diet exam
-
పరీక్షల్లో అందరూ ఫెయిల్
సాక్షి, చెన్నై : పరీక్ష రాసిన విద్యార్థుల్లో 99 శాతం మందిని అధికారులు ఫెయిల్ చేశారని ఆరోపిస్తూ 2019–20 సంవత్సరానికి చెందిన డైట్ కళాశాలకు చెందిన విద్యార్థులు గురువారం కలెక్టర్ ఆల్బీజాన్‌వర్గీష్‌కు వినతిపత్రం సమర్పించారు. కరోనా వేగంగా విస్తరించిన నేపథ్యంలో గత ఏడాది పూర్తిగా క్లాసులను రద్దు చేసి ఆన్లైన్ క్లాసులను నిర్వహించారు. దీంతో పాటు పరీక్షలను సైతం రద్దు చేసి ఆల్పాస్ను ప్రకటించారు. అయితే తరగతులను నిర్వహించకుండానే టీచర్ ట్రైనింగ్ చేస్తున్న విద్యార్థులకు పరీక్షలను నిర్వహించారు. పరీక్షలకు జిల్లా నుంచి సుమారు రెండు 2వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పరీక్ష ఫలితాలను ప్రభుత్వం ఇటీవల వెలువరించిన నేపథ్యంలో 99 శాతం మంది ఫెయిల్ అయినట్లు వెబ్సైట్లో ప్రకటించారు. సింగిల్ డిజిట్ మార్కులకు పరిమితం చేశారని, బాగా చదివి పరీక్షలు రాసినా అందరినీ ఫెయిల్ చేశారని ఆరోపిస్తూ గురువారం కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. కలెక్టర్ స్పందిస్తూ.. సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్తామని హమీ ఇచ్చారు. -
డీఎడ్ పరీక్షల్లో భారీగా మాస్ కాపీయింగ్
పరీక్ష ప్రారంభమైన కాసేపటికే ప్రశ్నపత్రం బయటకు వచ్చిన వైనం కిటీకీల్లో నుంచి పరీక్ష హాల్లోకి జవాబు పత్రాల పంపిణీ అంతా పబ్లిక్‌గా జరుగుతున్నా పట్టించుకోని అధికారులు రాయచోటి రూరల్: రాయచోటి పట్టణంలో నిర్వహిసున్న డీఎడ్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ భారీగా జరుగుతోంది. పరీక్షలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా నిమిషాల వ్యవధిలోనే ప్రశ్నపత్రం బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. ఆ తరువాత దానికి సంబంధించిన జవాబు పత్రాలు పరీక్షా కేంద్రాల బయట నుంచి కిటికీ ద్వారా లోపలి విసిరేసేందుకు పలువురు సిద్ధమయ్యారు. రాయచోటి పట్టణంలో డైట్ విద్యా కేంద్రం, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో రెండు చోట్ల మొత్తం 17 గదుల్లో 500 మంది విద్యార్థులకు పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షా కేంద్రాల వద్ద కిటికీల నుంచి కొందరు యువకులు పరీక్షా హాల్లోకి జవాబు పత్రాలు నేరుగా వేస్తున్నా అక్కడ ఉన్న సిబ్బంది, అధికారులు నిమ్మకునీరెత్తినట్లు ఉండటం గమనార్హం. ఈ విషయాలపై పరీక్షా కేంద్రాల చీఫ్‌లు దేవరాజులురెడ్డి, రాజేంద్రప్రసాద్‌లను వివరణ కోరగా ప్రశ్నపత్రం ఎలా బయటకు వెళ్లిందో తమకు అంతు పట్టడం లేదన్నారు. మాస్ కాపీయింగ్ జరగకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. -
డైట్‌సెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న డైట్‌సెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ప్రాథమిక విద్యాశాఖ కమిషనర్ చిరంజీవులు వెల్లడించారు. చిరంజీవులు హైదరాబాద్‌లో మాట్లాడుతూ... ఈ పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 473 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే 1,11,206 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకానున్నారని పేర్కొన్నారు. ఈ పరీక్ష ఉదయం 10.00 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 12.30 లకు ముగుస్తుందన్నారు. కాపీయింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ప్రాథమిక విద్యా కమిషనర్ చిరంజీవులు తెలిపారు.