఆ ప్రభావం గట్టిగానే పడింది. వీకెండ్ అయ్యేసరికి ఈ చిత్రం పవన్ కెరీర్లో డిజాస్టర్లలో ఒకటిగా నిలిచింది. విడుదలకు ముందు దర్శకుడు హరీశ్ శంకర్ చాలాచెప్పాడు. అభిమానులని కూడా సరిగా ఆకట్టుకోలేకపోయిందీ చిత్రం. ఇదే తేదీన వచ్చిన డబ్బింగ్ బొమ్మ 'ధురంధర్ 2'.. తెలుగు రాష్ట్రాల్లోని బాక్సాఫీస్‌ని ఆదుకుంది. రెండు రోజుల ఆలస్యంగా తెలుగు వెర్షన్ వచ్చినప్పటికీ మన ప్రేక్షకులు దీన్ని ఆదరించారు. 'ఉస్తాద్..'ని లైట్ తీసుకున్నారు.చివరిదైన నాలుగోవారంలో బ్యాండుమేళం, లేచింది మహిళా లోకం, సుయోధన తదితర స్ట్రెయిట్ మూవీస్‌తో పాటు యూత్, హ్యాపీరాజ్ లాంటి డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. వీటిలో ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాలేదు. దీంతో ఈ నెలలో ఏ తెలుగు మూవీ కూడా ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. 'ధురంధర్ 2' మాత్రమే టాలీవుడ్ బాక్సాఫీస్ అంతో ఇంతో కళకళలాడేలా చేసింది. ఇది కూడా లేకపోయింటే అంతే సంగతులు.(ఇదీ చదవండి: అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్) -
దురంధర్-2ను వదలని పైరసీ.. యూట్యూబ్‌లో ప్రింట్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. ఈనెల 19న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పటికే దురంధర్ వసూళ్లను క్రాస్ చేసింది. కేవలం 11 రోజుల్లోనే రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ సీక్వెల్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లో రిలీజ్ కావడంతో రెండు వేల కోట్ల మార్క్ చేరుకునేలా కనిపిస్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పాకిస్తాన్‌కు వెళ్లిన ఇండియన్ స్పై జీవితం ఆధారంగా తెరకెక్కించారు.బాక్సాఫీస్ వద్ద సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోన్న ఈ చిత్రానికి పైరసీ గండం తప్పింది. అయితే పైరసీ కేటుగాళ్లు ఈ మూవీని యూట్యూబ్‌లో అప్లోడ్ చేశారు. ఇది గమనించిన దురంధర్ అభిమానులు వెంటనే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై వెంటనే అప్రమత్తమై దురంధర్ టీమ్ పైరసీ కంటెంట్‌ను తొలగించాలని యూట్యూబ్‌ను కోరింది. దీంతో వెంటనే స్పందించిన యూట్యూబ్ ఆ వీడియోను తొలగించింది. త్వరగా రెస్పాండ్ కావడంతో పైరసీ గండం నుంచి తప్పించుకున్నారు మేకర్స్. లేకపోతే దురంధర్ వసూళ్లపై తీవ్ర ప్రభావం పడేదని నెటిజన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పైరసీకి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు సోషల్ మీడియాలో ఆదిత్య ధర్‌ను ట్యాగ్ చేశారు.కాగా.. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ చిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా కనిపించింది. ఈ మూవీలో అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్, సంజయ్ దత్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు. -
విజయ్ దేవరకొండ మూవీలో సారా అర్జున్ తండ్రి.. ఏ సినిమానో తెలుసా?
'నాన్న', 'పొన్నియన్ సెల్వన్' సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన సారా అర్జున్. 'ధురంధర్' సినిమాతో ఒక్కసారిగా స్టార్ అయిపోయింది. తన తొలి సినిమాకే ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఇందులో 40 ఏళ్ల హీరో రణ్వీర్ సింగ్‌కు జంటగా నటించింది. కేవలం 20 ఏళ్ల సారా అర్జున్ తన గ్లామర్‌తో అభిమానులను మెప్పించింది. ఆ తర్వాత తెలుగులోనూ యూఫోరియా మూవీతో అలరించింది.ప్రస్తుతం సారా నటించిన దురంధర్-2 థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో సారా అర్జున్ గురించి తెగ చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే సారా అర్జున్‌కు సంబంధించిన ఆసక్తికర విషయం బయటకొచ్చింది. ఆమె తండ్రి రాజ్ అర్జున్ సైతం తెలుగు సినిమాల్లో నటించడం విశేషం.విజయ్ దేవరకొండ హీరోగా వచ్చిన డియర్ కామ్రేడ్ మూవీలో క్రికెట్ సెలక్టర్ రమేశ్ రావు పాత్రలో మెప్పించారు. అంతేకాకుండా గతేడాది రిలీజైన రజాకార్ చిత్రంలోనూ కీలక పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ఆయన కుమార్తె సారా అర్జున్ సైతం తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. 2002లో కంపెనీ అనే మూవీతో అరంగేట్రం రాజ్ అర్జున్ దాదాపు 30కి పైగా సినిమాల్లో నటించారు. సీక్రెట్ సూపర్‌స్టార్ అనే చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనే ఫేవరేట్ హీరో..గతంలో యూఫోరియా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన సారా అర్జున్ తెలుగులో నటించడం చాలా గర్వంగా ఉందని చెప్పింది. టాలీవుడ్లో మీ ఫేవరేట్ హీరో ఎవరని యాంకర్ ప్రశ్నించింది. దీనికి బదులిస్తూ తెలుగులో చాలామంది హీరోలు ఉన్నారని.. కానీ నాకు మాత్రం విజయ్ దేవరకొండ ఫేవరేట్ అని బాలీవుడ్ ముద్దుగుమ్మ చెప్పుకొచ్చింది. ఆమె తండ్రి రాజ్ అర్జున్ డియర్ కామ్రేడ్లో నటించడం వల్లే సారా అర్జున్ తన ఫేవరేట్ హీరో అని చెప్పుకొచ్చింది. -
దురంధర్-2 మరో రికార్డ్.. కేవలం 11 రోజుల్లోనే బ్రేక్..!
బాలీవుడ్ మూవీ దురంధర్-2 బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఇప్పటికే పలు చిత్రాల రికార్డులు బద్దలు కొట్టిన ఈ మూవీ వసూళ్ల పరంగా దూసుకెళ్తోంది. మార్చి 19న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం 11 రోజుల్లోనే మరో రికార్డ్ క్రియేట్ చేసింది. గతేడాది రిలీజైన దురంధర్ ఆల్ టైమ్ వసూళ్లను అధిగమించింది.ఇప్పటి వరకు దురంధర్-2 ప్రపంచవ్యాప్తంగా రూ. 1,363.15 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇండియావ్యాప్తంగా ఇప్పటి వరకు రూ.1013.15 కోట్లు రాగా.. ఓవర్సీస్లో రూ.350 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఓవరాల్‌గా నెట్ వసూళ్ల పరంగా చూస్తే రూ. 847.87 కోట్లు వసూలు చేసింది. గతేడాది డిసెంబర్ 5, 2025న విడుదలైన 'ధురందర్' ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ. 1,307.35 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు మనదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన నాలుగో భారతీయ చిత్రంగా 'ధురందర్: ది రివెంజ్' నిలిచింది. దీనికంటే ముందు ఆమిర్ ఖాన్ నటించిన దంగల్ (2016) రూ. 2,070 కోట్లతో జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. ఆ తర్వాత ప్రభాస్ బాహుబలి- 2 (2017) రూ. 1,788 కోట్లతో ఉంది. అల్లు అర్జున్ పుష్ప- 2 (2024) రూ. 1,742 కోట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.కాగా.. రణవీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్స్ దురంధర్ చిత్రాలకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. ఈ మూవీస్‌లో సారా అర్జున్ హీరోయిన్గా మెప్పించారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, రాకేష్ బేడీ, అర్జున్ రాంపాల్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. -
వారణాసి, స్పిరిట్ కు సీక్వెల్ కన్ఫర్మ్ చేసిన ధురంధర్
-
దురంధర్-2పై విమర్శలు.. దెబ్బకు సోషల్ మీడియా ఖాతా డిలీట్...!
మార్చి నెల అంతా దురంధర్ పేరే వినిపిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లు దాటేసింది. వసూళ్ల పరంగా ఓ రేంజ్లో దూసుకెళ్తోంది. పార్ట్-1 రిలీజైన మూడు నెలల్లోనే సీక్వెల్ కూడా రావడంతో ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. మొదటి నుంచే భారీ అంచనాలు ఉండడంతో ఫ్యాన్స్ ఎగబడుతున్నారు. ఇప్పటికే సౌత్ స్టార్స్ సైతం ఈ మూవీపై ప్రశంసలు కురిపించారు. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురందర్: ది రివెంజ్' మార్చి 19న థియేటర్లలో రిలీజైంది.అయితే ఈ మూవీ ఒకవైపు ప్రశంసలు వస్తుంటే.. విమర్శలు సైతం అదేస్థాయిలో చేస్తున్నారు. ప్రాపగండ అనే ముద్ర వేస్తున్నారు. బాలీవుడ్ నటి అని అనీల్ పడ్డా సోదరి రీత్ పడ్డా దురంధర్ సీక్వెల్‌పై విమర్శలు చేసింది. ఈ సినిమా 'ది కేరళ స్టోరీ', 'ది కాశ్మీర్ ఫైల్స్' లాంటి చిత్రాల్లాగే ప్రాపగండగా చిత్రీకరించారని కామెంట్స్ చేశారు. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో పెద్దఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఈ వివాదంతో ఊహించని విధంగా ఆమె ఇన్‌స్టా ఖాతా డిలీట్ చేసేసింది. మొదట ప్రైవేట్‌గా ఉంచిన రీత్ పడ్డా.. ఆ తర్వాత ఏకంగా ఖాతానే తొలగించింది. ప్రస్తుతం ఇన్‌స్టాలో ఆమె ప్రొఫైల్ అందుబాటులో లేదు. ఈ వివాదం తర్వాత ఆమె లింక్డ్ఇన్ ఖాతాను కూడా తొలగించినట్లు తెలుస్తోంది. ధురందర్తో సహా ది కశ్మీర్ ఫైల్స్, ది కేరళ స్టోరీ చిత్రాలను రీత్ విమర్శించడంతో ఈ వివాదం మొదలైంది. దీనిపై నెట్టింట పెద్దఎత్తున ట్రోల్స్ రావడంతో ఏకంగా సోషల్ మీడియా ఖాతానే మూసేయాల్సి వచ్చింది.అంతేకాకుండా రీత్ వ్యక్తిగత జీవితంపై కూడా ఆన్లైన్లో ట్రోల్స్ వచ్చాయి. ఫాజిల్ అహ్మద్ అనే వ్యక్తితో ఆమెకు రిలేషన్ ఉందంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేశారు. అయితే తమపై వస్తున్న ట్రోల్స్‌పై రీత్ గానీ, అనీత్ పడ్డా గానీ వాటిపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. మరోవైపు నటి అనీత్ పడ్డా మ్యాడాక్ ఫిల్మ్స్ నిర్మిస్తున్న 'శక్తి శాలిని' చిత్రంలో నటించనున్నారు. ఈ చిత్రం క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. -
9 ఏళ్ల ‘బాహుబలి’ రికార్డు బ్రేక్ చేసిన ‘ధురంధర్’.. నిర్మాత ట్వీట్ వైరల్
ధురంధర్ 2 చిత్రం ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తోంది. బాలీవుడ్,టాలీవుడ్ అని మాత్రమే కాదు ఎక్కడ చూసినా.. ఈ సినిమా గురించే మాట్లాడుతున్నారు. విడుదలై 10 రోజులు గడుస్తున్నా.. థియేటర్స్‌కి జనం పోటెత్తుతున్నారు. కలెక్షన్ల పరంగా ఈ చిత్రం రికార్డులను బద్దలు కొడుతుంది. 10 రోజుల్లో రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. దాంతో పాటు బాహుబలి రికార్డుని కూడా బద్దలు కొట్టింది. ఉత్తర అమెరికా అత్యధిక కలెక్షన్లు రాబట్టిన ఇండియన్ సినిమాగా బాహుబలి 2 ఉంది. గత 9 ఏళ్లుగా ఉన్న ఈ రికార్డును తాజాగా ధురంధర్ 2 బద్దలు కొట్టింది. కేవలం 10 రోజుల్లోనే 20+ మిలియన్ల డాలర్లను కలెక్ట్ చేసింది.ఈ విషయాన్ని తెలియజేస్తూ.. ‘బాహుబలి 2 రికార్డుని ధురంధర్ 2 అధిగమించింది’ అని ఓ నెటిజన్ పోస్ట్ పెట్టారు. దీనిపై బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ స్పందించారు. ‘నేను కూడా ఇటీవల ధురంధర్ 2 చూశా. ఆద్యంతం ఆస్వాదించా. ఈ చిత్రం అన్ని రికార్డులు బద్దలుకొడుతూ.. కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పడం ఆనందంగా ఉంది. చిత్ర బృందానికి అభినందనలు’ అని పేర్కొన్నారు.రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ఆదిత్యధర్ దర్శకత్వం వహించారు. రణ్వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రలు పోషించారు. Yesterday I watched #Dhurandhar2TheRevenge and needless to say I loved it and thoroughly enjoyed the film! Happy to see it breaking all the records and setting new box office benchmarks in India and worldwide! Congratulations to the entire team! 👏🏼👏🏼 https://t.co/ATl3o3bNTu— Shobu Yarlagadda (@Shobu_) March 28, 2026 -
రాజమౌళి మనసు మార్చిన 'ధురంధర్ 2'?
ఈ సీక్వెల్, పాన్ ఇండియా మూవీస్ ట్రెండ్‌కి రాజమౌళి ఓ రకంగా ఆద్యుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే 'బాహుబలి'తో భారతీయ దర్శకుల్ని ఆశ్చర్యపరిచాడు. భారీ బడ్జెట్ పెట్టి సరైన కంటెంట్ వదిలితే.. వందల వేల కోట్ల వసూళ్లు సాధించొచ్చని చూపించాడు. ఇప్పుడు సీక్వెల్ ట్రెండ్ పాతబడిపోయింది. పుష్ప 2, ధురంధర్ 2 లాంటివి ఒకటో రెండో మాత్రమే బ్లాక్‌బస్టర్ అయ్యాయి. ఈ ట్రెండ్ షురూ చేసిన రాజమౌళి కూడా దీని నుంచి దూరంగా జరగాలనే చూస్తున్నాడు. కానీ ఇప్పుడు మనసు మారిపోయినట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పింది నేనే)రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబు హీరోగా 'వారణాసి' చేస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తయింది. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న థియేటర్లలోకి తీసుకురానున్నట్లు ప్రకటించారు కూడా. సాధారణంగా రిలీజ్ టైంలో ప్రమోషన్స్ చేస్తారు. రాజమౌళి మాత్రం తన సంప్రదాయానికి భిన్నంగా హాలీవుడ్‌కి చెందిన పలు మీడియా సంస్థలకు తన టీమ్‌తో కలిసి ఈ పాటికే ఇంటర్వ్యూలు ఇచ్చాడు. ఇందులోనే 'వారణాసి' ఒకే సినిమాగా రాబోతుందని రాజమౌళి బల్లగుద్ది చెప్పాడు. కానీ ఇప్పుడు మనసు మారినట్లు అనిపిస్తుంది.దాదాపు ఏడున్నర గంటల నిడివి ఉన్నా సరే 'ధురంధర్' రెండు భాగాల్ని ప్రేక్షకులు ఆదరించారు. రీసెంట్గా రిలీజైన సీక్వెల్‌కి వందల కోట్ల వసూళ్లు వస్తున్నాయి. ఇదంతా చూసిన రాజమౌళి.. 'వారణాసి'ని కూడా రెండు భాగాలుగా తీసుకొస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నాడట. ఎందుకంటే త్రేతా యుగంలోని రాముడు నుంచి వర్తమాన,భవిష్యత్ కాలాల వరకు ఈ సినిమా కాన్సెప్ట్ ఉంది. ఇదివరకే రిలీజ్ చేసిన వీడియోతో ఆ క్లారిటీ ఇచ్చారు. దీన్నంతటినీ ఒకే భాగంలో చూపించే బదులు రెండు భాగాల్లో చూపిస్తే ఎలా ఉంటుందా అని జక్కన్న ఆలోచిస్తున్నాడట. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం మూవీ లవర్స్‌కి పండగే.'ధురంధర్' రెండు భాగాల్ని కేవలం మూడు నెలల వ్యవధిలో రిలీజ్ చేసి సక్సెస్ అయ్యారు. రాజమౌళి కూడా 'వారణాసి'ని రెండు భాగాలుగా రిలీజ్ చేద్దామనుకుంటే ఇలా మూడు నాలుగు నెలల గ్యాప్‌లో థియేటర్లలోకి తీసుకొచ్చే ప్లాన్ చేస్తే బెటర్. లేదంటే ఆడియెన్స్ డిసప్పాయింట్ అయ్యే అవకాశముంది. చూడాలి మరి ఏం చేస్తారో?(ఇదీ చదవండి: ఐటమ్ డ్యాన్సర్‌గా ప్రముఖ గాయని.. వీడియో రిలీజ్) -
అది సినిమానే కాదు.. 'ధురంధర్ 2'పై వెట్రిమారన్ షాకింగ్ కామెంట్స్!
ఆదిత్య ధర్ దర్శకత్వంలో రణవీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ ఇప్పుడు ఇండియన్ బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం ఇప్పటికే రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, రికార్డును సృష్టించింది. ప్రతి ఒక్కరు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నాయి. అయితే తాజాగా ప్రముఖ దర్శకుడు, నిర్మాత వెట్రిమారన్ మాత్రం ఈ మూవీపై పరోక్షంగా తీవ్ర విమర్శలు చేశాడు. హింసను ప్రేరేపించేలా సినిమాను తీసి వందల కోట్లు సంపాదిస్తున్నారంటూ మండిపడ్డారు. అంతేకాదు చరిత్రను వక్రీకరించడానికి, ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయడానికి సినిమాలను వాడుకుంటున్నారంటూ అసహనం వ్యక్తం చేశారు.శ్రీలంక సివిల్ వార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న'నీలిర' సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్లో వెట్రిమారన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘మనం మన కథలను చెప్పుకునేంత వరకు, మన శత్రువులు చెప్పిందే మన జీవితం. మన సొంత కథలను చెప్పుకోవడానికి మనకు ప్రజాస్వామ్యం లేదు. ఈ చిత్రం ద్వేషాన్ని ప్రొత్సహించదు. హింసను సమర్థించదు. వందల కోట్లు సంపాదించాలనే ఆశతో కొంతమంది హింసను ప్రేరేపించేలా సినిమాలను నిర్మిస్తున్నారు. కానీ ఈ చిత్రం ఒక జాతిని, ఒక మతాన్ని కానీ అపహాస్యం చేసేలా తెరకెక్కలేదు’ అన్నారు. ఇంకా మాట్లాడుతూ..‘ఈ రోజుల్లో ప్రతీది ఒక ప్రచారంగా మారిపోయింది. మన జ్ఞాపకాలను, ఆలోచనలను ప్రభావితం చేసే శక్తి ఈ ప్రచారానికి ఉంది. నోట్ల రద్దు వల్ల ఎవరు నష్టపోయారో, క్యూ లైన్లలో నిలబడి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వాటన్నింటినీ మరుగున పడేసి, ద్వేషాన్ని పెంచేలా ప్రచారం చేస్తున్నారు. అది సినిమానే కాదు. చరిత్రను లేదా వాస్తవాలను వక్రీకరించి చూపడం ‘హేట్ ప్రొపగండా’కిందకే వస్తుంది’అని వెంట్రిమారన్ విమర్శించాడు.కాగా, ధురంధర్ 2 చిత్రంలో 2016లో మోదీ ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయాన్ని సమర్థించారు. పాకిస్తాన్ నుంచి వచ్చే దొంగ నోట్లను అరికట్టడానికే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చూపించారు. వాస్తవం ఏంటో తెలియదు కానీ.. నోట్ల రద్దు కారణంగా దేశంలో చిన్న వ్యాపారాలు అన్ని మూతబడ్డాయి. కొంతమంది డబ్బుల కోసం బ్యాంకు వద్ద క్యూ లైన్లో నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నారు. రైతులు తమ పంటను అమ్ముకోలేక, విత్తనాలు కొనలేక తీవ్రంగా నష్టపోయారు. అయితే ఇదే విషయాన్ని వెట్రిమారన్ ప్రస్తావిస్తూ.. సినిమాల్లో నోట్ల రద్దును ఒక గొప్ప విజయంగా చూపిస్తున్నప్పుడు, పైన పేర్కొన్న సామాన్యుల కష్టాలను ఆ సమయంలో జరిగిన ప్రాణనష్టాన్ని విస్మరించడం ‘ప్రొపగండా’ అవుతుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం వెంట్రిమారన్ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి. ధురంధర్ 2 గురించే ఆయన మాట్లాడారంటూ నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు. #Vetrimaaran indirectly attacks #Dhurandhar2:"Today everything becomes propoganda. Propoganda has power to influence memory. We all know who has impacted with demonetization & how many Lost lives in standing the queue. It's hate propoganda"pic.twitter.com/kdQgYobUCN— AmuthaBharathi (@CinemaWithAB) March 28, 2026 -
ధురంధర్ ను ఫాలో అవుతున్న టాలీవుడ్ దర్శకుడు
-
ధురంధర్- 2లో దర్శకుడి సతీమణి.. అండర్ కవర్ ఏజెంట్‌గా ఎంట్రీ
రణవీర్ సింగ్- దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ధురంధర్-2.. గతేడాది విడుదలైన పార్ట్-1కు సీక్వెల్‌గా తాజాగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపుతుంది. అయితే, దర్శకుడు ఆదిత్య ధర్ సతీమణి యామీ గౌతమ్ తాజాగా ఈ మూవీని చూశారు. ఇందులో ఆమె అతిథి పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తన సోదరితో రహస్యంగా ప్రేక్షకులతో పాటుగా మూవీని చూశారు.గౌరవం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన యామీ గౌతమ్.. ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌తో భారీగా పాపులర్ అయింది. దర్శకుడు ఆదిత్య ధర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె వరుసగా సినిమాలు చేస్తుంది. 'ఉరి' మూవీ తర్వాత వారిద్దరి కాంబినేషన్లో ఇది రెండో చిత్రం కావడం విశేషం.ధురంధర్-2లో యామీ గౌతమ్ నర్స్ కమ్ అండర్ కవర్ ఏజెంట్ 'షాజియా బానో'గా నటించారు. తెరపై ఆమె కనిపించగానే కాస్త సిగ్గుగా చూస్తూ, చిరునవ్వుతో నిశ్శబ్దంగా ఉండమని తన సోదరి సురిలీ గౌతమ్‌ని సైగ చేసింది. ఈ ముచ్చటైన క్షణాన్ని సురిలీ కెమెరాతో వీడియో తీసి తన ఇన్‌స్టాగ్రామ్‌లో "మూవీ టైమ్" అనే క్యాప్షన్‌తో అప్లోడ్ చేసింది. ఆ క్లిప్‌లో 'ధురందర్ 2'లో నర్సుగా యామీ చేసిన అతిథి పాత్రను చూపిస్తుంది. ఆ తర్వాత ఆమె కెమెరాను ఆ నటి వైపు తిప్పుతుంది. థియేటర్లో ఆ సన్నివేశాన్ని చూస్తున్నప్పుడు యామీ నవ్వుతూ, సిగ్గుపడుతూ కనిపించింది. ఆ తర్వాత ఆమె తన సోదరిని నిశ్శబ్దంగా ఉండమని సైగ చేసింది. Yami Gautam blushing watching herself on *Dhurandhar* screen , how cute!❤️❤️❤️Yami Gautam Dhar ☆ Aditya Dhar #Dhurandhar2TheRevenge https://t.co/L0Zoy6GQ9K pic.twitter.com/mEh2vvlgtl— JyotiKarma🚩🇮🇳 (@JyotiKarma7) March 27, 2026Spotted! ❤️ Yami Gautam enjoying #Dhurandhar2 like a true fan in a packed theatre—supporting hubby Aditya Dhar & even cheering her own cameo! 🔥 #DhurandharTheRevenge pic.twitter.com/2b0sXIGRnk— Smita Patil (@patil45802) March 27, 2026 -
దురంధర్-2 కలెక్షన్స్.. తొలి వారం ఎన్ని కోట్లంటే?
రణ్వీర్ సింగ్- ఆదిత్యధర్ కాంబోలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ధురంధర్ ది రివెంజ్. గతేడాది రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల గ్యాప్‌లోనే సీక్వెల్‌ను రిలీజ్ చేయడం విశేషం. తొలి రోజు నుంచే కాసుల వర్షం కురిపిస్తోన్న ఈ చిత్రం వారం రోజుల్లోనే రికార్డ్ సృష్టించింది.తాజాగా ఈ మూవీ మొదటి వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.1006 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించింది. తొలి వారంలోనే వెయ్యి కోట్లు సాధించిన తొలి హిందీ మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ స్వయంగా వెల్లడించింది. ఓవరాల్‌గా చూస్తే ఎనిమిది రోజుల్లో రూ.1088 కోట్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. దేశవ్యాప్తంగా రూ.814 కోట్ల గ్రాస్ రాబట్టగా.. ఓవర్సీస్లో రూ.274 కోట్లు వచ్చినట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా నెట్ పరంగా చూస్తే రూ.690 కోట్లు వసూలు చేసింది. ఈ మూవీలో సంజయ్ దత్, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్ కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ బ్యూటీ సారా అర్జున్ హీరోయిన్గా మెప్పించింది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ఈ మూవీపై దక్షిణాది స్టార్స్ ప్రశంసలు కురిపించారు. Yeh dahaad hai naye Hindustan ki.🔥Day-wise break-up | India NBOCWeekend 1: 466 Cr* DAY 5: ₹64 Cr* DAY 6: ₹58 Cr* DAY 7: ₹49 Cr* DAY 8: ₹53 Cr* India: ₹690 Cr* Week 1 | Worldwide GBOC (8 Days)India: ₹814 Cr* Overseas: ₹274 Cr*Book Your Tickets Now.🔗-… pic.twitter.com/x2iLMxfX6K— B62 Studios (@B62Studios) March 27, 2026 -
ఆదిత్య ధర్‌కు పాకిస్తాన్ ప్రజల వింత డిమాండ్
రణ్వీర్ సింగ్- ఆదిత్యధర్ కాంబినేషన్ సినిమా ‘ధురంధర్2’ హిట్ టాక్‌తో బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతుంది. గతేడాది విడుదలైన ‘ధురంధర్-1’ సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కాసుల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ. 1000 కోట్ల మార్క్‌ను దాటేసింది. అయితే, ఈ కలెక్షన్స్ గురించి పాక్స్తాన్లోని ల్యారీ ప్రాంత ప్రజలు ఏమనుకుంటున్నారనే అంశంపై ఒక వీడియో వైరల్ అవుతుంది.ధురంధర్-2 కలెక్షన్స్‌పై నెటిజన్లకు నవ్వు పుట్టించేలా ఈ వీడియో ఆసక్తిగా ఉంది. ఈ మూవీలో ఎక్కువగా కరాచీలోని ల్యారీ ప్రాంత నివాసుల జీవితం గురించి చూపించారు. ఇప్పుడు ఈ చిత్రం భారీ విజయం సాధించడంతో అక్కడి ప్రజలు సరదాగా మాట్లాడుకుంటూ కనిపిస్తున్నారు. ధురంధర్-2 రూ. 1000 కోట్లు వసూలు చేసింది కాబట్టి, దర్శకుడు ఆదిత్య ధర్ అందులో నుంచి రూ. 500 కోట్లు తిరిగి తమకు ఇచ్చేయాలని, ఆ డబ్బుతో తమ ల్యారీ ప్రాంతంలో మంచి రోడ్లు నిర్మించుకుంటామని వారు కోరడం విశేషం.ఎంతో చమత్కారంగా ఉన్న ఈ వ్యాఖ్యలు నెటిజన్ల మనసులను తాకింది. దీంతో వారు ఈ వీడియోను విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ల్యారీ ప్రజల నిజ జీవిత సమస్యలను సినిమాలో చాలా చక్కగా చూపించారని కూడా వారు అంటున్నారు. తమ జీవితాలు ఎలా ఉంటాయో ఈ మూవీ ద్వారా ప్రపంచానికి చూపించారని దర్శకుడిపై వారు ప్రశంసలు కూడా కురిపించడం విశేషం.Pakistani delulu aawam is saying that Aditya Dhar will earn 1000 Crore from #Dhurandhar2TheRevenge , he should return back 500 crore to Lyari because we don't have good roads here 😭😭😭😂😂😂😂 pic.twitter.com/kBdtGYvPla— Chota Don (@choga_don) March 27, 2026 -
దురంధర్ 2 హిట్‌పై RGV & బాలీవుడ్ డైరెక్టర్స్ భయపడ్డారు
-
దురంధర్-2లో చిన్న రోల్.. కానీ మూవీ చూడలేకపోతున్నా..!
రణ్వీర్ సింగ్ దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. గతేడాది రిలీజైన మూవీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ చిత్రం రూ.919 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లతో దూసుకెళ్తోంది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీని పాకిస్తాన్ నేపథ్యంలో తెరకెక్కించారు. ఇండియన్ స్పై రవీంద్ర కౌశిక్ జీవితం ఆధారంగా రూపొందించారు.అయితే తాజాగా ఈ మూవీలో నటించిన ఓ ఆటో డ్రైవర్ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో చివర్లో రణ్వీర్ సింగ్ ఆటోలో వస్తారు. ఆ ఆటోను నడిపిన బద్రుల్ ఇస్లాం వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. ఆర్థిక సమస్యలతో తాను ఇంకా దురంధర్-2 చూడలేదని అన్నారు. టికెట్స్ రేట్లు తగ్గాక వెళ్లి చూస్తానని చెబుతున్నారు. సినిమా టికెట్ ధర ఎక్కువగా ఉన్నందువల్ల చూడలేకపోతున్నాని తెలిపారు. కుటుంబంతో కలిసి దురంధర్-2 చూసేందుకు తనకు మరింత సమయం పడుతుందన్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీంతో ఆటో రిక్షా డ్రైవర్ అయిన బద్రుల్ కోసం సినిమాను ఉచితంగా ప్రదర్శించేలా ఏర్పాట్లు చేయాలని అభిమానులు దర్శకుడు ఆదిత్య ధర్‌కు విజ్ఞప్తి చేస్తున్నారు.కాగా.. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. హిందీతో పాటు సౌత్ భాషల్లోనూ ఈ మూవీని రిలీజ్ చేశారు. ఈ మూవీ సారా అర్జున్ హీరోయిన్గా కనిపించగా.. అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్. మాధవన్ కీలక పాత్రల్లో నటించారు. View this post on Instagram A post shared by Mintu dhotian (@amar.gill.12139862) -
'ధురంధర్ 2'.. టాలీవుడ్ ఏం నేర్చుకోవాలి?
'ధురంధర్ 2' వచ్చింది. దేశంలో ప్రతిచోట బాక్సాఫీస్ కళకళలాడిపోయేలా చేస్తోంది. ఇప్పటికే రూ.1000 కోట్ల కలెక్షన్స్‌కి చేరువలో ఉంది. కొన్ని సినిమాలు కేవలం వచ్చి వెళ్లడం మాత్రమే కాదు. ఇండస్ట్రీ రూపురేఖల్ని మార్చేస్తాయి. 'ధురంధర్ 2' ఆ రేంజ్ మూవీలానే అనిపిస్తోంది. చూస్తుంటే రాబోయే రోజుల్లో అన్ని ఇండస్ట్రీలపై దీని ప్రభావం గట్టిగానే ఉండబోతుందనిపిస్తోంది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' కోసం రణవీర్ సింగ్ ఆరు వారాల్లోనే)ఎందుకంటే ఏదైనా సినిమా హిట్టయి, వందల కోట్ల కలెక్షన్స్ సాధిస్తే చాలు.. టాలీవుడ్లో కావొచ్చు బాలీవుడ్లో కావొచ్చు అదే తరహాలో మూవీస్ తీసే ప్రయత్నం చేస్తుంటారు. రాబోయే కొన్నేళ్లలో 'ధురంధర్' తరహా మూవీస్ ఎక్కువగా రావడం గ్యారంటీ. గతంలో బాహుబలి, కేజీఎఫ్ వచ్చినప్పుడు ఇలానే చాలామంది డైరెక్టర్స్ వాటిని అనుకరించి సినిమాలు తీశారు. అడ్డంగా బోల్తా కొట్టారు. టాలీవుడ్, 'ధురంధర్' మాయలో పడకపోతేనే బెటర్. లేదు మేం కూడా ఇలాంటి మూవీసే తీస్తాం, హిట్ కొడతాం అనుకుంటే మాత్రం మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది.టాలీవుడ్లో చాలామంది దర్శకులు.. స్టోరీ కంటే హీరోలకు ఎలివేషన్స్ ఇవ్వాలి, అవసరం లేకపోయినా కామెడీ పెట్టాలి, ఐటమ్ సాంగ్స్ ఇరికించాలి అనే ఆలోచనలతోనే ఉంటారు. ఇలాంటివన్నీ చూసి బోర్ కొట్టడం వల్లే 'ధురంధర్'కి అదే తెలుగు ఆడియెన్స్ క్యూ కడుతున్నారు. కాబట్టి 'ధురంధర్' లాంటి సినిమాలు తీయాలంటే హీరోలని అనుకుని స్టోరీలు రాయడం కాకుండా స్టోరీ రాసి, దానికి తగ్గ నటీనటుల్ని వెతుక్కోవాలి. అప్పుడే సరైన ఫలితం దక్కే అవకాశముంటుంది.ఏదైనా సినిమాకు సీక్వెల్ అంటే చాలు ఏళ్లకు ఏళ్లు ఎదురుచూడాలనేలా టాలీవుడ్‌ని భ్రష్టుపట్టించారు. ఆ ట్రెండ్ బ్రేక్ చేసిన ఆదిత్య ధర్.. తొలి పార్ట్ వచ్చిన మూడంటే మూడు నెలల్లో సీక్వెల్ తీసుకొచ్చాడు. ప్రేక్షకుల అంచనాలని అందుకోవడమే కాదు వాటిని దాటేసి మెప్పించాడు. ఒకవేళ తెలుగులో ఈ తరహా ప్రయత్నాలు ఎవరైనా చేద్దామనుకుంటే ఇదే ట్రెండ్ ఫాలో అవ్వాల్సి ఉంటుంది.టాలీవుడ్లో ఉన్న ఇంకో సమస్య టికెట్ రేట్స్. సినిమాతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ టికెట్ ధరలు పెంచేయాలని తాపత్రయపడుతుంటారు. దీని కారణంగానే థియేటర్లకు వచ్చే చాలామంది ప్రేక్షకులని ఓటీటీలు, పైరసీలకు అలవాటు పడేలా చేశారు. ఈ విషయంలో 'ధురంధర్' టీమ్ నిర్ణయం అందరినీ ఆశ్చర్యం కలిగించింది. తొలి పార్ట్ గానీ రెండో పార్ట్‌కి గానీ టికెట్ రేట్లు పెంచలేదు. ఆయా థియేటర్ లేదా మల్టీప్లెక్స్‌ల్లో ఎంత రేటు అయితే ఉందో దానితోనే సినిమా చూసే అవకాశం కల్పించారు. ఇలా చేయడం వల్లే అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. టాలీవుడ్ దీన్నిచూసి చాలా నేర్చుకోవాలి.'ధురంధర్' రెండు భాగాలని కలిపి రూ.300 కోట్ల కంటే తక్కువ బడ్జెట్‌తోనే పూర్తి చేశారని టాక్. ఈ విషయంలో టాలీవుడ్ ఎంత నేర్చుకుంటే అంత బెటర్. స్టార్ హీరోలకు వందల కోట్లు గుమ్మరించడం లాంటివి కాకుండా కంటెంట్‌కి ఏం కావాలి? దేనికి ఎంత ఖర్చుపెట్టాలి అనే విషయాలపై కాస్త దృష్టిపెట్టాలి అప్పుడే తెలుగు ఇండస్ట్రీలో కొంతైనా మార్పు వస్తుంది. లేదు మేం ఇలానే రొటీన్, మూస స్టోరీలు తీస్తామంటే కుదరదు. ఎందుకంటే ప్రేక్షకులు అలాంటి వాటిని చూడటం మానేశారు. మానేస్తున్నారు. నిర్మాతలు ఈ విషయం ఎంత త్వరగా అర్థం చేసుకుంటే అంత బెటర్.(ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి 'అవతార్ 3' సినిమా) -
సంజయ్ దత్ క్రేజీ రికార్డ్.. ఆ విషయంలో తొలి నటుడిగా ఘనత..!
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 బాక్సాఫీస్ రికార్డుల వేట కొనసాగుతోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా వెయ్యి కోట్ల మార్క్ చేరుకునేందుకు రెడీగా ఉంది. తొలి రోజు నుంచే వసూళ్లు సునామీ సృష్టిస్తోంది. గతేడాది రిలీజైన దురంధర్‌కు సీక్వెల్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల్లోనే పార్ట్-2 రిలీజ్ చేశారు. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులను తిరగరాసింది.ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ గురించి చర్చ మొదలైంది. విలన్ పాత్రలతో అందరినీ దృష్టిస్తోన్న ఏకైక బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా మెప్పించిన మూడు సినిమాలు వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద మూడు సినిమాలు రూ. 1,000 కోట్ల వసూళ్లు సాధించిన ఏకైక బాలీవుడ్ స్టార్‌గా సంజయ్ దత్ ఘనతను సొంతం చేసుకున్నారు.కన్నడ హీరో యశ్ నటించిన కేజీఎఫ్-2 చిత్రంలో విలన్ అధీర పాత్రలో అభిమానులను ఆకట్టుకున్నారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దాదాపు 66 ఏళ్ల వయసులోనూ యువకుడిలా వరుస సినిమాలు చేస్తున్నారు. కేజీఎఎఫ్ తర్వాత షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించిన 'జవాన్' చిత్రంలో సంజయ్ దత్ కీలక పాత్రలో కనిపించారు. ఈ యాక్షన్ డ్రామాగా చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 1,160 కోట్ల మార్కును అధిగమించింది.తాజాగా గతేడాది రిలీజైన దురంధర్ మూవీలోనూ సంజయ్ దత్ కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా సైతం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఈ స్పై థ్రిల్లర్ చిత్రంలో విలన్ పాత్రలో మెప్పించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాతో సంజయ్ దత్ నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద వెయ్యి కోట్లకు వసూళ్లు రాబట్టాయి. ఇటీవల రిలీజైన దురంధర్-2 సైతం రూ.1000 కోట్ల మార్క్ దగ్గరలో ఉంది. ఈ చిత్రం కూడా వెయ్యి కోట్లు దాటితే సంజయ్ దత్‌కు రికార్డ్ మరింత పెరగనుంది. కాగా.. సంజయ్ దత్ 'ధురందర్: ది రివెంజ్'లో ఎస్పీ చౌదరి అస్లాం పాత్ర పోషించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఇప్పటివరకు రూ. 919 కోట్లు వసూలు చేసింది. ఈ రికార్డ్స్ పరిశీలిస్తే.. ఇకపై సంజయ్ దత్ ఉంటే చాలు వెయ్యి కోట్లు పక్కా అనాల్సిందే. కాగా.. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, డానిష్ పండోర్, సారా అర్జున్, గౌరవ్ గెరా కీలక పాత్రలు పోషించారు. -
'ధురంధర్ 2' కోసం రణవీర్ సింగ్ ఆరు వారాల్లోనే ఏకంగా పదికిలోలు..!
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్ 2' మూవీ రికార్డు రేంజ్ కలెక్షన్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మార్చి 19న ప్రారంభమైన వసూళ్ల వేట ఐదురోజుల వరకు అలానే కొనసాగుతూ వెళ్తోందంటే ఆ సినిమా క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ మూవీలో స్పై హంజా అలీ మజారిగా నటించిన రణవీర్ సింగ్ ఈ పాత్ర కోసం ఎంతలా కష్టపడ్డారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ పాత్రలో ఒదిగిపోయేలా క్రూరంగా కనిపించేందుకు చాలా తక్కువ టైంలోనే పదికిలోలు పైనే బరువు పెరిగారట. విలక్షణ పాత్రలతో అభిమానులను మెప్పించే రణవీర్ ఫిజిక్ పరంగా చాలా కేర్ తీసుకుంటారట. అది కూడా ఆరోగ్యకరమైన రీతీలోను ఉంటుందని, ఎలాంటి షార్టకట్లు ఫాలో అవ్వరని చెబుతున్నాడు అతని ఫిట్నెస్ కోచ్. అంత తక్కువ వ్యవధిలో రణవీర్ శరీరాన్ని అంతలా ఎలా మార్చగలిగాడో తెలుసుకుందామా..!.గత కొన్నేళ్లుగా, నటుడిగా రణవీర్ సింగ్ విలక్షణమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. ముఖ్యంగా 'ధురంధర్: ది రివెంజ్' చిత్రంలో ఆయన నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. అంతలా అభిమానులను కట్టిపడేసేలా తెరపై ఆ పాత్రను పండించడం కోసం రణవీర్ ఎంతలా కష్టపడ్డారో వింటే నోటమాట రాదు. ఆ విషయాన్ని స్వయంగా ఆ మూవీలో నటించని సహనటుడు, సెలబ్రిటీ ఫిట్నెస్ కోచ్ ముస్తఫా అహ్మద్ వెల్లడించారు. ఆయన 'ధురంధర్: ది రివెంజ్'లో రిజ్వాన్ షా పాత్రలో ఒదిగిపోయారు. ఫిట్నెస్ కోచ్ ముస్తఫా రణవీర్ సింగ్ తెరపై క్రూరంగా కనిపంచడం కోసం కేవలం ఆరు వారాల్లోనే పదికిలోల బరువు పెరిగారట. నిజానికి షూటింగ్ చేసే సమయం తక్కవు ఉండటంతో చాలా తక్కువ వ్యవధిలోనే రణవీర్‌సింగ్ బరువు పెరగక తప్పని పరిస్థితని చెప్పుకొచ్చారు. రణవీర్ దాదాపు పదికిలోలు దాక పెరగాల్సి ఉంది. అయితే ఆ టైంకి రణవీర్ బరువు కేవలం 76 నుంచి 77 కిలోలు ఉన్నట్లు తెలిపారు. అయితే షూటింగ్ ప్రారంభమయ్యే సమయానికి రణవీర్ ఏకంగా 87-88 కిలోలకు చేరి అందర్నీ ఆశ్చర్యపరిచారు. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే రణవీర్‌కి ఏ పని అప్పగించినా ఓ యంత్రంలా చేసేస్తారని అంటున్నాడు కోచ్ ముస్తఫా. తాను రోజుకు 3,000-3,600 కేలరీలు తీసుకుంటుండగా, రణ్వీర్ తీసుకునేది రోజుకు 3,600 నుండి 4,000 కేలరీలు. అందులో ఎక్కువ భాగం 600-700 కేలరీలు ప్రోటీన్ షేక్‌ల నుంచే ఎక్కువగా తీసుకుంటున్నారు. అంటే రోజుకు రెండు ప్రోటీన్ షేక్‌లు, 240 గ్రాముల ప్రోటీన్ కోసం చికెన్, మటన్ ఎక్కువుగా తీసుకునేవాడట. View this post on Instagram A post shared by Mustafa Ahmed (@mustafa_thebull_ahmed) తాను ఆరువారాల్లో కేవలం రెండు నెలలు మాత్రమే ట్రైన్ చేశానని, మిగతా మొత్త ఆయన స్వయంగా కేర్ తీసుకున్నదేనని అంటున్నాడు. షూటింగ్ షెడ్యూల్ రీత్యా పూర్తి స్థాయిలో ఆయనకు శిక్షణ ఇవ్వకపోయినా రణవీర్ తన పాత్ర బాగా కనిపించాలనే ఉద్దేశ్యతో చాలా జాగ్రత్తతు తీసుకుంటారని, ఆ విషయంలో ఆయనకు సాటిరారెవ్వరూ అని ప్రశంసిస్తున్నాడు. శ్వాసను మెరుగుపరుచుకుంటూ..వెయిట్ ట్రైనింగ్ చేస్తాడు. చాలామంది శరీరం కండలు తిరిగిన దేహంలా కనిపించేలా చేస్తే..ఆయన మాత్రం బలంతో కూడిన కండరాల కోసం ప్రయత్నిస్తాడని అన్నారు. తెరపై అతడు చాలా సమర్థుడైన వ్యక్తిలా కనిపించేందుకు భోజన విరామ సమయంలో సైతం వెయిట్ ట్రైనింగ్ చేసేవాడని అన్నారు. అలా చేస్తే ఫిట్నెస్ కోచ్‌కి ట్రైనింగ్ సులభతరం అవుతుందని చెబుతున్నాడు. ఇక్కడ రణవీర్ ఫిట్నెస్ నిపుణుల పర్యవేక్షణలో చాలా ఆరోగ్యకరమైన రీతీలోనే బరువు పెరిగారనేది గ్రహించాల్సిన ముఖ్యమైన విషయం. కాగా, రణవీర్ సింగ్, ముస్తఫా ఈ మూవీ కోసం దాదాపు 16 నుంచి 18 గంటలు చిత్రీకరణలో పాల్గొన్నారట.గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యలు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. View this post on Instagram A post shared by Mustafa Ahmed (@mustafa_thebull_ahmed) (చదవండి: కూరగాయలు అమ్ముతూ.. కోట్లకు పడగలెత్తిన యువకుడు!) -
ధురంధర్ 2 ఎఫెక్ట్.. స్టార్ హీరో సినిమా వాయిదా
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘భూత్ బంగ్లా’ విడుదల మరోసారి వాయిదా పడనుంది. ఈమేరకు సోషల్‌మీడియాలో వార్తలు వస్తున్నాయి. అక్షయ్, దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్లో రూపొందుతున్న హారర్ కామెడీ సినిమా ‘భూత్ బంగ్లా’. ఇందులో టబు, వామికా గబ్బి, పరేష్ రావల్, రాజ్‌పాల్ యాదవ్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా.. అక్షయ్ కుమార్, శోభా కపూర్, ఏక్తా కపూర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తొలుత ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఆ తర్వాత ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు. ఇప్పుడు మరోసారి వాయిదా పడనుందని వార్తలు వస్తున్నాయి.రణ్వీర్ సింగ్ ‘ధురంధర్ 2’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్‌తో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. దీంతో ఏప్రిల్ 10న భూత్ బంగ్లా విడుదల కష్టమేనని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం ప్రకారం, ఈ చిత్రం మరో వారం పాటు వాయిదా పడి, ఏప్రిల్ 17, 2026న కొత్త విడుదల తేదీని ఖరారు చేసే అవకాశం ఉంది. 'ధురందర్: ది రివెంజ్' భారీ విజయం సాధించి, బాక్సాఫీస్‌ను శాసిస్తూ ఉండటమే దీనికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అధికారికంగా ప్రకటించే ఛాన్స్ ఉంది. -
'ఆ అమ్మాయి నా కూతురితో సమానం'.. దురంధర్ నటుడు
దురంధర్‌లో రణ్వీర్ సింగ్ రోల్ తర్వాత అందరికీ గుర్తుండిపోయే పాత్ర ఆయనదే. అతని వల్లే ఈ సీక్వెల్ రూ.500 కోట్లు ఎక్కువగా సాధిస్తుందని హీరో సైతం అన్నారని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అతను ఎవరో కాదు.. జమీల్ జమాలీ పాత్రలో అలరిస్తోన్న నటుడు రాకేశ్ బేడీ. తన పాత్రలో రాకేశ్ అద్భుతంగా నటించారు. కరాచీకి చెందిన రాజకీయ నాయకుడు జమాలి పాత్రలో రాకేశ్ బేడీ అదరగొట్టేశారు.అయితే తాజాగా దురంధర్ హీరోయిన్ సారా అర్జున్ను ముద్దు పెట్టుకోవడంతో వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. గతంలో ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ సందర్భంగా జరిగింది. ఆ వీడియో నెట్టింట వైరల్ కావడంతో పెద్దఎత్తున విమర్శలొచ్చాయి. తనకంటే వయసులో చాలా చిన్నదైన సారా అర్జున్ను రాకేశ్ బేడీ ముద్దుపెట్టుకోవడంతో విపరీతంగా ట్రోల్స్ వచ్చాయి. అయితే కొందరు మాత్రం తనను సమర్థించారని కూడా ఆయన పేర్కొన్నారు.తాజాగా ఈ వివాదంపై రాకేష్ బేడీ మరోసారి స్పందించారు. సారాపై తనకు ఎలాంటి చెడు ఉద్దేశం లేదన్నారు. తాను కేవలం ఆమెపై ఆప్యాయతతోనే అలా చేశానని తెలిపారుు. కానీ మరో కోణంలో చిత్రీకరించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కూతురి పాత్ర పోషించిన సారాతో తండ్రిలాగే ప్రవర్తిస్తానని..సినిమా షూటింగ్ సమయంలో కూడా ఆమెతో అలాగే ప్రవర్తించేవాడినని బేడీ వివరణ ఇచ్చారు. మాది తండ్రీ, కూతుళ్ల బంధమని తెలిపారు. నా ఆప్యాయతను ప్రజలు గుర్తించలేకపోయారని అన్నారు.ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.." తన కూతురి పాత్ర పోషించిన సారాతో తన బంధం ఎప్పుడూ ఆప్యాయంగా.. ఒక తండ్రిలాగే ఉంటుంది. ఈ మూవీ షూటింగ్ సమయంలో కూడా ఆమెతో అలాగే ప్రవర్తించా. ధురందర్ షూటింగ్ సమయంలో ఆమె వచ్చినప్పుడల్లా ఒక కూతురిలా ఆమెను కౌగిలించుకుని నుదుటిపై ముద్దు పెట్టేవాడిని. ఏం పర్వాలేదు.. చింతించకు.. మనిద్దరం కలిసి ఒక గొప్ప సీన్ చేస్తామని తనతో చెప్పేవాడిని. అదృష్టవశాత్తూ, కొందరు నన్ను సమర్థించారు కూడా. కానీ ఈ సినిమాతో దక్కిన విజయం చాలా మందికి రాదు' అని అన్నారు. -
దురంధర్-2 మూవీ.. ఈ అరుదైన షూటింగ్ ఫోటోలు చూశారా? (ఫోటోలు)
-
ప్రభాస్ సీక్వెల్ సినిమాలపై ధురంధర్ ఎఫెక్ట్
-
దురంధర్-2 క్రేజ్.. పుష్పరాజ్ రికార్డ్ బ్రేక్
రణ్వీర్ సింగ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ రికార్డుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే రూ.800 కోట్లకు పైగా వసూళ్లతో బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. మార్చి 19న ప్రారంభమైన వసూళ్ల వేట ఐదు రోజులైనా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇదే జోరు కొనసాగితే కేవలం వారం రోజుల్లోనే వెయ్యి కోట్ల మార్క్ చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమాకు ఆదిత్య దర్శకత్వం వహించారు. తాజాగా ఈ మూవీ మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది.ఈ సారి ఏకంగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన పుష్ప-2 వసూళ్లను దాటేసింది. పుష్ప-2 సాధించిన హిందీ వసూళ్లు రికార్డ్‌ను దురంధర్-2 బద్దలు కొట్టింది. పుష్ప-2 మూవీకి నాలుగు రోజుల్లో హిందీ వర్షన్‌కు రూ. 425.10 కోట్లు రాగా.. దురంధర్-2 ఏకంగా రూ.430 కోట్లు వసూలు చేసింది. ఈ రికార్డుతో పుష్పరాజ్‌ను వెనక్కి నెట్టేసింది. దురంధర్-2, పుష్ప-2 తర్వాత పఠాన్, జవాన్, స్త్రీ-2 చిత్రాలు ఉన్నాయి. ఓవరాల్‌గా అన్ని భాషల్లో ఇండియా వ్యాప్తంగా కలెక్షన్స్ పరిశీలిస్తే 'పుష్ప 2: ది రూల్' ఇంకా అగ్రస్థానంలోనే ఉంది. హిందీ వెర్షన్లో 'ధురందర్: ది రివెంజ్' అధిగమించింది.ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఐదు రోజుల్లోనే రూ.829 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇక ఐదు రోజుల్లోనే దేశ వ్యాప్తంగా ఈ సినిమా రూ.619.76 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది. దేశవ్యాప్తంగా చూస్తే రూ. 519.12 కోట్ల నికర వసూళ్లు సాధించింది. బాక్సాఫీస్ వద్ద ఒక హిందీ చిత్రానికి ఇవే అత్యధిక వసూళ్లు కావడం విశేషం. కాగా.. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, రాకేష్ బేడి, డానిష్ పండోర్, సారా అర్జున్, గౌరవ్ గెరా కీలక పాత్రలు పోషించారు. హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-5 సినిమాలివే.. దురంధర్ ది రివెంట్: రూ. 430 కోట్లు (నాలుగు రోజులు)పుష్ప-2 ది రూల్: రూ. 425.10 కోట్లుపఠాన్: రూ. 351 కోట్లుజవాన్: రూ. 346.98 కోట్లుస్త్రీ-2: రూ. 291.65 కోట్లు -
18 ఏళ్లకే తల్లి పాత్ర.. ‘ధురంధర్’ నటిపై ప్రశంసలు
సాధారణంగా హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్ పాత్రలే చేస్తుంటారు. నటనకు స్కోప్ ఉండే పాత్రలు రేర్‌గా వస్తుంటాయి. అలా వచ్చినప్పుడే కొంతమంది తమ టాలెంట్‌ని నిరూపించుకుంటారు. అయితే అందులోనూ తమ వయసు తగ్గ పాత్రలనే ఎంచుకుంటారు. ముఖ్యంగా తల్లి పాత్రలు చేయాల్సి వస్తే సీనియర్ హీరోయిన్లు సైతం ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తారు. 30 ఏళ్లు దాటినా.. తల్లి పాత్ర చేయమని అడిగితే నో చెప్పే హీరోయిన్లు చాలామందే ఉన్నారు. కానీ సారా అర్జున్ మాత్రం 18 ఏళ్లకే తల్లి పాత్ర చేసింది. అది కూడా 40 ఏళ్ల వయసు ఉన్న హీరో నటించిన పాన్ ఇండియా సినిమాలో. అదే ధురంధర్ 2.ధురంధర్ సినిమా సమయంలో సారాపై పెద్ద ఎత్తున ట్రోల్ నడిచింది. 40 ఏళ్ల వయసు ఉన్న హీరో(రణ్వీర్ సింగ్)తో రొమాన్స్ చేయబోతుందంటూ ఆమెను విమర్శిస్తూ పోస్టులు పెట్టారు. కానీ ధురంధర్ రిలీజ్ తర్వాత అందరూ ఆమెపై ప్రశంసలు కురిరించారు. చిన్న పిల్ల అయినా బాగా నటించిందని అభినందించారు.అయితే పార్ట్ 1లో కేవలం హీరో ప్రియురాలి పాత్రలో కనిపించిన సారా.. పార్ట్ 2 మాత్రం ఓ బిడ్డకు తల్లిగా నటించి, మెప్పించింది. ప్రస్తుతం సారా వయసు 20 ఏళ్లు. ధురంధర్ షూటింగ్ సమయంలో ఆమె వయసు 18 ఏళ్లు మాత్రమే. అంత చిన్న వయసులో తల్లి పాత్ర ఒప్పుకొని సారా పెద్ద సాహసమే చేసింది.కథపై నమ్మకంతోనే సారా ఆ పాత్ర చేసేందుకు అంగీకరించిందట. తల్లి పాత్ర ఉంటుందని చెప్పగానే ఏమాత్రం సంకోచించకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఈ విషయాన్ని ధురంధర్ సినిమా కాస్టింగ్ డైరెక్టర్ ముకేష్ చబ్రా చెప్పారు.‘పార్ట్ 2లో తల్లి పాత్ర పోషిస్తున్నానా అనే విషయాన్ని కూడా సారా అడగలేదు. కథ విని వెంటనే ఓకే చెప్పింది. దీంతో ఆమెకు లుక్ టెస్ట్ చేశాం. నేను చేసిన లుక్ టెస్ట్‌లోనూ సారానే ది బెస్ట్ అనిపించింది. అందుకే ఆ పాత్రకు ఎంపిక చేశాం’ అని ముకేష్ అన్నారు. కాగా, ధురంధర్ కాస్టింగ్‌పై అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలోని ప్రతి పాత్రకు సరైన నటుడిని ఎంచుకున్నారని, తెరపై చూస్తుంటే వారు తప్ప వేరే నటుడు అలా చేయరేమో అన్నట్లుగా పాత్రలను తీర్చిదిద్దారంటూ సినిమా చూసినవాళ్లు చెబుతున్నారు. -
దుమ్ములేపుతున్న దురంధర్ 2 కలెక్షన్స్.. 4 రోజుల్లో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్..
-
ధురంధర్ 2కి బ్లాక్‌బస్టర్ టాక్.. ట్రెండింగ్‌లో హీరోయిన్ సారా (ఫోటోలు)
-
ధురంధర్ 2పై తలైవా రివ్యూ.. సంతోషంలో డైరెక్టర్
గత ఆరునెలలుగా బాక్సాఫీస్ వద్ద ధురంధర్ పేరు మారుమోగిపోతోంది. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ 1 ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.. మూడు నెలలు కూడా తిరగకముందే దర్శకుడు ఆదిత్య ధర్ దానికి సీక్వెల్ తీసుకొచ్చాడు. మార్చి 19న ధురంధర్: ది రివేంజ్ విడుదలైంది. ఈ సినిమాపై నార్త్ నుంచి సౌత్ వరకు అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. తలైవా రివ్యూతాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ ధురంధర్ 2 చూసి రివ్యూ ఇచ్చాడు. ఆదిత్య ధర్‌ను బాక్సాఫీస్ కా బాప్ అని అభివర్ణించాడు. రణ్వీర్ సహా చిత్రయూనిట్ అందరికీ శుభాకాంక్షలు తెలిపాడు. ప్రతి భారతీయుడు తప్పక చూడాల్సిన చిత్రమని ఎక్స్ (ట్విటర్)లో కితాబిచ్చాడు. తలైవా పోస్ట్‌పై దర్శకుడు ఆదిత్య ధర్ సంతోషం వ్యక్తం చేశాడు. గర్వంగా ఉందిసర్, వినోదం అనే పదానికి మిమ్మల్నే బెంచ్‌మార్క్‌గా చూస్తూ పెరిగాం. ఎన్నో దశాబ్దాలుగా మీరు మమ్మల్ని ఏడిపించారు, నవ్వించారు, విజిల్స్ కొట్టేలా చేశారు. ఇప్పటికీ అదే గ్రేస్, స్వాగ్తో మ్యాజిక్ చేస్తూనే ఉన్నారు. అలాంటి మీరు ధురంధర్ 2 తప్పక చూడాల్సిన మూవీ అని చెప్పడం నా జీవితంలో అతిపెద్ద సూపర్‌స్టార్ మూమెంట్‌గా అనిపిస్తోంది. పెద్ద కలలను కనమని ప్రోత్సహించిన వ్యక్తి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నట్లుగా ఉంది. ఎంతో గర్వంగా ఉంది సర్. మీ మాటలు నా మనసును తాకాయి అని ఆదిత్య ధర్ రాసుకొచ్చాడు. Sir, we’ve all grown up measuring “entertainment” with just one benchmark, YOU. ❤️⁰Making us whistle, laugh, cry and feel larger than life for decades and still doing it with the same swag and grace, that’s pure magic.So for you to call Dhurandhar 2 a “must watch” feels like…— Aditya Dhar (@AdityaDharFilms) March 23, 2026 చదవండి: బ్యాండ్‌మేళం కోసం ఆస్తులమ్ముకున్న కోన వెంకట్.. నేనైతే ఆ పనిచేయను: బండ్ల గణేశ్ -
అందరి నోటా దురంధర్.. ఆ రియల్ హీరో స్టోరీ తెలుసా?
దురంధర్.. దురంధర్.. దురంధర్.. ఇప్పుడు ఎవరినీ నోటా విన్నా ఆ ఒక్క పేరే వినిపిస్తోంది. గతేడాది రిలీజైన ఈ మూవీ సీక్వెల్ ప్రస్తుతం థియేటర్లను షేక్ చేస్తోంది. బాక్సాపీస్ వద్ద ఊహకందని రికార్డులు సృష్టిస్తోంది. రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన దురంధర్ ది రివెంజ్ మార్చి 19న రిలీజై ఊచకోత కోస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ దాటేసిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది.ఈ నేపథ్యంలో అసలు దురంధర్ ఎవరు? అనే అంశంపై చర్చ నడుస్తోంది. ఇంతకీ ఆ రియల్ దురంధర్ ఎవరినీ తెగ నెటిజన్స్ తెగ ఆరా తీస్తున్నారు. ఆడియన్స్‌కు ఇంతలా కనెక్ట్ అయిన ఆ పాత్ర ఎవరిది? అసలు ఆ వ్యక్తి ఎవరు? అసలు అతను బతికే ఉన్నాడా? అనే వివరాల కోసం తెగ వెతికేస్తున్నారు. మరి ఆ వివరాలేంటో మీరు కూడా తెలుసుకోవాలనుకంటున్నారా? అయితే ఈ స్టోరీ చదివేయండి.రియల్ ధురంధర్ ఆయనే..రవీంద్ర కౌశిక్.. ఈ పేరు చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు. ఆర్మీలో మేజర్ స్థాయికి ఎదిగిన రవీంద్ర.. తన ధైర్య సాహసాలతో రాలో(RAW) బ్లాక్ టైగర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీనే బ్లాక్ టైగర్ అనే బిరుదు ఇవ్వడం విశేషం. అయితే స్పై ఏజెంట్‌గా పాకిస్తాన్ వెళ్లిన రవీంద్ర కౌశిక్.. పాక్ ఆర్మీలో చేరి మేజర్ స్థాయికి ఎదిగారు. భారతదేశపు అత్యంత ధైర్యవంతులైన రా ఏజెంట్లలో ఒకరిగా నిలిచారు.భారత్‌కు చెందిన రవీంద్ర కౌశిక్ పాకిస్థాన్‌లో రహస్యంగా ప్రవేశించి.. పాక్ జాతీయుడిగా మారిపోయి పాకిస్థాన్ సైన్యంలో చేరారు. అక్కడి సైనిక కదలికలు, పాకిస్థాన్ అణు కార్యక్రమం గురించి కీలకమైన సమాచారాన్ని ఇండియాకు అందించారు. అయితే ఊహించని విధంగా 1983లో పాకిస్థాన్ గూఢచార సంస్థ ISIకి దొరికిపోయాడు. ఆ తర్వాత తన మిగిలిన జీవితాన్ని జైలులోనే గడిపారు.23 ఏళ్ల వయసులోనే..రవీంద్ర కౌశిక్ 1975లో అంటే కేవలం 23 ఏళ్ల వయసులోనే నబీ అహ్మద్ షకీర్ అనే పేరుతో పాకిస్తాన్లోకి ప్రవేశించారు. అక్కడే కరాచీ విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రంలో డిగ్రీ సంపాదించి.. పాకిస్తాన్ సైన్యంలో చేరారు. తన టాలెంట్‌తో ఏకంగా మేజర్ హోదాను పొందారు. 1979 నుండి 1983 మధ్య దాదాపు 4 ఏళ్ల పాటు కౌశిక్ రహస్యంగా భారతదేశానికి కీలకమైన సమాచారాన్ని పంపాడు. అక్కడి పంజాబ్‌లోని సైనిక కదలికలు.. కహుటాలోని పాకిస్తాన్ అణు కర్మాగారం గురించి సున్నితమైన వివరాలను అందించాడు. అంతేకాకుండా అమానత్ అనే పాకిస్తానీ మహిళను వివాహం చేసుకున్నారు. వీరికి ఓ బిడ్డ కూడా పుట్టారు.అయితే 1983లో రా (RAW) సంస్థ ఇనాయత్ మసీహ్ అనే జూనియర్ స్పైని.. రవీంద్రను కలవడానికి పంపింది. కానీ మసీహ్ వెంటనే అక్కడి ఐఎస్ఐకి దొరికిపోయాడు. మసీహ్ ఇచ్చిన సమాచారం ఆధారంగా కౌశిక్‌ను కలవాల్సిన ముల్తాన్‌లోని పార్కును ఐఎస్ఐ గుర్తించింది. దీంతో 1983 సెప్టెంబర్‌లో రవీంద్ర కౌశిక్‌ను అరెస్టు చేశారు. ఆ తర్వాత కౌశిక్‌ను సియాల్కోట్లో విచారించి.. కోట్ లఖ్‌పత్, మియాన్వాలి లాంటి అత్యంత కట్టుదిట్టమైన భద్రత గల జైళ్లకు తరలించారు. 1985లో పాకిస్తానీ సైనిక న్యాయస్థానం అతనికి మరణశిక్ష విధించింది. కానీ ఆ తరువాత దానిని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. అయితే రవీంద్ర కౌశిక్ 2001 నవంబర్ 21న.. మియాన్వాలి సెంట్రల్ జైలులో క్షయవ్యాధి, గుండె జబ్బుతో మరణించాడు.రవీంద్ర కౌశిక్ స్వస్థలం ఎక్కడంటే? రవీంద్ర కౌశిక్ స్వస్థలం రాజస్థాన్‌లోని శ్రీ గంగానగర్ పట్టణం. 1952 ఏప్రిల్ 11న భారత్-పాకిస్తాన్ సరిహద్దుకు సమీపంలో ఉన్న శ్రీ గంగానగర్‌లో జన్మించారు. అక్కడే ఆయన పంజాబీతో పాటు స్థానిక భాషలు నేర్చుకున్నారు. గంగానగర్‌లోని ఎస్.డి. బిహానీ కళాశాలలో కామర్స్ చదువుతున్నప్పుడే నాటకరంగంలో పాల్గొని తన నటన నైపుణ్యాలను ప్రదర్శించారు.అదే సమయంలో 1973లో లక్నోలో జరిగిన ఒక జాతీయ నాటక పోటీలో రవీంద్ర ప్రదర్శన ఇచ్చారు. ఒక భారతీయ సైనికుడి పాత్రలో ఏకపాత్రాభినయం చేశారు. అతని ప్రదర్శన రా అధికారుల దృష్టిని ఆకర్షించింది. ఆ వెంటనే ఢిల్లీలో రహస్య మిషన్ కోసం అతనికి తీవ్రమైన శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ సమయంలో ఇస్లాం గురించి.. పాకిస్తానీ ఉర్దూ భాష, ఆ దేశ భౌగోళిక స్వరూపం గురించి పూర్తిగా తెలుసుకున్నారు. రెండేళ్ల కఠిన శిక్షణ తర్వాత రా స్పైగా పాకిస్తాన్లో అడుగుపెట్టాడు. -
దురంధర్-2 రిలీజ్.. పాకిస్తాన్ వీడియోలు వైరల్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ దురంధర్-2 థియేటర్లలో సందడి చేస్తోంది. మార్చి 19న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. కేవలం మూడు రోజుల్లేనే రూ.500 కోట్ల మార్క్ దాటిన ఈ చిత్రం పలు రికార్డులు తిరగరాస్తోంది. ఇప్పటికే నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.700 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది.దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ సినిమా హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజైంది. పాకిస్తాన్ నేపథ్యంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తాజాగా ఈ మూవీ రిలీజ్ వేళ సోషల్ మీడియాలో పాకిస్తాన్‌కు సంబంధించిన వీడియోలు వైరలవుతున్నాయి. ఇప్పుడు కరాచీలోని లియారి ప్రాంతంలో పోలీసులు స్పై లాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారేమోననని సోదాలు చేస్తున్నారు. అక్కడి ప్రాంతంలోని లోకల్ ప్రజలంతా కలిసి ఇండియన్ స్పైల కోసం వెతుకుతున్న వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. అయితే ఈ వీడియో ఇప్పటిదా.. లేదాంటే పాతదా? అనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ధురంధర్ 2 తర్వాత పాకిస్తాన్ అంతటా పానిక్ మొదలైంది!ఇప్పుడు కరాచీలోని లియారి ప్రాంతంలో పోలీసులు, లోకల్ ప్రజలు కలిసి ప్రతి వీధిలో ఇండియన్ స్పైలను వెతుకుతున్నారు.వాళ్ల ఆశ ఏమిటంటే—హమ్జా అలీ మజారిని పట్టుకుంటామని!#Dhurandhar2 #DhurandharTheRevenge #Dhurandhar #Pakistan… pic.twitter.com/7Emn1qkEPc— Tupaki (@tupaki_official) March 23, 2026 -
జూన్‌లో ధురంధర్ 3? నిజమెంత?
ఏదైనా సినిమా బాగుందంటే చాలు దాని కొనసాగింపు కోసం జనం ఎదురుచూస్తుంటారు. బాహుబలి, పుష్ప, కేజీఎఫ్, కాంతార వంటి చిత్రాలు కూడా అలాంటి బజ్ క్రియేట్ చేసుకుని సీక్వెల్లో కూడా కాసుల వర్షం కురిపించాయి. ఇప్పుడు ధురంధర్ సినిమా విషయంలోనూ అదే జరుగుతోంది.ధురంధర్ బ్లాక్బస్టర్రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ మూవీ 2025 డిసెంబర్లో విడుదలైంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం చూసేందుకు జనం థియేటర్ల ఎదుట క్యూ కట్టారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా రూ.1350 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసింది. దీంతో దీని సీక్వెల్ కోసం జనం వెయిట్ చేశారు.ధురంధర్ 3 రాబోతోందా?అయితే వారిని మరీ ఎక్కువ ఎదురుచూడనివ్వకుండా మూడు నెలల్లో ధురంధర్ 2ని తీసుకొచ్చారు మేకర్స్. మార్చి 19న ధురంధర్: ది రివేంజ్ విడుదలైంది. నాలుగు రోజుల్లోనే రూ.761 కోట్ల కలెక్షన్స్ రాబట్టి అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. ఈ క్రమంలో ధురంధర్ 3 రాబోతోందని ప్రచారం మొదలైంది.ఫేక్ ఫోటోఅది కూడా మరో మూడు నెలల్లోనే విడుదల కాబోతుందని రూమర్ సృష్టించారు. జూన్ 14న ధురంధర్: ద ఫైనల్ చాప్టర్ రాబోతుందంటూ ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) సాయంతో సృష్టించిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో వదిలారు. ఇంకేముంది, అది నెట్టింట వైరల్‌గా మారగా అది నిజమని చాలామంది భ్రమపడుతున్నారు.సినిమాసినిమా చివర్లో పేర్లు పడి ఆగిపోయేంతవరకు మీరు సీటులో నుంచి లేవొద్దు అని ఆదిత్య ధర్ ప్రేక్షకులకు సూచించాడు. ఆ లెక్కన నిజంగానే చివరాఖరులో మూడో భాగం కోసం ప్రకటించారేమోనని పలువురూ భావించారు. కానీ, అందులో ఏమాత్రం నిజం లేదు. ఇప్పటివరకు చిత్రయూనిట్ మూడో భాగం గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. కాబట్టి అదంతా ఫేక్ న్యూస్ అని అర్థమవుతోంది. Is This For Real ? 3 Parts #Dhurandhar The Final Chapter on 14 June 2026 pic.twitter.com/EqAINSzpxN— INDIAN (@hindus47) March 18, 2026 చదవండి: కరుప్పు ఫస్ట్ ఛాయిస్ సూర్య కాదా? -
రికార్డులు బ్రేక్ చేసినా 'పుష్ప2'ని దాటలేకపోయింది
ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్ 2' సినిమా సంచలనాలు సృష్టిస్తోంది. బీభత్సమైన అంచనాలతో బరిలోకి దిగిన ఈ మూవీ ఉత్తరాదితో పాటు దక్షిణాదిలోని బీ,సీ సెంటర్లలోనూ హవా చూపిస్తుండటం ట్రేడ్ వర్గాలని ఆశ్చర్యపరుస్తోంది. మొదటి రోజు నుంచి వందల కోట్ల వసూళ్లు సాధిస్తున్న ఈ చిత్రం ఇప్పుడు తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి ఊహించని రికార్డులు సొంతం చేసుకుంది. ఇంతకీ నాలుగు రోజుల కలెక్షన్స్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?(ఇదీ చదవండి: ధురంధర్ 2 సక్సెస్: 28 ఏళ్ల నాటి లేఖ వైరల్)తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి 'ధురంధర్ 2' చిత్రానికి రూ.750 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఆదివారం ఒక్కరోజే కేవలం మన దేశంలోనే రూ.115 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదో రికార్డ్. ఇప్పటివరకు వీకెండ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'పుష్ప 2' రూ.762 కోట్లతో అగ్రస్థానంలో ఉండగా.. దీని తర్వాతి స్థానంలోకి 'ధురంధర్ 2' వెళ్లింది. ఈ క్రమంలోనే బాహుబలి 2 (రూ.591 కోట్లు), ఆర్ఆర్ఆర్ (రూ.470 కోట్లు), కల్కి 2898 ఏడీ (రూ.500 కోట్లు) తదితర రికార్డులు బ్రేక్ చేసింది.మరోవైపు బాలీవుడ్‌లోనూ ఇప్పటివరకు షారుఖ్ ఖాన్ 'పఠాన్' పేరిట రూ.287 కోట్ల కలెక్షన్స్ రికార్డ్ ఉంది. దీన్ని 'ధురంధర్ 2' అధిగమించడంతో పాటు సరికొత్త ఘనత సాధించింది. చూస్తుంటే ఇప్పుడప్పుడే ఈ చిత్ర రచ్చ ఆగేలా లేదు. తొలి వారం పూర్తయ్యేసరికి రూ.1000 కోట్లు సాధించడం పక్కా అనిపిస్తుంది. అలానే రూ.2000 కోట్ల మార్క్‌ని కూడా త్వరలోనే అందుకునే అవకాశముందని విశ్లేషకులు మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 19 సినిమాలు) -
ధురంధర్ 2 సక్సెస్: 28 ఏళ్ల నాటి లేఖ వైరల్
బ్లాక్‌బస్టర్ ధురంధర్‌కు కొనసాగింపుగా వచ్చిన చిత్రం ధురంధర్: ద రివేంజ్. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపిస్తోంది. అటు సోషల్ మీడియాలో నార్త్ నుంచి సౌత్ వరకు ఎందరో సెలబ్రిటీలు దర్శకుడు ఆదిత్య ధర్‌ను, అతడి సినిమాను ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. ఈ మూవీలో నటించిన అందరికీ మంచి పేరు, గుర్తింపు వచ్చింది. 28 ఏళ్ల నాటి లేఖఈ క్రమంలో ధురంధర్ 2లో మొహమ్మద్ ఆలంగా నటించిన గౌరవ్ గేరా తన కెరీర్ తొలినాళ్లలో ఎదుర్కొన్న ఇబ్బందులను బయటపెట్టాడు. 1998లో ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన రోజుల్లో పేరెంట్స్‌కు రాసిన లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఇది నేను 1998 డిసెంబర్ 3న మా అమ్మానాన్నలకు రాసిన లేఖ. ముంబైకి వచ్చి అప్పటికింకా నెల రోజులు కూడా కాలేదు. అప్పట్లో ఈమెయిల్స్ గట్రా ఏవీ లేవు.. ఇదిగో ఇలా ఉత్తరాలు రాసుకునేవాళ్లం. అమ్మానాన్న థాంక్యూఆ తర్వాత టీవీ, సినిమా, యాడ్స్, రేడియో, టిక్‌టాక్ రీల్స్.. ఇలా ఎన్నో ఒడిదుడుకులతో నా ప్రయాణం సాగింది. భగవంతుడు నాపై ఎంతో దయచూపించాడు. ఇదిగో ఇలా ధురంధర్లో నటించే అవకాశం.. రానున్న రోజుల్లో భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు. ఈ జర్నీలో నాకు అండగా నిలిచిన అమ్మానాన్నకు ధన్యవాదాలు అంటూ లేఖను పంచుకున్నాడు.లేఖలో ఏముందంటే?అమ్మానాన్న, ఎలా ఉన్నారు? నేనిక్కడ క్షేమంగానే ఉన్నాను. ప్రస్తుతానికి డబ్బుపరంగా ఏమీ కలిసిరావడం లేదు. కానీ, త్వరలోనే అంతా మంచే జరుగుతుందని ఆశిస్తున్నాను. ఢిల్లీతో పోలిస్తే ఇక్కడ అవకాశాలు ఎక్కువే.. ఖర్చు తగ్గించుకునేందుకు నేను స్నేహితుడితో కలిసి ఓ చిన్న గదిలో ఉంటున్నాను. ఫోన్, కరెంట్, గ్యాస్, వాటర్ బిల్లుతో పాటు భోజన ఖర్చులు కూడా ఇద్దరం పంచుకుంటున్నాం. భవిష్యత్తుపై కొండంత ఆశ ఉంది. కానీ నేను నేర్చుకోవాల్సింది కూడా చాలా ఉంది అని రాసుకొచ్చాడు. ఇది చూసిన నటీనటులు, అభిమానులు మీరు చాలా దూరం వచ్చారు, మీ కథ వింటుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Gaurav Gera (@gauravgera) చదవండి: ద 50 షో.. విన్నర్‌గా శివ్ ఠాక్రే.. ప్రైజ్‌మనీ మాత్రం ఎవరికంటే? -
పవన్ దొరికిపోతే.. యష్ తప్పించుకున్నాడు!
కొన్నిసార్లు పోటీ కంటే తప్పుకోవడం వల్ల కూడా మంచి జరగొచ్చు. అవును ప్రస్తుతం సోషల్ మీడియాలో నెటిజన్లు, మూవీ లవర్స్ మధ్య ఇలాంటి ఓ ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇదంతా కూడా 'ధురంధర్ 2' గురించే. ఈ మూవీ నుంచి యష్ ఎలా తప్పించుకున్నాడు. పవన్ కల్యాణ్ ఎలా దొరికిపోయాడనేదే ఈ స్టోరీ.(ఇదీ చదవండి: ఎక్కువ సినిమాల్లో నన్ను పెట్టుకోండి: రాజశేఖర్)గతేడాది డిసెంబరు 5న 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడు సీక్వెల్ గురించి క్లారిటీ ఇచ్చారు. మార్చి 19న థియేటర్లలోకి వస్తుందని ప్రకటించారు. అయినా సరే 'కేజీఎఫ్' ఫేమ్ యష్ 'టాక్సిక్' మూవీని అదే తేదీకి తీసుకొస్తామని మేకర్స్ ఘనంగా అనౌన్స్ చేశారు. మార్చి మొదలైన వరకు రెండు పాన్ ఇండియా సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోటీపడతాయేమోనని అనుకున్నారు. కానీ ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా పశ్చిమాసియా దేశాల్లో అనిశ్చితి వాతావరణాన్ని కారణంగా చూపిస్తూ 'టాక్సిక్' మూవీని వాయిదా వేశారు. షూటింగ్ ఇంకా పెండింగ్ ఉండటం వల్లే ఇలా చేశారని మాట్లాడుకుంటున్నారు.మరోవైపు 'ధురంధర్ 2' రిలీజైన వారం తర్వాత అంటే మార్చి 26న తమ సినిమా రిలీజ్ చేస్తామని 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలుత చెప్పింది. కానీ 'టాక్సిక్' వాయిదా పడటంతో వారం ముందుకొచ్చారు. ధురంధర్ హిందీ సినిమానే అయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి హైప్ ఉంది. ఇదేమైనా 'ఉస్తాద్..'కి నెగిటివ్ అవ్వొచ్చేమోనని పలువురు అభిప్రాయపడ్డారు. అయితే రిలీజ్ రోజున 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ రాకపోవడం, ఉగాది పండగ వల్ల 'ఉస్తాద్..'కి ఉన్నంతలో కలిసొచ్చింది.కానీ రెండో రోజు నుంచి 'ధురంధర్ 2' హిందీ బుకింగ్స్ పెరిగాయి. అదే టైంలో మూస కంటెంట్ వల్ల 'ఉస్తాద్..' వసూళ్లలోనూ విపరీతమైన డ్రాప్ కనిపించింది. అది మరింతగా కొనసాగుతోంది. ఈ వీకెండ్ వరకు ఓకే గానీ సోమవారం నుంచి పవన్ సినిమాకు అగ్నిపరీక్షే. ఎందుకంటే వర్కింగ్ డేస్‌లోనూ ఈ మూవీ నిలబడితే పర్లేదు. అలా జరగకపోతే మాత్రం కష్టమే. మరోవైపు 'ధురంధర్ 2' తెలుగు షోలకు ఇచ్చిన స్క్రీన్లు సరిపోవడం లేదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి థియేటర్ ఓనర్స్ ఈ సినిమా వైపు మొగ్గుచూపుతారా? లేదంటే 'ఉస్తాద్..'నే కొనసాగిస్తారా అనేది చూడాలి?(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?) -
'ధురంధర్ 2'.. ఇంత పొరపాటు ఎలా చేశారు?
ప్రస్తుతం భారతీయ బాక్సాఫీస్ దగ్గర 'ధురంధర్ 2' హవా కనిపిస్తోంది. పేరుకే హిందీ సినిమా అయినప్పటికీ డబ్బింగ్ రూపంలో తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరిస్తోంది. దీని ప్రభావమో ఏమో గానీ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' కలెక్షన్స్ కూడా పూర్తిగా డౌన్ అయిపోయాయి. అయితే 'ధురంధర్ 2' చూసి చాలామంది ఎంజాయ్ చేస్తుండగా.. మరికొందరు మాత్రం ప్రొపగాండా మూవీ అని విమర్శిస్తున్నారు. వీటి సంగతి కాసేపు పక్కనబెడితే మూవీలో ఓ పొరపాటు మాత్రం అలానే వదిలేశారు. దీన్ని ఇప్పుడు నెటిజన్లు కనిపెట్టారు.(ఇదీ చదవండి: పవన్-హరీశ్ శంకర్ మూడో సినిమా.. అయ్యే పనేనా?)గతేడాది డిసెంబరులో 'ధురంధర్' తొలి భాగం రిలీజ్ కాగా.. ఈ శుక్రవారం(మార్చి 19) సీక్వెల్ విడుదలైంది. ప్రమోషన్స్ ఏం లేకపోయేసరికి వాయిదా పడుతుందేమో అని చాలామంది అనుకున్నారు. కానీ చెప్పిన తేదీకే థియేటర్లలోకి వచ్చారు. కాకపోతే తెలుగు వెర్షన్ మాత్రం రెండు రోజులు ఆలస్యంగా అంటే నిన్నటి(మార్చి 21) నుంచి అందుబాటులోకి తెచ్చారు.అసలు విషయానికొస్తే ఈ మూవీ ఇంటర్వెల్ సీన్లో హీరో, పిండా అనే పాత్రధారి మధ్య బాత్రూమ్లో చిన్నపాటి ఫైట్ సీన్ జరుగుతుంది. మూవీలో ఈ సన్నివేశం చాలామందికి ఆకట్టుకున్నప్పటికీ.. అద్దంలో కెమెరామ్యాన్ కూడా కనిపిస్తాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు ట్విటర్లో వైరల్ అవుతోంది. ఈ పొరపాటు అసలు మేకర్స్ చూసుకోలేదా అని మాట్లాడుకుంటున్నారు. అయితే చెప్పిన తేదీన రిలీజ్ చేయాలనే హడావుడిలో దీన్ని మర్చిపోయింటారేమో అని మాట్లాడుకుంటున్నారు.'ధురంధర్ 2' కలెక్షన్స్ విషయానికొస్తే.. ప్రస్తుతం రూ.500 కోట్ల మార్క్ దాటేసినట్లు తెలుస్తోంది. అలానే ఓవర్సీస్లోనూ 16 మిలియన్ డాలర్లు సాధించినట్లు టాక్. తొలి భాగంలానే ఇది కూడా లాంగ్ రన్లో మరిన్ని వందల కోట్లు సొంతం చేసుకునేలా కనిపిస్తుంది. మరి 'ధురంధర్ 2' రచ్చ.. ఎన్ని వందల కోట్ల దగ్గర ఆగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: క్రికెట్ రాజకీయాలకు బలైన 'ధురంధర్' దర్శకుడు)A Cameraman showing in this scene.Peak Detailing by Aditya Dhar Damm 🤣#Dhurandhar2 #DhurandherTheRevenge pic.twitter.com/LDjDG8nReP— Sunil Goriya (@Sunil_Goriya) March 21, 2026 -
సల్మాన్ ఖాన్ పేరు.. నన్ను ధురంధర్ 2లో తీసేశారనుకున్నా!
రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ధురంధర్ 2 బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీలో డానిష్ ఇక్బాల్.. బడే సాహెబ్ అలియాస్ దావూద్ ఇబ్రహీంగా నటించాడు. అయితే సినిమాలో తనను ఎక్కడ తీసేస్తారో అని తెగ భయపడిపోయానంటున్నాడు డానిష్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అతడు మాట్లాడుతూ.. ధురంధర్ 1 రిలీజయ్యాక సీక్వెల్లో బడే సాహెబ్‌గా ఎవరు కనిపించనున్నారని జనాల్లో ఆసక్తి మొదలైంది. నన్ను తీసేశారనుకున్నా..ఈ క్రమంలో ఎంతోమంది పేర్లు తెరపైకి వచ్చాయి. వారిలో సల్మాన్ ఖాన్, ఇమ్రాన హష్మీ పేర్లు కూడా ఉన్నాయి. అది చూసి ఒకరకంగా నేను చాలా భయపడ్డాను. బడే సాహెబ్ కోసం అప్పటికే నేను సెలక్ట్ అయ్యాను. కానీ నన్ను పక్కనపెట్టేశారేమో.. నా స్థానంలో పెద్ద స్టార్స్‌ను తీసుకుంటున్నారేమో అని కంగారుపడ్డాను. డైరెక్టర్ ఆదిత్య ధర్‌కు ఫోన్ చేసి కనుక్కుందామా? అని ఆందోళన చెందాను.ఆ రెండు పాత్రలు ఒక్కటే అని తెలీదుకానీ, తర్వాత అలాంటిదేం లేదని తెలిసి ఊపిరి పీల్చుకున్నాను. నిజానికి బడే సాహెబ్, దావూద్ ఇబ్రహీం ఒక్కరేనని నాకూ ముందు తెలీదు. నాది మంచానికే పరిమితమైన దావూద్ ఇబ్రహీం పాత్ర అని మాత్రమే తెలుసు. తర్వాత హీరో బడే సాహెబ్ కోసం వెతుకుతున్నప్పుడు ఆయనెవరని అందరూ ఆలోచించడం మొదలుపెట్టాం. పర్వీజ్ ముషారఫా? ఒసామా బిన్ లాడెనా? అనుకున్నాం. అదే సమయంలో దావూదే బడే సాహెబా? అన్న అనుమానమూ వచ్చింది. చివరకు అదే జరిగింది.మేకప్ కోసం 12 గంటలుముసలి వయసులో ఉన్న దావూద్‌గా కనిపించడం కోసం దాదాపు ఏడెనిమిది గంటలు శ్రమించాల్సి వచ్చింది. ఆ ప్రోస్తటిక్ మేకప్‌ను తీసేందుకు కనీసం రెండుమూడు గంటలైనా పెట్టేది. అలా మేకప్‌కే 12 గంటల సమయం అయిపోయేది అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే మార్చి 19న రిలీజైన ధురంధర్ 2 కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. -
ధురంధర్ 2 తెలుగు వర్షన్ రిలీజ్ ఎప్పుడు? అసలు కారణం ఏంటి?
-
'ధురంధర్' విజయం వెనుక తెలుగు హిట్ సినిమా: ఆదిత్య ధర్
రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్యధర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ధురంధర్- 2: ది రివెంజ్’.. బాక్సాఫీస్ వద్ద మూడురోజుల్లోనే రూ. 500 కోట్ల గ్రాస్ క్లబ్‌లోకి చేరిపోయింది. గతేడాదిలో విడుదలైన పార్ట్-1 భారీ విజయం అందుకోవడంతో దర్శకుడు ఆదిత్య ధర్ పేరు పాన్ ఇండియా రేంజ్లో ట్రెండ్ అవుతుంది. అయితే, ఇంతటి బ్లాక్ బస్టర్ సీక్వెల్స్‌ను డైరెక్ట్ చేసిన ఆదిత్య ధర్ తాజాగా తెలుగు సినిమాపై ప్రశంసలు కురిపించారు. 'ధురంధర్' సినిమా విజయం వెనుక తెలుగు హిట్ సినిమా స్పూర్తి అని ఆయన పంచుకున్నారు.నాగార్జున ఐకానిక్ చిత్రం 'శివ'(1989)పై దర్శకుడు ఆదిత్య ధర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ చిత్రాన్ని నేటికీ తప్పక చూడాలని ఆయన అన్నారు. తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు శివ సినిమా చూసినట్లు గుర్తుచేసుకున్నారు. శివ చిత్రం చాలామంది దర్శకులకు దిక్సూచిగా పనిచేస్తుందని తెలిపారు. ఈ సినిమా ద్వారా టెక్నికల్ వాల్యూస్, మేకింగ్ స్టైల్లో కొత్త ఒరవడిని RGV సృష్టించారని ఆయన మెచ్చుకున్నారు.శివ సినిమాలోని ఇళయరాజా సంగీతంపై కూడా ఆదిత్య ధర్ ప్రశంసించారు. ఇందులో విప్లవాత్మకమైన సౌండ్ డిజైన్ ఉన్నట్లు ఆయన క్లారిటీ ఇచ్చారు. 'శివ' చిత్రం ఇప్పటికీ తాజాగా, శక్తివంతంగా అనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఆ చిత్రం భారతీయ సినిమా భాషను ఎలా మార్చిందో, తరతరాల చిత్రనిర్మాతలకు ఎలా స్ఫూర్తినిచ్చిందో ఆయన మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఒక ఆధునిక దర్శకుడి నుండి వచ్చిన ఈ అరుదైన ప్రశంస, నిజమైన క్లాసిక్లు కాలంతో పాటు మసకబారవని నిరూపిస్తుంది. రామ్‌గోపాల్ వర్మ తన సృజనాత్మక మేకింగ్‌తో తరతరాల దర్శకులకు స్ఫూర్తిగా నిలిచారని, ఆదిత్య ధర్ వ్యాఖ్యలు తెలియజేస్తున్నాయి. A 6 year old kid saw #Shiva and today he became #AdityaDhar https://t.co/Y0Fh3GP55Z pic.twitter.com/ARbIY4t2j0— Nag Mama Rocks (@SravanPk4) March 21, 2026 -
దురంధర్-2లో టీమిండియా క్రికెటర్స్.. ఈ వీడియో చూశారా?
ఇప్పుడు ఎక్కడ చూసినా దురంధర్ ఫీవర్ కనిపిస్తోంది. మార్చి 19న రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ప్రీమియర్స్‌తోనే వసూళ్లు సునామీ మొదలెట్టిన ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే రూ.500 కోట్ల మార్క్ దాటేసింది. ఆదిత్య ధర డైరెక్షన్లో వచ్చిన ఈ సీక్వెల్ హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ విడుదలైంది. ఈ మూవీపై టాలీవుడ్ స్టార్స్‌తో పాటు పలువురు సినీ నటులు ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకధీరుడు రాజమౌళి సైతం దురంధర్-2 మూవీని పొగిడారు.దురంధర్-2 రిలీజ్ వేళ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో హల్చల్ చేస్తోంది. దురంధర్-2 మూవీపై రీల్స్, వీడియోలు పెద్దఎత్తున వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఓ వీడియో నెట్టింట అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమాలో టీమిండియా క్రికెటర్స్ నటిస్తే ఎలా ఉంటుంది? అనే కోణంలో ఓ వీడియోను రూపొందించారు. రణ్‌వీర్‌సింగ్ పాత్రలో విరాట్ కోహ్లీ కనిపించగా.. జమీల్ జమాలీ పాత్రలో వీరేంద్ర సెహ్వాగ్ ఉండేలా క్రియేట్ చేశారు. ఈ వీడియో చేసిన ఫన్నీ కోసమే అయినా.. క్రికెటర్స్ ఈ మూవీలో ఎలా కనిపిస్తారో చూస్తే మాత్రం అద్భుతంగా అనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ వీడియో మీరు కూడా చూసేయండి. pic.twitter.com/GalcyV6WIe ఇండియన్ క్రికెటర్లు దురంధర్‌లో నటిస్తే? 💀🔥— Tupaki (@tupaki_official) March 21, 2026 -
దూసుకెళ్తోన్న దురంధర్-2.. కేవలం మూడు రోజుల్లోనే అన్ని కోట్లా?
రణ్‌వీర్‌సింగ్ హీరోగా వచ్చిన దురంధర్-2 హవా కొనసాగుతోంది. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. ప్రీమియర్స్‌తోనే రికార్డ్ స్థాయిలో వసూళ్లు సాధించిన ఈ సినిమా కేవలం రెండు రోజుల్లోనే రూ.300 కోట్ల మార్క్ దాటేసింది. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మరో రికార్డ్‌ను తన ఖాతాలో వేసుకుంది. కేవలం మూడు రోజుల్లోనే రూ. 500 కోట్ల క్లబ్లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా రూ.501 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ కలెక్షన్స్‌తో ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించింది.నెట్ వసూళ్ల పరంగా చూస్తే మూడు రోజుల్లోనే రూ.రూ. 339.27 కోట్లు వసూలు చేసింది. మూడో రోజు అత్యధికంగా రూ.113 కోట్ల నికర వసూళ్లు రాబట్టింది. కేవలం మూడో రోజు వసూళ్లతోనే హిందీ సినిమా చరిత్రలోనే ఒక కొత్త అధ్యాయాన్ని సృష్టించింది. కేవలం ఇండియాలో మాత్రమే కాదు.. ఓవర్సీస్లోనూ దురంధర్-2 దూసుకెళ్తోంది.ఉత్తర అమెరికాలో 'ధురంధర్ 2' ఏకంగా 4,405 షోలు ప్రదర్శిస్తున్నారు. ఒక ఇండియన్ సినిమా ఇంత భారీ స్థాయిలో విడుదల కావడం ఇదే మొదటిసారి. మూడో రోజు కూడా రెండు లక్షలకు టికెట్లకు పైగా విక్రయించారు. కేవలం అడ్వాన్స్ బుకింగ్‌ల ద్వారానే సుమారు రూ.23.70 కోట్ల భారీ వసూళ్లను నమోదు చేసింది. ఈ వసూళ్లను చూస్తే ఉత్తర అమెరికా మార్కెట్లో ఒక ఇండియన్ మూవీ ఒక్క రోజులో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా 'ధురంధర్ 2' నిలవనుంది. యూకేలోనూ దురంధర్-2 షోలు హౌస్‌పుల్‌గా రన్ అవుతున్నాయి. బెల్ఫాస్ట్ నగరంలో ఏడు షోలు హౌస్‌పుల్‌గా ప్రదర్శించారు. ఇదే జోరు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా రూ. 2 వేల కోట్ల క్లబ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. -
దురంధర్-2 రిలీజ్.. టాక్సిక్ సేఫ్.. మరి ఉస్తాద్ సంగతేంటి?
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా దురంధర్ పేరే వినిపిస్తోంది. గతేడాది రిలీజైన దురంధర్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడంతో సీక్వెల్‌గా భారీ హైప్ క్రియేట్ చేసింది. అందుకు తగ్గట్టుగానే మార్చి 19న రిలీజైన దురంధర్-2 బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. రెండు రోజుల్లోనే రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డ్ సృష్టించింది. కేవలం ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్లోనూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఈ సినిమా నార్త్ అమెరికాలోనూ 3.95 మిలియన్ల ఓపెనింగ్ వసూళ్లు సాధించింది. అడ్వాన్స్ బుకింగ్స్‌తో కలిపి ఇప్పటికే 10.5 మిలియన్ డాలర్ల మార్క్ దాటేసినట్లు తెలుస్తోంది. టాక్సిక్ టీమ్ సేఫ్.. మరీ ఉస్తాద్ సంగతేంటి?యశ్ హీరోగా వచ్చిన టాక్సిక్ మార్చి 19న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ దురంధర్ క్రేజ్ చూసి మేకర్స్ తెలివిగా తప్పుకున్నారు. ఈ లెక్కన చూస్తే టాక్సిక్ టీమ్ చేసిన పని కరెక్టే అనిపిస్తోంది. కానీ తెలుగు హీరో పవన్ కల్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రం బాక్సాఫీస్ పోటీకి దిగింది. దురంధర్-2 మానియాకు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రిలీజ్ అయిందన్న విషయం కూడా చాలామంది సినీ ప్రియులకు తెలియడం లేదు. దురంధర్ దెబ్బకుఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కూడా రిలీజ్ అయిందా? అని కొంతమంది ఆడియన్స్ అడుగుతున్నారు. మరోవైపు చాలా థియేటర్లలో దురంధర్-2 మూవీకి టికెట్స్ కూడా దొరకడం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్లు మాత్రం ఖాళీగా దర్శనమిస్తున్నాయి.ఇంత భారీ హైప్ ఉన్న మూవీ రిలీజ్ అయ్యే సమయంలో ఉస్తాద్ భగత్ సింగ్ మేకర్స్ కాస్తా ఆలోచించి ఉండాల్సిందనే ఆడియన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా దురంధర్-2 బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. గతేడాది డిసెంబర్ 5న కేవలం హిందీలో మాత్రమే విడుదలైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సీక్వెల్ మూవీ క్రేజ్ చూస్తుంటే రూ.2 వేల కోట్ల మార్క్ చేరుకోవడం పక్కా అని తెలుస్తోంది. ఈ చిత్రాలను బాలీవుడ్ దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించారు. -
క్రికెట్ రాజకీయాలకు బలైన 'ధురంధర్' దర్శకుడు
'డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యాను'.. ఇండస్ట్రీలో ఎక్కువగా ఈ మాట వినిపిస్తూ ఉంటుంది. నటుడు లేదా దర్శకుడు అవ్వాలని ఆలోచనతో ఇండస్ట్రీలో అడుగుపెట్టేవాళ్లు కొందరైతే.. అనుకోని విధంగా ఇక్కడొచ్చి అద్భుతమైన గుర్తింపు తెచ్చుకునేవాళ్లు మరికొందరు. అలాంటి వాళ్లలో 'ధురంధర్' డైరెక్టర్ ఆదిత్య ధర్ ఒకడు. క్రికెటర్ కావాల్సిన ఇతడు పాన్ ఇండియా లెవల్లో ఎలాంటి గుర్తింపు తెచ్చుకున్నాడు. అసలు ఆదిత్య బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?)ఢిల్లీలో పుట్టిన ఆదిత్య ధర్, కశ్మీర్ పండిట్ కుటుంబానికి చెందిన కుర్రాడు. టీమిండియాకి ఎలాగైనా ఆడాలని అనుకునేవాడు. అందుకు తగ్గట్లే ఢిల్లీ అండర్-19 టీమ్ తరఫున కూడా ఆడేవాడు. అయితే 2002లోని భారత అండర్-19 వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కలేదు. క్రికెట్లోని రాజకీయాలే దీనికి కారణమని భావించి తను ఎంతగానే నమ్మిన క్రికెట్‌ని పక్కనబెట్టేశాడు. రైటర్‌గా ఇండస్ట్రీలోకి వచ్చాడు. తొలుత 2006లో వచ్చిన కాబుల్ ఎక్స్‌ప్రెస్ పాటల రచయితగా పనిచేశాడు. తర్వాత హల్ ఏ దిల్, ఆక్రోష్, తేజ్ తదితర చిత్రాలకు కూడా రచయితగా చేశాడు. స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్ దగ్గర సహాయకుడిగానూ వర్క్ చేశాడు. అయితే 2019లో వచ్చిన 'ఉరి' ఇతడిని ఓవర్ నైట్ సెన్సేషన్ చేసిపడేసింది. ఇదే దర్శకుడిగా తొలి చిత్రం. ఇది బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు దేశవ్యాప్తంగా ఆదిత్య పేరు మార్మోగిపోయేలా చేసింది. ఈ మూవీలో 'హౌ ఈజ్ ద జోష్' డైలాగ్ అయితే తెగ వైరల్ అయిపోయింది. ఇదే చిత్రానికిగానూ ఉత్తమ దర్శకుడిగా జాతీయ అవార్డ్ కూడా తొలి సినిమాకే సొంతం చేసుకున్నాడు.ఇక అదే ఏడాది తన సోదరుడితో కలిసి బీ62 స్టూడియోస్ స్థాపించిన ఆదిత్య ధర్.. తన భార్య, నటి యామీ గౌతమ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఆర్టికల్ 370'ని నిర్మించి, రచయితగానూ పనిచేసి హిట్ కొట్టాడు. తొలి మూవీ వచ్చిన దాదాపు ఆరేళ్లకు అంటే గతేడాది డిసెంబరులో 'ధురంధర్'తో వచ్చాడు. సర్ప్రైజింగ్ హిట్ కొట్టాడు. 50 రోజులకు పైనే ఇది థియేటర్లలో ప్రదర్శితమైంది. రెండు రోజుల క్రితం రిలీజైన ధురంధర్ 2 అయితే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. వందల కోట్ల వసూళ్లు సాధిస్తోంది. క్రికెటర్ కావాల్సిన వాడు ఇప్పుడు బాక్సాఫీస్ మొనగాడు అయిపోయాడు.ఆదిత్య తల్లి సునీత ధర్.. ఢిల్లీ యూనివర్సిటీలో డీన్‌గా పనిచేయగా, తండ్రి గురించిన సమాచారం అయితే దొరకలేదు. 'ఉరి' తీస్తున్న టైంలోనే అందులో నటించిన యామీ గౌతమ్‌తో ప్రేమలో పడ్డ ఆదిత్య.. 2021లో ఆమెని పెళ్లి చేసుకున్నాడు. 2024లో వీళ్లకు కొడుకు పుట్టాడు. ప్రస్తుతం 'ధురంధర్ 2' విజయాన్ని ఈ భార్యభర్తలిద్దరూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఏదేమైనా మూడంటే మూడే సినిమాలు తీసి దేశవ్యాప్తంగా అందరూ తన గురించి మాట్లాడుకునేలా చేయడం విశేషం.(ఇదీ చదవండి: డూప్, VFX కాదు.. నిజంగా ధురంధర్ హీరోనే!) -
డూప్, VFX కాదు.. నిజంగా ధురంధర్ హీరోనే!
సినిమాలో కాస్త కఠినమైన సీన్లు, యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయంటే చాలు చాలామంది హీరోలు వారి డూప్‌లతోనే చేయిస్తారు. దర్శకనిర్మాతలు సైతం ముందుజాగ్రత్త కొద్దీ డూప్‌లను పెట్టే సీన్లు పూర్తి చేస్తారు. కొన్ని చోట్లేమో హీరోనే పెట్టి సీన్లు చేసినా.. భారీగా వీఎఫ్ఎక్స్ వాడతారు. అతడే సాహసాలు చేసినట్లుగా తెరపై మాయ చేస్తారు.డూప్ కాదుకానీ ధురంధర్ హీరో రణ్వీర్ సింగ్ మాత్రం నిజంగానే సాహసం చేశాడు. డూప్, వీఎఫ్ఎక్స్ జోలికి పోకుండా రియల్ స్టంట్ చేశాడు. సినిమాలో సీక్రెట్ ఏజెంట్‌గా మారేందుకు హమ్జా (రణ్వీర్ సింగ్) కఠోరమైన శిక్షణ తీసుకుంటాడు. అందులో భాగంగానే నీటిలో ఊపిరి బిగపట్టుకుని ఉండేలా సాధన చేస్తాడు. కదలకుండా కూర్చున్న హీరోఅందుకోసం నీటి అడుగు భాగంలో కదలకుండా కూర్చుంటాడు. ఈ సీన్‌ను చాలా సహజంగా చిత్రీకరించారు. అందుకు సంబంధించిన మేకింగ్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇప్పటిదాకా అతడి నటనను మెచ్చుకున్న జనం.. ఈ వీడియో చూశాక అతడి అంకితభావాన్ని ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. నీ కష్టం వృథాకాలేదు, నువ్వు చాలా గ్రేట్ యాక్టర్ అని కితాబిస్తున్నారు.సినిమాసినిమా విషయానికి వస్తే.. 2025 డిసెంబర్లో వచ్చిన బ్లాక్‌బస్టర్ ధురంధర్ మూవీకి సీక్వెల్‌గా ధురంధర్ 2 తెరకెక్కింది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చి 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.240 కోట్లు రాబట్టింది. #RanveerSingh performs intense underwater scene with no VFX 🔥Pure dedication & madness by Ranveer 💥#Dhurandhar2 #DhurandharTheRevenge pic.twitter.com/go6iHgSoYb— Milagro Movies (@MilagroMovies) March 21, 2026 చదవండి: త్వరలో పెళ్లి? తేజ సజ్జా రియాక్షన్ ఇదే -
'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
చాన్నాళ్ల తర్వాత పాన్ ఇండియా బాక్సాఫీస్ కళకళలాడుతోంది. రీసెంట్‌గానే థియేటర్లలోకి వచ్చిన 'ధురంధర్ 2'.. నిలకడగా వసూళ్ల సాధిస్తోంది. రిలీజ్‌కి భారీ హైప్ సొంతం చేసుకోగా.. సాంకేతిక కారణాల వల్ల హిందీ వెర్షన్ మాత్రమే తొలిరోజు విడుదలైంది. శనివారం నుంచి తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఇంతకీ రెండు రోజుల పాటు ఈ చిత్రానికి కలెక్షన్స్ ఎంతొచ్చాయి?(ఇదీ చదవండి: దురంధర్-2 చెత్త సినిమా.. థియేటర్‌కు అస్సలు వెళ్లకండి)రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన 'ధురంధర్ 2'.. రెండు రోజుల్లో రూ.333 కోట్ల మేర గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది. తొలిరోజు మన దేశంలో రూ.145 కోట్ల నెట్ వసూళ్లు రాగా, శుక్రవారం ఈ నంబర్స్ కాస్త తగ్గి రూ.81 కోట్లు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంగా రూ.226 కోట్ల నెట్ కాగా రూ.269 కోట్ల గ్రాస్ అని తెలుస్తోంది. మరోవైపు ఓవర్సీస్లోనూ రెండు రోజులకు కలిపి 7 మిలియన్ డాలర్లు వచ్చినట్లు టాక్.అలా ప్రపంచవ్యాప్తంగా 'ధురంధర్ 2' చిత్రానికి రెండు రోజులకు కలిపి రూ.333 కోట్ల గ్రాస్ వచ్చినట్లు తెలుస్తోంది. తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి వీకెండ్ అయ్యేసరికి రూ.500 కోట్ల మార్క్ దాటేయడం గ్యారంటీ అనిపిస్తుంది. గతేడాది డిసెంబరులో ఫస్ట్ పార్ట్ రిలీజైనప్పుడు ఒక్కసారి వసూళ్లు రాలేదు. రోజురోజుకీ పెరుగుతూ వెళ్లాయి. దీనికి కూడా అలానే పునరావృతమయ్యేలా కనిపిస్తుంది. మొదటి భాగానికి రూ.1300 కోట్ల మేర కలెక్షన్స్ రాగా.. ఇప్పుడొచ్చిన సీక్వెల్, ల్యాంగ్ రన్లో ఎన్ని వేలకోట్ల కలెక్షన్స్ సాధిస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: ఉస్తాద్ భగత్‌సింగ్ కలెక్షన్స్.. చెప్పుకోలేని పరిస్థితిలో మేకర్స్) -
‘ధురంధర్ 2’ అభిమానులకు గుడ్ న్యూస్.. తెలుగులో కూడా!
‘ధురంధర్ 2’ అభిమానులకు గుడ్ న్యూస్. నేటి నుంచి(మార్చి 21) ఈ మూవీ తెలుగులోనూ విడుదల కానుంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ, ఆన్లైన్లో తెలుగు వెర్షన్‌కి కూడా బుకింగ్స్ ఓపెన్ చేశారు. వాస్తవానికి ఈ సినిమా ప్రీమియర్స్ రోజే అంటే మార్చి 18న తెలుగులోనూ విడుదల కావాల్సింది. కానీ సాంకేతిక కారణాలు, చివరి నిమిషంలో సెన్సార్ బోర్డ సూచించిన మార్పుల వల్ల తెలుగు పాటు తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్ల విడుదల వాయిదా పడింది. ప్రీమియర్స్ కోసం ముందే బుక్ చేసుకున్నవారికి థియేటర్ యాజమాన్యాలు రీఫండ్ చేశాయి. దీంతో కొంతమంది భాష తెలియకపోయినా హిందీలోనే ఈ సినిమాను వీక్షించించారు. అయితే శుక్రవారం ఈ మూవీ తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్లకు శుక్రవారం సెన్సార్ పూర్తయ్యింది. కన్నడలో ఇంకా సెన్సార్ పూర్తి కాలేదు. దీంతో కన్నడ వెర్షన్ మినహా..మిగతా భాషలన్నింటిలోనూ ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.ధురంధర్ 2 విషయానికొస్తే..బాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రణవీర్ సింగ్ హీరోగా నటించిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఆదిద్యధర్ దర్శకత్వం వహించిన ఈచిత్రంలో సారా అర్జున్ హీరోయిన్గా నటించింది. తొలిరోజే ఈ చిత్రం రూ. 172 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది రికార్డు సృష్టించింది. నేటి నుంచి తెలుగు, తమిళ, మలయాళ వెర్షన్స్ కూడా అందుబాటులో ఉండడంతో కలెక్షన్స్ భారీగా పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
దురంధర్-2పై సౌత్ స్టార్స్ ప్రశంసలు.. ప్రకాశ్ రాజ్ రియాక్షన్ ఇదే..!
రణ్వీర్ సింగ్ దురంధర్-2పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, రామ్ చరణ్, రాం గోపాల్ వర్మ సైతం సీక్వెల్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ మేకర్స్ సైలెంట్‌గా ఉన్నా.. టాలీవుడ్ స్టార్స్ మాత్రం దురంధర్ మూవీని కొనియాడుతున్నారు. ఆదిత్య ధర్ మరో అద్బుతమైన కంటెంట్ అందించారని.. రణ్వీర్ సింగ్ అదరగొట్టేశాడని ఆకాశానికేత్తేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ నటుడు ప్రకాశ్ రాజ్ రియాక్షన్ కోసం ఎంతోమంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొదటి నుంచి దురంధర్‌కు వ్యతిరేకంగా ఉన్న ఆయన.. తాజాగా సౌత్ స్టార్స్ ఈ మూవీ ప్రశంసించడంపై ఎట్టకేలకు స్పందించారు. ఓ నెటిజన్ చేసిన పోస్ట్‌కు ప్రకాశ్ రాజ్ రిప్లై ఇచ్చారు. దురంధర్-2 మూవీని దక్షిణాది హీరోలు మహేశ్ బాబు, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ ప్రశంసించారు.. బాలీవుడ్ నుంచి ఎవరైనా స్పందించారా? అని నెటిజన్ రాసుకొచ్చాడు. దీనికి ప్రకాశ్ రాజ్ బదులిస్తూ.. 'బాధ్యతల సంకేతాలు దక్షిణాదికి కూడా వ్యాపిస్తున్నాయి' అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అంతకుముందు ప్రకాశ్ రాజ్ ఓ పాత సినిమాకు సంబంధించిన పాటలు వింటున్న వీడియోను ట్విటర్లో షేర్ చేశారు. నేను దురంధర్‌కు చాలా దూరంగా ఉన్నా.. మీరు కూడానా? అంటూ పాట వింటున్న వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో హమ్ దోనో(1961) చిత్రంలోని 'అభీ నా జావో ఛోడ్ కర్' ఐకానిక్ పాటను ప్లే చేశారు. మొదటి నుంచి దురంధర్‌ను వ్యతిరేకిస్తున్న ప్రకాశ్ రాజ్.. ఈ ట్వీట్స్ చూస్తుంటే మరోసారి తనలోని అక్కసును వెళ్లగక్కినట్లు తెలుస్తోంది.కాగా.. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన'ధురందర్: ది రివెంజ్' హిందీ, తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, ఆర్ మాధవన్, సారా అర్జున్, రాకేష్ బేడీ కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. Signs of Obligations are spreading South too .. #justasking https://t.co/iB01E1sp7K— Prakash Raj (@prakashraaj) March 19, 2026 -
ధురంధర్ 2 చూసి షాక్ అయిన టాలీవుడ్ స్టార్స్.. ఏం అన్నారంటే...
-
దురంధర్-2 మూవీకి రామ్ చరణ్ రివ్యూ.. ఏమన్నారంటే?
రణ్వీర్ సింగ్ దురంధర్-2పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే మహేశ్ బాబు, అల్లు అర్జున్, రాం గోపాల్ వర్మ సీక్వెల్ అద్భుతంగా ఉందంటూ ట్వీట్స్ చేశారు. బాలీవుడ్ మేకర్స్ సైలెంట్‌గా ఉన్నా.. టాలీవుడ్ స్టార్స్ మాత్రం దురంధర్‌పై తమ ప్రేమను చాటుకుంటున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో మెగా హీరో, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా చేరిపోయాడు. దురంధర్-2 అద్భుతంగా ఉందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. రణ్వీర్ సింగ్ అద్భుతమైన నటనతో మెప్పించారని.. ఈ సినిమా ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తుందని ట్విటర్లో రాసుకొచ్చారు.రామ్ చరణ్ తన ట్వీట్లో రాస్తూ..'దురంధర్ ది రివెంజ్ చాలా ఉత్కంఠభరితంగా ఉంది. ఈ మూవీలో భావోద్వేగాలను అద్భుతంగా చూపించారు. ఈ చిత్రానికి ఆయన చేసిన పనిని తప్పుకుండా ప్రశంసించాల్సిందే. ఇక రణ్వీర్ సింగ్ అద్భుతంగా ఫర్మామెన్స్తో అదరగొట్టాడు. సినిమా ఆద్యంతం మిమ్మల్ని కట్టిపడేస్తారు. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ అద్భుతమైన నటనతో ఆకట్టుకున్నారు. సారాఅర్జున్ తన పాత్రలో మెప్పించింది. సుస్వత్ మ్యూజిక్ మరో రేంజ్‌కు తీసుకెళ్లింది. ఇంత ఆసక్తకరమైన మూవీని అందించిన నిర్మాతలకు, చిత్ర బృందానికి నా అభినందనలు.' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. దురంధర్‌కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ మార్చి 19న థియేటర్లలో రిలీజైంది. ఆదిత్య ధర్ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది.ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పెద్ది మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా కనిపించనుంది. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలో సందడి చేయనుంది.#DhurandharTheRevenge is raw, gripping and impactful 🔥@AdityaDharFilms brings scale and emotion together seamlessly. What he has done with this film is truly remarkable.@RanveerOfficial delivers a phenomenal performance - full of intensity and holds your attention…— Ram Charan (@AlwaysRamCharan) March 20, 2026 -
దేవుళ్లనుకునే ఆ హీరోలకు ఇక మనుగడ లేదు: ఆర్జీవీ
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. గత కొన్నిరోజుల నుంచి 'ధురంధర్ 2' మేనియాలోనే ఉన్నాడు. ఇప్పటికే కొన్ని పదుల సంఖ్యలో ట్వీట్స్ చేస్తున్నాడు. ఇప్పుడు కూడా తెలుగు స్టార్ హీరోలని కౌంటర్ వేస్తూ పెద్ద ట్వీట్ చేశాడు. అది ఆయా హీరోలకే కాదు టాలీవుడ్ ప్రేక్షకులని కూడా ఆలోచనలో పడేసింది.(ఇదీ చదవండి: 'దురంధర్-2 చెత్త సినిమా.. థియేటర్‌కు అస్సలు వెళ్లకండి')'ధురంధర్ 2 ఓ హారర్ సినిమా. కానీ ఇది ప్రేక్షకులని భయపెట్టలేదు. కేవలం మాస్ మసాలా, లౌడ్నెస్, లాజిక్ లేని చిత్రాలతో కెరీర్ నిర్మించుకున్న దర్శకుల గుండెల్లో వణుకు పుట్టించింది. బుర్రని ఇంట్లోనే వదిలేసి సినిమా చూడాలనే కాలం చెల్లిన డైరెక్టర్లకు ఈ మూవీ ఓ పీడకల. ఇన్నాళ్లు నొప్పి తెలియకుండా గాయపడకుండా కేవలం ఎలివేషన్ల మీద బతికే 'దేవుళ్లు' అనే ఫీలింగ్ ఉన్న హీరోలని రణ్వీర్ సింగ్ తనదైన నటనతో పాతిపెట్టాడు. ఇందులో హీరోకు బలహీనతలు ఉంటాయి. నిజమైన రక్తం చిందస్తూ, తన తెలివైన హీరోయిజం పండించడం చూస్తుంటే పాతకాలపు హీరోలు.. సర్కస్‌లో జోకర్లలా కనిపిస్తున్నారు. గాల్లో యాభై అడుగులు ఎగిరే ఫైట్స్, గ్రావిటీని అవహేళన చేసే యాక్షన్ సీన్స్ నమ్ముకున్న వారికి ఇక మనుగడ లేదు' అని ఆర్జీవీ స్పష్టం చేశాడు.'పాన్ ఇండియా దర్శకులు.. కేవలం కాస్ట్యూమ్స్, హెయిర్ స్టైల్స్, ఫొటోషాప్‌తో చేసిన సిక్స్ ప్యాక్‌లతో పాత్రలని సృష్టించవచ్చని భ్రమపడుతున్నారు. కానీ ఆదిత్య ధర్ మాత్రం మెదడుతో సినిమా తీసి చూపించారు. ధురంధర్ 2 సాధిస్తున్న భారీ కలెక్షన్స్.. పాతకాలపు దర్శకుల నమ్మకాలని పూడ్చి పెడుతున్న శబ్దాలు. ప్రస్తుతం షూటింగ్లో ఉన్న లేదా కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టబోయే డైరెక్టర్స్.. ఇప్పటికైనా 'ధురంధర్ 2'ని పదేపదే చూసి పాఠాలు నేర్చుకోవాలి. లేదంటే వారిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. డబ్బు ఉండొచ్చు కానీ ఆదిత్య ధర్ లాంటి విజన్ ఎక్కడ నుంచి తెస్తారు?' అని ఆర్జీవీ చేసిన ట్వీట్ ఇప్పుడు నెటిజన్ల మధ్య చర్చకు దారితీసింది. ఆర్జీవీ ట్వీట్ చూస్తే చాలామందికి నిజమే కదా అనిపించకమానదు. ఎందుకంటే ఇన్నాళ్లు ప్రేక్షకుల్ని చాలా తక్కువగా చూస్తే లాజిక్ లేని సినిమాలు తీస్తూ చాలామంది దర్శకులు కాలం గడిపేస్తున్నారు. ప్రేక్షకులు కూడా మరో దారి లేక వాటిని చూస్తున్నారు. ఇప్పుడు 'ధురంధర్ 2' లాంటి మూవీ చూసిన తర్వాత ప్రేక్షకుల ఆలోచన విధానంలోనూ కచ్చితంగా మార్పు వచ్చే అవకాశముంటుందనేది ఆర్జీవీ ఉద్దేశం అయ్యిండొచ్చు.(ఇదీ చదవండి: తెలుగు స్టార్ హీరోలతో 'ధురంధర్' డైరెక్టర్ మల్టీస్టారర్?)The @Dhurandhar2 is a HORROR.It is a horror for all filmmakers who built their careers and their fortunes on dumbed down, over the top cinema. The cinema that demanded the brain to be left at home . The cinema that was rammed down our throats full of LOUDNESS and MASALA which…— Ram Gopal Varma (@RGVzoomin) March 20, 2026 -
రికార్డులు బద్దలు! ధురంధర్ 2 ఫస్ట్ డే కలెక్షన్స్ సునామి..
-
'దురంధర్-2 చెత్త సినిమా.. థియేటర్‌కు అస్సలు వెళ్లకండి'.. నటి షాకింగ్ రివ్యూ
కన్నడ నటి, రాజకీయ నాయకురాలు దివ్య స్పందన గురించి పరిచయం అక్కర్లేదు. గతేడాది హీరో దర్శన్‌పై కామెంట్స్ చేసిన ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. ఓ అభిమానిని హీరో దర్శన్ హత్య చేయడంపై దివ్య స్పందన మండపడింది. దర్శన్.. తన జీవితంలో సరిదిద్దుకోలేని తప్పు చేశాడని నటి రమ్య గతంలో పేర్కొంది. ఆ తర్వాత దర్శన్ ఫ్యాన్స్ దివ్యపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేశారు.తాజాగా ఈ ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈనెల 19న రిలీజైన రణ్వీర్ సింగ్ దురంధర్-2పై అభిప్రాయాన్ని తెలిపింది. ఈ మూవీ తనను తీవ్రంగా నిరాశపర్చిందని.. చూస్తున్నంతసేపు నిద్ర వచ్చిందని ఎద్దేవా చేసింది. అసలు ఇది థియేటర్స్‌లో చూసే సినిమానే కాదంటూ ట్వీట్ చేసింది.మొదటి పార్ట్‌లో ఉన్న సాంకేతిక విలువలు ఈ సినిమాలో కొరవడ్డాయాని దివ్య స్పందన విమర్శించారు. దర్శకత్వం, డైలాగ్స్, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, నటనలో దురంధర్-2 పూర్తిగా తేలిపోయిందని దివ్య స్పందన కామెంట్స్ చేసింది. మార్చి 19న విడుదల ఉందని వారికి ఎవరూ చెప్పలేదేమోనని మేకర్స్‌ను ఉద్దేశించిన వ్యంగ్యంగా మాట్లాడింది. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చకు దారితీశాయి. దివ్య తన ట్వీట్లో రాస్తూ..' ఇప్పుడే ధురందర్ 2 చూశాను. మన సహనానికి పరీక్షలా ఉంది. దయచేసి థియేటర్లో మీ సమయాన్ని, డబ్బును వృధా చేసుకోకండి. ఇది ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్లో చూసే మూవీ. దర్శకత్వం, సంభాషణలు, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, నటన అన్నీ చెత్తగా ఉన్నాయి. మార్చి 19న విడుదల ఉందని వాళ్లకు ఎవరూ చెప్పలేదేమోనని అనిపించింది. పార్ట్-1 ఫర్వాలేదు కానీ.. సింపుల్‌గా చెప్పాలంటే ధురందర్ 2 ప్రేక్షకుడిని పూర్తిగా నిరాశపర్చే సినిమా. మరీ అంతంత మాత్రంగానే ఉంది. ఇది ప్రేక్షకుడిని నిద్రపుచ్చే ఓ కామెడీ సినిమా. అసలు ఈ సినిమా 'ఎందుకని మనల్ని ప్రశ్నించేలా చేస్తుంది. రణ్వీర్.. నువ్వు ఇంతకంటే బాగా చేయగలవు. ఆదిత్య ధర్.. జాతీయవాదం, ప్రాపగండ నుంచి మీరు బయటికి రండి.' అంటూ రాసుకొచ్చింది. Just watched Dhurandhar 2 and wow! what a masterclass in how to turn something promising into an endurance test.It’s like reading a textbook of the most boring subject with never-ending chapters and at some point, your brain just gives up and starts laughing out of sheer despair…— Ramya/Divya Spandana (@divyaspandana) March 20, 2026 -
తెలుగు స్టార్ హీరోలతో 'ధురంధర్' డైరెక్టర్ మల్టీస్టారర్?
ప్రస్తుతం దేశంలో 'ధురంధర్ 2' గురించి చర్చ గట్టిగానే నడుస్తోంది. సీక్వెల్ అయిన ఈ చిత్రం.. రెండు రోజుల క్రితం ప్రీమియర్లతో థియేటర్లోకి వచ్చింది. రిలీజ్‌కి ముందు బీభత్సమైన హైప్ ఏర్పడింది. దర్శకుడు ఆదిత్య ధర్ దాన్ని నిలబెట్టుకున్నాడు. 4 గంటల నిడివి ఉన్నప్పటికీ ఏ మాత్రం బోర్ కొట్టకుండా మ్యాజిక్ చేశాడు. ఈ చిత్రానికి మూడో భాగం ఉంటుందనే రూమర్ కొన్నిరోజుల ముందు వరకు వినిపించింది. కానీ 'ధురంధర్ 2' రిలీజైన తర్వాత అలాంటిదేం లేదని అందరికీ క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2'.. బాలీవుడ్ కంటే టాలీవుడే ముందు)అయితే 'ధురంధర్' ఫ్రాంచైజీని పూర్తి చేసిన దర్శకుడు ఆదిత్య ధర్.. తర్వాత ఏ సినిమా చేస్తాడు? ఎవరితో చేస్తాడనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. కొన్నాళ్ల క్రితం తన డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన 'అశ్వద్ధామ' గురించి అల్లు అర్జున్‌తో ఆదిత్య చర్చలు జరిపాడనే టాక్ బయటకొచ్చింది. తర్వాత దీని అప్డేట్ ఏం లేదు. అయితే 'ధురంధర్ 2' ప్రీమియర్ చూసిన వెంటనే అల్లు అర్జున్.. సినిమాని పొగుడుతూ ట్వీట్ చేయడం, ఆదిత్యని ఆకాశానికెత్తేయడం చూస్తుంటే త్వరలో కలిసి పనిచేస్తారా అనే సందేహం వస్తోంది.ఇందులో అల్లు అర్జున్ మెయిన్ హీరో అయినప్పటికీ ఎన్టీఆర్ కూడా ఓ స్పెషల్ రోల్ చేస్తాడని రూమర్స్ కూడా వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం టాలీవుడ్లో వచ్చే బిగ్గెస్ట్ మల్టీస్టారర్ అవుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాకపోతే ఇది నిజమా కాదా అనేది తెలియడానికైనా మరికొన్నేళ్లు పట్టొచ్చు. ఎందుకంటే 2019లో 'ఉరి' రిలీజ్ చేసిన ఆదిత్య ధర్.. దాదాపు ఆరేళ్ల విరామం తర్వాత 'ధురంధర్' రెండు భాగాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. మరి తర్వాత మూవీ ఎన్నేళ్లకు వస్తుందనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్.ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో చూసుకుంటే 'పుష్ప'తో బన్నీ, 'ఆర్ఆర్ఆర్' తారక్ రేంజ్ చాలా పెరిగింది. ప్రస్తుతం వీళ్లు చేస్తున్న ప్రాజెక్టుల స్పాన్ కూడా పెద్దదే. ఒకవేళ కాలం కలిసొచ్చి ఆదిత్య.. అల్లు అర్జున్-ఎన్టీఆర్‌తో మల్టీస్టారర్ తీస్తే మాత్రం బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ గ్యారంటీ.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
దురంధర్-2 వసూళ్ల ఊచకోత.. ఆ ఒక్కడి వల్లే రూ.500 కోట్లు..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. గతేడాది డిసెంబర్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ల ఊచకోత చూపించింది. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది. కేవలం హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఏకంగా రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా వచ్చిన చిత్రం దురంధర్ ది రివెంజ్. పార్ట్-2గా వచ్చిన ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సారి హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ రిలీజైంది. కేవలం ప్రీమియర్స్‌తోనే వసూళ్లు సునామీ ప్రారంభించిన బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో దురంధర్ నటుడు రాకేశ్ బేడీ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. రణ్వీర్ సింగ్ తనతో ఇలా చెప్పారని గుర్తు చేసుకున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రాకేశ్ బేడీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. నా రోల్ షూటింగ్ పూర్తైన రోజు రణ్వీర్ తనకు ఓ మాట చెప్పారని గుర్తు చేసుకున్నారు. ఒకవేళ ఈ మూవీ రూ.1000 కోట్లకు పైగా వసూలుచేస్తే.. అందులో రూ.500 కోట్లు రాకేశ్ వల్లే వస్తాయని అన్నారని తెలిపారు. ఓ నటుడిగా ఇంతకుమించి ఏం కావాలని హర్షం వ్యక్తం చేశారు. నా చివరి రోజు షూటింగ్లో రణ్ వీర్‌సింగ్ ఏడ్చారని దర్శకుడు ఆదిత్య ధర్ అన్నారు. సెట్లో అంతలా ఎమోషనల్ వాతావరణాన్ని సృష్టించిన మూవీ అని తెలిపారు. కాగా.. ఈ చిత్రంలో రాకేశ్ బేడీ రోల్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. కరాచీకి చెందిన రాజకీయ నాయకుడు జమాలి పాత్రలో రాకేశ్ బేడీ అదరగొట్టేశారు. రణ్వీర్ సింగ్ ప్రశంసలు..జమాలిగా బేడీ నటన ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకుంది. ఓ రాజకీయ నాయకుడి నయవంచక పాత్రలో పాత్రలో ఆయన నటన ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రణ్వీర్ సింగ్ ప్రశంసలు కురిపించడం చూస్తుంటే బేడీ పాత్ర ప్రభావం, అలాగే సెట్లో వారి మధ్య ఏర్పడిన స్నేహబంధం అర్థమవుతోంది. కాగా.. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, సారా అర్జున్, డానిష్ పాండోర్, సంజయ్ దత్ లాంటి స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించారు. కాగా.. ధురంధర్ 2 ఫస్ట్ డే, ప్రీమియర్స్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా రూ. 172.63 కోట్ల గ్రాస్ రాబట్టింది. -
'ధురంధర్ 2'.. బాలీవుడ్ కంటే టాలీవుడే ముందు
ఓ హిందీ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసి చాలా కాలమైపోయింది. పదిపదిహేనేళ్ల క్రితం షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, సల్మాన్ ఖాన్ తదితరుల చిత్రాలకు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి క్రేజ్ ఉండేది. అందుకు తగ్గట్లే కలెక్షన్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు 'ధురంధర్ 2' విషయంలో ఆ జోష్ కనిపిస్తోంది. తెలుగు షోలు పూర్తిస్థాయిలో స్క్రీనింగ్ కానప్పటికీ హిందీ వెర్షన్ అయినా సరే చూసేయాల్సిందే అని ఆలోచనతో ఉన్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో టికెట్ బుకింగ్స్ చూస్తుంటే ఇదే అనిపిస్తుంది.(ఇదీ చదవండి: ధురంధర్-2 ఫస్ట్ డే కలెక్షన్స్..)ఈ సినిమాలో ఒక్క తెలుగు నటుడు కూడా లేడు. అయినా సరే తొలి పార్ట్ హిట్ అయ్యేసరికి బీభత్సమైన హైప్ ఏర్పడింది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితమే అంటే బుధవారం సాయంత్రం నుంచి ప్రీమియర్స్ పడ్డాయి. ఈ క్రమంలోనే తెలుగు స్టార్ హీరోలు అయిన అల్లు అర్జున్, మహేశ్ బాబు, ఎన్టీఆర్ తదితరులు ఏకంగా ట్వీట్స్ చేసి మరీ మూవీని ఆకాశానికెత్తేశారు. అదే టైంలో బాలీవుడ్ మాత్రం పూర్తిగా సైలెన్స్ పాటిస్తోంది.'ధురంధర్ 2' ట్రైలర్ రిలీజైనప్పుడు హిందీ ఇండస్ట్రీకి చెందిన హృతిక్ రోషన్, ఆలియా భట్, విక్కీ కౌశల్ లాంటి స్టార్స్ పోస్టులు పెట్టారు గానీ మూవీ వచ్చి రెండు రోజులు కావొస్తున్నా బాలీవుడ్ నుంచి ఒక్కరు కూడా పోస్టుల్లాంటివి పెట్టకపోవడం ఆసక్తికరంగా అనిపిస్తుంది. దీని గురించి సోషల్ మీడియాలోనూ చర్చ నడుస్తోంది. హిందీ సినిమాని సపోర్ట్ చేసే విషయంలోనూ బాలీవుడ్ కంటే టాలీవుడ్ ముందుందిగా అని మాట్లాడుకుంటున్నారు.దీనికి పోటీగా తెలుగు రాష్ట్రాల వరకు పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజైంది. కానీ తొలి షో నుంచే నెగిటివ్ టాక్ వస్తోంది. రొటీన్ ఫక్తు కమర్షియల్ మూవీ అని చూసిన ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. పవన్ అభిమానులకు తప్పితే ఇది మరెవరికి నచ్చట్లేదనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి! 'ధురంధర్ 2' తెలుగు వెర్షన్ విడుదలైతే.. 'ఉస్తాద్'కి మరింత కష్టాలు తప్పవు.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
సివిల్స్‌లో సత్తా చాటిన దినసరి కూలీ కొడుకు..! 'ధురంధర్ 2' మూవీ..
ప్రతిష్టాత్మకమైన సివిల్స్‌లో సత్తా చాటి ఐఏఎస్ అవ్వాలనేది ఎందరో యువత డ్రీమ్. అత్యంత కఠినతరమైన ఎగ్జామ్‌లో గెలుపుని అందుకోవడమే తమ ధ్యేయంగా ఎంతలా కష్టపడుతుంటారో తెలిసిందే. అంత కష్టమైన ఎగ్జామ్‌లో తొలిప్రయత్నంలోనే అవలీలగా విజయఢంకా మోగించి అందరిచేత శెభాష్ అనిపించుకున్నాడు ఈ యువకుడు. ఇతడి గెలుపు 'ధురందర్ 2'మూవీ నటుడిని సైతం ఆకట్టుకుంది. అతడు మాములు స్ఫూర్తి కాదంటూ ఆకాశానికి ఎత్తేశాడు. ఇంతకీ ఎవరా వ్యక్తి అంటే..సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ మంచి మంచి వీడియోలను షేర్ చేస్తూ.. అభిమానులకు ఖుషీ చేసే హీరో మాధవన్ ఈసారి కూడా అలానే మంచి స్ఫూర్తిదాయకమైన వీడియోను షేర్ చేశారు. ఇటీవల యూపీఎస్సీ సివిల్స్ పరీక్షలో సత్తా చాటి సుబ్రమణ్య భారతి వీడియోని రీషేర్ చేస్తూ..ఆ యువకుడి అజేయమైన సక్సెస్ జర్నీని మెచ్చుకున్నారు. అందుకు సహకరించిన అతని తల్లిదండ్రులు, అతడికి లభించిన మద్దతు తదితరాలన్ని తనను ఎంతగానో కదిలించాయని, పైగా స్ఫూర్తిని పొందానని పేర్కొన్నారు. పట్టుదల, సరైన మార్గదర్శకత్వం ఎలా మార్పు తీసుకురాగలవో అనేందుకు ఆ యువకుడు సుబ్రమణ్య భారతినే ఉదాహరణ అంటూ పోస్ట్‌ని ముగించారు మాధవన్. హీరో మాధవన్ షేర్ చేసిన వీడియోలో దినసరి కూలీ కుమారుడైన సుబ్రమణ్య భారతి ఉన్నారు. ఆయన తమిళనాడు ప్రభుత్వ 'నాన్ ముదల్వన్' పథకం సహాయంతో ఈ అధ్భుతమైన ఘనతను సాధించాడు. భారతి తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌లో విజయం సాధించడం విశేషం.తన సక్సెస్ జర్నీ అసాధారణమైనది అభివర్ణించాడు సుబ్రమణ్య భారతి. తాను క్షేత్రస్థాయిలో సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశ్యంతోనే తాను సివిల్ సర్వీసెస్‌ను ఎంచుకున్నానని చెప్పారు. తొలి ప్రయత్నంలోనే ఈ ఘనత సాధించడానికి, ఈ పథకం, కోచింగ్ వంటి మద్దతే కారణమని పేర్కొన్నారు. తాను కేవలం 18 ఏళ్ల వయసులో, ఎలాంటి మార్గదర్శకత్వం లేకుండా ఈ సివిల్స్ ప్రయాణం ప్రారంభించినట్లు తెలిపాడు. అందుకు తల్లిదండ్రులే స్ఫూర్తి అని, ఎందుకంటే వాళ్లు దేశానికి సాధ్యమైనంత ఉత్తమ రీతిలో సేవ చేసేలా వాళ్లు సదా ప్రోత్సహించారని చెప్పుకొచ్చాడు. కాగా, భారతి తండ్రి మరియప్పన్ మాట్లాడుతూ.. తమ కుటుంబం పేద కుటుంబమని, ఇటుకల తయారీ యూనిట్లో రోజువారీ కూలీగా పనిచేస్తుంటానని చెప్పారు. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ, తన కుమారుడు ఈ ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్‌కు సన్నద్ధమయ్యాడని అన్నారు. అందులో విజయం సాధించడానికి తమిళనాడు ప్రభుత్వ నాన్ ముదల్వన్ పథకం ఎంతగానో సహాయపడిందని అన్నారు. నాన్ ముదల్వన్ (Naan Mudhalvan) పథకం:తమిళనాడు ప్రభుత్వం ప్రారంభించిన నాన్ ముదల్వన్ (Naan Mudhalvan) పథకం ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ధి (Skill Development), ఉపాధి అవకాశాలను పెంచే ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. ఇది 18-35 ఏళ్ల యువతకు, ముఖ్యంగా కళాశాల విద్యార్థులకు టెక్నాలజీ, భాషా నైపుణ్యాలు, ఇండస్ట్రీ-రెడీ కోర్సులలో శిక్షణ ఇస్తూ, ఉచిత కోచింగ్, స్కాలర్షిప్లను అందిస్తుంది. View this post on Instagram A post shared by Asian News International (@ani_trending)(చదవండి: మా మాష్టారే పేషెంట్‌గా..!) -
బాక్సాఫిస్ ను బద్దలు కొడుతున్న ధురంధర్ 2
-
పాకిస్తాన్ టీవీలో 'ధురంధర్-2'.. వీడియో షేర్ చేసిన జర్నలిస్ట్
‘ధురంధర్-2’ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ వసూళ్లతో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. ఫస్ట్ డే ఏకంగా రూ. 172 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు ప్రముఖ సంస్థలు పేర్కొన్నాయి. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ విడుదలైంది. కానీ, ఈ చిత్రం పాకిస్తాన్లో విడుదల కాలేదు. పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా ఈ మూవీని తెరకెక్కించడం కొన్ని దేశాలు దీన్ని బ్యాన్ చేసినట్లు బాలీవుడ్ మీడియా గతంలోనే పేర్కొంది. అయినప్పటికీ పాక్ దేశ ప్రజలు రణవీర్ సింగ్ నటించిన ధురంధర్-2 మూవీని చూడటానికి ఉత్సాహంగా ఉన్నారని స్పష్టంగా తెలుస్తోంది. భారీ సంఖ్యలో పాక్ ప్రజలు ఈ సినిమా పైరసీ వెర్షన్‌ను చూస్తున్నారు.పాక్‌లోని లాహోర్‌లో ధురంధర్-2 సినిమా చూస్తున్న దృశ్యాన్ని పాకిస్తానీ జర్నలిస్ట్ షేర్ చేశారు. అదే పోస్ట్‌ను భారత్‌కు చెందిన ఆదిత్య రాజ్ కౌల్ తన సోషల్‌మీడియాలో షేర్ చేశారు. 'ధురందర్' చిత్రానికి రీసెర్చ్ కన్సల్టెంట్‌గా ఆయన ఉన్న విషయం తెలిసిందే. పాక్‌లోని లాహోర్‌లో ధురంధర్-2 సినిమా చూస్తున్న దృశ్యాన్ని ఒక పాకిస్తానీ జర్నలిస్ట్ షేర్ చేసిన ట్వీట్‌ను ఆదిత్య రీషేర్ చేశారు. పాకిస్తానీ ఉగ్రవాదాన్ని అణచివేయడం గురించి ఈ సినిమా ఉన్నా సరే వారు పైరసీ కాపీ కోసం వెతికి మరీ చూస్తున్నారు. పాకిస్తాన్లో భారతీయ చిత్రాలు నిషేధించబడినప్పటికీ, అక్కడి ప్రజలు మన సినిమాల పైరసీ వెర్షన్లను చూసి ఆనందిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గతంలో, పొరుగు దేశంలో ధురందర్ పార్ట్ 1 పైరసీ వెర్షన్‌ను కూడా చూశారు. ఆ సమయంలో మూవీ విడుదలైన కేవలం రెండు వారాల్లోనే పాకిస్తాన్లో 1.8 మిలియన్లకు (18 లక్షలు) పైగా ఇల్లీగల్ డౌన్లోడ్ నమోదయ్యాయని అంచనా. ఇప్పుడు ధురందర్ -2 పైరసీ కాపీని టెలిగ్రామ్ గ్రూప్‌లలో షేర్ చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌లో పార్ట్-1 విడుదలైనప్పుడు కూడా పాక్‌లో ట్రెండింగ్‌లో నిలిచింది. -
ధురంధర్-2 ఫస్ట్ డే కలెక్షన్స్..
‘ధురంధర్ 2’ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టించింది. స్ట్రీ 2, జవాన్, యానిమల్ వంటి చిత్రాల రికార్డులను బద్దలు కొట్టి, బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రణ్వీర్ సింగ్ హీరోగా, ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ మార్చి 18 నుంచే ప్రీమియర్ షోలతో థియేటర్స్‌లోకి వచ్చేసింది. ఫస్ట్ డే ‘ధురంధర్ 2’ కలెక్షన్స్ దుమ్మురేపింది. భారతీయ చిత్ర పరిశ్రమలో 'పుష్ప-2' తర్వాత భారీ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా ధురంధర్2 నిలిచింది. గతేడాదిలో విడుదలైన ‘పార్ట్-1’ తొలిరోజు కలెక్షన్లు రూ.28.60 కోట్ల (నెట్) రాబట్టిన విషయం తెలిసిందే.ట్రేడ్ అనలిస్ట్ వెబ్ సైట్ సక్నిల్క్ ప్రకారం ధురంధర్ 2 ఫస్ట్ డే, ప్రీమియర్స్‌తో కలిసి ప్రపంచవ్యాప్తంగా రూ. 172.63 కోట్ల గ్రాస్ రాబట్టింది. నెట్ పరంగా అయితే రూ. 145.55 కోట్లు అని ఆ సంస్థ పేర్కొంది. ఈ క్రమంలో నెట్ కలెక్షన్లలో రూ.100 కోట్లు దాటిన మొదటి హిందీ సినిమాగా ధురంధర్- 2 నిలిచింది. కేవలం హిందీ నుంచే ఈ సినిమాకు రూ.103 కోట్ల నెట్ కలెక్షన్లు రావడం విశేషం. ఇప్పుడు వరసు సెలవులు ఉండటంతో ఫస్ట్ వారంలోనే రూ. 700 కోట్ల మార్క్‌ను సులువుగా దాటుతుందని అంచనా వేస్తున్నారు.‘ధురంధర్: ది రివెంజ్’ ప్రీమియర్స్‌తోనే హిట్ టాక్ తెచ్చుకోవడం ఆపై ఉగాది, రంజాన్ వంటి పండుగల సెలవులు ఉండటంతో ఈ మూవీకి కలిసిసొస్తుంది. ఈ మూవీలోని యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్ వంటి స్టార్ యాక్టర్స్ ఈ మూవీకి మరింత బలాన్ని చేకూర్చింది. ప్రస్తుతం ‘ధురంధర్ 2’కు వస్తున్న ఆదరణ చూస్తుంటే కలెక్షన్స్ పరంగా మరిన్ని రికార్డులు సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
దురంధర్-2 మూవీ.. ప్రీమియర్స్‌తోనే ఆల్‌టైమ్ రికార్డ్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్-2 థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ రోజే ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. దురంధర్ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలవడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ప్రీమియర్స్ షోలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. టికెట్స్ రిలీజైన కొన్ని నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి.తాజాగా ప్రీమియర్ షోల కలెక్షన్స్‌లో దురంధర్-2 సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇండియాలో కేవలం ప్రీమియర్ షోల ద్వారా ఏకంగా రూ.52 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించింది. ఈ మూవీ ప్రీమియర్ షోలను దేశవ్యాప్తంగా దాదాపు 12000 వేలకు పైగా షోలు ప్రదర్శించారు. ఈ కలెక్షన్స్ ప్రీమియర్స్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా ఘనత సాధించింది. ఇప్పటి వరకు నమోదైన అన్ని రికార్డులను దురంధర్-2 అధిగమించింది. ఈ చిత్రంలో ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, సారా అర్జున్, రాకేష్ బేడీ కీలక పాత్రల్లో నటించారు. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన దురంధర్ ప్రపంచవ్యాప్తంగా రూ. 1,300 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. -
ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్.. ఓటీటీలోకి ఎప్పుడు?
తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉగాది సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మరోవైపు థియేటర్లలోకి ధురంధర్ 2, ఉస్తాద్ భగత్ సింగ్ ' సినిమాలు వచ్చేశాయి. పేరుకే హిందీ అయినప్పటికీ 'ధురంధర్'కి మన దగ్గర కూడా ఫుల్ క్రేజ్ కనిపిస్తోంది. మరోవైపు పవన్ చిత్రానికి అభిమానులు తప్పితే సగటు ఆడియెన్స్ కాస్త దూరంగానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. సరే ఈ సంగతులు కాసేపు పక్కనబెడితే ఇంతకీ ఈ మూవీస్ ఓటీటీ స్ట్రీమింగ్ సంగతేంటి? ఎప్పుడు అందుబాటులోకి రావొచ్చు?(ఇదీ చదవండి: ఓటీటీలోకి సుప్రీత చేసిన తెలుగు హారర్ థ్రిల్లర్ సినిమా)ముందుగా 'ధురంధర్ 2' విషయానికొస్తే తొలి భాగం డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్‌కి విక్రయించారు. ఇప్పుడు రిలీజైన సీక్వెల్‌ని మాత్రం నిర్మాణ సంస్థల్లో ఒకటైన జియో స్టూడియోస్కి చెందిన హాట్‌స్టార్‌కి ఇచ్చేశారు. మొదటి పార్ట్‌లానే ఈసారి కూడా థియేటర్లలోకి వచ్చిన 8 వారాల తర్వాతే స్ట్రీమింగ్ అవుతుంది. అంటే మే చివరి వారంలోనే 'ధురంధర్ 2' డిజిటల్‌గా అందుబాటులోకి వస్తుంది. అయితే దీన్ని థియేటర్లలోనే చూడాలని చాలామంది అంటున్నారు.మరోవైపు 'ఉస్తాద్ భగత్ సింగ్' విషయానికొస్తే డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్‌కి అమ్మేశారు. అయితే ఇది ఐదు వారాల తర్వాత ఓటీటీలోకి రానుందని నిర్మాత చెప్పుకొచ్చారు. అంటే ఏప్రిల్ చివరి వారంలో పవన్ మూవీ స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంటుంది. సోషల్ మీడియాలో వినిపించినట్లు ఇది 'తెరి' రీమేక్ అయితే కాదనే క్లారిటీ వచ్చింది. కాకపోతే రొటీన్ కమర్షియల్ పోలీస్ టెంప్లేట్ స్టోరీతోనే దీన్ని తెరకెక్కించారు. టాక్ అయితే నెగిటివ్‌గానే వస్తోంది. వీకెండ్ అయ్యేసరికి అసలు సంగతి ఏంటనేది తెలుస్తుంది.(ఇదీ చదవండి: 'ధురంధర్ 2' తెలుగు షోలన్నీ రద్దు.. ఏమవుతోంది?) -
'ధురంధర్ 2' తెలుగు షోలన్నీ రద్దు.. ఏమవుతోంది?
తెలుగు ప్రేక్షకులకు బ్యాడ్ న్యూస్. 'ధురంధర్ 2' మేకర్స్ హ్యాండ్ ఇచ్చేశారు. రిలీజ్ నాడు పడాల్సిన తెలుగు వెర్షన్ షోలన్నీ రద్దయిపోయాయి. ఈ మేరకు టికెట్స్ బుక్ చేసుకున్న వాళ్లందరికీ మెసేజులు వెళ్తున్నాయి. టికెట్ డబ్బులని తిరిగి ఇచ్చేస్తామని అందులో పేర్కొన్నారు. ఇంతకీ అసలేం జరుగుతోంది? తెలుగు షోలు ఎప్పటి నుంచి ఉండొచ్చు?(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)గతేడాది డిసెంబరు తొలివారంలో వచ్చిన 'ధురంధర్'.. 50 రోజులకు పైనే థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమైంది. తర్వాత ఓటీటీలోకి వస్తే అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. తొలి పార్ట్ రిలీజైనప్పుడే సీక్వెల్.. మార్చి 19న థియేటర్లలోకి వస్తుందని క్లారిటీ ఇచ్చారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ వెర్షన్ కూడా ఈసారి ఉంటాయని మాటిచ్చారు. కానీ ఇప్పుడది తప్పారు.18వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి తెలుగు షోలు ఉంటాయని చెప్పినప్పటికీ వాటిని రద్దు చేశారు. ఈ క్రమంలోనే దర్శకుడు ఆదిత్య ధర్.. రాత్రి 9 గంటల నుంచి ఉంటాయని పోస్ట్ పెట్టాడు. రాత్రి సంగతి పక్కనబెడితే తర్వాత అంటే 19వ తేదీ అయిన ఈ రోజు కూడా హైదరాబాద్‌లో తెలుగు వెర్షన్ షోలు రద్దయ్యాయి. డబ్బింగ్ ఇంకా పూర్తిగా జరగకపోవడం, చివరి నిమిషంలో హడావుడి లాంటివి సమస్యలుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి బుక్ మై షోలో 20వ తేదీకి తెలుగు షోలు ఉన్నప్పటికీ.. అవి అయినా వేస్తారా లేదా అనేది సందేహమే?'ధురంధర్ 2' విషయానికొస్తే.. రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ధురంధర్ పార్ట్ 1 ముగుస్తుంది. ఆ తర్వాత ల్యారీకి తానే నాయకుడినని అర్షద్ పప్పు (అశ్విన్ ధర్)ప్రకటించుకుంటాడు. అన్నచావుకు కారణమైన అర్షద్ పప్పుపై రెహమాన్ సోదరుడు ఉజెయిర్ బలోచ్(డానిష్) కోపంతో రగిలిపోతుంటాడు. వీరిద్దరిని కాదని, ల్యారీని భారత సీక్రెట్ ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్) తన గుప్పింట్లోకి తెచ్చుకొని, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్) అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొస్తుంటాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎంపీ జమీల్ (రాకేష్ బేడీ) కూడా హమ్జాని గుడ్డిగా నమ్ముతారు. ఇలా పాక్ ఉగ్రవాద నాయకులందరిని నమ్మించి.. ఇండియాపై వాళ్లు చేసే కుట్రలన్నింటిని హమ్జా తిప్పికొడతాడు.అసలు భారత్‌పై పాన్ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రలు ఏంటి? వాటిని తిప్పికొట్టే క్రమంలో హమ్జాకు ఎదురైన సమస్యలు ఏంటి? హమ్జా ఇండియన్ ఏజెంట్ అనే విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం తెలిసిన తర్వాత మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఏం చేశాడు?. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద ముఠాలందరికి మార్గనిర్దేశం చేస్తున్న ‘బడే సాహెబ్ ’ ఎవరు? ఆపరేషన్ ధురంధర్ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్.. పంజాబ్‌లో జైలు జీవితం గడుపుతున్న జస్కరిత్ సింగ్ రంగీ(రణ్వీర్)నే ఎందుకు ఎంచుకున్నాడు? అతని నేపథ్యం ఏంటి? ఇతని కుటుంబానికి ఎమ్మెల్యే సుఖ్వెంధర్ చేసిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. సహనానికి పరీక్ష) -
పవన్ VS రణ్వీర్.. ఇది మూడోసారి
భారతీయ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన రణ్వీర్ సింగ్ 'ధురంధర్ 2' సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈ మూవీ ఉన్నప్పటికీ.. తెలుగు రాష్ట్రాల వరకు పోటీగా రిలీజైన చిత్రం పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'. వీటి టాక్ ఏంటి? చూసిన వాళ్లు ఏమంటున్నారు? అనే విషయాల్ని పక్కనబెడితే పవన్ vs రణ్వీర్ పోటీ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. గతంలోనూ ఈ హీరోలిద్దరూ బాక్సాఫీస్ దగ్గర పోటీపడ్డారు.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. సహనానికి పరీక్ష)రణ్వీర్ సింగ్.. హిందీ సినిమాలే చేసినప్పటికీ తెలుగులోనూ కాస్తంత ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. చాన్నాళ్ల నుంచి ఇక్కడ కూడా ఇతడి మూవీస్ రిలీజయ్యాయి. గతంలో అంటే 2011లో పవన్ కల్యాణ్ 'పంజా' వచ్చినప్పుడే రణ్వీర్ 'లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్' మూవీ కూడా వచ్చింది. వీటిలో పంజా ఫ్లాప్ కాగా రణ్వీర్ ఎబోవ్ యావరేజ్ అనిపించుకుంది. 2023లోనూ మళ్లీ వీళ్లిద్దరూ ఒకేరోజున చిత్రాల్ని రిలీజ్ చేశారు. పవన్ 'బ్రో' సినిమాతో రాగా రణ్వీర్ 'రాఖీ ఔర్ రాణి కీ ప్రేమ్ కహానీ'తో వచ్చాడు. ఇక్కడ సేమ్ సీన్ రిపీటైంది పవన్ మూవీ ఫ్లాప్ కాగా రణ్వీర్ హిట్ కొట్టాడు.ఇపుడు ముచ్చటగా మూడోసారి రణ్వీర్ వర్సెస్ పవన్ పోటీలో నిలిచారు. ఈసారి రణ్వీర్ 'ధురంధర్ 2' ఆధిపత్యమే కొనసాగేలా కనిపిస్తోంది. ఎందుకంటే 'ఉస్తాద్ భగత్ సింగ్'కి ప్రీమియర్ల నుంచే నెగిటాక్ వస్తోంది. కంటెంట్ మరీ ఔట్ డేటెడ్‌గా ఉందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం 'ధురంధర్ 2' హవా తెలుగులోనూ గట్టిగానే ఉండొచ్చు.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్) -
'ధురంధర్ 2'కి అల్లు అర్జున్ రివ్యూ.. ఏమన్నాడంటే?
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన సినిమా 'ధురంధర్'. గతేడాది డిసెంబరులో తొలి పార్ట్ రిలీజ్ కాగా.. ఇప్పుడు మూడు నెలలు తిరిగేసరికల్లా సీక్వెల్ వచ్చేసింది. నిన్నటి(మార్చి 18) నుంచి దేశవ్యాప్తంగా ప్రీమియర్లు పడ్డాయి. చూసిన ప్రతిఒక్కరూ అదిరిపోయిందని మాట్లాడుకుంటున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ కూడా ప్రీమియర్ చూసి తనదైన రివ్యూ ఇచ్చేశాడు. మూవీని ఆకాశానికెత్తేశాడు.(ఇదీ చదవండి: ‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్)'దేశభక్తి, స్వాగ్తో ఇప్పుడే 'ధురంధర్ 2' చూశాను. ప్రతి భారతీయుడిని గర్వంగా ఫీలయ్యేలా చేసింది. సినిమాలో క్లాప్స్ కొట్టే సందర్భాలెన్నో. చిత్రబృందానికి శుభాకాంక్షలు. మాధవన్ సహా నటీనటులు అందరూ అదరగొట్టేశారు. నీలాంటి భిన్నమైన యాక్టర్ దేశంలో ఉండటం గర్వకారణంగా ఉంది బ్రదర్ రణ్వీర్ సింగ్. ఆదిత్య ధర్.. మరోసారి బ్లాక్‌బస్టర్ కొట్టేశాడు. నీలాంటి దర్శకులు మన దేశంలో ఉన్నందుకు గర్వంగా ఉంది. షో రాకర్. ఇది ఇంటర్నేషనల్ స్వాగ్తో తీసిన భారతీయ కథ. జైహింద్' అని అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు.మామ పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజైనప్పటికీ.. అల్లు అర్జున్ ముందుగా 'ధురంధర్ 2' చూసి ఏకంగా రివ్యూ ఇవ్వడం తెలుగు ప్రేక్షకుల్లో చర్చకు కారణమైంది. ఎందుకంటే పవన్ సినిమాకు ఎర్లీ మార్నింగ్ షోలు పడ్డాయి. మొత్తం నెగిటివ్ టాక్ వస్తోంది. అల్లు అర్జున్‌తో పాటు విజయ్ దేవరకొండ తదితరులు.. 'ధురంధర్ 2' సినిమాని బుధవారం సాయంత్రం అల్లు సినిమాస్ థియేటర్లో చూశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'ఉస్తాద్ భగత్ సింగ్' ట్విటర్ రివ్యూ.. ఇలా అంటున్నారేంటి?) -
‘ధురంధర్ 2’ మూవీ రివ్యూ అండ్ రేటింగ్
సినిమా: ధురంధర్: ద రివేంజ్నటీనటులు: రణ్వీర్ సింగ్, మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా, సారా అర్జున్ తదితరులుసంగీతం: శాశ్వత్ సచ్దేవ్సినిమాటోగ్రఫీ: వికాల్ నోవ్లఖాఎడిటర్: శివకుమార్ వి పనికర్రచన-దర్శకత్వం: ఆదిత్య ధర్నిర్మాతలు: జియో స్టూడియోస్, బీ62 స్టూడియోస్నిడివి: 229 నిమిషాలువిడుదల తేదీ: 19 మార్చి 2026గతేడాది డిసెంబరులో ఏ మాత్రం అంచనాల్లేకుండా వచ్చి సంచలనం సృష్టించిన సినిమా 'ధురంధర్'. సీక్వెల్ గురించి అప్పుడే క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు అదే మాటపై నిలబడి 'ధురంధర్: ద రివేంజ్'ని థియేటర్లలోకి తీసుకొచ్చేశారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా రెండో భాగాన్ని హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల చేశారు. ఇంతకీ ఈ చిత్రం ఎలా ఉంది? తొలి భాగాన్ని మించిపోయిందా లేదా అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?రెహమాన్ డెకాయిట్ (అక్షయ్ ఖన్నా) మరణంతో ధురంధర్ పార్ట్ 1 ముగుస్తుంది. ఆ తర్వాత ల్యారీకి తానే నాయకుడినని అర్షద్ పప్పు (అశ్విన్ ధర్)ప్రకటించుకుంటాడు. అన్నచావుకు కారణమైన అర్షద్ పప్పుపై రెహమాన్ సోదరుడు ఉజెయిర్ బలోచ్(డానిష్) కోపంతో రగిలిపోతుంటాడు. వీరిద్దరిని కాదని, ల్యారీని భారత సీక్రెట్ ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్) తన గుప్పింట్లోకి తెచ్చుకొని, భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్) అప్పజెప్పిన పనులన్నీ పూర్తి చేసుకొస్తుంటాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్), ఎంపీ జమీల్ (రాకేష్ బేడీ) కూడా హమ్జాని గుడ్డిగా నమ్ముతారు. ఇలా పాక్ ఉగ్రవాద నాయకులందరిని నమ్మించి.. ఇండియాపై వాళ్లు చేసే కుట్రలన్నింటిని హమ్జా తిప్పికొడతాడు. అసలు భారత్‌పై పాన్ ఉగ్రవాద సంస్థలు చేసిన కుట్రలు ఏంటి? వాటిని తిప్పికొట్టే క్రమంలో హమ్జాకు ఎదురైన సమస్యలు ఏంటి? హమ్జా ఇండియన్ ఏజెంట్ అనే విషయం ఎలా బయటకు వచ్చింది? ఆ విషయం తెలిసిన తర్వాత మేజర్ ఇక్బాల్ (అర్జున్ రాంపాల్) ఏం చేశాడు?. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద ముఠాలందరికి మార్గనిర్దేశం చేస్తున్న ‘బడే సాహెబ్ ’ ఎవరు? ఆపరేషన్ ధురంధర్ కోసం ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్.. పంజాబ్‌లో జైలు జీవితం గడుపుతున్న జస్కరిత్ సింగ్ రంగీ(రణ్వీర్)నే ఎందుకు ఎంచుకున్నాడు? అతని నేపథ్యం ఏంటి? ఇతని కుటుంబానికి ఎమ్మెల్యే సుఖ్వెంధర్ చేసిన అన్యాయం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.ఎలా ఉందంటే..ఉగ్రవాదాన్ని అంతం చేయడానికి ఒక జైలు ఖైదీని సీక్రెట్ ఏజెంట్‌గా పాకిస్తాన్‌కి పంపడం అనే కొత్త పాయింటే ధురంధర్ విజయానికి కారణం అయింది. ఇంతవరకు వచ్చిన స్పె యాక్షన్ సినిమాలకు ధురంధర్‌కు మత్య ఉన్న తేడా అదే. దానికి తోడు యాక్షన్ సన్నివేశాలు, బీజీఎం అదిరిపోవడంతో రికార్డు స్థాయి కలెక్షన్స్ వచ్చాయి. ఆ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన ధురంధర్ : ది రివెంజ్ కూడా అదే రేంజ్లో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో పాటు ఎమోషన్‌కి కూడా పెద్ద పీట వేశారు. పార్ట్ 1 చూసిన వాళ్లు సినిమా ప్రారంభం నుంచే ధురంధర్ ప్రపంచంలోకి వెళ్లిపోతారు. చూడనివారికి కూడా కథను చాప్టర్ల వారిగా విడగొట్టి.. అర్థమయ్యేలా తెరపై చూపించాడు దర్శకుడు. అయితే పార్ట్ 1 చూస్తేనే కొన్ని పాత్రలకు తాలుకు పవర్ తెలిసి..తర్వాత ఏం జరుగుతుందో ఊహించొచ్చు.చివరిలో వచ్చే కొన్ని ట్విస్టులను మాత్రం ఊహించలేం. అవి థ్రిల్‌కి గురి చేస్తాయి. పార్ట్1 కంటే నిడివి ఎక్కువైనా.. ఎక్కడా బోర్ కొట్టదు.హమ్జా పాత్ర ప్లాష్‌బ్యాక్‌తో సినిమా కథ ప్రారంభం అవుతుంది. తన కుటుంబానికి జరిగిన అన్యాయంపై హీరో పగ తీర్చుకునే క్రమంలో వచ్చే సన్నివేశాలు అయితే ఒళ్లు జలదరించేలా ఉన్నాయి. అక్కడ నుంచి మొదలు సినిమా ఎండింగ్ వరకు యాక్షన్ సీన్స్‌ను ఓ రేంజ్‌తో తీర్చిదిద్దారు. ల్యారీ పీఠం దక్కించుకునేందకు హమ్జా ఆడే మైండ్ గేమ్ అదిరిపోతుంది. ఉగ్రవాదులకు అంతం చేసేందుకు వేసే ఎత్తులు థియేటర్స్‌లో చప్పట్లు కొట్టించేలా ఉంటాయి. 2016లో జరిగిన నోట్ల రద్ధు ఘటనను కూడా ఈ కథలో ప్రస్తావించారు. నోట్ల రద్దు సరైన నిర్ణయం అనేలా ఈ చిత్రంలో చూపించారు. అలాగే మాఫీయా డాన్ దావూద్‌ని కూడా ఈ కథకు ముడిపెట్టడం ఆసక్తిరేకెత్తించే అంశం. ఫస్టాఫ్ వరకు కాస్త స్లోగా అనిపించినా.. ఇంటర్వెల్ ట్విస్ట్ మాత్రం అదిరిపోతుంది. ద్వితియార్థంలో ఏం జరుగుందా అనే ఆసక్తిని ప్రేక్షకులను కలిగించేలా ఇంటర్వెల్ కట్ చేశారు. ఇక సెకండాప్ మొత్తం కథనం పరుగులు పెడుతుంది. హమ్జాపై ఎన్సీ అస్లాం చౌదరిపై అనుమానం రావడంతో కథనంపై ఆసక్తి పెరుగుతుంది. హమ్జా భారత ఏజెంట్ అని తెలిసిన తర్వాత ఏం జరుగుతుందా అనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఇక చివరి 30 నిమిషాల్లో వచ్చే ట్విస్టులు అదిరిపోతాయి. క్లైమాక్స్ ఎమోషనల్‌గా సాగుతుంది. ఎవరెలా చేశారంటే..సీక్రెట్ ఏజెంట్ హమ్జా పాత్రలో రణ్వీర్ సింగ్ ఒదిగిపోయాడు. యాక్షన్ సీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాల్లోనూ అదరగొట్టేశాడు. పాకిస్తాన్ మేజర్ ఇక్బాల్‌గా అర్జున్ రాంపాల్ అద్భుతంగా నటించాడు. ఎస్పీ చౌదరిగా నటించిన సంజయ్ దత్ నిడివి కాస్త తక్కువే. ఆయన పాత్ర ముగింపు బాగుంటుంది. ఐబీ చీఫ్ అజయ్ సన్యాల్‌గా మాధవన్ తెరపై కనిపించేది తక్కువే అయినా.. గుర్తిండిపోయేలా నటించాడు. జమీల్ జమాల్‌గా నటించిన రాకేశ్ బేడి నవ్వులు పూయించడంతో పాటు థ్రిల్లింగ్‌కి కూడా గురిచేశాడు. సారా అర్జున్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేదు. మిగిలినవారంతా బాగానే చేశారు. సాంకేతికంగా సినిమా చాలా బాగుంది. శాశ్వత్ సచ్దేవ్ బీజీఎం ఈ సినిమాకు మరో ప్రధాన బలం. తనదైన నేపథ్య సంగీతంతో కొన్ని సీన్లకు ప్రాణం పోశాడు. పోరాట ఘట్టాలు వాస్తవికంగా తెరకెక్కించారు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
టాలీవుడ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. తెలుగులోనూ ప్రీమియర్స్
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడంతా దురంధర్ ఫీవర్ నడుస్తోంది. ఇప్పటికే ప్రీమియర్స్ పడగా.. థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఇవాళ సాయంత్రం కేవలం హిందీలో మాత్రమే ప్రీమియర్స్ ప్రదర్శించారు. అయితే తెలుగు ఆడియన్స్ కూడా ప్రీమియర్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో దురంధర్ టీమ్ గుడ్ న్యూస్ చెప్పింది.ఈ రోజు రాత్రి 9 గంటల నుంచే తెలుగుతో పాటు తమిళంలోనూ ప్రీమియర్స్ ప్రారంభం అవుతాయని ప్రకటించింది. ఈ విషయాన్ని డైరెక్టర్ ఆదిత్య ధర్ వెల్లడించారు. దీంతో టాలీవుడ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే కన్నడ, మలయాళ భాషల్లో మాత్రం రేపటి నుంచి మాత్రమే ప్రదర్శిస్తామని తెలిపారు. సాంకేతిక సమస్యల వల్లే ప్రీమియర్స్ ఆలస్యమైనట్లు పేర్కొన్నారు.గతేడాది రిలీజైన దురంధర్ సూపర్ హిట్ కావడంతో ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. డిసెంబర్ 5న విడుదలైన ఈ స్పై థ్రిల్లర్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. దీంతో సీక్వెల్‌పై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. -
దురంధర్-2 ట్విటర్ రివ్యూ.. ఆడియన్స్ ఏమన్నారంటే?
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా దురంధర్-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కేవలం మూడు నెలల వ్యవధిలోనే సీక్వెల్‌ను థియేటర్లలో రిలీజ్ చేశారు. ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ ప్రీమియర్ షోలు ఇప్పటికే ఓవర్సీస్తో పాటు ఇండియాలోనూ ప్రదర్శించారు.ఈ మూవీ చూసిన ఆడియన్స్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ప్రముఖ సినీ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ సైతం ఈ మూవీపై తన రివ్యూ రాసుకొచ్చారు. దురంధర్-2 ఒక మాస్టర్ పీస్ అని పోస్టులు పెడుతున్నారు. ఇంటర్వెల్ సీక్వెన్స్ స్టన్నింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దురంధర్-2 ఫస్ట్ హాఫ్ బ్లాక్‌బస్టర్ అంటూ ఆడియన్స్ ట్వీటిర్ వేదికగా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ ఖాయమని ప్రేక్షకులు ట్వీట్స్ పోస్ట్ చేస్తున్నారు. It's a stunning interval now✅Finally watched the Bade Saab 🔔Wait here for the complete #Dhurandhar2Review .#Dhurandhar2 #DhurandharTheRevenge . pic.twitter.com/8zk7CEhmkA— Always Bollywood (@AlwaysBollywood) March 18, 2026 BLOCKBUSTER 🔥#Dhurandhar2 #Dhurandhar2Review#DhurandharTheRevenge pic.twitter.com/j14czkhBWh— ◔‿◔ (@KhusshRaho) March 18, 2026 RANVEER SINGH 🫡Radiant-Relentless-Roaring-Resilient-Raw 👑🔥#Dhurandhar2 #DhurandharTheRevenge #Dhurandhar2Review @RanveerOfficial @AdityaDharFilms pic.twitter.com/65jgu2Bmy4— Shikhar Negi (@ImshikharNegi) March 18, 2026 #Dhurandhar2 crushing cringe Bollywood #DhurandharTheRevenge #Dhurandhar2review pic.twitter.com/Hy83od6XCR— Viral (@drviral1123) March 18, 2026 Ohhh mannnBLOCKBUSTER 1ST HALFThis is not going to stop soonThe opening sequence Jassi's back storyAnd many things Don't want to spoil it for u guyzzBut this is a Box office Tsunami#DhurandharTheRevengePremiere#Dhurandhar2Review Bgm is a hit miss because we are spoiled— Aarav jain (@sanidhya_jain18) March 18, 2026 -
'ధురంధర్ 2' సినిమా.. HD ఫొటోలు
-
'ధురంధర్ 2' రెమ్యునరేషన్ డీటైల్స్.. ఎవరికి ఎన్ని కోట్లు?
స్పై యాక్షన్ థ్రిల్లర్ జానర్లో ట్రెండ్ సెట్ చేసిన 'ధురంధర్' నుంచి ఇప్పుడు సీక్వెల్ వచ్చేసింది. దేశవ్యాప్తంగా ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రింట్స్ టైంకి రాకపోవడంతో తెలుగు వెర్షన్ ప్రీమియర్స్ మాత్రం రద్దయ్యాయి. గురువారం ఉదయం నుంచి తెలుగు షోలు యధావిధిగా స్క్రీనింగ్ కానున్నాయి. ఇప్పటికైతే మూవీపై ఓ రేంజ్ బజ్ ఉంది. దానికి తోడు దర్శకుడు కూడా చివరివరకు కూర్చోండి, ట్విస్టులు బయటపెట్టొద్దని చెప్పడం ఆసక్తికరంగా అనిపిస్తోంది. మరోవైపు సీక్వెల్ కోసం నటీనటులు తీసుకున్న రెమ్యునరేషన్ వివరాలు కూడా వైరల్ అవుతున్నాయి.(ఇదీ చదవండి: 'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి)మిగతా పాన్ ఇండియా సినిమాల్లా 'ధురంధర్' రెండు భాగాల షూటింగ్స్ వేర్వేరుగా చేయలేదు. మొత్తం ఒకేసారి కలిపి తీసేశారు. గత నెలలో ప్యాచ్ వర్క్స్ లాంటివి చేశారు. అయితే రెండు భాగాలకు కలిపి నటీనటులకు ఒకేసారి రెమ్యునరేషన్స్ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. హమ్జా అలీ, జస్కీరాత్ సింగ్ అనే రెండు పాత్రలు చేసిన రణ్వీర్ సింగ్‌కి అత్యధికంగా రూ.40-50 కోట్ల వరకు ఇచ్చినట్లు తెలుస్తోంది.రణ్వీర్ కంటే ఎక్కువగా మూవీలో హైలైట్ అయింది అక్షయ్ ఖన్నా చేసిన రహమాన్ డకాయిట్ పాత్ర. తొలి భాగంలోనే రహమాన్ రోల్ ముగిసింది. కానీ సీక్వెల్లో కొన్ని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్‌లో ఈ పాత్ర కనిపించనుందట. మొత్తంగా దీనికోసం అక్షయ్ ఖన్నాకు రూ.5 కోట్ల వరకు పారితోషికం ఇచ్చినట్లు సమాచారం.ఎస్పీ అస్లాం చౌదరిగా అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చిన సంజయ్ దత్.. మొత్తంగా రూ.10 కోట్ల వరకు పారితోషికం అందుకున్నాడట. ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ పాత్ర చేసినందుకుగానూ మాధవన్కి రూ.9 కోట్లు, మేజర్ ఇక్బాల్ అనే విలనీ పాత్రలో నటించిన అర్జున్ రాంపాల్, హీరోయిన్గా చేసిన సారా అర్జున్ తలో రూ.కోటి రెమ్యునరేషన్‌గా అందుకున్నారట. ఇక దర్శకుడు, నిర్మాత అయిన ఆదిత్య ధర్ పారితోషికం గురించి అయితే ఎక్కడా వివరాలు లేవు. కానీ ఈ మూవీ వల్ల ఆదిత్య ధర్ బ్రాండ్ ఇమేజ్ చాలా పెరిగిపోయింది. తర్వాత చేయబోయే చిత్రం ఏంటో తెలియనప్పటికీ.. ఒకవేళ ఏ నిర్మాత అప్రోచ్ అయినా సరే భారీ రెమ్యునరేషన్ అయితే డిమాండ్ చేయడం గ్యారంటీ.'ధురంధర్' విషయానికొస్తే.. మన దేశంపై పాకిస్తాన్ చేస్తున్న వరస దాడులు ఆగాలంటే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించాలని భారత ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్ (మాధవన్) భావిస్తాడు. ఆపరేషన్ ధురంధర్కి శ్రీకారం చుడతాడు. ఇందులో భాగంగా జైలుజీవితం గడుపుతున్న ఓ కుర్రాడిని ఏజెంట్ హమ్జా(రణ్వీర్ సింగ్)ని మారుపేరుతో పాకిస్తాన్‌కి పంపిస్తాడు. జ్యూస్ షాపులో పనిచేసే దగ్గర నుంచి రహమాన్ డకాయిట్ అనే కరుడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌కి ఆత్మీయుడు అయ్యేంతవరకు ఎలా ఎదిగాడు? ఈ ప్రయాణంలో ఎదురైన సవాళ్లేంటి? చివరకు ఏమైందనేదే స్టోరీ. రహమాన్ డకాయిట్‌ని హమ్జా చంపడంతో తొలి భాగం ముగిసింది. రెండో పార్ట్‌లో హమ్జా.. లయారీకి ఎలా డాన్ అయ్యాడు? భారత్‌ని దాడులు చేసిన మిగతా ఉగ్రవాదుల్ని ఎలా మట్టుబెట్టాడనేది చూపించబోతున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' తెలుగు ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్) -
'ధురంధర్' తెలుగు ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్
'ధురంధర్' సినిమా గతేడాది డిసెంబరులో థియేటర్లలోకి వచ్చింది. దేశవ్యాప్తంగా అద్భుతమైన ఆదరణ దక్కించుకుంది. తర్వాత ఓటీటీలోకి వచ్చిన తర్వాత అదే రేంజ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. తొలి భాగం విడుదలైన మూడు నెలలకు ఇప్పుడు సీక్వెల్ రెడీ అయిపోయింది. ముందే చెప్పినట్లు మార్చి 19నే అంటే రేపటి నుంచే మూవీని రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలోనే తెలుగు సినీ ప్రేక్షకులకు అనుకోని చేదువార్త ఎదురైంది.(ఇదీ చదవండి: నోరు జారా.. క్షమించండి: ఉస్తాద్ భగత్ సింగ్ నటుడు)'ధురంధర్ 2' చిత్రం లెక్క ప్రకారం గురువారం(మార్చి 19) రిలీజ్ అవుతున్నప్పటికీ.. ముందు రోజు సాయంత్రం 5 గంటల నుంచే ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. హిందీతో పాటు దక్షిణాది భాషల్లోనూ ఉంటుందని ప్రకటించారు. అందుకు తగ్గట్లే టికెట్స్ కూడా విక్రయించారు. కానీ చివరి నిమిషంలో హడావుడి వల్ల తెలుగు, తమిళ ప్రింట్స్ టైంకి డెలివరీ కాలేదు. దీంతో బుధవారానికి సంబంధించి హిందీ వెర్షన్ మాత్రమే ప్రీమియర్స్ వేస్తున్నారు.తెలుగు, తమిళ వెర్షన్స్.. బుధవారానికి సంబంధించిన షోలు రద్దయ్యాయి. డబ్బులు కూడా రీఫండ్ చేసేశారు. ఇకపోతే గురువారం ఉదయం నుంచి యధావిధిగా తెలుగు వెర్షన్ షోలు పడనున్నాయి. మరోవైపు దర్శకుడు ఆదిత్య ధర్.. మూవీ గురించి ఆసక్తికర పోస్ట్ పెట్టాడు. ట్విస్టులు బయటపెట్టొద్దని చెబుతూనే చివరి వరకు థియేటర్లలోనే ఉండాలని రాసుకొచ్చాడు. దీంతో మూడో భాగం గురించి హింట్ ఇస్తున్నాడా అని మాట్లాడుకుంటున్నారు.'ప్రియమైన 'ధురంధర్' ఫ్యామిలీ.. సినిమాని మీరెంతో ప్రేమించారు. ప్రతి చిన్న అంశాన్ని గుర్తించి మెచ్చుకున్నారు. మళ్లీ మళ్లీ చూసి ఎవరూ గుర్తించలేరనుకునే వాటిని కూడా గుర్తించారు. ఈ ప్రయాణంలో సినిమా మీది అయింది. తర్వాత ప్రపంచానిది కూడా అయింది. 'ధురంధర్: ద రివేంజ్'తో మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాం. భావోద్వేగానికి గురిచేస్తాం. రెడీగా ఉండండి. అందరితో కలిసి ప్రతి ట్విస్ట్, ఎమోషన్ థియేటర్ లోనే అనుభూతి చెందండి. దయచేసి సినిమా చూసిన తర్వాత ట్విస్టులని చెప్పేయకండి. ఎండ్ క్రెడిట్స్ అయ్యేంతవరకు సీట్ల నుంచి లేచి వెళ్లిపోకండి' అని డైరెక్టర్ ఆదిత్య ధర్ చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: 'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి)🙏🧿♥️#DhurandharTheRevenge releases worldwide on 19 March, on Gudi Padwa, Ugadi, and Eid.Hindi | Telugu | Tamil | Kannada | Malayalam @ranveersingh @rampal72 @duttsanjay @actormaddy #AkshayeKhanna @saraarjunn @therakeshbedi @adityadharfilms #JyotiDeshpande @dhar_lokesh… pic.twitter.com/wgO61vrUUQ— Aditya Dhar (@AdityaDharFilms) March 18, 2026 -
'ధురంధర్' పూర్తి స్టోరీ.. సీక్వెల్ చూడటానికి ముందు మరోసారి
కొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేస్తాయి. అలాంటి వాటిలో 'ధురంధర్' ఒకటి. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఇది. గతేడాది డిసెంబరులో రిలీజయ్యేంత వరకు ఇదో చిత్రం ఉందని కూడా చాలామందికి తెలీదు. ఎప్పుడైతే థియేటర్లలోకి వచ్చిందో సరికొత్త రికార్డులు సృష్టించింది. ఇప్పుడు మూడు నెలలు తిరిగేసరికల్లా సీక్వెల్ రెడీ చేశారు. ఈ రోజే(మార్చి 18) ప్రీమియర్ షోలు పడనుండగా.. రేపటి నుంచి రెగ్యులర్ షోలు వేయనున్నారు. ఈ సందర్భంగా అసలు తొలి భాగంలో ఏం జరిగింది? సీక్వెల్లో ఏం జరగొచ్చనేది చూద్దాం.'ధురంధర్' పూర్తి స్టోరీ30 డిసెంబరు 1999, అఫ్గానిస్తాన్‌లోని కాందహార్ ఎయిర్‌పోర్ట్‌లో భారతదేశానికి చెందిన విమానాన్ని హైజాక్ చేసిన ఐఎస్ఐ వాళ్లు.. ప్రయాణికుల్ని బందీలుగా చేశారు. మన దగ్గర బందీగా ఉన్న 36 మంది టెర్రరిస్టులు రిలీజ్ చేస్తే గానీ జనాల్ని వదలం అనే దగ్గర నుంచి కేవలం ముగ్గురిని విడుదల చేస్తే చాలు అనేంత వరకు వస్తారు. అప్పుడు విదేశాంగ శాఖ మంత్రి దేవరత కపూర్, ఇంటెలిజన్స్ బ్యూరో చీఫ్ అజయ్ సన్యాల్(మాధవన్).. విమానంలో ఉన్న జనాలకు ధైర్యం ఇచ్చేందుకు వస్తారు. అయితే ఐఎస్ఐ వాళ్లలో ఒకడు.. మన దేశాన్ని కించపరుస్తూ అజయ్ సన్యాల్‌తో దారుణంగా మాట్లాడుతాడు. కానీ మనోడు ఒకడు పాకిస్తాన్లోకి వెళ్లి అక్కడున్న గ్యాంగ్స్ ని మట్టుబెట్టేందుకు 'ధురంధర్' అనే మిషన్ ఉందని అజయ్ సన్యాల్.. విదేశాంగ శాఖమంత్రితో చెబుతాడు. కానీ అదంతా చాలా టైమ్ తీసుకునే మిషన్ అని గ్రీన్ సిగ్నల్ ఇవ్వరు.కట్ చేస్తే 13 డిసెంబరు 2001లో పార్లమెంట్‌పై దాడి జరుగుతుంది. కాందహార్ హైజాక్‌లో భాగమైన ఓ టెరర్రిస్ట్.. దీనికి నాయకత్వం వహిస్తాడు. కొందరు పోలీస్ ఆఫీసర్లని చంపేస్తారు. దొరికిపోయే టైంకి ఆత్మాహుతి దాడి చేసుకుని వాళ్లంతా చనిపోతారు. ఈ దెబ్బకు ప్రభుత్వం షేక్ అయింది. సహనం కోల్పోయింది. అందుకే అజయ్ సన్యాల్ చెప్పిన 'ధురంధర్' ఐడియాకు ఓకే చెబుతారు. కట్ చేస్తే 2004లో మన దేశ ఏజెంట్ హంజా అలీ మజారీ(రణ్వీర్ సింగ్) తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. నేరుగా పాకిస్తాన్‌కి వెళ్లకుండా ఆఫ్గానిస్తాన్ మీదుగా పాక్‌లోని లయారీకి చేరుకుంటాడు. అక్కడికి వెళ్లిన తర్వాత హంజా.. ఆలం జ్యూస్ సెంటర్ నడుపుతున్న మన దేశానికి చెందిన మరో ఏజెంట్ ఆలం భాయ్ షాపులో పనికి చేరతాడు. ఓ రోజు సాల్ట్ ఛాయ్ తాగుతూ.. లయారీ టౌన్ జియో పాలిటిక్స్ అంతా వివరిస్తాడు.లయరీని ఏలుతున్న బాబు డకాయిట్ అక్రమ సంతానం రహమాన్ డకాయిట్ (అక్షయ్ ఖన్నా). ఈ విషయం చిన్నప్పుడే రహమాన్‌కి తెలియడంతో సొంత తల్లిని చంపేసి సవతి తండ్రికి దూరంగా ఉంటాడు. తన సొంత సామ్రాజ్యాన్ని సృష్టించుకుంటాడు. తన కజిన్ ఉజైర్ బలూచ్ తో కలిసి ఆయుధాల అక్రమ రవాణా, రమ్మీ క్లబ్, కిడ్నాపులు, రాజకీయ హత్యలు.. ఇలా అన్ని దారుణాలు చేస్తూ కరాచీ అండర్ వరల్డ్ కి డాన్ లా తయారయ్యాడు. రహమాన్ కి ఇద్దరు కొడుకు నయిమ్, ఫైజల్. రహమాన్ అండతో స్థానిక ఎన్నికల్లో రెండుసార్లు గెలిచిన పాకిస్తానీ అవామీ పార్టీ నాయకుడు జమీల్. కానీ రహమాన్ గ్యాంగ్ కి వ్యతిరేకంగా ముస్లిం మూమెంట్ పార్టీ.. బాబు డకాయిట్, అర్షద్ పప్పు చేతిలో ఉంటుంది. బాబు డకాయిట్ కి పక్షవాతం రావడంతో రహమాన్ ని ఎదుర్కొనేందుకు అర్షద్ తో చేతులు కలుపుతాడు. హంజా.. అక్కడే పనిచేసుకుంటూ ఉంటే కుదరదు కాబట్టి ఈ రెండు గ్యాంగ్స్ లో ఏదో ఒకదానిలో చేరేందుకు ప్లాన్ వేస్తాడు. వీళ్లకు బాబు డకాయిట్ గ్యాంగ్ లో ఉన్న మరో ఏజెంట్ సాయం చేస్తాడు. ఓ పెళ్లిలో రహమాన్ కొడుకులపై బాబు డకాయిట్ గ్యాంగ్ దాడి చేయడానికి ప్లాన్ చేస్తున్నారనే సమాచారాన్ని సదరు ఏజెంట్.. హంజాకి చెబుతాడు.అనుకున్నట్లే ఆ పెళ్లిలో రహమాన్ కొడుకులపై బాబు-అర్షద్ గ్యాంగ్ దాడి చేస్తారు. ఇందులో రహమాన్ పెద్ద కొడుకు నయిమ్ చనిపోతాడు. ఇతడిని కాపాడి, రహమాన్ గ్యాంగ్‌లో హంజా చేరాలనేది ప్లాన్. కానీ పిల్లాడు చనిపోయినా సరే దాన్ని కూడా తనకు అవకాశంగా మార్చుకుని రమమాన్కి హంజా దగ్గరవుతాడు. డబ్బులు ఇస్తానని చెబితే వద్దని.. తనని గ్యాంగ్‌లో చేర్చుకోమంటాడు. అలా రహమాన్ గ్యాంగ్‌లో హంజా జాయిన్ అవుతాడు. ఎన్నికల వరకు ఎలాంటి ప్రతీకారాలు వద్దని జమీల్.. రహమాన్‌కి చెప్పడంతో అంతా సైలెంట్ అవుతాడు. కానీ ఓ రోజు హంజా.. ప్రతీకారం గురించి మాట్లాడటంతో బాబు డకాయిట్‌ని నడిరోడ్డుపై రహమాన్ దారుణంగా చంపుతాడు.2007లో పీఏపీ పార్టీ 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తుంది. రహమాన్ ఫాలోయింగ్ జనాల్లో చాలా పెరిగిపోయింది. ఓ రోజు పార్టీ ఫంక్షన్ లో ఖనానీ బ్రదర్స్.. రహమాన్ ని కలుస్తారు. వీళ్లలో ఒకడు కొత్త రాజకీయ పార్టీ పెట్టాలని రహమాన్ కి సలహా ఇస్తాడు. మరోవైపు హంజా.. జమీల్ కూతురు యలీనాని ప్రేమలో పడేస్తాడు. ఈలోపు ఖనానీ బ్రదర్స్, మన రూ.500,రూ.1000 నోట్లని ప్రింట్ చేసే ప్లేట్లు సంపాదించారని అజయ్ సన్యాల్ కి తెలుస్తోంది. ఇది ఎలా జరిగిందో కనుక్కోమని అజయ్ సన్యాల్ తన తోటి అధికారికి చెబుతాడు. మరోవైపు ఐఎస్ఐ చీఫ్ మేజర్ ఇక్బాల్, రహమాన్ కలిసేలా ఖనానీ బ్రదర్స్ ఏర్పాటు చేస్తారు. తనకు గన్స్ కావాలని, కానీ వాటిపై మేడిన్ అమెరికా, మేడిన్ రష్యా అని ఉండాలని చెబుతాడు. ఇలానే ఎందుకంటే రేప్పొద్దున ఎవరైనా దొరికిపోతే పాకిస్తాన్‌ని ఎవరూ పాయింట్ అవుట్ చేయకూడదనేది మేజర్ ఇక్బాల్ ప్లాన్. అలానే రహమాన్‌కి రాజకీయంగానూ సాయం చేస్తానని చెప్పడంతో డీల్‌కి ఓకే చెబుతాడు.ఆ తర్వాత రహమాన్.. ఇక్బాల్‌కి గన్స్ అందజేస్తాడు. తర్వాత కొన్నిరోజులకు ముంబైలోని తాజ్ హోటల్లో దాడులు జరుగుతాయి. దీనికి కారణం తానే అనుకున్న హంజా.. రహమాన్ ని చంపే అవకాశం కోసం ఎదురుచూస్తుంటాడు. మరోవైపు తను అధికారం ఎక్కడ కోల్పోతానో అని భయపడిన జమీల్.. రహమాన్ని కట్టడి చేసేందుకు ఎస్పీ అస్లాం చౌదరిని రంగంలోకి దింపుతాడు. రహమాన్ కి నమ్మకస్తుడిగా ఉన్న హంజా.. జమీల్, ఎస్పీ అస్లాం చౌదరిలతో చేతులు కలిపి చివరకు రహమాన్‌నే చంపేస్తాడు. అక్కడితో తొలి భాగాన్ని ముగించారు.రెండో భాగంలో స్టోరీ ఏం ఉండనుంది?మరి రహమాన్ చనిపోయిన తర్వాత లయారీని హమ్జా ఎలా శాసించాడు? రహమన్ సోదరుడు ఉజైర్ బలూర్ ఏమయ్యాడు? అతడిని హమ్జా ఏం చేశాడు?అసలు హమ్జా అలియాస్.. జస్కీరాత్ సింగ్ రంగీ.. మన దేశంలో ఉన్నప్పుడు ఎందుకు జైలుకెళ్లాడు? ఏం నేరం చేశాడు? ఇతడినే ఎందుకు గూఢచారిగా పంపించారు?తొలి భాగంలో హమ్జాని ఎవరు గుర్తుపట్టలేదు. కానీ రెండో భాగంలో అది బయటపడుతుందా? ఒకవేళ ప్రేమించి పెళ్లి చేసుకున్న యలీనాకి ఈ విషయం తెలిసిందా?ఐఎస్ఐకి చెందిన మేజర్ ఇక్బాల్‌కి హమ్జా దొరికేస్తాడా? రహమాన్ని చంపేందుకు హమ్జాతో చేతులు కలిపిన ఎస్పీ అస్లాం చౌదరి.. హమ్జాని ఏమైనా అడ్డుకున్నాడా?స్వయానా అల్లుడే.. భారతీయ గూఢచారి అని జమీల్ కి ఏమైనా తెలిసిందా? ఒకవేళ తెలిస్తే ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు?తొలి భాగంలో ఎక్కువగా వినిపించిన బడే సాహెబ్.. సీక్వెల్లో కనిపిస్తాడా? లేదంటే దీన్ని మూడో భాగం కోసం ఏమైనా దాస్తారా? ఇలా చాలా ప్రశ్నలు మిగిలిపోయాయి. వీటన్నింటికి 'ధురంధర్ 2'లో సమాధానాలు దొరుకుతాయా అనేది చూడాలి? -
'ధురంధర్ 2'.. మన దగ్గర ఇలా అక్కడ మరోలా
లెక్క ప్రకారం ఈ నెలలో చాలానే పాన్ ఇండియా సినిమాలు రావాలి. కానీ చాలావరకు అవన్నీ వాయిదా పడటంతో చివరకు 'ధురంధర్ 2' మాత్రమే రేసులో మిగిలింది. ఈ గురువారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. దేశమంతటా దీనిపై హైప్ బీభత్సంగా ఉంది. ప్రీమియర్, రెగ్యులర్ షోల టికెట్స్ వేగంగా బుక్ అయిపోతున్నాయి. అయితే ఓ విషయం మాత్రం ఆసక్తికరంగా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: బ్యాడ్ సెంటిమెంట్.. టెన్షన్లో పవన్ ఫ్యాన్స్!)గతేడాది డిసెంబరులో అంటే మూడు నెలల క్రితం 'ధురంధర్' తొలి పార్ట్ రిలీజైనప్పుడు ఏ మాత్రం హైప్ లేదు. ఎప్పుడైతే థియేటర్లలోకి వచ్చిందో మౌత్ టాక్ వల్ల పాన్ ఇండియా లెవల్లో టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోయింది. ఈ మూవీ చివరలో చెప్పినట్లుగానే మార్చి 19నే ఇప్పుడు సీక్వెల్ విడుదల చేస్తున్నారు. తొలి భాగం దాదాపు మూడున్నర గంటల నిడివి కాగా.. ఇప్పుడు మరింత నిడివితో సీక్వెల్ రాబోతుంది.'ధురంధర్: ద రివేంజ్' నిడివి మన దేశంలో మూడు గంటల 49 నిమిషాలు కాగా.. ఓవర్సీస్లో మాత్రం 3 గంటల 55 నిమిషాలు. అంటే మన కంటే విదేశీ ప్రేక్షకులు ఆరు నిమిషాల పాటు అదనంగా ఉండే ఫుటేజ్ చూడనున్నారనమాట. రిలీజ్ 19నే అయినప్పటికీ ముందురోజు సాయంత్రం నుంచి దేశవ్యాప్తంగా ప్రీమియర్లు పడనున్నాయి. ముంబై, బెంగళూరు లాంటి నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ప్రీమియర్ల బుకింగ్స్ టాప్ రేంజులో ఉన్నట్లు తెలుస్తోంది.ఇక విడుదలకు ముందే రూ.130 కోట్లకు పైగా ప్రీ సేల్స్‌తో అదరగొట్టిన 'ధురంధర్ 2'.. తెలుగు, తమిళం లాంటి దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ కానుంది. దీంతో ఈసారి ఎన్ని వందల కోట్ల కలెక్షన్స్ వస్తాయోనని మూవీ లవర్స్ మాట్లాడుకుంటున్నారు. మరోవైపు దీనితో పాటు విడుదలవుతున్న తెలుగు సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'.. 2 గంటల 34 నిమిషాల నిడివితో థియేటర్లలోకి వస్తోంది. మరి 'ధురంధర్ 2' పోటీ తట్టుకుని పవన్ మూవీ నిలబడుతుందా లేదా అనేది చూడాలి?(ఇదీ చదవండి: నాకు నయనతార కావాలి.. ఎంపీ షాకింగ్ కామెంట్స్) -
రిలీజ్‌కు ముందే దూకుడు.. ఓజీ, బాహుబలి-2 రికార్డ్స్ బ్రేక్..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. పాకిస్తాన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా రికార్డ్ సృష్టించింది. కాంతార-2, ఛావా సినిమాలను అధిగమించి మొదటిస్థానంలో నిలిచింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా దురంధర్-2 ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. దురంధర్ ది రివెంజ్ పేరుతో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయనుంది.అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు..ఇప్పటికే అడ్వాన్స్ టికెట్ బుకింగ్స్‌లోనూ దురంధర్-2 దూసుకెళ్తోంది. ప్రీమియర్ షోలు, మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్‌తో కలిసి ఏకంగా రూ.123 కోట్లు వసూలు చేసింది. రిలీజ్‌కు ముందే సరికొత్త రికార్డులతో అభిమానుల్లో అంచనాలు మరింత పెంచేసింది. మరిన్ని షోల బుకింగ్‌లు ఇంకా ప్రారంభం కావాల్సి ఉన్నందున.. రాబోయే రెండు రోజుల్లో ఈ వసూళ్ల సంఖ్య భారీగా పెరిగే ఛాన్స్ ఉంది.దేశవ్యాప్తంగా మార్చి 18న 'ధురందర్ 2' ప్రీమియర్ షోలు ప్రదర్శించనున్నారు. ఈ ప్రీమియర్ షో టికెట్స్ ద్వారా రూ.38.50 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. ఈ కలెక్షన్స్‌తో ఓజీ, బాహుబలి-2 ప్రీమియర్ షోల రికార్డ్స్ బ్రేక్ చేసింది. ఇండియాలో మొదటి రోజు 13 వేల షోల ద్వారా ఈ చిత్రం రూ. 24.50 కోట్ల దేశీయ వసూళ్లు రాబట్టింది. ప్రీ సేల్స్ ద్వారా అంతర్జాతీయ మార్కెట్లలో సుమారు రూ. 60 కోట్లు బిజినెస్ చేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మొత్తం ప్రీ బిజినెస్ రూ. 123 కోట్లకు చేరుకుంది. -
డ్రాగన్ పై దురంధర్ ఎఫెక్ట్..!
-
‘ధురంధర్’తో ఆ విషయం అర్థమైయింది :అక్షయ్ కుమార్
ప్రేక్షకులు అభిరుచి ప్రతి రెండు,మూడేళ్లకు ఓసారి మారుతుందని, అందుకు ‘ధురంధర్’ మంచి ఉదాహరణ అని బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ అన్నాడు. తాజాగా అక్షయ్ కుమార్ ఇండియా టుడే కాంక్లేవ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాలీవుడ్లో మారుతున్న ట్రెండ్ గురించి అక్షయ్ మాట్లాడుతూ.. ‘ధురంధర్’ సినిమాను తీసుకోండి. ఇది పూర్తి స్థాయి యాక్షన్ చిత్రం. సినిమా మొత్తంలో యాక్షన్ సన్నివేశాలే ఉంటాయి. ప్రేక్షకులు వాటిని ఎంజాయ్ చేస్తున్నారు. రణవీర్ సింగ్ చేసిన హై-ఎనర్జీ యాక్షన్ సన్నివేశాలకు చప్పట్లు కొడుకున్నారు. దీన్ని బట్టి ఇప్పుడు ఆడియన్స్ యాక్షన్ సినిమాలను ఇష్టపడుతున్నారనే విషయం అర్థమవుతుంది.ఇలా రెండు, మూడేళ్లకు ఒకసారి ప్రేక్షకుల అభిరుచి మారుతూనే ఉంటుంది. ఐదారేళ్ల క్రితం పరిస్థితి వేరుగా ఉండేది.అప్పుడు సామాజిక సందేశాత్మక చిత్రాలను ఆదరించారు. నేను చేసిన ‘టాయిలెట్: ఏక్ ప్రేమ్ కథ’, ‘ప్యాడ్ మ్యాన్’ లాంటి సినిమాలు అప్పుడు సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇప్పుడు అలాంటి సినిమాలు తీస్తే.. ఆడుతాయో లేదో తెలియదు. ప్రేక్షకుల కోరికలు ట్రెండ్‌కు తగ్గట్లుగా మారుతుంటాయి. ప్రస్తుతం హారర్ కామెడీలకూ ఆదరణ లభిస్తోంది. తర్వాత ఆడియన్స్ దేనిని ఇష్టపడతారో మనం ఎప్పటికీ ఊహించలేం’ అని అన్నారు. ధురంధర్ విషయానికొస్తే.. రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ తెరకెక్కించిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం.. బాక్సాఫీస్‌ని షేక్ చేసింది. దాదాపు రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌గా ధురంధర్ 2 రాబోతుంది. మార్చి 19న ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
ధురంధర్ 2 ఛాన్స్ వస్తే వదిలేసుకున్నా: నటుడు
గతేడాది చివర్లో వచ్చిన ధురంధర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఆదిత్య ధర్ డైరెక్టర్ చేసిన ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో సారా అర్జున్ కథానాయిక. ఆర్ మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్ కీలక పాత్రలు పోషించారు.ధురంధర్: రివేంజ్‌లో ఛాన్స్అయితే మూడు నెలలు కూడా తిరగకముందే ధురంధర్ పార్ట్ 2 వచ్చేస్తోంది. మార్చి 19న 'ధురంధర్: రివేంజ్' రిలీజ్ కానుంది. మొదటి భాగం బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ కాబట్టి ఎవరైనా సరే సీక్వెల్లో ఛాన్స్ వస్తే ఎగిరి గంతేస్తారు. కానీ ఈ బాలీవుడ్ నటుడు మాత్రం తనకు ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేశాడట!డేట్స్ లేవని..ఆయన మరెవరో కాదు, అనిల్ కపూర్. తాజాగా ఆయన ఓ ఈవెంట్లో మాట్లాడుతూ.. ధురంధర్ 2 సినిమాలో యాక్ట్ చేయమని దర్శకుడు ఆదిత్య నన్ను సంప్రదించాడు. అతిథి పాత్ర ఉంది, చేస్తావా? అని అడిగాడు. కానీ అప్పటికే నా డేట్స్ ఖాళీగా లేవు. వేరే సినిమాలతో బిజీగా ఉన్నాను. నీ సినిమాలో చేయాలనుంది, కానీ నేను ఖాళీగా లేను అని చెప్పి తిరస్కరించాను. ఆ మూవీ కోసం అప్పటికే ఒప్పుకున్న ప్రాజెక్టులను నేను పక్కనపెట్టలేను. కుదర్లేదుఆ నిబద్ధత వల్లే నేను ఇంతకాలం ఇండస్ట్రీలో ఉన్నాను. కేవలం టాలెంట్ ఒక్కటే మన స్థాయిని నిర్ణయించదు. కాకపోతే ధురంధర్ మూవీ అనేది మంచి ఆఫర్.. కానీ, ఏం చేద్దాం.. చేయడం కుదర్లేదు. భవిష్యత్తులో ఆదిత్యతో కలిసి పని చేస్తాననుకుంటున్నాను అని చెప్పుకొచ్చాడు. అనిల్ కపూర్ చివరగా 'సుబేదార్' సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉంది. -
'ధురంధర్-2' పవర్ఫుల్ సాంగ్ విడుదల
'ధురంధర్-2' నుంచి పవర్ఫుల్ సాంగ్‌ను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించారు. మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ నెల 19న విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్‌లో భాగంగా 'ధురంధర్: ది రెవెంజ్ ఆరి ఆరి..' సాంగ్‌ను షేర్ చేశారు. శాశ్వత్ సచ్దేవ్ అందించిన సంగీతం ఈ పాటకు ప్రధాన బలంగా నిలుస్తుంది. -
ధురందర్ 2 టికెట్ రేటు రూ. 3100
భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమైన ధురంధర్-2 సినిమా టికెట్ ధరల విషయంలో కొత్త రికార్డు సృష్టించింది. దేశంలోనే అత్యధిక టికెట్ ధరగా రూ.3100ను ఢిల్లీలోని ఐనాక్స్ మెగాప్లెక్స్లోని ఒక ప్రత్యేక స్క్రీన్‌లో ఫిక్స్ చేశారు. కేవలం 42 సీట్లు మాత్రమే ఉన్న ఈ స్క్రీన్‌లో ప్రీమియర్స్ కోసం ఈ రేటు అమలు చేస్తున్నారు. బుక్ మై షో చార్జీలతో కలిపితే ధర రూ.3145కి చేరుతుంది. ప్రస్తుతం అదే స్క్రీన్‌లో ప్రదర్శితమవుతున్న ది కేరళ స్టోరీ-2 టికెట్ ధర కేవలం రూ.500 మాత్రమే. అయితే ధురంధర్-2 క్రేజ్ కారణంగా ప్రీమియర్ షోలకు టికెట్ ధరను అమాంతం పెంచేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఇప్పటికే సగానికి పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. దేశవ్యాప్తంగా ఒక రోజు ముందే పెయిడ్ ప్రివ్యూలు ప్లాన్ చేశారు. బెంగళూరులో కొన్ని స్క్రీన్లలో టికెట్ ధరలు రూ.800 వరకు ఉన్నాయి. హైదరాబాద్‌లో కూడా ఎప్పటిలాగే రేట్లు పెంచారు. సాయంత్రం 5 గంటలకే అన్ని ప్రాంతాల్లో ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి. అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా సాగుతున్నాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా 3 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. -
రణవీర్ సింగ్ ధురంధర్ 2 మూవీలో ప్రియదర్శి..
-
48 గంటల్లో 312 మిలియన్స్ వ్యూస్.. ‘ధురంధర్ 2’ రికార్డు
రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘ధురంధర్ 2’. గతేడాది బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచిన ‘ధురంధర్’ చిత్రానికి సీక్వెల్ ఇది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా రిలీజైన ట్రైలర్ ఆ అంచనాలను మరింత పెంచేశాయి. అంతేకాదు రిలీజ్‌కి ముందే ఈ సినిమా రికార్టులను కొల్లగొడుతోంది. యూట్యూబ్‌లో ఈ మూవీ ట్రైలర్‌కి రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి. కేవలం 48 గంటల్లో అంటే రెండో రోజుల్లేనే 312 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఈ మధ్యకాలంలో ఒక మూవీ ట్రైలర్‌కు ఈ స్థాయి వ్యూస్ వచ్చిన దాఖలాలు లేవు.ట్రైలర్లో పవర్ఫుల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, స్ట్రైకింగ్ డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ ఆడియో ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండ్ అవుతూ, అనేక రీల్స్, ఫ్యాన్ ఎడిట్స్‌కు ప్రేరణగా మారింది. ఇదే సమయంలో గూగుల్ ట్రెండ్స్‌లో కూడా ఈ సినిమా, నటీనటులపై సెర్చ్‌లు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో రణవీర్ సింగ్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. మార్చి 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రణ్వీర్ సింగ్ దురంధర్-2.. ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఫిక్స్
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. కేవలం హిందీలోనే రిలీజైనప్పటికీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.అయితే కొన్ని నెలల వ్యవధిలోనే ఈ మూవీకి సీక్వెల్‌గా దురంధర్ ది రివెంజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓటీటీ స్ట్రీమింగ్ ఫ్లాట్‌ఫామ్ ఖరారైంది. ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ తర్వాత జియో హాట్‌స్టార్ వేదికగా అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ట్రైలర్లోనే వెల్లడించారు. థియేటర్లలో రిలీజైన తర్వాత ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీని మేకర్స్ ప్రకటించనున్నారు. కాగా.. ధురంధర్: ది రివెంజ్ మార్చి 19న థియేటర్లలో విడుదల కానుంది.పోటీ నుంచి తప్పుకున్న టాక్సిక్..ఈ మూవీతో మార్చి 19న యశ్ హీరోగా వస్తోన్న టాక్సిస్ రిలీజ్ కావాల్సి ఉంది. అయితే బాక్సాఫీస్ పోటీ నుంచి యశ్ తప్పుకున్నారు. గీతు మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన గ్యాంగ్‌స్టర్ మూవీ జూన్ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
రిలీజ్‌కు ముందే రికార్డులు.. దురంధర్-2 ప్రభంజనం..!
రణ్వీర్ సింగ్ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్ దురంధర్. పాకిస్తాన్ నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. గతేడాది డిసెంబర్ 5న రిలీజైన ఈ సినిమా ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు ఆదిత్య ధర్ దర్శకత్వం వహించారు. అయితే కొన్ని నెలల వ్యవధిలోనే ఈ మూవీకి సీక్వెల్‌గా దురంధర్ ది రివెంజ్ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇటీవల ట్రైలర్ రిలీజ్ చేయగా.. అంచనాలు మరింత పెంచేసింది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ప్రీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. సరికొత్త రికార్డులతో దూసుకెళ్తోంది. కేవలం రెండు రోజుల్లో రెండు లక్షలకు పైగా టిక్కెట్లు అమ్ముడు కావడం చూస్తుంటే ఏ రేంజ్లో క్రేజ్ ఉందో అర్థమవుతోంది. అడ్వాన్స్ టికెట్స్ బుకింగ్స్ ద్వారా ఇప్పటికే రూ. 18.11 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని ట్రేడ్ వెబ్సైట్ సాక్నిల్క్ తెలిపింది.ఈనెల 19న దురంధర్ ది రివెంజ్ థియేటర్లలోనే సందడి చేయనుంది. అంతకుముందు రోజే ఈ సినిమా ప్రీమియర్ షోలను ప్రదర్శించనున్నారు. ఈ షోల కోసం మేకర్స్ ముందుగానే బుకింగ్‌లు ప్రారంభించడంతో చాలా థియేటర్లలో టిక్కెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. హిందీలో మొదటి రోజే టికెట్ ధర ప్రస్తుతం రూ. 450-500 మధ్య ఉంది. ఈ మూవీ రిలీజ్‌కు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ చిత్రం తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా విడుదల కానుంది. -
'ధురంధర్' మేకర్స్‌కు తెలుగు ప్రేక్షకుల రిక్వెస్ట్
బాలీవుడ్ మూవీ ‘ధురంధర్: ది రెవెంజ్’ తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైన విషయం తెలిసిందే. ఈ సందర్భంలో తెలుగు ప్రేక్షకులు ఒక రిక్వెస్ట్ చేస్తున్నారు. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో గతేడాది వచ్చిన చిత్రం ‘ధురంధర్’. ఇప్పుడు ఈ మూవీకి సీక్వెల్‌గా పార్ట్-2 రానుంది. దేశభక్తి కాన్సెప్ట్‌తో భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా హిందీలో మాత్రమే విడుదలైన ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో ప్రేక్షకులను మెప్పించింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్ రూపొందించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో మార్చి 19న విడుదల చేస్తున్నారు. తెలుగు ట్రైలర్ విడుదల తర్వాత టాలీవుడ్ ప్రేక్షకుల నుంచి దర్శకుడికి ఒక విన్నపం అంటూ వైరల్ అవుతుంది.ధురంధర్ -2 నిర్మాతలు తెలుగు ట్రైలర్‌ను ఆవిష్కరించిన తర్వాత డబ్బింగ్, సంభాషణల పట్ల తెలుగు ప్రేక్షకుల నుండి సానుకూల స్పందన వచ్చింది. తెలుగు డబ్బింగ్ పనులను హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్వహించినట్లు సమాచారం. అయితే, తెలుగు ప్రేక్షకులకు నుంచి దర్శకుడు ఆదిత్య ధర్‌కు ఒక స్పష్టమైన అభ్యర్థన వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని పాన్-ఇండియ రేంజ్లో విడుదల చేస్తున్నందున, అభిమానులు పాటలను తెలుగులోకి డబ్ చేయకుండా వాటి అసలు హిందీ వెర్షన్లోనే ఉంచమని మేకర్స్‌ను అడుగుతున్నారు.ఈ అభ్యర్థన వెనుక కారణం గతంలో అనేక డబ్ చేసిన సినిమా పాటలు ప్రేక్షకులను పెద్దగా మెప్పించలేదు. అనువాదంలో విడుదలైన పాటలు బలహీనమైన మిక్సింగ్‌తో పాటు తప్పుడు అర్థాలు రావడం గమనించారు. డబ్ చేసిన వెర్షన్లలో వచ్చే పాటలు సినిమా ప్రభావాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. దీని కారణంగా, పాటలు హిందీలోనే ఉంచాలని తెలుగు ప్రేక్షకులు కోరుతున్నారు. మూవీలో డైలాగ్‌లను మాత్రమే తెలుగులోకి డబ్ చేస్తే మంచిదని చాలామంది భావిస్తున్నారు. నిర్మాతలు ఈ అభ్యర్థనను పరిశీలిస్తారా లేదా తెలుగు-డబ్ చేసిన పాటలతో ముందుకు వెళ్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సినిమాని ఆదిత్య, జ్యోతీదేశ్ పాండే, లోకేశ్ ధర్‌తో కలిసి సంయుక్తంగా నిర్మించారు. -
పవన్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్!
పవన్ కల్యాణ్ అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్! ఈ హీరో నటించిన లేటెస్ట్ మూవీ 'ఉస్తాద్ భగత్ సింగ్'. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం.. లెక్క ప్రకారం ఈ నెల 26న థియేటర్లలోకి రావాలి. కానీ ఓ వారం ముందుకు తీసుకొచ్చారు. ఉగాది కానుకగా 19నే రిలీజ్ చేస్తున్నట్లు రీసెంట్‌గానే ప్రకటించారు. కానీ ప్రీమియర్ల విషయంలో మాత్రం మూవీ టీమ్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇంతకీ ఏంటి విషయం?'గబ్బర్ సింగ్' తర్వాత పవన్-హరీశ్ శంకర్ కలిసి చేసిన సినిమా 'ఉస్తాద్ భగత్ సింగ్'. చాన్నాళ్ల క్రితం ప్రాజెక్ట్ ప్రకటించినప్పటికీ.. గతేడాది చివరలో షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ నెల 19న థియేటర్లలోకి రానుంది. 18వ తేదీన రాత్రి ప్రీమియర్లు వేయాలని తొలుత అనుకున్నారు కానీ డిస్ట్రిబ్యూటర్ల అభ్యర్థన మేరకు నిర్మాణ సంస్థ.. ప్రీమియర్ల విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. 19న ఉదయం 7 గంటల నుంచి మాత్రమే రెగ్యులర్ షోలు వేయాలని నిర్ణయించుకున్నారట.(ఇదీ చదవండి: త్రిషపై చిల్లర కామెంట్స్.. నోరు జారిన సీనియర్ నటుడు)ప్రీమియర్ల విషయంలో 'ఉస్తాద్' వెనక్కి తగ్గటానికి బజ్ ఏమైనా కారణమా అనిపిస్తుంది. ఎందుకంటే దీనిపై ప్రస్తుతానికి ఓ మాదిరి హైప్ మాత్రమే ఉంది. రెండు పాటలు రిలీజైనప్పటికీ అవేం పెద్దగా మ్యాజిక్ చేయలేదు. ట్రైలర్ వచ్చిన తర్వాతే మూవీ చూడాలా వద్దా అని చాలామంది ఆడియెన్స్ ఓ అంచనాకు రావొచ్చు. దీనితో పాటే తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతున్న డబ్బింగ్ సినిమా 'ధురంధర్ 2'పై హైప్ బాగానే ఉంది.'ధురంధర్ 2' ప్రీమియర్ షోలు.. 18వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి దేశవ్యాప్తంగా స్క్రీనింగ్ కానున్నాయి. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ చేశారు. మిగతా నగరాల కంటే హైదరాబాద్‌లోనే టికెట్స్ ఎక్కువగా సేల్ అవుతున్నట్లు కనిపిస్తున్నాయి. దీని రన్ టైమ్ దాదాపు 4 గంటలు. పోలిక అని చెప్పలేం కానీ 'ధురంధర్ 2' ప్రీమియర్ చూసిన తర్వాత ప్రేక్షకుడు.. 'ఉస్తాద్' ప్రీమియర్ అంటే ఆసక్తి చూపిస్తాడా అంటే సందేహమే. బహుశా ఈ కారణాల వల్లే 'ఉస్తాద్'.. ప్రీమియర్ల రిస్క్ తీసుకోవట్లేదా అనిపిస్తోంది.(ఇదీ చదవండి: నిశ్చితార్థం చేసుకున్న హీరో బెల్లంకొండ శ్రీనివాస్) -
'ధురంధర్-2' తెలుగు ట్రైలర్ వచ్చేసింది
'ధురంధర్-2' తెలుగు ట్రైలర్ తాజాగా విడుదలైంది. మొదట హిందీ వర్షన్ మాత్రమే మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. గతేడాదిలో విడుదలైన ధురంధర్‌కు సీక్వెల్‌గా ‘ధురంధర్: ది రెవెంజ్’ మూవీని దర్శకుడు ఆదిత్య ధర్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, సారా అర్జున్, సంజయ్ దత్, ఆర్.మాధవన్ తదితరులు నటిస్తున్నారు. అయితే, ఈ సీక్వెల్లో యంగ్ రణ్వీర్ సింగ్‌ని జస్కిరాత్ సింగ్ రాంగీ అనే పాత్రను ట్రైలర్లో పరిచయం చేశారు. రెహమాన్ మరణం తర్వాత అక్కడి వీధుల్లో ఏర్పడిన వాతావరణాన్ని చూపించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ నెల 19న విడుదల చేస్తున్నారు. -
భారీ అంచనాలతో.. ధురంధర్ 2.. ట్రైలర్ చూస్తే పూనకాలే
-
'ధురంధర్ 2'ని చూసి టాలీవుడ్ చాలా నేర్చుకోవాలి!
'ధురంధర్' సినిమాని చూసి తెలుగు దర్శకనిర్మాతలు చాలా అంటే చాలా నేర్చుకోవాలి. కేవలం కంటెంట్ అనే కాదు మిగతా విషయాల్లోనూ ఈ మూవీ ఓ గైడ్ లాంటిది అని చెప్పొచ్చు. తాజాగా సీక్వెల్ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఈ విషయం మరోసారి చర్చనీయాంశమవుతోంది. ఇంతకీ ఏంటా విషయాలు? టాలీవుడ్ దీనిని చూసి ఏమేం నేర్చుకోవాలి?(ఇదీ చదవండి: నేను బెస్ట్ ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌ని.. బ్రేకప్ తర్వాత చాలా ఏడ్చా: షణ్ముఖ్ జస్వంత్)గత కొన్నాళ్ల నుంచి పాన్ ఇండియా, సీక్వెల్ అనే ట్రెండ్ బాగా నడుస్తోంది. తెలుగులోనే చిన్నపెద్ద అనే తేడా లేకుండా ప్రతి దర్శకుడు ఓ సినిమా తీసేయడం, సీక్వెల్ ఉంటుంది అన్నట్లు చివరలో స్టోరీని అర్థంతరంగా వదిలేయడం లాంటివి చాలానే చూశాం. వీటన్నింటికి భిన్నంగా కంటెంట్‌పై నమ్మకంతో 'ధురంధర్' టీమ్ రెండు భాగాల షూటింగ్ ఒకేసారి పూర్తి చేసింది. తొలి భాగం హిట్టయితేనే రెండో పార్ట్ తీస్తాం అనే ట్రెండ్‌ని బ్రేక్ చేసింది. ఓ రకంగా చెప్పాలంటే వాళ్ల కంటెంట్‌పై వాళ్లకు అంత బలమైన నమ్మకం ఉండటమే దీనికి కారణం.టాలీవుడ్ ఓ సినిమాకు సీక్వెల్ అంటే అది ఎన్నేళ్ల తర్వాత వస్తుందో ఎవరూ చెప్పలేరు. అలాంటిది 'ధురంధర్' టీమ్ ఎంత ఫెర్ఫెక్ట్ ప్లానింగ్‌తో వచ్చారంటే.. తొలి పార్ట్ రిలీజైన మూడు నెలల్లో రెండో పార్ట్ రిలీజ్ చేస్తామని మాటిచ్చారు. ఇప్పుడు దానికే కట్టుబడ్డారు. ఈ నెల 19న 'ధురంధర్ 2'ని థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. చాలామంది తెలుగు దర్శకనిర్మాతలు.. తమ సినిమాలో కంటెంట్ అంతంత మాత్రంగానే ఉన్నా ఏదో ఉంది అనేంత హడావుడి చేస్తుంటారు. 'ధురంధర్' టీమ్ మాత్రం ఎక్కువ హడావుడి చేయలేదు. ప్రమోషన్స్ లాంటివి కూడా పెద్దగా చేయలేదు. కేవలం ప్రేక్షకుల్ని మాత్రమే నమ్ముకుంది.(ఇదీ చదవండి: ‘ధురంధర్2’కి పెయిడ్ ప్రీమియర్స్.. రన్‌టైమ్ ఎంతంటే?)తెలుగులో చాలా సినిమాల పాటలు, టీజర్, ట్రైలర్స్ లాంటివి నేరుగా రిలీజ్ చేయకుండా.. మొదట ఓ అప్డేట్ అంటారు. తర్వాత సాంగ్‌కి టీజర్ అంటారు. తీరా రిలీజ్ టైంకి వచ్చేసరికి సాంకేతిక కారణాలు చెప్పి వాయిదా వేస్తుంటారు. ప్రేక్షకుల సహనానికి పరీక్ష పెడుతుంటారు. ఈ విషయంలోనూ 'ధురంధర్' టీమ్‌ని మెచ్చుకోవాలి. ఓ టైమ్ చెప్పారు. సరిగ్గా అదే సమయానికి ట్రైలర్ రిలీజ్ చేసేశారు.తొలి భాగం దేశవ్యాప్తంగా అద్భుతమైన హిట్ అయినా సరే ప్రభుత్వాల నుంచి టికెట్ రేట్ల పెంపులాంటివి అడగలేదు. మూవీ రిలీజ్‌కి 10-12 రోజులు ముందుగానే టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేసేశారు. అదీ సాధారణ ధరలతోనే. టికెట్‌పై రూ.50-100 అదనం చెప్పి ప్రేక్షకుడి నుంచి దోచుకునే ప్రయత్నం చేయలేదు. పైన చెప్పిన విషయాల్లో చాలావరకు టాలీవుడ్లో చాలామంది పాటించరు.తీసిన సినిమాకు పెట్టిన బడ్జెట్‌కి టికెట్ ధరలకు ఏ మాత్రం సంబంధం ఉండదు. ఒకవేళ ఏమైనా అంటే వింత వింత కారణాలు చెబుతారు. థియేటర్లకు జనాలు రావట్లేదని బాధపడతారు. చెప్పాలంటే ప్రేక్షకులని గ్రాంటెడ్‌గా తీసుకుంటున్నారు. ఏం తీసినా సరే చూస్తారులే అని అనుకుంటున్నారు. అందుకే తెలుగులో స్టార్ హీరోల సినిమాలకు సైతం డిజాస్టర్ టాక్‌లు తప్పట్లేదు.(ఇదీ చదవండి: మరింత వైలెంట్‌గా ధురంధర్ 2 ట్రైలర్) -
‘ధురంధర్2’కి పెయిడ్ ప్రీమియర్స్.. రన్‌టైమ్ ఎంతంటే?
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్2: ది రివెంజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఆ అంచనాలు డబుల్ చేసింది. యాక్షన్‌తో పాటు ఎమోషనల్ డ్రామాకు కూడా పెద్ద పీట వేసినట్లు ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మార్చి 19న బాక్సాఫీస్ బద్దలు అవ్వడం ఖాయమని రణ్వీర్ ఫ్యాన్స్ అంటున్నారు. అయితే చిత్రబృందం మాత్రం ఒక రోజు ముందే బాక్సాఫీస్‌ని షేక్ చేసేందుకు రెడీ అవుతోంది. మార్చి 18న పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నారు. ఆ రోజు సాయంత్రం ఫస్ట్ షో నుంచే ‘ధురంధర్2: ది రివెంజ్’ మూవీని ప్రదర్శించబోతున్నారు. ఇప్పటికే బుక్‌మై షో, డిస్ట్రిక్ట్ యాప్‌ల ద్వారా టికెట్ బుకింగ్స్‌ను అందుబాటులోకి తెచ్చారు. అయితే ఈ పెయిడ్ ప్రీమియర్స్‌కి మాత్రం కేవలం హిందీ భాషలో మాత్రమే బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. హైదరాబాద్‌లోని వివిధ మల్టీప్లెక్స్‌లలో ఇప్పటికే టికెట్స్ అందుబాటులోకి వచ్చాయి. మామలుగా అయితే పెయిడ్ ప్రీమియర్స్‌కి టికెట్ ధరలను పెంచుతారు. కానీ ధురంధర్ 2కి మాత్రం ప్రీమియర్స్‌కి కూడా నార్మల్ ధరలే ఉండడం గమనార్హం. ఎక్కువ మంది ప్రేక్షకులు థియేటర్స్‌కి రావడం కోసమే మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.భారీ రన్‌టైమ్..ధురంధర్ 2 మూవీ రన్‌టైమ్‌పై మొన్నటి వరకు సోషల్ మీడియాలో రకరకాల పుకార్లు వచ్చాయి. తాజాగా దీనిపై స్పష్టత వచ్చింది. ఈ మూవీ నిడివి 3 గంటల 55 నిమిషాలు. మొదటి భాగం 3 గంటలా 34 నిమిషాలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. బ్రేక్ టైమ్‌తో కలిపితే నాలుగు గంటలకు పైనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో ఇంత నిడివితో ఏ చిత్రం రాలేదు. ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే కంటెంట్ ఉంది కాబట్టే.. రన్‌టైమ్ విషయంలో మేకర్స్ భయపడడం లేదట. మరి ధురంధర్ 2 ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. -
మరింత వైలెంట్‌గా 'ధురంధర్ 2' ట్రైలర్
‘ధురంధర్ 2’ మూవీ ట్రైలర్ వచ్చేసింది. బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్యధర్ తెరకెక్కించిన ‘ధురంధర్’కు సీక్వెల్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. గతేడాది విడుదలైన ఈ మూవీ సంచలన విజయం సాధించింది. దీంతో సీక్వెల్‌గా తెరకెక్కిన ‘ధురంధర్: ది రివెంజ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ మూవీ మార్చి 19న రిలీజ్ కానుంది. హిందీతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడలోనూ విడుదల కానుంది. -
వాయిదా రూమర్స్‌కి చెక్.. ట్రైలర్ రిలీజ్ ఎప్పుడంటే?
'ధురంధర్ 2' సినిమా విడుదలకు ఇంకా రెండు వారాలు కూడా లేదు. టీమ్ నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోయేసరికి వాయిదా పడుతుందనే రూమర్స్ వినిపించాయి. యష్ 'టాక్సిక్' తప్పుకోవడంతో.. ధురంధర్ సీక్వెల్ కూడా అలానే చేస్తుందేమోనని మాట్లాడుకున్నారు. కానీ ట్రైలర్ రిలీజ్ అప్డేట్ గురించి అధికారికంగా ప్రకటించి సదరు పుకార్లకు చెక్ పెట్టేశారు.రణ్వీర్ సింగ్ పాన్ ఇండియా మూవీ 'ధురంధర్:ది రివెంజ్' ట్రైలర్‌ని శనివారం(మార్చి 07) ఉదయం 11:01 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా అనౌన్స్ చేశారు. దీనిబట్టి మూవీపై ఓ అంచనాకు వచ్చేస్తారు. ఇందులో రణవీర్.. జస్కిరత్ సింగ్, హమ్జా అనే రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నాడు.(ఇదీ చదవండి: తిరుమలలో రుక్మిణి వసంత్.. ఈమె చెల్లిని చూశారా?)'ధురంధర్' తొలి భాగం.. భారత్‌తో పాటు అంతర్జాతీయంగానూ హిట్ అయింది. రూ.1300 కోట్లకుపైనే కలెక్షన్ సాధించి రికార్డులు సృష్టించింది. ముఖ్యంగా నార్త్ అమెరికా, కెనడా, యుకే, ఆస్ట్రేలియా లాంటి చోట్ల భారీ విజయాన్ని అందుకుంది. తొలి పార్ట్ కేవలం హిందీలోనే రాగా ఇప్పుడు దక్షిణాది భాషల్లోనూ రిలీజ్ కానుండటం మరింతగా కలిసి రానుంది.జియో స్టూడియోస్ సమర్పణలో, బి62 స్టూడియోస్ నిర్మాణంలో దర్శకుడు ఆదిత్య ధార్ తీసిన ఈ చిత్రం.. పాకిస్థాన్ బ్యాక్‌డ్రాప్‌లో తీసిన స్పై యాక్షన్ థ్రిల్లర్. హిందీ, తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ నెల 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. గుడి పాడ్వా, ఉగాది పండుగల సందర్భంలో ఈద్‌కు ముందుగా విడుదలవుతూ భారీ ఓపెనింగ్ సాధించేందుకు సిద్ధమవుతోంది.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రేమ పెళ్లి.. అమ్మాయి ఎవరంటే?) -
'ధురంధర్ 2'కి లైన్ క్లియర్.. 'టాక్సిక్' వాయిదా
ఈ నెలలో రావాల్సిన పెద్ద సినిమాల్లో 'టాక్సిక్' ఒకటి. కేజీఎఫ్ లాంటి పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని హీరో యష్ చేసిన మూవీ ఇది. లెక్క ప్రకారం మార్చి 19నే థియేటర్లలో రిలీజ్ అన్నారు. నిన్నటి వరకు అదే మాటపై ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఉన్నట్లుండి పరిస్థితులు మారిపోయేసరికి వాయిదా వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో కొత్త విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: మా బాడీ పార్ట్స్ జూమ్ చేసి ఫొటోలు.. 'కాంతార' హీరోయిన్ ఫైర్)మార్చి 19న రావాల్సిన 'టాక్సిక్' చిత్రాన్ని జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పశ్చిమ ఆసియా దేశాల్లో యుద్ధ ప్రభావమే దీనికి కారణమని చెప్పుకొచ్చారు. విదేశాల్లో ఆడియెన్స్ కోసం ఈ చిత్రాన్ని తెరకెక్కించామని ప్రస్తుతం యుద్ధ కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో అనిశ్చితి నెలకొందని, తమ పార్ట్నర్స్ ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ఓ నోట్ రిలీజ్ చేసింది.'టాక్సిక్' వాయిదా పడింది. దీంతో 'ధురంధర్ 2'కి లైన్ క్లియర్ అయిపోయినట్లే. గతేడాది డిసెంబరులో పెద్దగా హడావుడి లేకుండానే 'ధురంధర్' వచ్చింది. రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పుడు సీక్వెల్ రాబోతుంది. ట్రైలర్ రిలీజ్ చేస్తే ఇది కూడా వస్తుందా లేదా అనేది క్లారిటీ వస్తుంది. 'ధురంధర్ 2' గురించి వాయిదా లాంటివి రూమర్స్ అయితే ఇప్పటివరకు ఏం రావట్లేదు.(ఇదీ చదవండి: టాలీవుడ్‌పై ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధ ప్రభావం ఎంత?) -
ఆశ్చర్యపరుస్తున్న'ధురంధర్ 2' రన్‌టైమ్..!
బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ధురంధర్.. గతేడాది డిసెంబరు 5న విడుదలైన ఈ మూవీకి సీక్వెల్ రానున్న విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీ రన్‌టైమ్ గురించి సోషల్‌మీడియాలో పలు కథనాలు వైరల్ అవుతున్నాయి. పార్ట్-1కు సెన్సార్ నుంచి A సర్టిఫికెట్ వచ్చింది. ఆపై దీని రన్‌టైమ్ 3.34గంటలుగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, ఈ మూవీ సీక్వెల్ రన్‌టైమ్ గురించి వస్తున్న వార్తలు చూస్తుంటే ఆందరిని ఆశ్చర్యపరుస్తుంది.'ధురంధర్ 2: ది రివెంజ్' మూవీ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా సుమారు ఐదు భాషల్లో విడుదల కానుంది. బాలీవుడ్లో వస్తున్న వార్తల ప్రకారం ఈ మూవీ రన్‌టైమ్ 3.50 గంటలు ఉండొచ్చని తెలుస్తోంది. అయితే, మరికొన్ని కథనాల్లో మాత్రం 3.40గంటలకు దగ్గరగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు. ఈ మూవీ నిడివి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పార్ట్-1కు మించే సీక్వెల్ రన్‌టైమ్ ఉంటుందని క్లారిటీ ఇస్తున్నారు. సుమారు 17ఏళ్ల తర్వాత ఈ రేంజ్ నిడివితో బాలీవుడ్లో సినిమా రావడం విశేషం. 2008లో హృతిక్ రోషన్ నటించిన ‘జోథా అక్బర్’ (3.50గంటలు) రన్టైమ్తో విడుదలైంది. అయితే, నిర్మాతల నుంచి ధురంధర్ తుది రన్‌టైమ్‌ను అధికారికంగా ప్రకటన రాలేదు. ఓవర్సీస్ డిస్ట్రిబ్యూషన్ వర్గాలు ప్రకారం రన్‌టైమ్ ఎక్కువగానే ఉందని సమాచారం.ధురంధర్ 2 లో సంజయ్ దత్, ఆర్. మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రల్లో తిరిగి వస్తున్నారు. యామి గౌతమ్ ఒక ప్రత్యేక అతిధి పాత్రలో కనిపిస్తారని కూడా సమాచారం ఉంది. ఈ చిత్రాన్ని జియో స్టూడియోస్, బి62 స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నాయి. -
దురంధర్ 2 రివ్యూ వచ్చేసింది.. నా భర్త ఇరగదీశాడు అంటున్న యామి..!
-
‘ధురంధర్ 2’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఒక్క మాటతో అంచనాలు రెట్టింపు
రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’ క్రియేట్ చేసిన రికార్డుల గురించి అందరికి తెలిసిందే. గతేడాది డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం.. ప్రపంచ వ్యాప్తంగా రూ. 1300 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ సృష్టించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా రాబోతున్న ధురంధర్ 2 చిత్రం కోసం యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఇటీవల రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై మరింత హైప్‌ని క్రియేట్ చేసింది. మార్చి 19న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈనేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు ఆదిత్యధర్ సతీమణి యామీ గౌతమ్ ధురంధర్ 2పై తన రివ్యూని ఇచ్చేసింది.భారత్ సమ్మిట్ 2026లో పాల్గొన్న యామీ గౌతమ్.. తాను ఇప్పటికే ‘ధురంధర్ 2’ చూశానని చెబుతూ..భర్తపై ప్రశంసల వర్షం కురిపించింది. ‘ధురంధర్ 2 నేను చూసేశాను. నా భర్త గొప్ప సినిమాలను తీస్తున్నారు. ధురంధర్ 2 చాలా అసాధరణమైన సినిమా. ఆడియన్స్ ఎప్పటికీ మర్చిపోలేని ఓ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. మూవీ చూసి నేను చాలా ఎమోషనల్ అయ్యాను.ఆ రోజు నేను విమానంలో ప్రయాణం చేయాల్సి వచ్చింది. దీంతో ఆదిత్య ధర్‌తో ఏమీ చెప్పలేకపోయాను. ఆ తర్వాత నేను దేనిపైనా దృష్టి పెట్టలేకపోయాను. విమానం దిగిన తర్వాత ఆదిత్యకు ఏం చెప్పాలా? అని ఆలోచిస్తున్నాను. సినిమాపై నా ఒపీనియన్ చాలా చెప్పాలనుకున్నా. ఆదిత్య తన ఆడియన్స్, దేశాన్ని ఎప్పటికీ ప్రేమిస్తాడు. ఈ మూవీ తెరకెక్కించేందుకు ఆయన ఎంతో శ్రమించారు. ధురంధర్ 2 ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని ఓ అద్భుతం. ప్రతి భారతీయుడు గర్వపడే సినిమా ఇది. ఈ విషయాన్ని నేను కచ్చితంగా చెప్పగలను’ అని యామీ గౌతమ్ అన్నారు.ఇక ధురంధర్ విజయం గురించి మాట్లాడుతూ.. ‘‘ఆర్టికల్ 370’ షూటింగ్లో ఉన్నప్పుడే ‘ధురంధర్’ స్క్రిప్ట్ చదివాను. అది కేవలం 40 పేజీలు మాత్రమే ఉంది. కానీ చదువుతున్నంత సేపు నా కళ్లు చెమర్చాయి. అప్పుడు కూడా ఆదిత్యకు ఏం చెప్పాల్లో అర్థం కాలేదు. కానీ నా స్పందన ఏంటో ఆయను అర్థమైపోయింది. ఈ సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. హిస్టరీ క్రియేట్ చేసే సినిమా అవుతుందని ముందే ఊహించా. ధురంధర్ 2 అంతకు మించి ఉంటుంది’ అంటూ అంచనాలను రెట్టింపు చేసింది. మరి ధురంధర్ 2 ఎన్ని రికార్డులకు బద్దలు కొడుతుందో చూడాలి. -
ఇది ఉత్తరాది-దక్షిణాది మధ్య యుద్ధం కాదు అంతకు మించి
సంక్రాంతి తర్వాత చెప్పుకోదగ్గ స్థాయిలో బాక్సాఫీస్ దగ్గర సౌండ్ లేదు. అయితే మార్చిలో 'ధురంధర్ 2', టాక్సిక్ లాంటి భారీ పాన్ ఇండియన్ మూవీస్ థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటి గురించి సగటు ప్రేక్షకుడు ఆత్రుతగా ఎదురుచూస్తున్నాడు. మరోవైపు ఈ చిత్రాల మధ్య పోటీ గురించి.. ప్లస్ మైనస్సుల గురించి దర్శకుడు రాంగోపాల్ వర్మ తనదైన శైలిలో విశ్లేషించాడు. ఈ మేరకు ట్విటర్లో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.'నేను కేవలం రెండు పెద్ద సినిమాల గురించి మాట్లాడటం లేదు. భారతీయ సినీ చరిత్రలో ముందెన్నడూ చూడని ఓ భీకర యుద్ధాన్ని చూడబోతున్నాం. ఇది డేవిడ్, గోలియత్ మధ్య జరుగుతున్న పోరాటం. గతంలో 'కేజీఎఫ్ 2' సాధించిన భారీ వసూళ్లు.. 'ధురంధర్' ముందు చిన్నవిగా అనిపించాయి. ఇప్పుడు 'ధురంధర్ 2' అనే డేవిడ్ ముందు 'టాక్సిక్' అనే గోలియత్ నిలబడింది. ధురంధర్ మేకర్స్.. ప్రేక్షకుల తెలివితేటలని గౌరవిస్తున్నారు. 'టాక్సిక్' మేకర్స్ మాత్రం ప్రేక్షకుల్ని మూర్ఖులని భ్రమపడుతున్నారు' అని ఆర్జీవీ రాసుకొచ్చాడు. అలానే కొన్ని పాయింట్స్ కూడా దేనికదే చెప్పుకొచ్చాడు.హీరోయిజం: గుడ్డిగా హీరోని ఆరాధించడం ఓవైపు ఉంటే, కథలోని నైతిక విలువల ద్వారా హీరోని ప్రేక్షకులని అభిమానించడం మరోవైపు.యాక్షన్: గాలిలో ఎగిరే స్టంట్స్, న్యూటన్ ఫార్ములాని వెక్కిరించే ఫైట్స్ 'టాక్సిక్'లో ఉంటే.. ఒళ్లు గగుర్పొడితే సహజ యాక్షన్ 'ధురంధర్' సొంతంమ్యూజిక్: ప్రతి ఐదు నిమిషాలకు విజిల్స్ వేయించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఒకటైతే, నటనకు అవకాశమిస్తూ నిశ్శబ్దంగా సాగే సంగీతం మరోవైపుకేవలం ఓ నటుడిని దేవుడిలా చూపించడానికి రూ.700 కోట్లు ఖర్చు చేయడం కంటే ప్రతి పాత్రని మనిషిలా చూపించడానికి రూ.130 కోట్లు ఖర్చు చేయడం గొప్ప. ప్రేక్షకులని పిల్లలనుకుని ప్రతిదీ వివరించి చూపించడం మానేయాలి. క్లిష్టంగా ఉండే స్టోరీలని కూడా అర్థం చేసుకోగలరని 'ధురంధర్' నిరూపించింది. అయితే ఇదంతా కూడా ఆదిత్య ధర్ మీద ప్రేమతో రాయడం లేదు. మన సినిమాపై ఉన్న ఆశతో రాస్తున్నాను. మార్చి 19న మన దేశం.. ధురంధర్ 2ని ఎంచుకుంటుందో లేదా టాక్సిక్ మాస్ మత్తులో పడుతుందో చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని రాంగోపాల్ రాసుకొచ్చాడు.ఈ ట్వీట్ చూసిన చాలామంది.. 'ధురంధర్ 2'ని పొగుడుతూ 'టాక్సిక్'ని తక్కువ చేశాడా అని మాట్లాడుకుంటున్నారు. దీంతో ఆర్జీవీ మరో ట్వీట్ చేశాడు. తాను సినిమాల గురించి మాట్లాడట్లేదని.. స్టైల్ ఆఫ్ మూవీస్ గురించి ప్రస్తావించానని క్లారిటీ ఇచ్చాడు.For all the dumbos , who dint understand I just wanted to clarify that , in the context of the 2 releases , I was talking about the styles of cinema and not in particular about a film https://t.co/Ydy61Nr32F— Ram Gopal Varma (@RGVzoomin) February 22, 2026 -
ధురంధర్-2 కు పోటీగా టాక్సిక్.. అసలు తగ్గేదేలే అంటున్న యష్..
-
అతన్ని పడేయాలని ట్రై చేశాను.. కానీ..,: కంగనా రనౌత్
ధురంధర్ సినిమా ఓటీటీలోకి రావడంతో మరోసారి ట్రెండ్ అవుతోంది. అందులో నటించిన అక్షయ్ ఖన్నా మళ్లీ వైరల్ అవుతున్నాడు. ఈ సందర్భంగా అక్షయ్ ఖన్నాపై బాలీవుడ్ నటి కంగనా రనౌత్ గతంలో చేసిన వ్యాఖ్యలు ఓ వీడియో క్లిప్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. హీరోయిన్గా బాలీవుడ్లో టాప్ రేంజ్లో కొనసాగిన కంగనా.. బీజేపీలో చేరి హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి ఎంపీగా గెలిచిన విషయం తెలిసిందే.'ధురంధర్' (Dhurandhar)సినిమా చూసిన వారందరూ సోషల్‌మీడియాలో అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో కంగనా రనౌత్ పాత ఇంటర్వ్యూ క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఈ క్లిప్ 'కాఫీ విత్ కరణ్' కార్యక్రమానికి సంబంధించింది కావడం విశేషం. 2010లో విడుదలైన నో ప్రాబ్లమ్ మూవీ ప్రమోషన్ సమయంలో ఈ కార్యక్రమం జరిగింది. అందులో అనిల్ కపూర్, సంజయ్ దత్‌లతో పాటు అక్షయ్, కంగనా కూడా కలిసి నటించారు.అతడ్ని ట్రై చేశాను.. కానీ, పడలేదు: కంగనాఈ వీడియోలో కరణ్ జోహార్ మాట్లాడుతూ ఎవరితోనైనా సరసాలాడటానికి ప్రయత్నించారా అని కంగనాను అడగడంతో ఆమె ఏమాత్రం సంకోచించకుండా.., "అవును అంటూ అక్షయ్ ఖన్నా(Akshaye Khanna) పేరును చెప్పారు. 'నేను మొదట అక్షయ్‌తో మాట్లాడ్డానికి ప్రయత్నించాను. ఆ తర్వాత అతడ్ని నిజంగానే పడేయాలని ట్రై చేశాను. కానీ అతడు ఎప్పుడూ నాతో మాట్లాడలేదు. నాతోనే కాదు, అతడు ఎవరితోనూ పెద్దగా మాట్లాడడు.' స్వయంగా కంగనా రనౌత్ ఆ షోలో అక్షయ్ ఖన్నా గురించి చెప్పిన ఈ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ధురంధర్ సినిమాలో అక్షయ్ ఖన్నా పోషించిన రెహ్మాన్ డెకాయిత్ పాత్ర సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో రణ్‌బీర్ సింగ్‌కు ఎంత పేరొచ్చిందో, అక్షయ్ ఖన్నాకు కూడా అంతే పేరొచ్చింది. ఈ సినిమా పార్ట్-2 మార్చి 19న రిలీజ్ అవుతోంది.in Coffee with Karan #KanganaRanaut reveals she once tried flirting with #AkshayeKhanna, but he was completely in hi won world and he didn't even notice her. pic.twitter.com/BccEj0twm6— आदेश 🚩 (@ADfanatic_New) February 8, 2026 -
'ధురంధర్-2'లో దర్శకుడి సతీమణి..
బాలీవుడ్ సినిమా 'ధురంధర్' భారీ హిట్ అందుకుంది. దీంతో దర్శకుడు ఆదిత్య ధర్ సీక్వెల్‌ను ప్లాన్ చేశారు. పార్ట్-2 మార్చి 19న విడుదల కానుంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో జియో స్టూడియోస్ నిర్మిస్తుంది. తాజాగా సీక్వెల్ టీజర్‌ను విడుదల చేశారు. అయితే, ధురంధర్-2లో ప్రముఖ నటి యామి గౌతమ్ నటిస్తుందని తెలుస్తోంది. గౌరవం సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఫెయిర్ అండ్ లవ్లీ యాడ్‌తో కూడా భారీగా పాపులర్ అయింది. దర్శకుడితో పెళ్లి తర్వాత కూడా హిందీలో వరుస సినిమాలు, సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉంటున్న యామి ఇప్పుడు ధురంధర్-2లో కీలకమైన పాత్రలో కనిపించనుంది.'ధురంధర్' దర్శకుడు ఆదిత్య ధర్‌ను నటి యామి గౌతమ్ నాలుగేళ్ల క్రితం పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. రణ్వీర్ సింగ్ హీరోగా ఆయన తెరకెక్కిస్తున్న ‘ధురంధర్: ది రివెంజ్’లో ఒక కీలకమైన పాత్రలో యామి గౌతమి నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ షూటింగ్లో కూడా ఆమె వారం రోజుల పాటు పాల్గొన్నారట. సినిమాలో ఆమె కనిపించేది కొన్ని నిమిషాలే అయినప్పటికీ ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరిచేలా యామి పాత్ర ఉండబోతుందని బాలీవుడ్లో ప్రచారం జరుగుతుంది. కాగా యామీ గౌతమ్ తెలుగులో నువ్విలా, గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ వంటి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. బాలీవుడ్లో రీసెంట్గా ఆమె నటించిన హక్ చిత్రంతో మంచి గుర్తింపు వచ్చింది. -
పెద్ది, డకాయిట్.. ఇక ది ప్యారడైజ్ వంతు..!
ఇటీవల కొద్దికాలంగా టాలీవుడ్ సినిమా పరిస్థితి కాస్తా అయోమయానికి గురి చేస్తోంది. పెద్ద హీరోల చిత్రాల రిలీజ్ డేట్లను ముందుగానే అనౌన్స్ చేస్తున్నారు. ఎప్పుడు షూటింగ్ మొదలవుతుంది.. ఎప్పుడు రిలీజవుతుందనేది పక్కాగా ముందే చెప్పేస్తున్నారు. ఆ రోజే గ్రాండ్ రిలీజ్ అంటూ పోస్టర్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు. తీరా డేట్ దగ్గరికొచ్చేసరికి వాయిదా వేసుకుంటూ పోతున్నారు. భారీ బడ్జెట్, స్టార్ హీరో ఉన్నా సరే విడుదలకు వెనకాడుతున్నారు. తాజాగా టాలీవుడ్లో జరుగుతున్న పరిణామాలే ఇందుకు నిదర్శనం.తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది మూవీని వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా.. ఏకంగా ఏప్రిల్ 30కి పోస్ట్ పోన్ అయింది. గ్లోబల్ స్టార్ చెర్రీ- బుచ్చిబాబు సనా డైరెక్షన్లో వస్తోన్న ఈ మూవీ వాయిదా పడడం అభిమానుల్లో నిరాశ కలిగిస్తోంది. ఈ మార్చిలో పెద్ది చూడాలనుకున్న సినీ ప్రియులకు కూడా ఈ నిరాశే మిగిల్చింది.అంతేకాకుండా అడివి శేష్ డకాయిట్ సైతం మరోసారి వాయిదా పడింది. గతంలో చాలాసార్లు వాయిదా పడినా.. ఈ ఏడాది మార్చి 19న వస్తామని ప్రకటించారు. అంతలోనే డకాయిట్ పోస్ట్ పోన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా కనిపించనుంది.ఇక మార్చిలో వస్తోన్న టాలీవుడ్ మూవీ ది ప్యారడైజ్. నాని హీరోగా వస్తోన్న ఈ చిత్రం మార్చి 26న రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అదే రోజు ఉస్తాగ్ భగత్ సింగ్ విడుదల చేయనున్నట్లు తాజాగా ప్రకటించారు. దీంతో నాని మూవీ కూడా దాదాపు వాయిదా పడిందనే వార్తలొస్తున్నాయి. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది. దీంతో ఈ చిత్రాలన్నీ సమ్మర్‌కు తరలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.దురంధర్-3 దెబ్బకేనా?ఇలా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలు వాయిదా వేయడం అభిమానుల్లో నిరాశ పెంచుతోంది. తమ అభిమాన హీరోల చిత్రాలు పోస్ట్‌పోన్ కావడం వల్ల ఫ్యాన్స్‌లో ఉన్న క్యూరియాసిటీ తగ్గుతోంది. అయితే ఇలా వరుసగా టాలీవుడ్ సినిమాలు వాయిదా పడడానికి ప్రధాన కారణం ఆ ఒక్క సినిమానేనా అని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. మార్చి 19న రానున్న దురంధర్-2 దెబ్బకేనని సగటు సినీ ప్రియుడు భావిస్తున్నారు. లేదంటే నిజంగానే షూటింగ్ పెండింగ్ వల్ల వాయిదా వేస్తున్నారా? అనేది తెలియాల్సి ఉంది. వరుసగా మూడు టాలీవుడ్ చిత్రాలు వాయిదా పడడంతో సినీ ప్రియుల్లో అసలేం జరుగుతోందనే డౌటానుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
దురంధర్-2 క్రేజ్.. బాక్సాఫీస్ రికార్డ్స్ గల్లంతేనా?
గతేడాది డిసెంబరులో రిలీజై సంచలనం సృష్టించిన బాలీవుడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'ధురంధర్'. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. పాకిస్థాన్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఈ మూవీని తెరకెక్కించారు. 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఛావా, కాంతార-2ను వెనక్కి నెట్టి ఫస్ట్ ప్లేస్ సొంతం చేసుకుంది. అంతేకాకుండా బాలీవుడ్లోనే దేశవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్క్ దాటిన చిత్రంగా ఘనత సాధించింది.కేవలం హిందీలో మాత్రమే రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.1300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ క్రమంలోనే కేజీఎఫ్, బాహుహలి, పుష్ప లాంటి సినిమాలను అధిగమించింది. ఇదే మూలవీ దక్షిణాది భాషల్లో కూడా విడుదలై ఉంటే మరిన్ని రికార్డుల తిరగరాసేదని నెటిజన్స్ అభిప్రాయ పడుతున్నారు.దక్షిణాది భాషల్లో సీక్వెల్ రిలీజ్కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఈ మూవీ సీక్వెల్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ సారి దక్షిణాది మార్కెట్లోనూ దురంధర్-2 విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసే ఛాన్స్ ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.భారతీయ చిత్రాల జాబితాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో దంగల్, పుష్ప-2, బాహుబలి-2 వరుసగా తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. దురంధర్ మూవీ హిందీలో మాత్రమే రిలీజై కేజీఎఫ్, బాహుబలి, పుష్ప చిత్రాల రికార్డులను దాటేసింది. ఈ నేపథ్యంలో మార్చిలో ప్రేక్షకుల ముందుకు రానున్న దురంధర్-2 బాక్సాఫీస్‌ను షేక్ చేసే అవకాశం కనిపిస్తోంది.ఆ రికార్డ్స్ గల్లంతేనా?ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ దంగల్, పుష్ప-2, బాహుబలి-2 లాంటి చిత్రాలను రికార్డులను అధిగమించేలా కనిపిస్తోంది. దురంధర్‌కు వచ్చిన కలెక్షన్స్ చూస్తే ఇది సాధ్యమేనని అనిపిస్తోంది. ఆదిత్య ధార్ దర్శకత్వంలో వస్తోన్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించడం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ వల్ల టాలీవుడ్ సినిమాలు సైతం వాయిదా పడుతున్నాయి. డకాయిట్, పెద్ది సినిమాలు పోస్ట్ పోన్ చేసి కొత్త తేదీలను ప్రకటించారు. దురంధర్-2 దెబ్బకు టాలీవుడ్ చిత్రాలు తప్పుకోవడం చూస్తే బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమేనని అర్థమవుతోంది. -
'ధురంధర్ 2'కి భయపడుతున్నారా? ఎందుకీ వాయిదాలు?
కొన్ని సినిమాల విషయంలో అప్పుడప్పుడు ఊహలకు అందనివి జరుగుతుంటాయి. రెండు నెలల క్రితం అలాంటి ఓ సంచలనానికి కారణమైంది 'ధురంధర్' అనే మూవీ. రిలీజ్ వరకు దీనిపై పెద్దగా బజ్ లేదు. రెగ్యులర్ ఆడియెన్స్ కాస్తోకూస్తో ఆసక్తి చూపించారు గానీ సాధారణ ప్రేక్షకుడికి అయితే థియేటర్లలోకి వచ్చేంతవరకు ఇదో సినిమా ఉందని కూడా తెలియదు. అలాంటిది బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టేసరికి.. దేశవ్యాప్తంగా పెద్ద డిస్కషన్‌కి కారణమైంది. త్వరలో రాబోతున్న దీని సీక్వెల్ ప్రభావం.. తెలుగు చిత్రసీమపై గట్టిగానే పడినట్లు కనిపిస్తోంది.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 14 సినిమాలు.. అవి డోంట్ మిస్)సాధారణంగా వేసవిని తెలుగు దర్శకనిర్మాత మిస్ చేసుకోరు. ఈసారి కూడా అందుకు తగ్గట్లే డకాయిట్, పెద్ది, ప్యారడైజ్ లాంటి మూవీస్ రిలీజ్ అవుతాయని చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. దీంతో ఆయా హీరోల ఫ్యాన్స్, సినిమా లవర్స్ చాలా ఉత్సాహపడ్డారు. తీరా చూస్తే ఈ తెలుగు చిత్రాలన్నీ ఇప్పుడు వాయిదా పడటం గ్యారంటీ. అధికారిక ప్రకటనలు రాలేదు గానీ వాయిదా పడటం అయితే పక్కా.చరణ్ 'పెద్ది', నాని 'ప్యారడైజ్' సినిమాల షూటింగ్ చాలా పెండింగ్‌లో ఉంది. దీంతో ఇవి వాయిదా పడ్డాయంటే సరేలే ఏదో అనుకోవచ్చు. కానీ అడివి శేష్ 'డకాయిట్' మాత్రం ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. మార్చి 19న పక్కా వస్తామని శేష్ కూడా కొన్నాళ్ల ముందు జరిగిన ప్రెస్మీట్లో చెప్పాడు. ఇదంతా 'ధురంధర్' విడుదలకు ముందు జరిగింది. కానీ ఈ మూవీ సూపర్ హిట్ అయ్యేసరికి.. రిస్క్ ఎందుకని 'డకాయిట్' టీమ్ వెనకడుగేసింది. ఏప్రిల్‌లో రావాలని ప్లాన్స్ చేసుకుంటున్నారట.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?)మరోవైపు 'పెద్ది' కోసం అనుకున్న రిలీజ్ తేదీకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రాన్ని తీసుకురావాలని అనుకుంటున్నట్లు రెండు రోజుల క్రితం వరకు రూమర్స్ వచ్చాయి. ఎప్పుడైతే 'ధురంధర్ 2' రిలీజ్ పక్కా అని క్లారిటీ వచ్చిందో.. 'ఉస్తాద్' టీమ్ రిస్క్ వద్దులే అనుకుందనే టాక్ వినిపిస్తుంది. వీళ్లు కూడా ఏప్రిల్ నెలనే టార్గెట్ చేస్తున్నారని టాక్. ఈ లెక్కన చూసుకుంటే మార్చిలో ప్రామిసింగ్ తెలుగు సినిమా ఒక్కటి కూడా వచ్చే సాహసం చేయట్లేదనిపిస్తుంది. అంటే తెలుగు రాష్ట్రాల్లో 'ధురంధర్ 2'కి దాదాపు లైన్ క్లియర్.అయితే ఈ చిత్రానికి 'టాక్సిక్' పోటీగా నిలబడుతోంది. కన్నడ స్టార్ యష్ నటించిన గ్యాంగస్టర్ డ్రామా మూవీ ఇది. మార్చి 19నే 'ధురంధర్ 2'తో పాటు ఈ చిత్రం కూడా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతోంది. కాకపోతే ప్రమోషన్ పరంగా చాలా వీక్‌గా ఉన్నారు. సాంగ్స్, ట్రైలర్స్ లాంటివి రిలీజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు 'టాక్సిక్' వాయిదా పడటానికి అవకాశాల్లేవని తెలుస్తోంది. దానికి కారణాలు చాలానే ఉన్నాయి. విజయ్ 'జన నాయగణ్' నిర్మించిన కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థనే యష్ మూవీ కూడా తీసింది. ఇది కూడా వాయిదా పడితే కోట్లలో నష్టాలు ఉండొచ్చు. అందుకే 'ధురంధర్ 2' పోటీలో ఉన్నప్పటికీ వెనక్కి తగ్గే పరిస్థితులు అయితే కనిపించట్లేదు.(ఇదీ చదవండి: 'ధురంధర్'తో హిట్.. ఇప్పుడు చిరంజీవి కూతురిగా?) -
చిక్కుల్లో దురంధర్ టీమ్.. కేసు నమోదు..!
రణ్వీర్ సింగ్ దురంధర్-2 మూవీ టీమ్‌కు ముంబయి పోలీసులు షాకిచ్చారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేశారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ఉల్లంఘనలకు పాల్పడ్డారనే ఫిబ్రవరి 1న ఈ కేసు నమోదైంది. దక్షిణ ముంబయిలోని అత్యంత భద్రత కలిగిన ఫోర్ట్ ప్రాంతంలో అనుమతి తీసుకోకుండా డ్రోన్ ఎగరేయడంపై సినిమా లొకేషన్ మేనేజర్ రింకు రాజ్‌పాల్ వాల్మీకిపై కేసు నమోదు చేశారు.ఈనెల 1వ తేదీన షూటింగ్లో సంజయ్ దత్ కూడా పాల్గొన్నారు. ఈ షూటింగ్ షెడ్యూల్ సమయంలో అనధికార డ్రోన్ కార్యకలాపాలను పోలీసులు గమనించారు. ఆ తర్వాతే పోలీసులు జోక్యం చేసుకున్నారు. డ్రోన్ వాడకాన్ని గుర్తించిన పోలీసు అధికారులు లొకేషన్ మేనేజర్‌కు నోటీసులు జారీ చేశారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా.. ఈ సినిమా సెట్ డిజైన్‌లో భాగంగా జనవరి 30న చారిత్రాత్మక ఫోర్ట్ కాంప్లెక్స్‌లోని కొన్ని భాగాలను పాకిస్తాన్‌లోని ఒక శక్తివంతమైన పాత వీధిని పోలి ఉండేలా ఏర్పాటు చేశారు.ఎవరైనా సరే మూవీ చిత్రీకరణ కోసం వైమానిక పరికరాలను ఉపయోగించే ముందు అవసరమైన అన్ని అనుమతులు పొందాలి. కానీ చట్టపరమైన అనుమతులు తీసుకోవడంతో దురంధర్ టీమ్ సభ్యులు విఫలమయ్యారు. ప్రతిష్టాత్మక ఫోర్ట్ ప్రాంతంలో మానవరహిత వైమానిక వాహనాల వాడకం ప్రభుత్వ, ఆర్థిక సంస్థలకు దగ్గరగా ఉండటం వల్ల కచ్చితంగా నిబంధనలు పాటించాల్సిందే. ఈ ప్రాంతం నిత్యం పర్యవేక్షణలో ఉంటుంది. ముఖ్యంగా వైమానిక ప్రదేశాల నిబంధనల ఉల్లంఘనను చట్ట అమలు సంస్థలు తీవ్రంగా పరిగణిస్తాయి. నిషేధిత ప్రాంతాల్లో డ్రోన్లు, ఇతర రికార్డింగ్ పరికరాల వినియోగాన్ని నియంత్రించే నిబంధనలను కఠినంగా పాటించాల్సిన అవసరముందని పోలీసులు తెలిపారు. -
'ధురంధర్ 2' టీజర్.. ఇలా మోసం చేశారేంటి?
'ధురంధర్ 2' టీజర్ వచ్చింది. దీన్ని చూసి మూవీ లవర్స్ ఒక్కసారిగా షాకయ్యారు. మమ్మల్ని ఇలా మోసం చేశారేంటి? అని విమర్శిస్తున్నారు. తమకు కొత్త టీజర్ కావాల్సిందే అని కామెంట్స్ పెడుతున్నారు. సోషల్ మీడియాలో ఇప్పుడిదే విషయం హాట్ టాపిక్ అయింది. వచ్చిన టీజర్ కంటే మేకర్స్ చేసిన మోసం గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలేం జరిగిందంటే?గత డిసెంబరులో 'ధురంధర్' సినిమా, థియేటర్లలో రిలీజైంది. దాదాపు 60 రోజుల కావొస్తున్నా, ఓటీటీలోకి వచ్చేసినా సరే బిగ్ స్క్రీన్‌పై ఇంకా ఆడుతోంది. ఈ మూవీ చివర్లో ఎండ్ క్రెడిట్స్ సీన్స్ కొన్ని వేశారు. సీక్వెల్ ఎలా ఉండబోతుంది అనేలా చిన్న గ్లింప్స్ చూపించారు. ఇప్పుడు అదే వీడియోని టీజర్లా విడుదల చేశారు. టీజర్ అనగానే కొత్త కంటెంట్ ఉండబోతుందని చాలామంది ఎగ్జైట్ అయ్యారు. కానీ థియేటర్లలో, ఓటీటీలో సినిమా చూసిన వాళ్లకు టీజర్ పెద్దగా నచ్చలేదు. ఎందుకంటే ఆల్రెడీ ఈ విజువల్స్ అన్నీ చూసేశారు కాబట్టి. అయితే ఇలా చేయడానికి కారణముందని బాలీవుడ్ మీడియా అంటోంది.(ఇదీ చదవండి: ఓటీటీలో 'ధురంధర్'.. తెలుగు ఆడియెన్స్ ఏమంటున్నారు?)'ధురంధర్ 2' కంటెంట్ ఇంకా పూర్తిస్థాయిలో రెడీ కాలేదట. ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయని.. దర్శకుడు ఆదిత్య ధర్ ఆ పనుల్లో బిజీగా ఉన్నారట. మార్చి 19నే థియేటర్లలోకి మూవీ రానుందని మరోసారి క్లారిటీ ఇవ్వడం కోసమే ఈ టీజర్ వదిలారని మాట్లాడుకుంటున్నారు. తొలి భాగం కేవలం హిందీలోనే రిలీజ్ కాగా.. సీక్వెల్ మాత్రం హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటించారు కూడా.'ధురంధర్' విషయానికొస్తే.. కాందహార్ హైజాక్, పార్లమెంట్‌పై ఉగ్రదాడి తర్వాత భారతదేశానికి చెందిన ఓ స్పై ఏజెంట్ హంజా అలీ అలియాస్ జస్క్రీత్ సింగ్.. పాకిస్థాన్‌లో అడుగుపెడతాడు. కరాచీ లయరీలోని రహమాన్ డకాయిట్ గ్యాంగ్‌లో చేరతాడు. అంచెలంచెలుగా ఎదుగుతూ రహమాన్‌కి నమ్మకస్తుడిగా మారతాడు. చివరకు రహమాన్‌నే చంపేస్తాడు. అక్కడితో తొలి భాగాన్ని ముగించారు. రహమాన్ చనిపోవడంతో అతడి స్థానంలోకి హంజా ఎలా వెళ్లాడు? లయరీలో అతిపెద్ద గ్యాంగ్‌స్టర్‌గా ఎలా అవతరించాడు? భారత్‌పై దాడి చేసిన మిగతా ఉగ్రవాదుల్ని ఎలా మట్టుబెట్టాడు? అనే అంశాలని సీక్వెల్లో చూపించబోతున్నారు.(ఇదీ చదవండి: 'ధురంధర్' సినిమా రివ్యూ)


