diastolic bladpresar
-
గుండెజబ్బును సూచించే రక్తపోటు అంకెలు!
అధిక రక్తపోటు గుండెజబ్బులకు దారితీస్తుందని మనం చాలాకాలంగా వింటూనే ఉన్నాం. రక్తపోటును కొలిచేందుకు ఉపయోగించే రెండు అంకెలు (డయాస్టోలిక్, సిస్టోలిక్ ) ద్వారా కూడా గుండెపోటు, జబ్బులను ముందుగానే గుర్తించవచ్చునని కైసర్ పర్మనెంటే అనే సంస్థ జరిపిన తాజా అధ్యయనం చెబుతోంది. గుండె ఎంత శక్తితో రక్తాన్ని ధమనుల్లోకి పంపుతుందో తెలిపేది సిస్టోలిక్ రీడింగ్ కాగా... లబ్ డబ్ల మధ్య గుండె విశ్రాంతి తీసుకునేటప్పుడు ధమనులపై ఉన్న ఒత్తిడిని డయాస్టోలిక్ రీడింగ్ సూచిస్తుంది. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. గుండెపోటు ప్రమాదాన్ని అంచనా వేసేటప్పుడు వైద్యులు దశాబ్దాలుగా సిస్టోలిక్ అంకెపైనే ఎక్కువ ఆధారపడుతున్నారని.. డయాస్టోలిక్ అంకెను పరిగణించాల్సిన అవసరం లేదని కూడా చెబుతారని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త అలెగ్జాండర్ సి ఫ్లింట్ తెలిపారు. తాజా అధ్యయనం మాత్రం రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాలని చెబుతోందని చెప్పారు. తాము దాదాపు మూడు కోట్ల అరవై లక్షల మంది తాలూకూ రక్తపోటు వివరాలను పరిశీలించి ఈ అంచనాకు వచ్చామని.. 20007 –16 మధ్యకాలంలో ఈ వివరాలను తీసుకోగా డయాస్టోలిక్ అంకెకూ గుండెపోటు, జబ్బులను అంచనా వేయడంలో తగిన ప్రాధాన్యమున్నట్లు తెలిసిందని చెప్పారు. -
గింజధాన్యాలతో గుండె జబ్బులు దూరం
ఆహారంలో గింజధాన్యాలు సమృద్ధిగా తీసుకునే వారికి గుండెజబ్బులు వచ్చే అవకాశాలు గణనీయంగా తగ్గుతాయని శాస్త్రవేత్తలు ఒక అధ్యయనంలో తేల్చారు. క్లీవ్‌ల్యాండ్ క్లినిక్, నెస్లేలు సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో రక్తపోటును సమర్థంగా నియంత్రించేందుకు గింజధాన్యాలు ఉపయోగపడతాయని, తద్వారా గుండెజబ్బులతో వచ్చే మరణాలను నివారించవచ్చునని తేలింది. యాభై ఏళ్ల కంటే తక్కువ వయసు ఉండి... ఊబకాయంతో ఉన్న వారిపై ఈ అధ్యయనం జరిగింది. కొందరికి గింజధాన్యాలు, మరికొందరికి శుద్ధి చేసిన ధాన్యాలను ఆహారంగా అందించారు. అధ్యయనం మొదట్లో, చివరలోనూ వారి జీవక్రియలపై క్షుణ్నంగా పరీక్షలు నిర్వహించారు. బీపీ కోసం మందులు తీసుకుంటున్న వారికి వాటిని కొనసాగించాల్సిందిగా సూచించారు. 8 వారాల తరువాత జరిపిన పరిశీలనలో గింజధాన్యాలు తిన్న వారిలో డయాస్టోలిక్ బ్లడ్‌ప్రెషర్ (రెండు లబ్డబ్లకు మధ్యలో గుండె రిలాక్స్ అవుతున్నప్పుడు ఉండే అతితక్కువ పీడనం) మూడు రెట్లు ఎక్కువైనట్లు గుర్తించారు. ఇది గుండెపోటు వచ్చే అవకాశాలను గణనీయంగా తగ్గిస్తుందనేందుకు సూచన.