The difficulties of the people
-
నగదు కష్టాలకు చంద్రబాబే బాధ్యుడు
ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కూడేరు : పెద్ద నోట్ల రద్దుతో నగదు కోసం పింఛన్దారులు, సామాన్య ప్రజానీకం పడుతున్న కష్టాలకు, ఇబ్బందులకు బాధ్యుడు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడేనని ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం కూడేరు మండలం ఉదిరిపికొండ తండాలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను మోదీకి లేఖ రాయడం వల్లే పెద్ద నోట్లు రద్దు జరిగిందని బాబు మొదట్లో గొప్పలు చెప్పుకొచ్చారన్నారు. కానీ చిల్లర నోట్లు ప్రజలకు అందుబాటులోకి రాకపోవడంతో రైతులు, కూలీలు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ వద్ద మెప్పు పొందేందుకే పింఛన్ నగదును బ్యాంకుల్లోకి జమ చేసి పండుటాకులకు, వికలాంగులకు నరకం చూపిస్తున్నారని సీఎంపై ధ్వజమెత్తారు. ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ నెపాన్ని బ్యాంకర్లపై నెట్టి ఆగ్రహం వ్యక్తం చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. నగదు రహిత లావాదేవీల కోసం ప్రజలకు, ఉద్యోగస్తులకు తీవ్ర ఇబ్బందులు పెడుతున్నాడని మండిపడ్డారు. విద్యావంతులే డిజిటల్ పద్ధతిని పాటించలేకపోతే గ్రామీణ ప్రజల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థమవుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి విరివిగా కొత్త రూ.500 నోట్లను, చిల్లర నోట్లను అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. -
బస్సు చార్జీలు పెరగవు
- రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి సాక్షి, బెంగళూరు: కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీల్లో ఇప్పట్లో బస్చార్జీల పెంపు ఉండబోదని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డివెల్లడించారు. డీజిల్ ధరలు పెరిగినప్పటికీ ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని చార్జీలను పెంచలేదని వివరించారు. ఈ నిర్ణయం ద్వారా రోడ్డు రవాణా సంస్థపై రూ.396కోట్ల భారం పడనుందని రామలింగారెడ్డి పేర్కొన్నారు. గురువారమిక్కడ తనను కలిసిన విలేకరులతో రామలింగారెడ్డి మాట్లాడారు. ఆరు నెలల క్రితం కేఎస్ఆర్టీసీ, బీఎంటీసీ చార్జీలను పెంచిన నేపథ్యంలో నష్టాలు కాస్తంత తగ్గాయని తెలిపారు. బీఎంటీసీలో ఖాళీగా ఉన్న 700 ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు చెప్పారు. రోడ్డు రవాణా సంస్థలోని ఉద్యోగుల బదీలలకు సంబంధించి మొట్టమొదటి సారిగా మార్గదర్శకాలను రూపొందించినట్లు వెల్లడించా రు. ప్రస్తుతం బీఎంటీసీతోపాటు కేఎస్ఆర్టీసీ ఇతర విభాగాలతో కలిపి రోడ్డు రవాణా సంస్థలో మొత్తం 1.2లక్షల మంది ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. ఉద్యోగుల బదిలీల్లో పారదర్శకతను పాటించేందుకు గాను ఈ మార్గదర్శకాలను రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి 30 లోపు ఉద్యోగుల బదిలీల ప్రకియను పూర్తి చేయనున్నట్లు మంత్రి రామలింగారెడ్డి వెల్లడించారు.