పూరి జగన్నాథ్ డైరెక్టర్స్ హంట్
10 డేస్...
ఈ పది రోజుల్లో...
నేను చెప్పే పది ఐడియాల్లో ఏ ఐడియా నచ్చినా దాంతో
మీరు ఓ షార్ట్ ఫిల్మ్ తీసేయండి. మొత్తం 10 ఐడియాలూ తీస్తానన్నా మాకు ఓకే!
స్టోరీ: పూరి
డైరెక్టర్స్: మీరే!!
10 స్టోరీ ఐడియాస్
10 మినిట్స్...
ఇప్పటికి నాలుగు స్టోరీ ఐడియాలు చెప్పా. ఇవాళ్టిది ఐదో ఐడియా. ఇలా మరో ఐదు ఐడియాలు చెప్తా. మొత్తం పది ఐడియాలు చెప్తా. వీటిల్లో మీకు నచ్చిన కథకు మీరు స్క్రిప్ట్ రెడీ చేసి చక్కగా డైలాగులు రాసుకుని 10 నిమిషాల లోపు నిడివితో ఒక షార్ట్ ఫిల్మ్ తీయండి. మీ ఇష్టం... ఏ డిజిటల్ కెమెరాతోనైనా తీయొచ్చు. ఏమీ లేకపోతే ఐ ఫోన్తోనైనా తీయొచ్చు. యాక్టర్స్ అంటారా? మీ ఇంట్లో, మీ చుట్టుపక్కల బోలెడంత మంది యాక్టర్స్ ఉన్నారు. వాళ్లతోనే షూట్ చేయండి.
నెల రోజులు టైం ఇస్తున్నాం. ఫిబ్రవరి 14 వేలంటైన్స్డే మీ ఎంట్రీలకు లాస్ట్ డే. మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ని directorsakshi@gmail.comకి పంపించండి. ఒక్కో కథకు ఒక్కో డైరెక్టర్స్ ని ఎంపిక చేస్తాం. అంటే పది కథలకూ పదిమంది దర్శకులు. వీళ్లందరికీ తగిన బహుమతులు ఇస్తాం. వాళ్లు తీసిన షార్ట్ ఫిల్మ్స్ ‘సాక్షి’ ఛానల్లో ప్రసారం చేస్తాం. యూ ట్యూబ్లో పెడతాం. దీంతో మీకు ఎక్స్పీరియెన్స్ వస్తుంది. ఎక్స్పోజర్ వస్తుంది. సినిమా ఇండస్ట్రీ నుంచి అవకాశాలూ రావొచ్చు.
ఏమో..! మీలో ఎవరైనా నాకు నచ్చితే నా బేనర్లో నేనే డైరెక్టర్స్ ఛాన్స్ ఇస్తానేమో!
పూరి Idea-5
నేనెప్పుడో ‘పుష్పక విమానం’ చూశాను. నాకది చాలా చాలా బాగా నచ్చిన సినిమా. అందులో ఒక్క డైలాగు కూడా ఉండదు.
కానీ కథ అద్భుతంగా అర్థమవుతూ ఉంటుంది. బోలెడంత ఎంజాయ్ చేశాం కూడా. ఎక్కువ మాట్లాడితేనే సినిమాలు హిట్టవుతాయనే కాలంలో అలా మాటల్లేకుండా సినిమా తీయడం నిజంగా రిస్కే. నాక్కూడా అలా ఎప్పటికైనా మూకీ తీయాలని ఉంది. కుదురుతుందో లేదో చూడాలి. మీరు కూడా ‘పుష్పక విమానం’లా ఓ మూకీ షార్ట్ ఫిల్మ్ తీసి చూపించండి. మ్యూజిక్ ఉండొచ్చు. సౌండ్స్ ఉండొచ్చు. డైలాగులు మాత్రం ఉండకూడదు. 10 నిమిషాల్లోపు ఓ మూకీ ప్రేమ కథను చెప్పగలరా? ఛాలెంజ్ మీకు...
బహుమతులు అందించేవారు...
ప్రెజెంటేషన్: పులగం చిన్నారాయణ