Digital camera
-
ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరా ఇదే.. మెగాపిక్సెల్ ఎంతంటే?
వాషింగ్టన్: ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ కెమెరాను ఆవిష్కరించారు అమెరికా ఇంజనీర్లు. ఎస్ఎల్ఏసీ నేషనల్ యాక్సిలరేటర్ లేబొరేటరీలో దీన్ని రూపొందించారు. ఈ ప్రాజెక్టు కోసం రెండేళ్లుగా శ్రమిస్తున్నారు. అయితే ఈ ఎల్ఎస్ఎస్టీ డిజిటల్ కెమెరా ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. కానీ అన్ని భాగాలను అమర్చారు. ఆపరేట్ చేసి ఫోటోలు తీసేందుకు ఇంకాస్త సమయం పడుతుంది. ఎల్ఎస్ఎస్టీ కెమెరా అంటే? ఎల్ఎస్ఎస్టీ అంటే 'లార్జెస్ట్ సినాప్టిక్ సర్వే టెలిస్కోప్' డిజిటల్ కెమెరా. ఉత్తర చీలిలోని 2,682 మీటర్ల ఎత్తయిన పర్వతం సెర్రో పచోన్ అంచున 2023లో ఏఫ్రిల్‌లో దీన్ని అమర్చనున్నారు. భూమిపై పరిశోధలనకు ఈ ప్రాంతం అత్యంత అనువైంది. జెమినీ సౌత్, సౌథర్న్ ఆస్ట్రోఫిజికల్ రీసెర్చ్ టెలిస్కోప్‌లు ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ డిజిటల్ కెమెరాలోని సెన్సార్లు అత్యాధునిక ఐఫోన్ 14 ప్రోతో పోల్చితే చాలా రెట్లు అధికం. దీని ఓవరాల్ రిజొల్యూషన్ 3.2 గిగాపెక్సెల్స్ లేదా 3200 మెగా పిక్సెళ్లు. అంటే 266 ఐఫోన్ 14ప్రో ఫోన్లతో ఇది సమానం. ఈ కెమెరాతో 15 మైళ్ల దూరంలో ఉన్న గోల్ఫ్ బంతిని కూడా క్లియర్‌గా చూడవచ్చు. ఇది చిన్న కారు సైజు పరిమాణం, మూడు టన్నుల బరువుంటుంది. చదవండి: బ్రిటన్‌లో నేరాల కట్టడికి ఈ- రిక్షాలు! -
డిజిటల్ కెమెరా పుట్టక ముందే మోదీ చేతికి
సాక్షి, న్యూఢిల్లీ : ‘నేను డిజిటల్ కెమెరాను 1987–1988 ప్రాంతంలో ఉపయోగించాను. అప్పుడు చాలా తక్కువ మందికి ఈ మెయిల్ సర్వీసు అందుబాటులో ఉండేది. ఒక రోజు వీరంగమ్ తెహసిల్‌లో (గుజరాత్) అద్వానీ బహిరంగ సభ జరుగుతుందంటే అక్కడికి నేను నా డిజిటల్ కెమెరాను తీసుకొని వెళ్లాను. ఇప్పట్లాగా కాకుండా అప్పట్లో ఆ కెమేరా చాలా పెద్దగా ఉండేది. అద్వానీ సభలో ప్రసంగిస్తున్న దశ్యాన్ని ఫొటో తీసి వెంటనే దాన్ని నేను ఢిల్లీకి ట్రాన్సిమిట్ చేశాను. ఆ మరుసటి రోజు ఉదయమే ఆయన కలర్ ఫొటో అచ్చయింది. ఒక్క రోజులోనే ఆయన ఫొటో అచ్చవడం చూసి అద్వానీ ఆశ్చర్యపడ్డారు’ అని ప్రధాని నరేంద్ర మోదీ ‘న్యూస్ నేషన్’ అనే హిందీ టెలివిజన్ ఛానెల్‌కు మే 11వ తేదీన ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. డిజిటల్ కెమేరా 1991లో మార్కెట్లోకి ప్రపంచంలోనే తొలి కమర్శియల్ డిజిటల్ కలర్ కెమెరా ‘కొడాక్ 100’ 1991లో మార్కెట్లోకి వచ్చింది. అప్పటికీ భారత్‌లో ఇంటర్నెట్ సర్వీసు అందుబాటులో లేదు. ఫొటోలు, చిత్రాలు కాకుండా కేవలం టెక్ట్స్(లిపి)ని మాత్రమే పంపించే ఈ మెయిల్ సర్వీస్‌ను భారత ప్రభుత్వం 1995, ఆగస్టు 15వ తేదీన ప్రారంభించింది. 1998లో ప్రైవేటు కంపెనీలు ఈ మెయిల్ సర్వీసులను ప్రారంభించాయి. 1987లో కమర్శియల్‌గా ఎలాంటి డిజిటల్ కెమెరా అందుబాటులో లేనేలేదని ‘మీడియా అండ్ డిజిటల్’ కన్సల్టెంట్ ప్రశాంతో కుమార్ రాయ్ తెలిపారు. ‘కొడాక్ ఫస్ట్ డిజిటల్ మూవ్మెంట్’ శీర్షికతో ‘న్యూయార్క్ టైమ్స్’ 2015లో రాసిన ఓ వార్తా కథనం ప్రకారం ప్రపంచంలోనే తొలి బ్లాక్ అండ్ వైట్ డిజిటల్ కెమెరాను కొడాక్ ఇంజనీరు స్టీవెన్ సాసన్ 1975లో కనుగొన్నారు. 0.1 మెగా పిక్సల్ కలిగిన దీన్ని ‘ఎలక్ట్రానిక్ స్టిల్ కెమెరా’గా పేర్కొంటూ 1978లో పేటెంట్ తీసుకున్నారు. అప్పటి వర కు ఈ కెమెరాను కనుగొన్న విషయాన్ని బయటకు చెప్పకుండా ఇంజనీరు స్టీవెన్‌ను కట్టడి చేశారు. డిజిటల్ సింగిల్ లెన్స్ రిఫ్లెక్స్ కెమెరాను 1989లో స్టీవెన్ సాసన్, రాబర్ట్ హిల్స్ కనిపెట్టారు. అయితే అది కూడా వెంటనే మార్కెట్లోకి రాలేదు. అంతుముందు 1986లోనే మెగా ఫిక్సల్ డిజిటల్ కెమెరా ‘ప్రోటోటైప్’ను తయారు చేశారు. అంటే, ప్రపంచంలోనే అది ఒక్కటే కెమెరా ఉంటుంది. దాని కమర్షియల్ మోడల్ కొడాక్ డీసీఎస్ (డిజిటల్ కెమెరా సిస్టమ్) 100, 1.3 మెగాఫిక్సల్ సామర్థ్యంతో 1991లో ప్రపంచ మార్కెట్లోకి వచ్చింది. ‘నికాన్ ఫిల్మ్ కెమెరా’ బాడీలో దాన్ని అమర్చారు. దాన్ని పదివేల డాలర్ల నుంచి 20వేల డాలర్ల వరకు ఉపయోగించారు. భారత్‌లో ఇంటర్నెట్ సదుపాయం భారత ప్రభుత్వరంగ సంస్థ ‘విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (వీఎస్ఎన్ఎల్)’ సంస్థ 1995, ఆగస్టు 15వ తేదీన దేశంలో ఇంటర్నెట్ సర్వీసును ప్రారంభించింది. దాంతో ఈ మెయిల్ ద్వారా సమాచారాన్ని పంపుకునే సౌకర్యం అందుబాటులోకి మరింత విస్తృతంగా అందుబాటులోకి వచ్చిందికానీ ఫొటోలను పంపుకునే సామర్థ్యం అప్పటికీ రాలేదు. ఈ రంగంలోకి ప్రవేటు కంపెనీలను 1998లో భారత ప్రభుత్వం అనుమతించింది. 2008లో టాటా గ్రూప్ వీఎస్‌ఎన్‌ఎల్‌ను కొనుగోలు చేసుకుంది. తర్వాత దాన్ని టాటా కమ్యూనికేషన్లుగా మార్చుకుంది. 1992లో ఈఆర్ఎన్ఈటీ (ఎడ్యుకేషన్ అండ్ రీసర్ట్ నెట్వర్క్), బిజినెస్ ఇండియా యాక్సెస్ పేరిట దేశంలో రెండు ఈ మెయిల్ సర్వీసులు ఉండేవి. ఒకటేమో అకాడమిక్ సంస్థల మధ్య ఈ మెయిళ్లుకు, రెండోది వ్యాపార సంస్థలకు మధ్య ఈ మెయిళ్ల కోసం ఈ రెండు నెట్‌వర్క్‌లు పనిచేశాయి. అవి అప్పుడు అత్యంత ఖరీదైనవి. వాటికి కూడా ఫొటోలు పంపించే సౌకర్యం లేకుండే. మోదీ ఏ పద్ధతి ఉపయోగించారో! 1986–87 సంవత్సరాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకుండానే ప్రధాని నరేంద్ర మోదీ ఏ పద్ధతిన ఢిల్లీకి డిజిటల్ ఫొటోను పంపించారంటూ నెటిజన్లు జోకులు వేసుకుంటున్నారు. మోదీ తన ఇంటర్వ్యూలో ట్రాన్సిమిట్ చేశానని చెప్పారుగానీ ఏ పద్ధతిన ట్రాన్సిమిట్ చేశారో చెప్పలేదు. తెలుసుకొని వివరించాల్సిందిగా ‘బీజేపీ సమాచార, సాంకేతిక విభాగం’ అధిపతి అమిత్ మాల్వియాకు మీడియా ఈ మెయిల్ పెట్టింది. ఇంతవరకు ఆయన నుంచి సమాధానం రాలేదు. ఈ మెయిల్ ఎక్స్ఛేంజ్కు 1986లోనే డైలప్ లింక్ పద్ధతి అనేది ఒకటి ఉండేది. అది కూడా ‘నేషనల్ సెంటర్ ఫర్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ (ఎన్సీఎస్టీ), ముంబై ఐఐటీ మధ్యనే ఉండింది. 1987లో మద్రాస్ ఐఐటీ, ఢిల్లీ ఐఐటీ మధ్య అలాంటి డైలప్ లింక్‌ను ఏర్పాటు చేశారు. ఈ పద్ధతికి డయల్ చేయడానికి ఓ కంప్యూటర్, దాన్ని మోడమ్ ద్వారా రిసీవ్ చేసుకోవడానికి మరో కంప్యూటర్ ఉంటే చాలు. వాటి ద్వారా ఈ మెయిళ్లను పంపించడమే కాకుండా మాట్లాడుకునే సౌకర్యం కూడా ఉంది. ఎవరో తప్పుదోవ పట్టిస్తున్నారు! ప్రధాని నరేంద్ర మోదీనే తన పాత జ్ఞాపకాలకు కొత్త టెక్నాలజీని జోడించి మాట్లాడుతున్నారా? ఎవరో తెలిసీ తెలియక రాసిస్తున్న ‘స్క్రిప్టు’ను ఆయన అనుసరిస్తున్నారా? చెప్పే మాటలు వింటారు తప్పించీ, లోతుల్లోకి వెళ్లి ఎవరు నిజానిజాలను చూస్తారులే అన్న అభిప్రాయమా ? ఏదైమైనా చరిత్ర గురించి, సైన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన తప్పులోనే కాలేస్తున్నారు. -
కెమెరా బుక్ చేస్తే.. రాళ్లొచ్చాయ్!
వనపర్తి: ఆన్లైన్ షాపింగ్ ఎప్పటికైనా ప్రమాదమని మరోసారి రుజువైంది. జిల్లాకేంద్రంలోని భగత్‌సింగ్‌నగర్ కాలనీకి చెందిన చీర్ల యాదిసాగర్ ఈ నెల 11వ తేదీన జీఎస్టీతో కలిపి రూ.48,990 విలువ గల కెనాన్ కంపెనీ డిజిటల్ కెమెరాను ఫ్లిప్‌కార్డు ఆన్లైన్ షాపింగ్‌లో కొనుగోలు చేశాడు. అయితే సోమవారం ప్లిప్‌కార్డు నుం చి ఇన్‌స్టాకార్డు సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా యాదిసాగర్‌కు ఓ పార్సిల్ వచ్చింది. డబ్బు చెల్లించి పార్సిల్‌ను ఇంటికి తెచ్చి తెరిచి చూస్తే.. అందులో రెండు నల్లని రాళ్లు కనిపించాయి. ఒక్కసారిగా నివ్వెరపోయిన బాధితుడు కొరియర్‌ను ప్రశ్నిస్తే.. తమకు సంబంధం లేదని చెప్పేశాడు. దీంతో బాధితుడు రాళ్లతో వచ్చిన ఫ్లిప్‌కార్డు బాక్స్‌తో జిల్లాకేంద్రంలోని పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు కేసు నమోదు చేస్తాం కాని.. íఫ్లిప్‌కార్డు సంస్థ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి విషయం చెప్పాలని సూచించారని బాధితుడు పేర్కొన్నారు. ఆన్లైన్ షాపింగ్‌లో ఎక్కువ విలువగల వస్తువులు వచ్చిప్పుడే.. పార్సిల్లో రాళ్లు, మట్టిపెల్లలు వస్తుంటాయి. ఫ్లిప్‌కార్డు సంస్థ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే.. మరో వారం రోజుల్లో పొరపాటు ఎక్కడ జరిగిందో విచారణ చేస్తామన్నట్లు బాధితుడు వివరించారు. -
బొమ్మ పడిందా.. కేసులూ కాసులే!
డిజిటల్ కెమెరాలతో పోలీసుల హల్చల్ వాహనాలను ఫొటోలు తీస్తున్న వైనం ట్రాఫిక్ క్రమబద్ధీకరణ గాలికి వాహనచోదకులకు కొత్త కష్టాలు ‘ఏయ్ ఆటో ఆపు.. బండి నంబరెంత..! చేతిలో ఉన్న చిన్నపాటి యంత్రాన్ని (పీడీఎఫ్ డివైస్) టకటకా నొక్కి.. ఇదిగో 2013 నుంచి ఇప్పటివరకు నీ ఆటో ఇన్నిసార్లు నిబంధనలను అతిక్రమించింది. రెండు వేల రూపాయలు జరిమానా కట్టు’ .. ఇది ఓ పోలీస్ అధికారి హుకుం. ‘అదేంటి సార్.. నేనీ ఆటో కొనుక్కుని నాలుగు నెలలే అయింది.. 2013 నుంచి ఫైన్ కట్టమంటే ఎలా! ఈ నాలుగు నెలల్లో నేనెప్పుడూ నిబంధనలను అతిక్రమించలేదు. ఒకవేళ మీరినా అప్పటికప్పుడే ఆపి జరిమానా రాస్తే కట్టేసేవాళ్లం కదా.. ఇదెక్కడి అన్యాయం సార్’ .. ఇది ఓ ఆటోడ్రైవర్ ఆవేదన. భవానీపురం : ఇది ఒక్క ఆటోడ్రైవర్ వాదన, ఆవేదనే కాదు. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు డిజిటల్ కెమెరాలతో చేస్తున్న హడావుడితో హడలెత్తిపోతున్న వాహనచోదకులందరిదీ. పోలీసులు ఎప్పుడు ఫొటో తీస్తున్నారో తెలియదు.. ఎందుకు తీస్తున్నారో తెలియదు. ఏదో ఒక రోజు, ఎక్కడో ఒక చోట ఉన్నట్లుండి వాహనాన్ని ఆపుతున్నారు. పోలీసు అధికారి చేతిలో విద్యుత్ మీటర్ రీడింగ్ తీసే యంత్రం లాంటిది ఒకటుంటుంది. మీ వాహనం నంబర్ చెప్పండంటారు. చెప్పగానే టక టక కొట్టేసి.. ఇదిగో ఇన్నిసార్లు మీరు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించారు.. ఇంత మొత్తం జరిమానా కట్టాలి.. అంటూ వాహనదారుడి చేతిలో చిన్న స్లిప్పు పెట్టేస్తున్నారు. కనిపించని నాలుగో సింహం నగరంలోని పోలీసుల తీరు చూస్తుంటే ‘కనిపించని నాలుగో సింహమేరా పోలీస్’ అనే సినీ డైలాగ్ గుర్తురాక మానదు. కొన్ని ముఖ్యమైన రోడ్లలో పోలీసులు ఎవరికీ తెలియకుండా ఫొటోలు తీస్తుంటే.. కొన్ని కూడళ్లలో విధులు నిర్వర్తించే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ తమ చేతిలోని డిజిటల్ కెమెరాతో ఎవరికీ అనుమానం రాకుండా వాహనదారులను ఫొటోలు తీస్తున్నారు. ఆఫీసులు, ఆస్పత్రుల వంటి ముఖ్యమైన పనులకు వెళ్లే హడావుడిలో ఉండే ద్విచక్రవాహనదారులు, కిరాయి వేటలో ఉండే ఆటో డ్రైవర్లకు పోలీసులు ఫొటోలు తీసిన విషయమే తెలియదు. ఎప్పుడో ఒకప్పుడు పోలీసులు పంపిస్తున్న జరిమానా నోటీసులను చూసి బెంబేలెత్తుతున్నారు. ఒక్కో కూడలిలో ఒక కానిస్టేబుల్, ఒక హోంగార్డ్ ఎవరికి వారు ఫొటోలు తీసేస్తున్నారు. కొందరైతే డ్యూటీ వదిలేసి పక్క రోడ్లో పార్క్ చేసిన ద్విచక్రవాహనాల ఫొటోలను తీస్తున్నారు. ఎక్కడైనా రోడ్డుపై హఠాత్తుగా ఆటో ఆపితే అమాంతం ఫొటో తీస్తున్నారు. నగరంలో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. ఇక వారు ఫొటోలపై పెట్టే శ్రద్ధ ట్రాఫిక్‌పై ఏం పెడతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కాసులు కురిసేదెలా అంటే.. డిజిటల్ కెమెరాతో ఎన్ని ఫొటోలు తీసినా తొలగించే (డిలీట్ చేసే) వీలుంటుంది. ఇది పోలీసులకు కాసులు కురిపిస్తోంది. ఏదేనీ వాహనాన్ని ఫొటో తీయడం ఆ వ్యక్తి గమనిస్తే జరిమానా కట్టేందుకు మక్కువచూపడం లేదు. ఎంతో కొంత సొమ్ము సదరు కానిస్టేబుల్‌కో, హోంగార్డుకో ముట్టజెప్పి ఫొటోను తొలగింపజేసుకుంటున్నారు. సూచికలు లేకుండా జరిమానాలా.. ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించిన సూచికలు పలుచోట్ల కనిపించడం లేదు. అలాంటప్పుడు జరిమానా ఎలా విధిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. పలుచోట్ల వన్‌వే, నో పార్కింగ్, బస్‌స్టాప్ వంటి సూచిక బోర్డులు లేవు. మరికొన్ని జంక్షన్లలో జీబ్రాలైన్లు వెలిసిపోయి కనిపించడం లేదు. అయినా పోలీసులు ఫొటోలు తీసేస్తున్నారని వాహనచోదకులు ఆరోపిస్తున్నారు. -
పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్
10 డేస్... ఈ పది రోజుల్లో... నేను చెప్పే పది ఐడియాల్లో ఏ ఐడియా నచ్చినా దాంతో మీరు ఓ షార్ట్ ఫిల్మ్ తీసేయండి. మొత్తం 10 ఐడియాలూ తీస్తానన్నా మాకు ఓకే! స్టోరీ: పూరి డైరెక్టర్స్: మీరే!! 10 స్టోరీ ఐడియాస్ 10 మినిట్స్... ఇప్పటికి నాలుగు స్టోరీ ఐడియాలు చెప్పా. ఇవాళ్టిది ఐదో ఐడియా. ఇలా మరో ఐదు ఐడియాలు చెప్తా. మొత్తం పది ఐడియాలు చెప్తా. వీటిల్లో మీకు నచ్చిన కథకు మీరు స్క్రిప్ట్ రెడీ చేసి చక్కగా డైలాగులు రాసుకుని 10 నిమిషాల లోపు నిడివితో ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. మీ ఇష్టం... ఏ డిజిటల్ కెమెరాతోనైనా తీయొచ్చు. ఏమీ లేకపోతే ఐ ఫోన్తోనైనా తీయొచ్చు. యాక్టర్స్ అంటారా? మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల బోలెడంత మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్లతోనే షూట్ చేయండి. నెల రోజులు టైం ఇస్తున్నాం. ఫిబ్రవరి 14 వేలంటైన్స్‌డే మీ ఎంట్రీలకు లాస్ట్ డే. మీరు తీసిన షార్ట్ ఫిల్మ్‌ని directorsakshi@gmail.comకి పంపించండి. ఒక్కో కథకు ఒక్కో డైరెక్టర్స్ ని ఎంపిక చేస్తాం. అంటే పది కథలకూ పదిమంది దర్శకులు. వీళ్లందరికీ తగిన బహుమతులు ఇస్తాం. వాళ్లు తీసిన షార్ట్ ఫిల్మ్స్ ‘సాక్షి’ ఛానల్లో ప్రసారం చేస్తాం. యూ ట్యూబ్‌లో పెడతాం. దీంతో మీకు ఎక్స్‌పీరియెన్స్ వస్తుంది. ఎక్స్పోజర్ వస్తుంది. సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలూ రావొచ్చు. ఏమో..! మీలో ఎవరైనా నాకు నచ్చితే నా బేనర్లో నేనే డైరెక్టర్స్ ఛాన్స్ ఇస్తానేమో! పూరి Idea-5 నేనెప్పుడో ‘పుష్పక విమానం’ చూశాను. నాకది చాలా చాలా బాగా నచ్చిన సినిమా. అందులో ఒక్క డైలాగు కూడా ఉండదు. కానీ కథ అద్భుతంగా అర్థమవుతూ ఉంటుంది. బోలెడంత ఎంజాయ్ చేశాం కూడా. ఎక్కువ మాట్లాడితేనే సినిమాలు హిట్టవుతాయనే కాలంలో అలా మాటల్లేకుండా సినిమా తీయడం నిజంగా రిస్కే. నాక్కూడా అలా ఎప్పటికైనా మూకీ తీయాలని ఉంది. కుదురుతుందో లేదో చూడాలి. మీరు కూడా ‘పుష్పక విమానం’లా ఓ మూకీ షార్ట్ ఫిల్మ్ తీసి చూపించండి. మ్యూజిక్ ఉండొచ్చు. సౌండ్స్ ఉండొచ్చు. డైలాగులు మాత్రం ఉండకూడదు. 10 నిమిషాల్లోపు ఓ మూకీ ప్రేమ కథను చెప్పగలరా? ఛాలెంజ్ మీకు... బహుమతులు అందించేవారు... ప్రెజెంటేషన్: పులగం చిన్నారాయణ -
పూరి జగన్నాథ్ డెరైక్టర్స్ హంట్
స్టోరీ: పూరి డెరైక్షన్: మీరే!! నేటి నుంచి వరుసగా 10 రోజుల పాటుమీకు రోజుకో కథ చెబుతా. దానికి మీరు స్క్రిప్ట్ రెడీ చేసి చక్కగా డైలాగులు రాసుకుని 10 నిమిషాల లోపు నిడివితో ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. మీ ఇష్టం... ఏ డిజిటల్ కెమెరాతోనైనా తీయొచ్చు. ఏమీ లేకపోతే ఐ ఫోన్తోనైనా తీయొచ్చు. యాక్టర్స్ అంటారా? మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల బోలెడంత మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్లతోనే షూట్ చేయండి. 10 మినిట్స్... ఈ పది రోజుల్లో... నేను చెప్పే పది ఐడియాల్లో ఏ ఐడియా నచ్చినా దాంతో మీరు ఓ షార్ట్ ఫిల్మ్ తీసేయండి. మొత్తం 10 ఐడియాలూ తీస్తానన్నా మాకు ఓకే! ఏమో..! మీలో ఎవరైనా నాకు నచ్చితే నా బేనర్లో నేనే డెరైక్షన్ ఛాన్స్ ఇస్తానేమో! అయితే కొన్ని కండిషన్స్... చాలా తక్కువ ఖర్చుతో ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. అనవసరంగా ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టకూడదు ఈ షార్ట్ ఫిల్మ్ పేరు చెప్పి మీ ఇంట్లో వాళ్లను డబ్బుల కోసం వేధించకూడదు. అసలు మీ సొంత డబ్బు వాడకూడదు. ఎవరో ఒకర్ని కన్విన్స్ చేసి ఈ షార్ట్ ఫిల్మ్ తీయాలి. పది నిమిషాల షార్ట్ ఫిల్మ్ కోసమే ఒకరిని కన్విన్స్ చేయలేనివాళ్లు జీవితంలో డెరైక్టర్ కాలేరు. రేపు సినిమా తీయడానికి ఏ నిర్మాతను ఒప్పించగలరు? అర్థమైందిగా.. లాస్ట్ అండ్ ఫైనల్... మీరు తీయబోయే షార్ట్ ఫిల్మ్ ఎలా ఉండాలంటే, అది మీ జీవితాన్ని మార్చేసేలా ఉండాలి. గమనిక: నా జీవితం కూడా ఇలా షార్ట్ ఫిల్మ్‌లతోనే మొదలైంది. మీ అందరికీ ఆల్ ది బెస్ట్. - పూరి జగన్నాథ్