భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ దూకుడును పెంచింది. జర్మనీకి చెందిన డిజిటల్ మార్కెటింగ్, కమర్షియల్ ఎజెన్సీ ఆడీటీ(oddity)ను కైవసం చేసుకుంటున్నట్లు ఇన్ఫోసిస్ మంగళవారం రోజున ఒక ప్రకటించింది. ఈ ఒప్పందంపై ఇరు కంపెనీలు సంతకం చేశాయి.
ఆడీటీ కొనుగోలుతో సృజనాత్మక, బ్రాండింగ్, అనుభవ రూపకల్పన వంటి సామర్థ్యాలను బలోపేతం చేస్తోందని ఇన్ఫోసిస్ అభిప్రాయపడింది. ఆడీటీను కైవసం చేసుకునే ప్రక్రియ 2023 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ముగుస్తోందని ఇన్ఫోసిస్ పేర్కొంది. ఈ కంపెనీతో పాటుగా ఏకకాలంలో క్రిస్టాల్ 247ను కూడా ఇన్ఫోసిస్ హస్తగతం చేసుకొనుంది. ఆడీటీను సొంతం చేసుకునేందుకు ఇన్ఫోసిస్ సుమారు 50 మిలియన్ యూరోల(సుమారు రూ. 419 కోట్లు)ను ఖర్చు చేసింది. ఇక క్రిస్టాల్ 247ను కేవలం 3000 యూరోల(సుమారు రెండున్నర లక్షల రూపాయల)ను ఖర్చు చేయనుంది.
జర్మనీలో అతి పెద్ద సంస్థగా..!
జర్మనీలో డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీల్లో ఆడీటీ అతి పెద్ద సంస్థగా నిలుస్తోంది. ఈ కంపెనీ స్టుట్‌గార్ట్, బెర్లిన్, కొలోన్, బెల్‌గ్రేడ్, షాంఘై, తైపీ వంటి నగరాల్లో 300పైగా డిజిటల్ మార్కెటింగ్ నిపుణులను కలిగి ఉంది. జర్మన్ ఓమ్నీ-ఛానల్, ఈ-కామర్స్ రిటైలర్‌లు, ప్రముఖ ఎఫ్‌ఎంసీజీ బ్రాండ్‌లు, గ్లోబల్ మొబిలిటీ ప్రొవైడర్ల కోసం డిజిటల్ పరివర్తనను ఎనేబుల్ చేయడం వంటి సర్వీసులను ఆడిటీ అందిస్తోంది. డిజిటల్-ఫస్ట్ బ్రాండ్ మేనేజ్‌మెంట్ అండ్ కమ్యూనికేషన్, వర్చువల్ అండ్ ఆగ్మెంటెడ్ రియాలిటీ, అనుభవంతో సహా అంతర్గత ఉత్పత్తితో కూడిన సమగ్ర సేవా పోర్ట్‌ఫోలియోను ఆడీటీ కల్గి ఉంది.
చదవండి: వర్క్ ఫ్రమ్ హోంపై ఇన్ఫోసిస్ నారాయణమూర్తి కీలక వ్యాఖ్యలు..!
Comments
Please login to add a commentAdd a comment