digital marketing company
-
జర్మనీ అతి పెద్ద సంస్థ ఇన్ఫోసిస్ కైవసం.. డీల్ విలువ ఎంతంటే?
భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ దూకుడును పెంచింది. జర్మనీకి చెందిన డిజిటల్ మార్కెటింగ్, కమర్షియల్ ఎజెన్సీ ఆడీటీ(oddity)ను కైవసం చేసుకుంటున్నట్లు ఇన్ఫోసిస్ మంగళవారం రోజున ఒక ప్రకటించింది. ఈ ఒప్పందంపై ఇరు కంపెనీలు సంతకం చేశాయి. ఆడీటీ కొనుగోలుతో సృజనాత్మక, బ్రాండింగ్, అనుభవ రూపకల్పన వంటి సామర్థ్యాలను బలోపేతం చేస్తోందని ఇన్ఫోసిస్ అభిప్రాయపడింది. ఆడీటీను కైవసం చేసుకునే ప్రక్రియ 2023 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ముగుస్తోందని ఇన్ఫోసిస్ పేర్కొంది. ఈ కంపెనీతో పాటుగా ఏకకాలంలో క్రిస్టాల్ 247ను కూడా ఇన్ఫోసిస్ హస్తగతం చేసుకొనుంది. ఆడీటీను సొంతం చేసుకునేందుకు ఇన్ఫోసిస్ సుమారు 50 మిలియన్ యూరోల(సుమారు రూ. 419 కోట్లు)ను ఖర్చు చేసింది. ఇక క్రిస్టాల్ 247ను కేవలం 3000 యూరోల(సుమారు రెండున్నర లక్షల రూపాయల)ను ఖర్చు చేయనుంది. జర్మనీలో అతి పెద్ద సంస్థగా..! జర్మనీలో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీల్లో ఆడీటీ అతి పెద్ద సంస్థగా నిలుస్తోంది. ఈ కంపెనీ స్టుట్గార్ట్, బెర్లిన్, కొలోన్, బెల్గ్రేడ్, షాంఘై, తైపీ వంటి నగరాల్లో 300పైగా డిజిటల్ మార్కెటింగ్ నిపుణులను కలిగి ఉంది. జర్మన్ ఓమ్నీ-ఛానల్, ఈ-కామర్స్ రిటైలర్లు, ప్రముఖ ఎఫ్ఎంసీజీ బ్రాండ్లు, గ్లోబల్ మొబిలిటీ ప్రొవైడర్ల కోసం డిజిటల్ పరివర్తనను ఎనేబుల్ చేయడం వంటి సర్వీసులను ఆడిటీ అందిస్తోంది. డిజిటల్-ఫస్ట్ బ్రాండ్ మేనేజ్మెంట్ అండ్ కమ్యూనికేషన్, వర్చువల్ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ, అనుభవంతో సహా అంతర్గత ఉత్పత్తితో కూడిన సమగ్ర సేవా పోర్ట్‌ఫోలియోను ఆడీటీ కల్గి ఉంది. చదవండి: వర్క్ ఫ్రమ్ హోంపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు..! -
ఏపీలో పల్సస్ విస్తరణ.. 60 వేల చ.అ. విస్తీర్ణంలో క్యాంపస్
సాక్షి, విశాఖపట్నం: హెల్త్ ఇన్ఫర్మేటిక్స్, డిజిటల్ మార్కెటింగ్ కంపెనీ పల్సస్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో తన కార్యకలాపాలను విస్తరిస్తోంది. వైజాగ్‌లోని మధురవాడ ఐటీ పార్క్‌లో 60,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో భారీ క్యాంపస్ సిద్ధమవుతోందని పల్సస్ సీఈవో డాక్టర్ గేదెల శ్రీను బాబు సోమ వారం పేర్కొన్నారు. 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో సొంత సెజ్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్టు సంస్థ 14వ వార్షికోత్సవం సందర్భంగా వెల్లడించారు. ‘ఓమిక్స్ ఇంటర్నేషనల్, కాన్ఫరెన్స్ సిరీస్ వంటి ప్రధాన సంస్థలను స్థాపించాం. మీటింగ్స్ ఇంటర్నేషనల్, పల్సస్, అలైడ్ అకాడమీలు, యూరోసికాన్, లాంగ్డమ్, లెక్సిస్, హిలారిస్ మొదలైన బ్రాండ్లను సొంతం చేసుకున్నాం. వేలాది ఓపెన్ యాక్సెస్ జర్నల్స్ నిర్వహిస్తున్నాం. వైద్య, ఆరోగ్య, విజ్ఞాన, ఇంజనీరింగ్ నిపుణులు, పరిశోధకులు, విద్యార్థులకు సమాచార వేదికను ఏర్పాటు చేశాం. మూడేళ్ల క్రితం ఏర్పాటై విజయవంతంగా నడుస్తోన్న విశాఖ పల్సస్ యూనిట్లో ఒక్క 2021లోనే సుమారుగా 3,500 వెబినార్లు నిర్వహించి.. 700 జర్నల్స్ ప్రచురించాం. మూడేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక ఉద్యోగాలు కల్పించిన ఏకైక సంస్థ పల్సస్ అని సగర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. 15,000 మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దడం మా విజయం అని ప్రకటిస్తున్నాం’ అని తెలిపారు. -
ఆన్లైన్ మార్కెటింగ్ కోర్సు
ఆన్లైన్ మార్కెటింగ్ మెళకువలను నేర్పేందుకు ఈనెల 18 నుంచి కొత్త బ్యాచ్‌ను ప్రారంభిస్తోంది మాదాపూర్‌లోని డిజిటల్ మార్కెటింగ్ సంస్థ. ఇప్పటికే బిజినెస్ రంగంలో ఉన్నవారితో పాటు గృహిణులు, స్టార్టప్ యజమానులు, ఎంటర్‌ప్రెన్యూర్స్, మేనేజ్మెంట్ స్టడీస్, అడ్వర్టైజింగ్ అండ్ మార్కెటింగ్ ప్రొఫెషనల్స్‌కు ఈ ఆన్లైన్ మార్కెటింగ్ లాభదాయకమని సంస్థ తెలిపింది. డిజిటల్ మార్కెటింగ్‌లో వస్తున్న నయా ట్రెండ్ విషయాలను చెప్పేందుకు ఫ్రీ డెమో క్లాస్‌లను నిర్వహిస్తోంది. ఆసక్తి గలవారు 088015 66566 నంబర్లో సంప్రదించవచ్చు.